చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను ఆయన పరిణయమాడారు. చండీగఢ్‌లోని గురుద్వారాలో అతికొద్ది మంది సమక్షంలో ఈ విహహం జరిగింది. పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న భగవంత్ ఫోటోను ఆప్ నేత రాఘవ్ చద్దా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇందులో బంగారు వర్ణం దుస్తులు, పసుపు రంగు టర్బన్‌ను ధరించి వెలిగిపోయారు పంజాబ్ సీఎం.
భగవంత్‌మాన్ వివాహం సిక్కుల సంప్రదాయం ప్రకారం నిరాడంబరంగా జరిగింది. ఆయన తల్లి, సోదరి, అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబంతో పాటు ఇతర పార్టీ నేతలు ఈ వేడుకకు వెళ్లినవారిలో ఉన్నారు. ఈరోజు నుంచి కొత్త జీవితం ప్రారంభించబోతున్న భగవంత్ మాన్‌కు శుభాకాంక్షలు అని కేజ్రీవాల్ మీడియాకు తెలిపారు.
Chandigarh | Wedding rituals underway of Punjab CM Bhagwant Mann with Dr. Gurpreet Kaur pic.twitter.com/4QjnNsRXtg
— ANI (@ANI) July 7, 2022
AAP convenor and Delhi CM Arvind Kejriwal arrives in Mohali ahead of party leader and Punjab CM Bhagwant Mann's wedding which will be held in Chandigarh..."He is embarking on a new journey today, I wish him a happy married life," he says pic.twitter.com/YowaFASB8V
— ANI (@ANI) July 7, 2022
అంతకుముందు తన సోదరుడికి పెళ్లి జరగడం చాలా సంతోషంగా ఉందని ఆప్ నేత రాహుల్ చద్దా తెలిపారు. భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనేది ఆయన తల్లి కల అని, ఇప్పుడు అది నెరవేరడం ఆనందంగా ఉందన్నారు. మరి ఆమ్ ఆద్మీ పార్టీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‍లర్ అయిన మీ పెళ్లి ఎప్పుడు అని చద్దాను ట్విట్టర్‌లో ఓ జర్నలిస్ట్ అడిగారు. ముందు పెద్దవాళ్ల పెళ్లి జరిగిన తర్వాతే చిన్నవాళ్లు చేసుకుంటారని ఆయన చమత్కరించారు.
Waheguru Ji Apne Bacche Utte Aashirwad Banaye Rakheo 🙏🏻 pic.twitter.com/snnmdTi1sw
— Raghav Chadha (@raghav_chadha) July 7, 2022
పసందైన విందు
భగవంత్ పెళ్లిలో అతిథులకు భారతీయ, ఇటాలియన్ వంటలు సిద్ధం చేయించారు. కరాహీ పనీర్, తందూరి కుల్చే, దాల్ మఖానీ, నవరత్న బిర్యానీ, మౌసమీ సబ్జీలు, ఆప్రికాట్ స్టఫ్డ్ కోఫ్తా, లసగ్న సిసిలియానో, బుర్రానీ రైత వంటి రకరాకల వంటలు తయారు చేశారు.
Saade veer da vyah
— Raghav Chadha (@raghav_chadha) July 7, 2022
Saanu gode gode chah pic.twitter.com/0c09v6YG4N
Comments
Please login to add a commentAdd a comment