Assembly Election Results 2022
-
హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ
-
కొత్త అసెంబ్లీల్లో పెరిగిన మహిళా ప్రాతినిథ్యం
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఎంఎల్ఏల ప్రాతినిథ్యం పెరిగింది. గత అసెంబ్లీలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో మహిళా ఎంఎల్ఏల సంఖ్య పెరిగిందని పీఆర్ఎస్ రిసెర్చ్ సంస్థ తెలిపింది. 2017లో యూపీ అసెంబ్లీలో 42 మంది మహిళా ఎంఎల్ఏలు ఉండగా ప్రస్తుతం వీరి సంఖ్య 47కు పెరిగింది. అదేవిధంగా ఉత్తరాఖండ్‌లో మహిళా ఎంఎల్ఏల సంఖ్య 5 నుంచి 8కి, మణిపూర్‌లో 4 నుంచి 8కి పెరిగింది. ఎంఎల్ఏలుగా ఎన్నికైన వారిలో 55 సంవత్సరాలు నిండినవారి సంఖ్య పెరిగింది. మరోవైపు యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌లో వయసులో పెద్దవారైన ఎంఎల్ఏల సంఖ్య పెరిగింది. 55 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న ఎంఎల్ఏల సరాసరి 2017లో 64.7 శాతం ఉండగా, 2022కు 59.5 శాతానికి పెరిగినట్లు సంస్థ తెలిపింది. కనీసం డిగ్రీ అర్హత ఉన్న ఎంఎల్ఏల వాటా యూపీలో 72.7 నుంచి 75.9 శాతానికి పెరగ్గా, ఉత్తరాఖండ్‌లో 77 నుంచి 68 శాతానికి, మణిపూర్‌లో 76 నుంచి 68 శాతానికి తగ్గిందని సంస్థ వెల్లడించింది. -
ప్రధాని మోదీతో సీఎం యోగి భేటీ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సీఎం యోగి మొదటిసారిగా దేశ రాజధానికి చేరుకున్నారు. దాదాపు గంటన్నరపాటు వారి భేటీ కొనసాగింది. ముఖ్యంగా యూపీలో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. రానున్న సంవత్సరాల్లో యోగి హయాంలో యూపీలో అభివృద్ధి మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకుముందు సీఎం యోగి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్‌లతో భేటీ అయ్యారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌లతోనూ సమావేశమయ్యారు. -
సీఎంకు ఓటర్ల షాక్.. మోదీ సూచనతో ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా మహిళ?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అఖండ విజయం సాధించినప్పటికీ.. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓడిపోవడంతో.. పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిని నియమించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ సీఎం బీసీ ఖండూరీ కుమార్తె రీతూ ఖండూరీకే సీఎం పగ్గాలు దక్కుతాయన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. బీజేపీ హైకమాండ్ నుంచి రీతు ఖండూరీకి పిలుపు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటు, సీఎం అభ్యర్థిపై అధినాకత్వం రీతూతో చర్చించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఆమెనే ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. రీతూ ఖండూరీ భర్త రాజేశ్ భూషణ్.. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ హెల్త్ సెక్రెటరీగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, సీఎం రేసులో మరో ఆరుగురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సత్పాల్ మహరాజ్, ధన్ సింగ్ రావత్, మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బిషన్ సింగ్ చుఫాల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే.. మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇదిలాఉండగా.. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనా కాలంలో ఉత్తరాఖండ్‌లో బీజేపీ ముగ్గురిని సీఎం పీఠంపై కూర్చోబెట్టిన సంగతి తెలిసిందే. పార్టీ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని ఒకరిని, నిర్ణీత సమయంలోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేనందున మరొరిని సీఎం పదవుల నుంచి బీజేపీ అధిష్టానం తప్పించింది. చివరగా పుష్కర్ సింగ్ ధామికి అవకాశం కల్పించింది. ఎన్నికల సమయంలో సీఎంల మార్పు వ్యవహారం పార్టీని కొంతవరకు ఇబ్బంది పెట్టింది. దీంతో ఈసారి ఎలాంటి తప్పూ దొర్లకుండా ముందుకు వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. -
