Former Finance Minister
-
మాజీ మంత్రికి గుండెపోటు
బీజేపీ నేత, పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ ఆదివారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే భటిండాలోని జిందాల్ హార్ట్ హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉంది. మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌కు రెండు స్టెంట్లు అమర్చామని, ఆయన త్వరలోనే కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. ఎస్ఏడీ చీఫ్ సుఖ్బీర్ బాదల్ కూడా ఆసుపత్రికి చేరుకుని మన్‌ప్రీత్ ఆరోగ్యంపై ఆరా తీశారు. బటిండా అర్బన్ నుండి ఎమ్మెల్యే అయిన బాదల్ 2023 జనవరిలో కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. కాంగ్రెస్, ఎస్ఏడీ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన ఆయన చాలాసార్లు పార్టీ మారారు. శిరోమణి అకాలీదళ్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మన్‌ప్రీత్ సింగ్ బాదల్ 2011లో పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ అనే ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత 2016లో కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిపై ఓడిపోయిన తర్వాత 2023లో బీజేపీలో చేరారు. -
సంస్కరణల సారథి
దివాలా చట్టంతో బ్యాంకులకు ఊరట ఒకపక్క స్కాముల కంపు కొడుతున్న వ్యవస్థ, మరోపక్క దిగజారిన విదేశీ నిధులు!!. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఎకనమిస్టుకైనా సంస్కరణల అమలు కత్తిమీద సామే. కానీ ఈ రాజకీయ లాయర్‌కు మాత్రం అది ఒక సంక్లిష్టమైన కేసులాగే కనిపించింది. దాన్ని గెలిచేవరకు వదలకూడదన్న పట్టుదలతో రోజుకు 16 గంటలు పనిచేస్తూ చివరకు కేసు గెలిపించారు. ఈ క్రమంలో తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టారు. అరుణ్‌జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఎకానమీలో రెండు అతిపెద్ద కుదుపులు సంభవించాయి. 2016లో ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు ఎకానమీని స్తంభింపజేసింది. దీంతో దాదాపు రెండు త్రైమాసికాల పాటు జీడీపీ ఒక్కసారిగా కుంచించుకుపోయింది. షాక్ తిన్న ఎకానమీని పట్టాలెక్కించి తిరిగి జీడీపీని గాడిన పెట్టడంలో జైట్లీది కీలక పాత్ర. ఒకపక్క ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ మరోపక్క నిర్ణయ పర్యవసానాలను ఎదుర్కొంటూ ఆయన అత్యంత సమర్ధవంతంగా ఎకానమీని నడిపించారని ఎకనమిస్టులు ప్రశంసిస్తారు. నోట్ల రద్దు తర్వాత ఏడాది జీఎస్టీ అమలు చేయడం ద్వారా అప్పటివరకు ఉన్న పన్ను వ్యవస్థ మొత్తాన్ని కదలించారు. నోట్ల రద్దుతో సతమతమై కుదుటపడుతున్న ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ మరో షాక్‌లాగా తగిలింది. దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా ఆలోచనల్లోనే ఉంటూ వచ్చిన ఒకే దేశం, ఒకే పన్ను వ్యవస్థను జైట్లీ సాకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ ‘‘పాత భారతం ఆర్థికంగా ముక్కలుగా కనిపిస్తోంది, కొత్త భారతం ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్‌గా మారుతుంది’’ అన్నారు. ఇండియా ఎకానమీలో అతిపెద్ద సంస్కరణగా జీఎస్టీని ఆర్థికవేత్తలు కొనియాడుతున్నారు. కేవలం సంస్కరణను ప్రవేశపెట్టడం కాకుండా, ఎప్పటికప్పుడు దాని అమలును సమీక్షిస్తూ, అవసరమైన మార్పులు చేస్తూ జైట్లీ జీఎస్టీని సానుకూలంగా మార్చారు. రాజకీయంగా కూడా జీఎస్టీ పట్ల దాదాపు ఏకాభిప్రాయాన్ని సాధించడం ఆయన విజయంగా నిపుణులు అభివర్ణిస్తారు. ఎగవేతదారులకు చెక్ ఈ రెండు సంస్కరణలతో పాటు జైట్లీ హయాంలో తీసుకువచ్చిన మరో ముఖ్యమైన సంస్కరణ దివాలా చట్టం ఏర్పాటు చేయడం. ఈ చట్టంతో క్రెడిట్ కల్చర్‌లో మంచి మార్పులు వచ్చాయి. రుణదాతలకు మరిన్ని అధికారాలు లభించాయి. ఎగవేతలంటే భయపడే స్థితి ఏర్పడింది. ముఖ్యంగా క్రోనీ క్యాపిటలిజం నిర్మూలనకు ఇది సమర్ధవంతంగా పనిచేసిందని ప్రముఖ ఎకనమిస్టులు కొనియాడారు. ఆర్బీఐ, ద్రవ్యపరపతి సమీక్ష అంశాలపై జైట్లీకి స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. కేంద్రబ్యాంకుకు మరింత స్వయం ప్రతిపత్తి ఉండాలని, ద్రవ్యోల్బణం కట్టడే సమీక్షా సమావేశ ప్రధాన అజెండా కావాలని ఆయన అభిప్రాయపడేవారు. ఆయన మరణం పట్ల అటు రాజకీయనాయకులతో పాటు ఇటు కార్పొరేట్ వర్గాలు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. ఆర్థిక సంస్కరణలు సమర్ధవంతంగా ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా కార్పొరేట్ ప్రపంచం జైట్లీని కొనియాడుతోంది. దేశాభివృద్ధికి విశేష కృషి: కోవింద్ జైట్లీ మరణం తీవ్రవిచారకరం. ఆయనో న్యాయవాది, గొప్ప పార్లమెంటేరియన్, సమర్థుడైన మంత్రి. ఈ దేశ పురోగతి కోసం ఆయన ఎంతో కృషిచేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. విలువైన మిత్రుడు: వెంకయ్య జైట్లీ లేని లోటు పూడ్చలేనిది. ఆయన నాకు అత్యంత సన్నిహితుడు. ఆయన్ను కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు నష్టమే. పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడంలో జైట్లీ సిద్ధహస్తుడు. జీఎస్టీ లాంటి సంస్కరణలు విజయవంతంగా అమలు చేయడంలో ఆయన కృషి మరువలేనిది. నీతి నిజాయితీ, విలువలకు కట్టుబడి రాజకీయ జీవితాన్ని కొనసాగించారు. స్నేహితుడిని కోల్పోయా: మోదీ జైట్లీ మృతితో ఒక విలువైన స్నేహితుడిని కోల్పోయానంటూ ప్రధాని మోదీ ఉద్వేగానికి గురయ్యారు. బహ్రెయిన్ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి భారత సంతతి ప్రజలతో జరిగిన భేటీలో మాట్లాడుతూ.. ‘దేశం కోసం నిరంతరం సేవ చేసిన అత్యున్నత మేధో సంపత్తి కలిగిన దిగ్గజ రాజకీయ నేత అరుణ్ జైట్లీ. నాకు విలువైన మిత్రుడు. ఆయన లేడనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకున్నా. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అరుణ్ జైట్లీ ఎన్నో మంత్రిత్వ శాఖల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. కొద్ది రోజుల క్రితమే నా సొదరి, మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మనల్ని విడిచి పోయారు. ఆ బాధ మరవకముందే.. నా ప్రియ మిత్రుడు జైట్లీ కూడా లేరనే వార్త రావడం విచారకరం’ అంటూ మోదీ సంతాపం వ్యక్తం చేశారు. జైట్లీ సేవలు చిరస్మరణీయం: కేసీఆర్ జైట్లీ మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘జైట్లీ మరణం తీరని లోటు. దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’ అంటూ కేసీఆర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. మేధావి, స్నేహశీలి: జగన్ అరుణ్ జైట్లీ ఇకలేరనే వార్తతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జైట్లీ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ‘జైట్లీ మరణవార్తపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. ఆయన ఓ మంచి మేధావి, స్నేహశీలి, చాలా అంశాలపై స్పష్టత కలిగిన వ్యక్తి. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేం’అని జగన్ ట్వీట్ చేశారు. కార్పొరేట్ ప్రపంచం నివాళి న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల దేశ వ్యాపార వర్గాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. ఆయన్ను నిజమైన సంస్కరణవాదిగా కార్పొరేట్ వర్గాలు కొనియాడాయి. జైట్లీ ఒక డైనమిక్ పార్లమెంటేరియన్ అని, వివిధ వర్గాలను సమన్వయం చేసుకోవడంలో ఆయన నేర్పరి అని, న్యూ ఇండియా అవతరణలో ఆయన ఆలోచనలు అత్యంత కీలకపాత్ర పోషించాయని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిత్తల్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ కొనియాడారు. జైట్లీ మరణం దేశం పూడ్చుకోలేని లోటని వేదంతా చైర్మన్ అనిల్ అగర్వాల్, సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్, బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ షా, ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్సోమానీ, జేఎస్‌డబ్లు్య గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ తదితరులు జైట్లీ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. –సాక్షి, బిజినెస్ వెబ్ విభాగం -
నేనైతే రాజీనామా చేసి పారేసేవాడిని
తానే ఇప్పుడు ఆర్థికమంత్రి అయి ఉండి, ప్రధానమంత్రి పెద్దనోట్ల రద్దుకు పట్టుబట్టి ఉంటే ఈ పాటికి రాజీనామా చేసే పారేసేవాడినని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ నేత పి. చిదంబరం వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి తనను పిలిచి, తాను 500, 1000 నోట్లను రద్దుచేయాలనుకుంటున్నానని అలా చేయొద్దని సలహా ఇచ్చేవాడినన్నారు. దానికి సంబంధించిన వాస్తవాలు, అంకెలు అన్నీ చెప్పేవాడినని, అయినా కూడా ఆయన ముందుకే వెళ్లాలనుకుంటే.. తాను రాజీనామా చేసేసేవాడినని ఆయన అన్నారు. ఢిల్లీలో జరిగిన సాహిత్య ఉత్సవంలో మీడియా ఆయనను మీరే అరుణ్ జైట్లీ స్థానంలో ఆర్థికమంత్రిగా ఉంటే ఏం చేసేవారని అడిగినప్పుడు ఈ విధంగా సమాధానం చెప్పారు. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రధానమంత్రి చెబుతున్నట్లుగా అవినీతి అంతం కాదని, నకిలీనోట్ల ప్రవాహం ఆగదని, బ్లాక్ మార్కెటింగ్ కూడా ఏమాత్రం తగ్గదని ఆయన మండిపడ్డారు. ప్రజలు డిజిటల్ లావాదేవీలవైపు మొగ్గడం వల్ల తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని తెలిపారు. పెద్దనోట్ల రద్దువల్ల కలిగే ప్రభావాలపై ప్రధానమంత్రికి సరిగా చెప్పలేదని, చివరకు ప్రధాన ఆర్థిక సలహాదారుకు కూడా నోట్ల రద్దు విషయం ముందుగా తెలియదని చిదంబరం విమర్శించారు. తానైతే ముందుగా ఒక కమిటీని నియమించి ఉండేవాడినని అన్నారు. సీబీడీటీ ఇచ్చిన నివేదిక కూడా పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగానే ఉందని.. ఏ ఒక్కరూ దానికి మద్దతు పలకలేదని చెప్పారు. 1946లో ఒకసారి 1978లో మరోసారి కూడా ఇలాంటి చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. ప్రతిపక్షాన్ని అడొగద్దు అనుకుంటే.. తన సొంత మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా సలహా అయినా తీసుకుని ఉండాల్సిందని, లేదా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను అడగొచ్చని అన్నారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలన్నారు. -
రాజన్ ఏమీ ప్రధానమంత్రి కాదు
ఆర్ బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఎగ్జిట్ పై జరిగిన తతంగమంతా అనవసర చర్చని మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తిపై ఇంత పెద్ద దేశం ఆధారపడదని, రెగ్జిట్ ప్రకటన కొంత వివాదస్పదకు దారితీసిందని నొక్కి చెప్పారు. రాజన్ దేశానికి ప్రధాన మంత్రేమి కాదని, కనీసం ఆర్థిక మంత్రి కూడా కాదన్నారు. ఆర్థిక వ్యవస్థలో అతనికి కేటాయించిన బాధ్యతను అతను విజయవంతంగా నిర్వర్తించాడని సిన్హా పేర్కొన్నారు. చాలామంది గవర్నర్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారని, ఎలాంటి సమస్యలు రాలేదని చెప్పారు. రఘురామ్ రాజన్ చుట్టూ జరిగిన వివాదాలు పూర్తిగా తోసిపుచ్చాల్సిన అంశాలని వ్యాఖ్యానించారు. కేవలం హైప్ క్రియేట్ చేయడానికి ఈ అనవసరం చర్చంతా జరిగిందని చెప్పారు. రెగ్జిట్ జరిగితే, భారత ఆర్థికవ్యవస్థ కుప్పకూలుతుందనే కామెంట్లను ఆయన కొట్టిపారేశారు. ఒక వ్యక్తి కంటే దేశం పెద్దదని రెగ్జిట్ ప్రభావం దేశ ఆర్థికవ్యవస్థపై ఉండదని పేర్కొన్నారు. ఆహార ధరల ద్రవ్యోల్బణం టార్గెట్ కంటే టోకుఆధారిత ద్రవ్యోల్బణంపై పోరాడటం మంచి విధానమని, కఠిన ద్రవ్యవిధాన వైఖరి పెట్టుబడులు, ఆహార ధరలపై నెగిటివ్ ప్రభావం చూపిందన్నారు. నెగిటివ్ డబ్ల్యూపీఐ తో కఠిన ద్రవ్యవిధాన వైఖరి ఏమీ సాధించదని సిన్హా ఎకనామిక్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వడ్డీరేట్ల పెంపు, పెట్టుబడులను తగ్గించదనే అభిప్రాయం వెల్లబుచ్చారు. కాని ఆహార కొనుగోలుల్లో ఎలాంటి ప్రభావం చూపలేదన్నారు. -
'మా అబ్బాయి కాబట్టే టార్గెట్ చేస్తున్నారు'
కార్తీ తన కుమారుడు కాబట్టే అతడిపై ఆరోపణలు చేస్తున్నారని, వాళ్ల అసలు టార్గెట్ తానేనని కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం వాపోయారు. విదేశాల్లో కార్తీకి వెల్లడించని ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఖండించారు. నిజంగా కార్తీకి అలాంటి ఆస్తులు ఏమైనా ఉంటే, ప్రభుత్వం వాటి జాబితాను తయారు చేయాలని, ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని వాటన్నింటినీ రిజిస్టర్ చేస్తారని చెప్పారు. కార్తీ ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారంటూ ఇటీవల వచ్చిన వార్తాకథనాలపై చిదంబరం స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ కార్తీ భారీ సామ్రాజ్యం నిర్మించుకున్నాడని, దాంతోపాటు 14 దేశాల్లో ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయంటూ ఇటీవల మీడియా కథనాలు వచ్చాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఎయిర్‌సెల్-మాక్సిస్ స్కాంలో ఆదాయపన్ను శాఖ దర్యాప్తు ఆధారంగా ఈ వివరాలు తెలిశాయన్నది ఆ కథనాల సారాంశం. వీటి నేపథ్యంలోనే చిదంబరం స్పందించారు. కార్తీ న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకుంటున్నాడని, దాంతోపాటు వారసత్వ ఆస్తిని నిర్వహిస్తున్నాడని, చాలా కాలంగా ఆదాయపన్ను ఎసెసీగా ఉన్నాడని చెప్పారు. అతడి ఆస్తులు, అప్పులు అన్నింటి వివరాలూ ఆదాయపన్ను రిటర్నులలో పేర్కొన్నాడని, అలా చెప్పకుండా దాచిపెట్టిన ఆస్తులు ఎక్కడా లేవని అన్నారు. కేవలం తనను టార్గెట్ చేయడానికే కార్తీపై ఇలాంటి అసత్య కథనాలు వస్తున్నాయని అన్నారు. -
'అతను మాకు కావాలి.. మీరు బహిష్కరించండి'
న్యూఢిల్లీ: దేశంలో సంచనలం సృష్టించిన లలిత్ గేట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు లలిత్ మోదీని వెంటనే బ్రిటన్ నుంచి బహిష్కరించాలని నాటి ఆర్థిక మంత్రి పీ చిదంబరం బ్రిటన్ కు లేఖ రాసినట్లు తెలిసింది. సమాచారం హక్కు చట్టం ద్వారా ఓ వ్యక్తి ఈ విషయంపై వివరణ కోరగా ఈ వివరాలు తెలిశాయి. భారీ కుంభకోణం అనంతరం 2010 నుంచి లలిత్ మోదీ బ్రిటన్ లోనే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే, ఆయనను వెనక్కి రప్పించేందుకునాటి కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నించిందని చిదంబరం లేఖ ద్వారా తెలుస్తోంది. ఆ లేఖలో.. తప్పు చేసిన అపరాధి అయిన మోదీని ఇక ఎక్కువ రోజులు బ్రిటన్‌లో ఎక్కువ రోజులు ఉండనివ్వాలని అనుకోవడం లేదని, అతడిని తిరిగి వెనక్కి రప్పించే కార్యకలాపాలు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉన్నందున వెంటనే బ్రిటన్ నుంచి బహిష్కరించాలని చిదంబరం విజ్ఞప్తి చేశారు. ఆయనపై ఉన్న తీవ్రమైన నేరాల కేసుల విచారణను భారత్ లోని కీలక విచారణ సంస్థలు పనిచేస్తున్నాయని కూడా అందులో ప్రస్తావించారు. ఆయన పాస్ పోర్టును చట్ట వ్యతిరేకమైనదిగా తాము గుర్తించినందున ఎక్కువకాలంపాటు ట్రావెలింగ్ డాక్యుమెంట్స్ పనిచేసే అవకాశం ఉండదని, అయినా అతడు బ్రిటన్ లో ఉంటున్నాడని, వెంటనే అక్కడి నుంచి బహిష్కరించాలని విన్నవించారు. ఇలాంటి తప్పిదాల పేరుతో గతంలో 3000మంది ఇండియన్స్ ను బ్రిటన్ నుంచి బహిష్కరించిన విషయం కూడా చిదంబరం గుర్తు చేశారు. దీనికి బ్రిటన్ స్పందించి తిరిగి బదులు సమాధానం కూడా ఇచ్చింది. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయినా, ఇప్పటివరకు బ్రిటన్ ఈ విషయంలో చర్యలు తీసుకోకపోవడం వెనుక మతలబు ఏమిటో తెలియాలి.