ఢిల్లీ : ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే దోపిడీ కేసులో షరతులతో కూడిన బెయిల్ పొందారు. అలా బెయిల్ వచ్చిందో లేదో .. ఇలా మరో కేసులో అరెస్ట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ బుధవారం దోపిడీ కేసులో బెయిల్ పొందిన కొన్ని గంటల తర్వాత, వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కేసులో అరెస్టయ్యారు.
ఆదివారం ఢిల్లీ ఉత్తమ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బల్యాన్‌ను మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) నిబంధనల ప్రకారం అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
PTI SHORTS | AAP MLA Naresh Balyan arrested in an organised crime case under MCOCA; granted bail in a separate extortion case
WATCH: https://t.co/enOt0Wf9Lo
Subscribe to PTI's YouTube channel for in-depth reports, exclusive interviews, and special visual stories that take you…— Press Trust of India (@PTI_News) December 4, 2024
అయితే, ఈ అరెస్ట్‌కు ముందే గత శనివారం దోపిడీ కేసులో మూడు రోజుల కస్టడీ గడువు ముగిసిన అనంతరం, అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. దోపిడీ కేసులో రూ.50 వేలు ఫైన్ విధిస్తూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ మరుసటి రోజు ఆదివారం బల్యాన్‌ను దక్షిణ ఢిల్లీలోని ఆర్‌కే పురం క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి విచారణ కోసం వచ్చిన బల్యాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం.
ఎమ్మెల్యేకు బెయిల్,అరెస్ట్‌పై బీజేపీ, ఆప్ నేతలు విమర్శల దాడికి దిగారు. నేరాలకు పాల్పడుతున్న తన పార్టీ ఎమ్మెల్యేపై అరవింద్ కేజ్రీవాల్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. అయితే, బీజేపీ విమర్శల్ని ఆప్ ఖండించింది. బల్యాన్ అరెస్ట్ అక్రమమని, బీజేపీ అబద్ధపు ప్రచారం చేసి తమ పార్టీ నేతలపై కేసులు పెట్టిస్తుందని ఆప్ నేతలు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment