సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనయుడు జయ్‌షా అక్రమాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ నోరువిప్పాలన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, ప్రధాన కార్యదర్శులు దాసోజు శ్రవణ్, వినోద్‌రెడ్డి, నిరంజన్‌లతో కలసి విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ మూడున్నరేళ్ల పాలనలో దేశం నిండా స్కాములేనని, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ పేరిట చేసిన హడావుడి వల్ల దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, వేలాది కంపెనీలు కుప్పకూలి దేశం ఆర్థికంగా దివాలా తీసిందని పేర్కొన్నారు. దీనివల్ల బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు లాభపడ్డారని, దీనికి తాజా ఉదాహరణ జయ్ షా కంపెనీ వ్యవహారమేనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment