చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పార్టీ చీఫ్ పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ రాష్ట్ర విభాగానికి పూర్తికాల అధ్యక్షుడిని నియమించటంపై ఆప్ పార్టీ నాయకత్వంతో చర్చిస్తామని అన్నారు. ఆయన చబ్బేవాల్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను రాష్ట్ర చీఫ్ పదవి నుంచి వైదొలగాలనే కోరికను బయటపెట్టారు.
‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు పెద్ద బాధ్యతలు ఉన్నాయి. ఇప్పటికే నాకు 13-14 శాఖలు ఉన్నాయి. బాధ్యతలు విభజించబడేలా పూర్తి సమయం రాష్ట్ర యూనిట్ చీఫ్‌ను నియమించడానికి పార్టీ న్యాయకత్వంతో మాట్లాడతా’’ అని అన్నారు.
భగవంత్ మాన్ 2017లో సంగ్రూర్ ఎంపీగా ఉన్నప్పుడు ఆప్ పంజాబ్ యూనిట్ చీఫ్‌గా నియమితులయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాన్ పంజాబ్‌లో పార్టీకి నాయకత్వం వహించారు. అంతేకాకుండా.. 2022లో 117 మంది సభ్యుల పంజాబ్ అసెంబ్లీలో 92 స్థానాలను గెలుచుకుని ఆప్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే.. 2023 జూన్ ఆప్ పంజాబ్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుధ్ రామ్‌ను నియమించింది.
మరోవైపు.. గిద్దర్‌బాహా, డేరా బాబా నానక్, చబ్బేవాల్, బర్నాలా నాలుగు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెలువడుతాయి. ఈ స్థానాల ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నిక కావటంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.
చదవండి: సీజేఐ ఇంట్లో గణపతి పూజకు మోదీ హాజరు.. చంద్రచూడ్ రియాక్షన్
Comments
Please login to add a commentAdd a comment