Baljeet Singh
-
గురుదాస్‌పూర్ దాడి: పోలీసులకు సాహస పతకాలు
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదుల చేతిలో మరణించిన ఎస్పీ బల్జీత్ సింగ్, సాహసోపేతంగా పోరాడిన మరో ఇద్దరు పోలీసులకు అత్యున్నత పోలీసు మెడల్స్ ఇవ్వనున్నారు. ఇన్స్పెక్టర్ బల్బీర్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ తారా సింగ్ ఈ దాడి జరిగిన సమయంలో పోలీసు స్టేషన్లో ఉన్నారు. వాళ్లు ఉగ్రవాదులను అణిచేయడంలో మంచి సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలు ప్రదర్శించారు. దాంతో వారికి కూడా పతకాలు ప్రకటించారు. బల్జీత్ సింగ్‌కు రాష్ట్రపతి పోలీసు పతకాన్ని ప్రకటించారు. బల్జీత్ సింగ్ తండ్రి కూడా కొన్నేళ్ల క్రితం ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు వదిలారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన లష్కరే తాయిబా లేదా జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఓ బస్సు మీద కూడా కాల్పులు జరిపి, తర్వాత దీనానగర్ పోలీసు స్టేషన్లోకి చొచ్చుకెళ్లారు. ఈ దాడిలో ముగ్గురు పౌరులు, బల్జీత్ సింగ్, ముగ్గురు హోం గార్డులు మరణించారు. -
కాలం చెల్లిన తుపాకులే ఉన్నాయి వాటితోనే...
కపూర్తలా : పంజాబ్ లోని పోలీసుల వద్ద కాలం చెల్లిన తుపాకీలే ఉన్నాయి. వాటితోనే తమ పోలీసులు తీవ్రవాదులతో పోరాడతున్నారు... గత ఎన్నో ఏళ్ల నుంచి ఇలాగే కొనసాగుతుంది. బుల్లెట్ ఫ్రూప్ దుస్తులు లేవు... యుద్ధ సమయంలో ధరించే హెల్మెట్లు లేవు... ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్. బుధవారం గురుదాస్‌పూర్‌లో పాక్ ముష్కర మూకల కాల్పులో ప్రాణాలు కోల్పోయిన ఎస్పీ బల్జీత్ సింగ్ నివాసంలో బల్జీజ్ మృతదేహాన్ని సందర్శించారు. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రకాశ్ సింగ్ బాదల్ మాట్లాడారు. బల్జీత్ సింగ్‌ను చూసి దేశం గర్విస్తుందన్నారు. రాష్ట్రంలో కాలం చెల్లిన ఆయుధాలపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు మంగళవారం న్యూఢిల్లీలో కలసి ఫిర్యాదు చేసినట్లు ప్రకాశ్ సింగ్ తెలిపారు. సోమవారం పంజాబ్ జిల్లాలోని గురుదాస్‌పూర్ పోలీసు స్టేషన్‌పై పాక్ తీవ్రవాదులు కాల్పులు జరిపారు. దాంతో అప్రమత్తమైన పంజాబ్ పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. దాదాపు 12 గంటల పాటు సాగిన ఈ ఎన్కౌంటర్లో నలుగురు పోలీసులతోపాటు ముగ్గురు పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులో స్థానిక డిటెక్టివ్ బ్రాంచ్‌లో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న బల్జీత్ సింగ్ మరణించారు. అలాగే పోలీసుల ఎదురు కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు మరణించారు. -
ఎస్పీ మృతి, 13కి చేరిన మృతుల సంఖ్య
-
ఎస్పీ మృతి, 13కి చేరిన మృతుల సంఖ్య
గురుదాస్ పూర్ : పంజాబ్‌లోని గురుదాస్ పూర్ ఎదురు కాల్పుల్లో ఎస్పీ బల్జీత్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులతో జరిగిన పోరులో ఆయన సోమవారం వీరమరణం పొందారు. గురుదాస్ పూర్ డిటెక్టివ్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్న బల్జీత్ సింగ్... ఉగ్రవాదుల కాల్పులు ఘటన వార్త తెలియగానే రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఆయన ఉగ్రవాదుల తూటాలకు బలైపోయారు. తీవ్ర బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బల్జీత్ సింగ్ అసువులు బాసినట్టు పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు. మరోవైపు ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన వారి సంఖ్య 13 కి చేరింది. గురుదాస్ పూర్ పోలీస్ స్టేషన్ లోకి చొరబడిన ఉగ్రవాదులు నిమిష నిమిషానికి కాల్పులకు తెగబడుతున్నారు. భద్రతా వర్గాలకు, టెర్రరిస్టులకు మధ్య భారీఎత్తున కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా భద్రతను పెంచారు. కేంద్ర హోంశాఖ, ప్రభుత్వ వర్గాలు అప్రమత్తమయ్యాయి. పంజాబ్ రాష్ట్రంలో సెక్యూరిటీ దళాలు పెద్ద ఎత్తున మోహరించాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, తదితర ప్రాంతాలలో డాగ్ స్క్వాడ్ తో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందాడు.