బీజేపీ నేత, పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ ఆదివారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే భటిండాలోని జిందాల్ హార్ట్ హాస్పిటల్‌లో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉంది. మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌కు రెండు స్టెంట్లు అమర్చామని, ఆయన త్వరలోనే కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. ఎస్‌ఏడీ చీఫ్ సుఖ్‌బీర్ బాదల్ కూడా ఆసుపత్రికి చేరుకుని మన్‌ప్రీత్ ఆరోగ్యంపై ఆరా తీశారు.
బటిండా అర్బన్ నుండి ఎమ్మెల్యే అయిన బాదల్ 2023 జనవరిలో కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. కాంగ్రెస్, ఎస్‌ఏడీ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన ఆయన చాలాసార్లు పార్టీ మారారు. శిరోమణి అకాలీదళ్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మన్‌ప్రీత్ సింగ్ బాదల్ 2011లో పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ అనే ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత 2016లో కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిపై ఓడిపోయిన తర్వాత 2023లో బీజేపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment