పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్కి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ : పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్కి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ రాజకీయ నాయకుడు, సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్కి జన్మదిన శుభాకాంక్షలంటూ ప్రధాని మోదీ మంగళవారం ట్విట్ చేశారు. 1927, డిసెంబర్ 8వ తేదీన ప్రకాశ్ సింగ్ బాదల్ జన్మించారు. 2007 నుంచి ప్రకాశ్ సింగ్ బాదల్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంతకు ముందు 1970 -71, ఆ తర్వాత 1977 నుంచి1980 వరకు, 1997 నుంచి 2002 వరకు ప్రకాశ్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.