![కాలం చెల్లిన తుపాకులే ఉన్నాయి వాటితోనే...](/styles/webp/s3/article_images/2017/09/3/71438147430_625x300.jpg.webp?itok=qI0ist2F)
కాలం చెల్లిన తుపాకులే ఉన్నాయి వాటితోనే...
కపూర్తలా : పంజాబ్ లోని పోలీసుల వద్ద కాలం చెల్లిన తుపాకీలే ఉన్నాయి. వాటితోనే తమ పోలీసులు తీవ్రవాదులతో పోరాడతున్నారు... గత ఎన్నో ఏళ్ల నుంచి ఇలాగే కొనసాగుతుంది. బుల్లెట్ ఫ్రూప్ దుస్తులు లేవు... యుద్ధ సమయంలో ధరించే హెల్మెట్లు లేవు... ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్. బుధవారం గురుదాస్పూర్లో పాక్ ముష్కర మూకల కాల్పులో ప్రాణాలు కోల్పోయిన ఎస్పీ బల్జీత్ సింగ్ నివాసంలో బల్జీజ్ మృతదేహాన్ని సందర్శించారు. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రకాశ్ సింగ్ బాదల్ మాట్లాడారు. బల్జీత్ సింగ్ను చూసి దేశం గర్విస్తుందన్నారు. రాష్ట్రంలో కాలం చెల్లిన ఆయుధాలపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు మంగళవారం న్యూఢిల్లీలో కలసి ఫిర్యాదు చేసినట్లు ప్రకాశ్ సింగ్ తెలిపారు.
సోమవారం పంజాబ్ జిల్లాలోని గురుదాస్పూర్ పోలీసు స్టేషన్పై పాక్ తీవ్రవాదులు కాల్పులు జరిపారు. దాంతో అప్రమత్తమైన పంజాబ్ పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. దాదాపు 12 గంటల పాటు సాగిన ఈ ఎన్కౌంటర్లో నలుగురు పోలీసులతోపాటు ముగ్గురు పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులో స్థానిక డిటెక్టివ్ బ్రాంచ్లో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న బల్జీత్ సింగ్ మరణించారు. అలాగే పోలీసుల ఎదురు కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు మరణించారు.