punjab chief minister
-
పార్టీ చీఫ్ పదవిపై పంజాబ్ సీఎం కీలక వ్యాఖ్యలు
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పార్టీ చీఫ్ పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ రాష్ట్ర విభాగానికి పూర్తికాల అధ్యక్షుడిని నియమించటంపై ఆప్ పార్టీ నాయకత్వంతో చర్చిస్తామని అన్నారు. ఆయన చబ్బేవాల్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను రాష్ట్ర చీఫ్ పదవి నుంచి వైదొలగాలనే కోరికను బయటపెట్టారు.‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు పెద్ద బాధ్యతలు ఉన్నాయి. ఇప్పటికే నాకు 13-14 శాఖలు ఉన్నాయి. బాధ్యతలు విభజించబడేలా పూర్తి సమయం రాష్ట్ర యూనిట్ చీఫ్‌ను నియమించడానికి పార్టీ న్యాయకత్వంతో మాట్లాడతా’’ అని అన్నారు. భగవంత్ మాన్ 2017లో సంగ్రూర్ ఎంపీగా ఉన్నప్పుడు ఆప్ పంజాబ్ యూనిట్ చీఫ్‌గా నియమితులయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాన్ పంజాబ్‌లో పార్టీకి నాయకత్వం వహించారు. అంతేకాకుండా.. 2022లో 117 మంది సభ్యుల పంజాబ్ అసెంబ్లీలో 92 స్థానాలను గెలుచుకుని ఆప్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే.. 2023 జూన్ ఆప్ పంజాబ్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుధ్ రామ్‌ను నియమించింది. మరోవైపు.. గిద్దర్బాహా, డేరా బాబా నానక్, చబ్బేవాల్, బర్నాలా నాలుగు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెలువడుతాయి. ఈ స్థానాల ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నిక కావటంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.చదవండి: సీజేఐ ఇంట్లో గణపతి పూజకు మోదీ హాజరు.. చంద్రచూడ్ రియాక్షన్ -
డాక్టర్‌ను రెండోపెళ్లి చేసుకున్న పంజాబ్ సీఎం, కేజ్రీవాల్ శుభాకాంక్షలు
చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను ఆయన పరిణయమాడారు. చండీగఢ్‌లోని గురుద్వారాలో అతికొద్ది మంది సమక్షంలో ఈ విహహం జరిగింది. పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న భగవంత్ ఫోటోను ఆప్ నేత రాఘవ్ చద్దా ట్విట్టర్లో పోస్టు చేశారు. ఇందులో బంగారు వర్ణం దుస్తులు, పసుపు రంగు టర్బన్‌ను ధరించి వెలిగిపోయారు పంజాబ్ సీఎం. భగవంత్‌మాన్ వివాహం సిక్కుల సంప్రదాయం ప్రకారం నిరాడంబరంగా జరిగింది. ఆయన తల్లి, సోదరి, అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబంతో పాటు ఇతర పార్టీ నేతలు ఈ వేడుకకు వెళ్లినవారిలో ఉన్నారు. ఈరోజు నుంచి కొత్త జీవితం ప్రారంభించబోతున్న భగవంత్ మాన్కు శుభాకాంక్షలు అని కేజ్రీవాల్ మీడియాకు తెలిపారు. Chandigarh | Wedding rituals underway of Punjab CM Bhagwant Mann with Dr. Gurpreet Kaur pic.twitter.com/4QjnNsRXtg — ANI (@ANI) July 7, 2022 AAP convenor and Delhi CM Arvind Kejriwal arrives in Mohali ahead of party leader and Punjab CM Bhagwant Mann's wedding which will be held in Chandigarh..."He is embarking on a new journey today, I wish him a happy married life," he says pic.twitter.com/YowaFASB8V — ANI (@ANI) July 7, 2022 అంతకుముందు తన సోదరుడికి పెళ్లి జరగడం చాలా సంతోషంగా ఉందని ఆప్ నేత రాహుల్ చద్దా తెలిపారు. భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనేది ఆయన తల్లి కల అని, ఇప్పుడు అది నెరవేరడం ఆనందంగా ఉందన్నారు. మరి ఆమ్ ఆద్మీ పార్టీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అయిన మీ పెళ్లి ఎప్పుడు అని చద్దాను ట్విట్టర్లో ఓ జర్నలిస్ట్ అడిగారు. ముందు పెద్దవాళ్ల పెళ్లి జరిగిన తర్వాతే చిన్నవాళ్లు చేసుకుంటారని ఆయన చమత్కరించారు. Waheguru Ji Apne Bacche Utte Aashirwad Banaye Rakheo 🙏🏻 pic.twitter.com/snnmdTi1sw — Raghav Chadha (@raghav_chadha) July 7, 2022 పసందైన విందు భగవంత్ పెళ్లిలో అతిథులకు భారతీయ, ఇటాలియన్ వంటలు సిద్ధం చేయించారు. కరాహీ పనీర్, తందూరి కుల్చే, దాల్ మఖానీ, నవరత్న బిర్యానీ, మౌసమీ సబ్జీలు, ఆప్రికాట్ స్టఫ్డ్ కోఫ్తా, లసగ్న సిసిలియానో, బుర్రానీ రైత వంటి రకరాకల వంటలు తయారు చేశారు. Saade veer da vyah Saanu gode gode chah pic.twitter.com/0c09v6YG4N — Raghav Chadha (@raghav_chadha) July 7, 2022 -
స్వీయ నిర్బంధంలోకి పంజాబ్ సీఎం
చండీఘడ్ : పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇవాళ సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. నిన్న(శుక్రవారం) నిర్వహించిన అసెంబ్లీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యుల సలహా మేరకు ముఖ్యమంత్రి నేటి నుంచి 7 రోజులపాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు మీడియా అధికారి రవీన్ తుక్రాల్ ట్వీట్ చేశారు. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు కలిపి 29 మంది కరోనా బారిన పడ్డారని ముఖ్యమంత్రి ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. అయితే కరోనా సోకిన ఎమ్మెల్యేతో సన్నిహితంగా మెలిగిన వారు శాసనసభ సమావేశానికి హాజరు కావొద్దని ముఖ్యమంత్రి కోరారు. (23 మంది ఎమ్మెల్యేలకు కరోనా: పంజాబ్ సీఎం) శాసనసభ సజావుగా నిర్వహించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అమరీందర్ సింగ్ ఆదేశించారు. పంజాబ్ భవన్, ఎమ్మెల్యేల హాస్టల్స్ వద్ద తర్వతగతిన కరోనా పరీక్షలు నిర్వహించేదుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. అదే విధంగా అసెంబ్లీ సమావేశమైన 48 గంటల్లో నెగిటీవ్ వచ్చిన వారిని మాత్రమే హాజరుకావడానికి అనుమతించారు. కరోనా నెగటివ్ రిపోర్టు చూపించిన తర్వాతే అసెంబ్లీలో ప్రవేశించేందుకు వీలు ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు పంజాబ్‌లో 47,800 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 1,256 మంది ప్రాణాలు కోల్పోయారు. (జర్నలిస్టులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా) -
మనం 82 మందిని చంపాలి!
ఛండీగఢ్: పుల్వామా దాడికి తక్షణం ప్రతీకారం తీర్చుకోవాలని దేశం కోరుకుంటోందని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ దన్నుతో ఉగ్రవాదులు 41 మంది జవాన్లను బలి తీసుకోగా, ‘కంటికి కన్ను, పంటికి పన్ను’ సిద్ధాంతం ప్రకారం భారత్ 82 మందిని చంపి బదులు తీర్చుకోవాలని వ్యాఖ్యానించారు. కశ్మీర్లో భారత్ సైనికులను చంపుతూ మూర్ఖంగా వ్యవహరిస్తున్న పాక్‌పై సైనిక, దౌత్య, ఆర్థికపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేల కొరిగిన ప్రతి భారత సైనికుడికి బదులుగా ఆ దేశానికి చెందిన ఇద్దరు సైనికులను హతమార్చాలన్నారు. ఇలా తక్షణమే చర్యకు దిగాలని భారత్ కోరుకుంటోందని చెప్పారు. భారత్‌పైకి అణ్వాయుధాలు ఉపయోగిస్తామన్న పాకిస్తాన్ బెదిరింపులు వట్టివేనన్నారు. శాంతి చర్చలకు కాలం చెల్లిందని, పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసనమైందని పేర్కొన్నారు. పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతోందని దుయ్యబట్టారు. ‘పాక్ ప్రధాని (ఇమ్రాన్ ఖాన్) శాంతి చర్చల గురించి మాట్లాడతారు. ఆర్మీ జనరల్ (ఖామర్ జావేద్ బాజ్వా) మాత్రం యుద్ధం గురించి మాట్లాడతార’ని అమరీందర్ సింగ్ తెలిపారు. పాకిస్తాన్ సరైన గుణపాఠం చెప్పకపోతే ఉగ్రదాడులు పునరావృతం అవుతూనే ఉంటాయన్నారు. కాగా, పుల్వామా దాడి ఖండిస్తూ పంజాబ్ శాసనసభ సోమవారం తీర్మానాన్ని ఆమోదించింది. -
తప్పంతా హర్యానా ప్రభుత్వానిదే: పంజాబ్ సీఎం
-
తప్పంతా హర్యానా ప్రభుత్వానిదే: పంజాబ్ సీఎం
ఛండీగఢ్; డేరా అనుచరుల హింసను ఎట్టి పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో ఉపేక్షించబోమని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై శనివారం ఆయన ఉన్నతస్థాయి భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు సీఎంకు వెల్లడించినట్లు సమాచారం. ఇక భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పంజాబ్‌లో పరిస్థితి చాలా ప్రశాంతంగా ఉంది. లాఠీఛార్జీ, కాల్పులు లాంటివి చోటు చేసుకోలేదు. ఎవరూ చనిపోలేదు కూడా. అని అమరీందర్ తెలిపారు. పంజాబ్‌లో హింసకు తావు ఇవ్వబోమని ఆయన ప్రకటించారు. తీర్పు నేపథ్యంలో పరిస్థితులను అంచనా వేయకుండా పంచకులలోకి గుర్మీత్ అనుచరులను అనుమతించటం హర్యానా ప్రభుత్వం చేసిన తప్పుగా ఆయన పేర్కొన్నారు. కర్ఫ్యూను నిన్న రాత్రికే పాక్షికంగా సడలించామని తెలిపిన ఆయన ఈరోజు మరోసారి సమీక్షించిన అనంతరం పూర్తిగా ఎత్తివేస్తామని తెలిపారు. డేరా ప్రధానకార్యాలయంలోకి వెళ్లం: ఆర్మీ డేరా సచ్ఛా సౌదా ఆశ్రమం ప్రధాన కార్యాలయంలోకి సైన్యం ప్రవేశించబోతుందన్న వార్తలపై ఆర్మీ వర్గాలు స్పందించాయి. అలా ప్రయత్నమేం చేయబోవట్లేదని హిసర్ 33వ విభాగం జీవోసీ అధికారి రాజ్‌పాల్ పునియా స్ఫష్టం చేశారు. హర్యానాలోని సిస్రా లో సుమారు 700 ఎకరాల్లో డేరా ప్రధాన కార్యాలయం విస్తరించి ఉంది. కురుక్షేత్ర, మన్సా డేరా ఆశ్రమంలో సుమారు 12 మందికి పైగా డేరా అనుచరులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. -
క్లాసు తుడవలేదని.. పైనుంచి తోసేశారు!
పాఠశాలకు వచ్చేది శుభ్రంగా చదువుకోడానికే గానీ, తరగతి గదులను శుభ్రం చేయడానికి కాదు. ఇదే విషయం చెప్పినందుకు తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థిని మీద టీచర్లకు ఎక్కడలేని కోపం వచ్చింది. వాళ్లు ఆమెను స్కూలు పై అంతస్తు వరకు తీసుకెళ్లి, అక్కడినుంచి కిందకు తోసేశారు. ఈ దారుణ ఘటన పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. ఫజ్జర్ నూర్ (14) అనే ఆ బాలిక ప్రస్తుతం లాహోర్ నగరంలోని ఘుర్కి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఆమెకు పలు చోట్ల ఫ్రాక్చర్లు కావడంతో పాటు వెన్నెముక కూడా విరిగిపోయింది తరగతి గదులను ప్రతిరోజూ ఒక్కో విద్యార్థిని శుభ్రం చేయాలి. మే 23న ఫజ్జర్ వంతు వచ్చింది. అయితే, ఆరోజు ఆమెకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో మరోరోజు ఆ పనిచేస్తానని చెప్పింది. దాంతో టీచర్లు ఆమెను మరో గదిలోకి తీసుకెళ్లి చెంపల మీద కొట్టారు. తర్వాత ఇద్దరు కలిసి మూడో అంతస్తు పైకి తీసుకెళ్లి, అక్కడ శుభ్రం చేయమన్నారు. తనకు ఆరోగ్యం బాగోలేదని మళ్లీ చెప్పగా వాళ్లు తనను మేడ మీద నుంచి తోసేశారని ఫజ్జర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చెప్పింది. దాంతో ఇద్దరు టీచర్లు రెహానా కౌసర్, బుష్రా తుఫైల్ అనే ఇద్దరిపై హత్యాయత్నం కేసు పెట్టారు. మే 23వ తేదీనే ఈ ఘటన జరిగినా, దాన్ని స్కూలు యాజమాన్యం దాచిపెట్టిందని పంజాబ్ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అల్లాబక్ష్ మాలిక్ చెప్పారు. ఎట్టకేలకు పోలీసులకు విషయం తెలియడంతో వాళ్లు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో కూడిన ఓ కమిటీని ముఖ్యమంత్రి నియమించారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి తన కూతురిని చూడాలని, ఆమె బాధ తట్టుకోలేకపోతోందని ఫజ్జర్ తల్లి రుఖ్సానా బీబీ అన్నారు. -
ఆ సీఎంను ఎలా హతమార్చామో తెలుసు కదా..!
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను చంపేస్తామంటూ కెనడాలో ఉన్న ఖలిస్తాన్ మద్దతుదారులు హెచ్చరికలు పంపుతున్నారు. ఈ మేరకు వరుసపెట్టి ఆడియో రికార్డింగులు ఆయనకు పంపినట్లు తెలుస్తోంది. ''కెప్టెన్, మీ పార్టీ నుంచే బియాంత్ అనే ఒక ముఖ్యమంత్రి ఉండేవారు.. అతడి అంత్యక్రియలు చేయడానికి మృతదేహం ముక్కలు ఏరుకోవాల్సి వచ్చింది'' అని గట్టిగా అరుస్తూ ఒక హెచ్చరికను రికార్డు చేశారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్‌ను ఖలిస్తాన్ ఉగ్రవాదులు కారుబాంబుతో చంపేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాగే చంపేస్తామంటూ కెప్టెన్ అమరీందర్నూ హెచ్చరిస్తున్నారు. అయితే, వాటిని తాను ఏమాత్రం పట్టించుకునేది లేదని కెప్టెన్ అంటున్నారు. వాళ్లు కెనడాలో తలలు పగిలేలా అరుచుకున్నా తాను మాత్రం కొంచెం కూడా పట్టించుకోనని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశం, పంజాబ్ కూడా సుస్థిరంగా, బలంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని, రాష్ట్రం సుస్థిరంగా ఉంటే తాను అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టగలనని అన్నారు. కెనడాలో ఉంటున్న కొందరు ఖలిస్తాన్ ఉగ్రవాదులు కేవలం పంజాబ్ ముఖ్యమంత్రినే కాక.. మాజీ డీజీపీ కేపీఎస్ గిల్‌ను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించివేశారంటూ గిల్‌కు అప్పట్లో చాలా మంచిపేరు వచ్చింది. కెనడాలో ఏదో నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ.. ఆ సందర్భంగానే ఈ ఆడియో మెసేజ్‌లు రికార్డు చేసినట్లుగా వెనకాల శబ్దాలను బట్టి తెలుస్తోంది. ఇటీవల భారతదేశంలో పర్యటించిన కెనడా రక్షణ మంత్రి హర్జీత్ సజ్జన్ పేరు కూడా ఆ ఆడియో సందేశాల్లో వినిపించింది. ఆయన ఖలిస్తానీ ఉద్యమానికి సానుభూతిపరుడన్న ఉద్దేశంతో సజ్జన్‌ను కలిసేందుకు అమరీందర్ నిరాకరించారు. అయితే.. ఆయనకు తగిన భద్రత మాత్రం కల్పించారు. ''నువ్వు మా రక్షణ మంత్రిని ఉగ్రవాది అన్నావు. నువ్వు సిక్కులను అవమానించావు. ఈ గడ్డ మీద నుంచి నిన్ను చాలెంజ్ చేస్తున్నాం. నీకు ఏ రేంజిలో స్వాగతం పలుకుతామంటే.. ఎప్పుడూ ఇక సిక్కులతో పెట్టుకోవు. నువ్వు సిక్కులందరినీ రెచ్చగొట్టావు. దమ్ముంటే కెనడా రమ్మని సవాలు చేస్తున్నాం'' అని మరో ఆడియో క్లిప్‌లో పేర్కొన్నారు. -
ముఖ్యమంత్రి సరికొత్త రికార్డు!
పంజాబ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉండగా ఒక్కసారి కూడా అసెంబ్లీకి హాజరు కాని అమరీందర్.. ఇప్పుడు మాత్రం గత నాలుగు రోజులుగా అసెంబ్లీ జరిగినంత సేపూ సభలోనే ఉన్నారు! ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో అసెంబ్లీకి, లోక్‌సభకు హాజరు కాలేదన్న విమర్శలు ఆయనపై ఉండేవి. బుధవారం నాడు వాయిదా తీర్మానంపై అసెంబ్లీలో 45 నిమిషాలు పాటు చర్చ జరిగింది. అంతసేపూ కెప్టెన్ సభలోనే కూర్చుని ఉన్నారు. 2015 నవంబర్‌లో తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత దాదాపు ఏడాది పాటు ప్రచార పర్వంలో మునిగి తేలిన అమరీందర్.. అప్పుడిచ్చిన హామీలను నెరవేర్చుకోవడం ఎలా అని మధనపడుతూ సభలోనే కాలం గడుపుతున్నారంటున్నారు. బుధవారం నాడు అసెంబ్లీకి వెళ్లిన సీఎం.. అక్కడి ప్రెస్ గ్యాలరీ వద్దకు కూడా వెళ్లి మీడియా ప్రతినిధులను కలిశారు. రైతులు తనఖా పెట్టిన భూములకు స్వాధీన నోటీసులు వస్తున్నాయంటూ వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. ఏవైనా వివరణలు కావాలంటే తన మీడియా సలహాదారును సంప్రదించాలని కోరారు. కవేలం తమకు అనుకూలంగా వార్తలు రాసేవాళ్లకే తాను అందుబాటులో ఉంటానని ఇంతకుముందు ఇదే ముఖ్యమంత్రి చెప్పారు. ఎన్నికలకు ముందు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న అమరీందర్‌కు, ఇప్పటి సీఎం అమరీందర్‌కు చాలా తేడా కనిపిస్తోంది. ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడిందని, తమకు కుదురుకోడానికి కాస్త సమయం ఇవ్వాలని మీడియాను కోరుతున్నారు. ఎన్నికల సమయంలో ఆయన డ్రగ్స్ భూతాన్ని తరిమేస్తానని, రైతు రుణాలు మాఫీ చేస్తానని, వీఐపీ సంస్కృతిని అంతం చేస్తానని.. ఇలా చాలా హామీలు ఇచ్చారు. వాటిని ఆయన మర్చిపోయినా మీడియా, ప్రజలు మాత్రం మర్చిపోయే పరిస్థితి లేదు. -
పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతూ.. మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఎవరి కార్లకూ బుగ్గలు (సైరన్ లైట్లు) తీసేస్తామని ప్రకటించారు. దాంతో ఇక ముఖ్యమంత్రికి తప్ప వేరెవ్వరికీ బుగ్గ కార్లు ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. శనివారం నాడు సమావేశమైన అమరీందర్ మంత్రివర్గం ఇంకా అనేక నిర్ణయాలు తీసుకుంది. వాటన్నింటినీ ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. పంజాబ్‌నుంచి డ్రగ్స్ భూతాన్ని పూర్తిగా తరిమేయడానికి వీలుగా ఒక స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. స్వాతంత్ర్య సమర యోధులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో వ్యవసాయాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తెచ్చేందుకు రైతులకు ఉచిత విద్యుత్తును కొనసాగిస్తామన్నారు. రుణమాఫీ విషయాన్ని అంచనా వేసి, దాని అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇచ్చేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలను వేధింపులకు గురిచేస్తున్న డీటీఓలు, హల్కా ఇన్చార్జులు ఉండబోరని, ఆ రెండు వ్యవస్థలను రద్దుచేయాలని తమ కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. నదీ జలాల పరిరక్షణ కోసం అన్ని రకాల న్యాయపరమైన, పాలనాపరమైన అవకాశాలను చూస్తామన్నారు. పాత ప్రభుత్వ హయాంలో పెట్టిన తప్పుడు కేసులు, ఎఫ్ఐఆర్లపై విచారణకు ఓ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. నిర్దోషులందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. My cabinet has decided to rid the state of VIP culture. All beacon lights to be removed from vehicles of Ministers, MLAs and bureaucrats. — Capt.Amarinder Singh (@capt_amarinder) 18 March 2017 We have also decided to set up a Special Task Force to crack down on drugs and wipe them out from Punjab. — Capt.Amarinder Singh (@capt_amarinder) 18 March 2017 No more DTOs, no more Halqa Incharges to harass and bleed my people. My cabinet has decided to abolish both. — Capt.Amarinder Singh (@capt_amarinder) 18 March 2017 We have decided to constitute a Group Of Experts to assess and propose farm debt waiver ways in 60 days. — Capt.Amarinder Singh (@capt_amarinder) 18 March 2017 We will continue to give free power to the farmers of Punjab and bring our agriculture back on track. — Capt.Amarinder Singh (@capt_amarinder) 18 March 2017 My government will pursue all legal and administrative options to protect the waters of Punjab in the SYL canal issue. — Capt.Amarinder Singh (@capt_amarinder) 18 March 2017 Will set up a Commission Of Enquiry to probe false cases and FIRs done by the previous govt and ensure justice to all innocent. — Capt.Amarinder Singh (@capt_amarinder) 18 March 2017 -
జడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా చాలదట!
-
జడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా చాలదట!
అక్కడ ఒకే కుటుంబంలో ముగ్గురికి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. అయినా అది సరిపోదని, తమకు మరింత భద్రత కావాలని అంటున్నారు. పంజాబ్‌లోని అకాలీదళ్ ప్రభుత్వం ఈ తరహా వింత కోరికలతో కేంద్ర ప్రభుత్వానికి సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే అక్కడ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, ఆయన కొడుకు, ఉప ముఖ్యమంత్రి అయిన సుఖ్బీర్ బాదల్, మంత్రివర్గంలో కీలక సభ్యుడు బిక్రమ్ సింగ్ మజీతియా.. ఈ ముగ్గురికీ ఇప్పటికే జడ్‌ప్లస్ సెక్యూరిటీ ఉంది. వీళ్లలో మజీతియా.. ఉపముఖ్యమంత్రికి బావమరిది. భద్రత పెంచాలంటూ గత వారమే అభ్యర్థన వచ్చిందని, అయితే.. దేశంలో అత్యున్నత స్థాయి భద్రత అయిన జడ్ ప్లస్ తర్వాత ఇంక ఏమివ్వాలో అర్థం కావడం లేదని కేంద్ర హోం మంత్రిత్వశాఖ వర్గాలు చెబుతున్నాయి. 88 ఏళ్ల ముఖ్యమంత్రికి నేషనల్ సెక్యూరిటీ గార్డులు భద్రత ల్పిస్తారు. ఆయన కొడుకును, అతడి బావమరిదిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది రోజుకు 24 గంటలూ కంటికి రెప్పలా కాపాడుతుంటారు. జడ్ ప్లస్ భద్రత కింద దాదాపు 30-40 మంది కేంద్ర భద్రతా సిబ్బంది, రెండు ఎస్కార్ట్ వాహనాలు ఇస్తారు. ముఖ్యమంత్రి కుటుంబీకులకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని, అందులోనూ ఇటీవలే రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ నాయకుడి మీద దాడి జరిగిన నేపథ్యంలో భద్రతను పెంచాలని అకాలీదళ్ వర్గాలు అంటున్నాయి. పంజాబ్ ఆర్ఎస్ఎస్ డిప్యూటీ చీఫ్, రిటైర్డ్ బ్రిగెడియర్ జగదీష్ గగ్నేజాపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. -
సీఎంగారూ ఈ సినిమా తప్పక చూడండి
న్యూఢిల్లీ: బాలీవుడ్ సినిమా ఉడ్తా పంజాబ్ బాగుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసించారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన కుటుంబ సభ్యులు ఈ 'పవర్ఫుల్ సినిమా'ను తప్పకుండా చూడాలని కేజ్రీవాల్ అన్నారు. ఈ సినిమా చూస్తే పంజాబ్‌కు బాదల్ ఏం చేశారో తెలుస్తుందని చెప్పారు. డ్రగ్స్ రాకెట్ లో రాజకీయ నాయకుల ప్రమేయాన్ని ఉడ్తా పంజాబ్‌లో స్పష్టంగా చూపించారని కేజ్రీవాల్ అన్నారు. 'రాజకీయ నాయకులు డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నట్టు ఈ సినిమాలో చూపించారు. అంతేగాక ఎన్నికల సమయంలో ఉచితంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. పంజాబ్ పరిస్థితి బాధాకరం' అని కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్‌లో విచ్చలవిడి డ్రగ్స్ అమ్మకాలు, వాటి బారినపడి నాశనమవుతున్న యువకుల జీవితాలను కథాంశంగా తీసుకుని దర్శకుడు అభిషేక్ చాబే ఉడ్తా పంజాబ్ సినిమాను తెరకెక్కించారు. సెన్సార్ బోర్డు వివాదాలను దాటుకుని ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. -
సీఎంకి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
న్యూఢిల్లీ : పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ రాజకీయ నాయకుడు, సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్‌కి జన్మదిన శుభాకాంక్షలంటూ ప్రధాని మోదీ మంగళవారం ట్విట్ చేశారు. 1927, డిసెంబర్ 8వ తేదీన ప్రకాశ్ సింగ్ బాదల్ జన్మించారు. 2007 నుంచి ప్రకాశ్ సింగ్ బాదల్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంతకు ముందు 1970 -71, ఆ తర్వాత 1977 నుంచి1980 వరకు, 1997 నుంచి 2002 వరకు ప్రకాశ్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. -
కాలం చెల్లిన తుపాకులే ఉన్నాయి వాటితోనే...
కపూర్తలా : పంజాబ్ లోని పోలీసుల వద్ద కాలం చెల్లిన తుపాకీలే ఉన్నాయి. వాటితోనే తమ పోలీసులు తీవ్రవాదులతో పోరాడతున్నారు... గత ఎన్నో ఏళ్ల నుంచి ఇలాగే కొనసాగుతుంది. బుల్లెట్ ఫ్రూప్ దుస్తులు లేవు... యుద్ధ సమయంలో ధరించే హెల్మెట్లు లేవు... ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్. బుధవారం గురుదాస్‌పూర్‌లో పాక్ ముష్కర మూకల కాల్పులో ప్రాణాలు కోల్పోయిన ఎస్పీ బల్జీత్ సింగ్ నివాసంలో బల్జీజ్ మృతదేహాన్ని సందర్శించారు. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రకాశ్ సింగ్ బాదల్ మాట్లాడారు. బల్జీత్ సింగ్‌ను చూసి దేశం గర్విస్తుందన్నారు. రాష్ట్రంలో కాలం చెల్లిన ఆయుధాలపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు మంగళవారం న్యూఢిల్లీలో కలసి ఫిర్యాదు చేసినట్లు ప్రకాశ్ సింగ్ తెలిపారు. సోమవారం పంజాబ్ జిల్లాలోని గురుదాస్‌పూర్ పోలీసు స్టేషన్‌పై పాక్ తీవ్రవాదులు కాల్పులు జరిపారు. దాంతో అప్రమత్తమైన పంజాబ్ పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. దాదాపు 12 గంటల పాటు సాగిన ఈ ఎన్కౌంటర్లో నలుగురు పోలీసులతోపాటు ముగ్గురు పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులో స్థానిక డిటెక్టివ్ బ్రాంచ్‌లో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న బల్జీత్ సింగ్ మరణించారు. అలాగే పోలీసుల ఎదురు కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు మరణించారు. -
ప్రకాష్ సింగ్ బాదల్ తో ముగిసిన జగన్ భేటీ