
మరణించడానికి రెండు గంటల ముందు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు
చండీగఢ్: పండగవేళ పంజాబ్ బీజేపీలో విషాదం చోటు చేసుకుంది. పంజాబ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత కమల్ శర్మ(48) ఆదివారం ఫెరొజెపూర్ జిల్లాలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన గుండెపోటుతో మరణించడానికి రెండు గంటల ముందు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడం గమనార్హం. ఎప్పటిలాగే ఆదివారం కూడా మార్నింగ్ వాక్‌కు వెళ్లిన కమల్‌కు ఒక్కసారిగా గుండెపోఓటు వచ్చింది.అదే సమయంలో ఆయనతో పాటు ఉన్న సన్నిహితుడొకరు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే శర్మ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.కమల్ శర్మకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.