కేటీఆర్‌తో అసదుద్దీన్ భేటీ.. ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌తో భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని ఎంఐఎం అధినేత,ఎంపీ అసదుద్దిన్ ఒవైసీ తెలిపారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. కాగా మంత్రి కేటీఆర్‌తో ఎంపీ అసదుద్దీన్ శనివారం అసెంబ్లీలో సమావేశమయ్యారు. అనంతరం అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే కేటీఆర్‌ను కలిశానని, పదవుల వంటి మరే ఇతర అంశాలు చర్చించలేదన్నారు. ఉత్తర ప్రదేశ్ ఫలితాలపై తనకే నారాజ్ లేదని పేర్కొన్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పని తెలిపారు. యూపీ ఫలితాలు ఆశ్చర్యపరచలేదని, యూపీ ఎన్నికలు.. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు వేర్వేరు అన్నారు. యూపీ సీఎం మంచి జోష్‌లో ఉన్నారని పేర్కొన్నారు. ఆయన మంచి మాటకారి అని ఆదిత్యనాథ్ తీరుపై కితాబిచ్చారు. అయితే ఎన్నికల ఫార్ములా ఇక్కడ పనిచేయదన్నారు. యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తే హత్య యత్నం చేశారు. అఖిలేష్ యాదవ్ నెల ముందు నుంచి పరీక్షకు సిద్ధమవుతారని. డిస్టింక్షన్ కొట్టాలంటే ముందు నుంచే సిద్ధంగా ఉండాలని హితవు పలికారు. చదవండి: రాజీనామా యోచనలో సోనియా, రాహుల్, ప్రియాంక?.. రేపే ప్రకటన! ‘బీజేపీ తెలంగాణపై దృష్టి సారించినా ఇక్కడ ముఖ్యమంత్రి బలంగా ఉన్నారు. తెలంగాణలో కారు స్పీడ్ మీద ఉంది. గుజరాత్, రాజస్థాన్ ఎన్నికల్లో మజ్లిస్ పోటీ చేస్తుంది. జమ్మూ కశ్మీర్లో మజ్లిస్ పోటీ చేయదు. కాంగ్రెస్ వైఫల్యం వల్లే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తోంది. దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలకం అవుతాయి. రాజకీయ శూన్యతను ఏదో పార్టీ నింపాల్సి ఉంటుంది. అందుకే ఆప్ ఎదుగుతోంది. పంజాబ్‌లో ఆప్‌కు అధికారాన్ని కాంగ్రెస్ బహుమతిగా ఇచ్చింది. కాంగ్రెస్ లోని జీ23 గ్రూప్ ఏం చేస్తుందో చూద్దాం. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయో... లేదో తెలియదు. చదవండి: పొంగులేటి వ్యాఖ్యలతో పెరిగిన రాజకీయ వేడి.. పోటీకి సై అంటున్న మాజీలు.. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మజ్లిస్ సిద్ధమే.కేసీఆర్ ఫ్రంట్ ఆలోచనల గురించి నాకు తెలియదు. ఒంటరిగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్‌ను తక్కువ అంచనా వేయలేం. కేసీఆర్ చాలా మొండి వ్యక్తి. . కేసీఆర్ ఇంత మందితో మాట్లాడుతున్నారంటే ఏదో ఒకటి ఉంటుంది. #పదవీకాలం ముగిసినా గులాం నబీ ఆజార్‌కు ఢిల్లీలో ఇచ్చిన అధికారిక నివాసాన్ని పీఎంఓ లేఖతో కొనసాగిస్తున్నారు. ఆజాద్‌కు క్వార్టర్ ను కొనసాగించడం వెనక ఉన్న మతలబు ఏమిటి?’ అని ప్రశ్నించారు. -
5 రాష్ట్రాల ఎన్నికల్లో డీలా పడ్డ కాంగ్రెస్ పార్టీ
-
బీజేపీ భారీ గెలుపు.. మమతా సంచలన ఆరోపణలు
లక్నో: గురువారం వెల్లడైన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ మేరకు ఆమె నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుపై సంచలన ఆరోపణలు చేశారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి వచ్చిన గెలుపు ప్రజా తీర్పు కాదని, ఈవీఎం మిషన్ల తీర్పని వ్యాఖ్యానించారు. కేంద్ర బలగాలు,ఏజెన్సీల సహాయంతో సాధించిన విజయమని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. కలిసి పోరాడాలి 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాలని మమతా పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అందరం కలిసి బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ కోరుకుంటే, ఇప్పుడు తీవ్రంగా స్పందించడం మానుకోవాలని సూచించారు. సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని తెలిపారు. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు భవిష్యత్తులో ఆ పార్టీకి నష్టదాయకమే అన్న మమతా... ఈ అయిదు రాష్ట్రాల ఫలితాలు 2024 ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయన్న వాదనలు చెల్లవు అని తెలిపారు. బీజేపీ పగటి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు. చదవండి: Tamil Nadu: పార్టీ బలోపేతానికి కమల్ హాసన్ కీలక నిర్ణయం మరోవైపు కాంగ్రెస్ విశ్వసనీయత కోల్పోతుందని, కాంగ్రెస్‌పై ఆధారపడే పరిస్థితులు లేవన్నారు. చాలా ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఉన్నాయని, అందరూ కలిసి పనిచేయాలని కోరారు. దీనిపై ఖచ్చితంగా ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. అఖిలేష్ యాదవ్ నిరుత్సాహపడొద్దు ఎన్నికల్లో అక్రమాలు జరగడం వల్లే సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఓడిపోయారని మమతా అన్నారు. అయితే యూపీ ఫలితాలతో అఖిలేశ్ యాదవ్ మనోస్థైర్యం కోల్పోరాదని అన్నారు. అఖిలేశ్ యాదవ్ కు ఈసారి ఓటింగ్ పెరిగిందని, 27 శాతం నుంచి 37 శాతానికి పెరిగిందని వివరించారు. ప్రజల వద్దకు వెళ్లి బీజేపీని సవాల్ చేయాలని ఆమె సూచించారు. ఈవీఎం యంత్రాలకు ఫోరెన్సిక్ పరీక్షలు జరిపేలా అఖిలేశ్ ఎన్నికల సంఘాన్ని కోరాలని సూచించారు. చదవండి: కశ్మీర్ సరిహద్దుల్లో కూలిన ఆర్మీ హెలికాప్టర్ -
ఇప్పుడిప్పుడే బలపడతున్న తరుణంలో ఢీలా పడేలా చేసిన రిజల్ట్స్
-
కొత్త రూపుతో తిరిగొస్తాం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును శిరసావహిస్తున్నట్టు కాంగ్రెస్ పేర్కొంది. ఫలితాలు తమ అంచనాలకు భిన్నంగా వచ్చాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ముఖ్య అధికార ప్రతిని ధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. అంతమాత్రాన ధైర్యం కోల్పోలేదని, పోరాడి విజయం సాధిస్తామని చెప్పారు. ఫలితాల అనంతరం గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫలితాలతో నిరాశ చెందినా కుంగిపోలేదని చెప్పారు. ‘‘ఓటమి కారణాలపై ఆత్మవిమర్శ చేసుకుంటాం. ఒక పార్టీగా కాంగ్రెస్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. సరికొత్త వ్యూహాలతో తిరిగొస్తుంది. గెలిచేదాకా పోరాడుతూనే ఉంటుంది. ఆ క్రమంలో నిత్యం జనం పక్షానే నిలుస్తుంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ వంటి ప్రజా సమస్యలపై అంతే బాధ్యతతో గొంతెత్తుతుం ది’’ అని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కుల, మతవాదాలకు తావివ్వకుండా చూసేందుకు కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలూ చేసినా బీజేపీ చేసిన విపరీతమైన భావోద్వేగ ప్రచారం ముందు విద్య, వైద్యం, ఆరోగ్యం, నిరుద్యోగం వంటి నిజమైన సమస్యలు పక్కకు పోయాయని ఆరోపించారు. ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాల్లో మెరుగైన ఫలితాలు ఆశించినట్టు సుర్జేవాలా చెప్పారు. కానీ పంజాబ్‌లో ప్రభు త్వ వ్యతిరేకతను అధిగమించలేకపోయామన్నారు. ‘‘యూపీలో పార్టీకి నూతన జవసత్వాలు కల్పించగలిగినా ప్రజల్లో తమ పట్ల ఉన్న సానుకూలతను ఓట్లుగా మార్చుకోలేకపోయాం. ఉత్తరాఖండ్, గోవాల్లో బాగా పోరాడినా విజయం సాధించలేకపోయాం’’ అని చెప్పారు. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పోరాటం సాగిస్తాం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ప్రజల తరపున నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తమ పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి ప్రియాంకా గాంధీ వాద్రా చెప్పారు. యూపీలో విజయం కోసం తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతగానో శ్రమించారని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారని, వాటి పరిష్కారం కోసం ఉద్యమించారని తెలిపారు. అయినప్పటికీ తమ శ్రమను ఓట్లుగా మరల్చుకోలేకపోయామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పు శిరోధార్యం అని ఉద్ఘాటించారు. యూపీ అభివృద్ధి కోసం తమ వంతు పోరాటం సాగిస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. -
‘మాయ’మైనట్టేనా?
సాక్షి, న్యూఢిల్లీ: యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేశాయి. 403 అసెంబ్లీ స్థానాల్లో ఒకే ఒక్క స్థానానికి పరిమితమై ఆ పార్టీ కుదేలైంది. తొలినుంచి ఆయువుపట్టుగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గం ఆదరించకపోగా మాయా సొంత సామాజికవర్గం జాటవ్‌లు కూడా బీజేపీ వైపు మొగ్గారు. ఒక దశలో ప్రధాని అయ్యేంతగా వెలుగు వెలిగిన మాయావతి ప్రభ ఈ ఎన్నికలతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టేనని విశ్లేషకులంటున్నారు. మాయా లేదు..మంత్రం లేదు.. బహుజనుల నేతగా 1995, 1997, 2002, 2007ల్లో నాలుగుసార్లు యూపీ సీఎం పీఠమెక్కిన ఘన చరిత్ర 66 ఏళ్ల మాయావతిది. అలాంటిది బీఎస్పీ ఈసారి ఎన్నడూ లేనంతటి ఘోర అపజయాన్ని మూటగట్టుకుంది. 2017 ఎన్నికల్లో 22.23 శాతం ఓట్లతో 19 స్థానాలు గెలిచిన పార్టీ ఈసారి నెగ్గింది ఒక్కటంటే ఒక్క సీటు! ఓట్ల శాతం కూడా 12.6 శాతానికి దిగజారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీఎస్పీ కేవలం 19.3 శాతం ఓట్లతో 10 స్థానాలతో సరిపెట్టుకుంది. అప్పటినుంచీ పార్టీ కార్యక్రమాలను మాయా పెద్దగా పట్టించుకోవడం లేదు. దాంతో పార్టీలో క్రియాశీలంగా ఉండే బ్రాహ్మణవర్గం బీజేపీలోకి, ముస్లింలు సమాజ్‌వాదీలో చేరారు. బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ పోటాపోటీ సభలు, రోడ్‌షోలు, ర్యాలీలకు దిగాయి. కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ 209 ర్యాలీలు, సభలు; బీజేపీ నుంచి యోగి 203 సభలు, ర్యాలీలు; ఎస్పీ అధినేత అఖిలేశ్ 139 ర్యాలీలు, సభలు జరిపితే మాయా కేవలం 18 మీటింగులతో ముగించారు. ఎస్సీలూ దూరమయ్యారు యూపీలో 21 శాతమున్న దళిత ఓటర్లు తొలినుంచీ బీఎస్పీకే దన్నుగా నిలిచారు. సుమారు 4.2 కోట్ల దళితుల్లో 2.25 కోట్లు మాయా సామాజికవర్గం జాటవ్కే చెందిన వారు. పాసీలు 70 నుంచి 80 లక్షల దాకా (16 శాతం)ఉంటారు. కోటికి పైగా మిగతా కులాల వారున్నారు. రాష్ట్రంలోని 84 ఎస్సీ స్థానాల్లో 2007లో బీఎస్పీ ఏకంగా 61 గెలుచుకోగా 2012లో 14కు పడిపోయింది. 2017 ఎన్నికల నాటికి ఎస్సీలు దాదాపుగా బీజేపీ వైపు మొగ్గారు. 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చాక జాటవేతర వర్గాలను విఛ్చిన్నం చేయడంతో దళితులు బీఎస్పీకి దూరమయ్యారు. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ అదే ఫార్ములా వాడింది. దాంతో దళితులంతా మరోసారి బీజేపీవైపే నిలిచారు. గడిచిన ఎన్నికల్లో బీఎస్పీ సాధించిన సీట్లు, ఓట్లు ఎన్నికలు గెలిచిన ఓట్ల సీట్లు శాతం 2002 98 23.06 2007 206 30.43 2012 80 25.97 2017 19 22.23 2022 1 12.66 -
యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు తెలుసా?
లక్నో: యోగి ఆదిత్యనాథ్.. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాయకుడు. బీజేపీని మరోసారి విజయతీరాలకు చేర్చిన నేతగా ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయం యోగియే అన్న ప్రచారం సైతం ఇప్పటికే ఊపందుకుంది. హిందుత్వ నినాదానికి ‘పోస్టర్ బాయ్’గా, ఫైర్‌బ్రాండ్ లీడర్‌గా గుర్తింపు పొందిన యోగి ఆదిత్యనాథ్ తరచుగా ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. మఠాధిపతి నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకూ ఆయన ప్రస్థానం నిజంగా ఆసక్తికరం. ► యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్‌సింగ్ బిస్త్. ► ఉమ్మడి ఉత్తరప్రదేశ్‌లో పౌరీ గర్వాల్ జిల్లాలోని పాంచుర్ (ప్రస్తుత ఉత్తరాఖండ్)లో 1972 జూన్ 5న ఠాకూర్ సామాజికవర్గంలో జన్మించారు. తండ్రి ఆనంద్‌సింగ్ బిస్త్ ఫారెస్ట్ రేంజర్‌గా పనిచేశారు. నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కాచెల్లెళ్లలో యోగి రెండో సంతానం. ► 1990లో ఇల్లు విడిచి వెళ్లిపోయారు. రామమందిర నిర్మాణ ఉద్యమంలో చేరారు. చురుగ్గా కార్యకలాపాలు సాగించారు. ► గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయ పీఠాధిపతి మహంత్ అవైద్యనాథ్కు ప్రియ శిష్యుడిగా మారారు. ► అవైద్యనాథ్ మరణం తర్వాత 2014లో గోరఖ్‌నాథ్ ఆలయ మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికీ పీఠాధిపత్యం ఆయనదే. ► పీఠాధిపతిగా ఉంటూ బీజేపీపై విమర్శలు చేసేందుకు కూడా ఆదిత్యనాథ్ వెనకాడలేదు. హిందుత్వ సిద్ధాంతాన్ని బీజేపీ నిర్వీర్యం చేస్తోందంటూ తూర్పారబట్టేవారు. అయినా యోగిపై ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు అభిమానం ప్రదర్శించేవారు. ► ‘హిందూ యువవాహని’ పేరిట యోగి సొంతంగా ఒక సేనను తయారు చేశారు. అందులో భారీగా కార్యకర్తలను చేర్చుకున్నారు. ► స్వగ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. హేమావతి నందన్ బహుగుణ గర్వాల్ వర్సిటీ నుంచి మ్యాథ్స్‌లో బ్యాచ్లర్స్ డిగ్రీ అందుకున్నారు. 1998లో సొంత గ్రామంలో స్కూలు నెలకొల్పారు. ► గురువు అవైద్యనాథ్ మార్గదర్శకత్వంలో 1998లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ► 28 ఏళ్ల వయసులోనే గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ లోక్‌సభలో అత్యంత పిన్నవయస్కుడు ఆయనే. ► 1998, 1999, 2004, 2009, 2014ల్లో ఐదుసార్లు గోరఖ్‌పూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ► 2017 ఎన్నికల్లో యూపీలో ఘనవిజయం సాధించిన బీజేపీ యోగిని అనూహ్యంగా సీఎంగా ఖరారు చేసింది. 2017 మార్చి 19న యూపీ 21వ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొందారు. ► హిందుత్వ ప్రతినిధిగా తన ప్రతిష్టను మరింత పెంచుకొనేలా యోగి పలు నిర్ణయాలు తీసుకున్నారు. యూపీలో గోవధపై ఉక్కుపాదం మోపారు. అక్రమ కబేళాలను మూసేయించారు. ► లవ్ జిహాద్‌ను అరికట్టడమే లక్ష్యంగా బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా తొలుత ఆర్డినెన్స్, ఆ తర్వాత బిల్లు తెచ్చారు. ► అవినీతి, అక్రమాలకు దూరంగా నిజాయితీపరుడైన నాయకునిగా ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. ► సీఎం పదవి నుంచి యోగిని తప్పించాలని బీజేపీ భావిస్తున్నట్లు గతేడాది బాగా విన్పించినా నిజం కాదని తేలింది. ► ఈ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసి లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. -
ఫలించిన పాజిటివ్ మంత్రం
ఉత్తరప్రదేశ్ ఓటర్లు చరిత్ర సృష్టించారు. యోగి ఆదిత్యనాథ్ పాలనకు జై కొట్టారు. మూడున్నర దశాబ్దాల ఆనవాయితీని తిరగరాస్తూ అధికార పార్టీ బీజేపీకి రెండోసారి అధికారం కట్టబెట్టారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఒంటరి పోరాటం ఫలించలేదు. బీఎస్పీ పూర్తిగా చతికిలపడటం, కాంగ్రెస్ కనుమరుగవడం, బీజేపీ హిందూత్వ ప్రచారం, పాజిటివ్ మంత్రం తదితరాలు అఖిలేశ్ సారథ్యంలోని ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమిని దెబ్బతీశాయి. శాంతిభద్రతలు, మోదీ ప్రజాదరణ, ఉచిత రేషన్, అభివృద్ధి వంటి సానుకూలాంశాలు యోగిని గట్టెక్కించాయి. సవ్యమైన శాంతిభద్రతలు యోగి పాలనలో సైతం గత ఐదేళ్లలో యూపీలో దారుణమైన నేరాలు అనేకం జరిగాయి. కానీ వాటికి పాల్పడ్డ వారిని యోగి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచేసిన తీరు ప్రజలకు నచ్చింది. నేరాలకు పాల్పడిన మాఫియా నేతలను ఎన్కౌంటర్లలో మట్టుపెట్టిన యోగి ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారు. ‘యోగి వల్ల మేం రాత్రి 12 గంటలకు కూడా రోడ్డుపై తిరగగలుగుతున్నాం. అంతకంటే మాకేం కావాలి?’ అని లక్నోకు చెందిన సురేఖ రాణి ప్రశ్నించారు. నేరస్తుల పట్ల యోగి అత్యంత కఠినంగా వ్యవహరించారని ప్రజలు విశ్వసించారు. గతంతో పోలిస్తే యూపీలో హత్యలు, అత్యాచారాలు తగ్గాయని రాయ్‌బరేలీకి చెందిన కిషన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘నేను యూపీలో విస్తృతంగా పర్యటించాను. యోగి ప్రభుత్వం పట్ల మహిళల్లో మంచి ఆదరణ కన్పించింది. దానికి మరో అవకాశం ఇవ్వాలన్న పట్టుదల చాలామందిలో గమనించా’ అని ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ విశ్లేషించారు. బీజేపీ మళ్లీ అధికారంలో రావడానికి మహిళల మద్దతు ప్రధాన కారణమని ఆయనన్నారు. అవినీతి నియంత్రణ యోగి తన ఐదేళ్ల పాలనలో అవినీతిని కొంతమేరకు నియంత్రించగలిగారు. ఇది కూడా ఆయనను మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి దోహదపడిందని రాజకీయ విళ్లేషకులు అంటున్నారు. ‘మరీ ముఖ్యంగా పై స్థాయిలో అవినీతిని యోగి బాగా నియంత్రించారని ప్రజలు నమ్మారు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని అదుపు చేయడంలో యోగి సఫలమయ్యారు. ఏ నియోజకవర్గంలో నేరాలు జరిగినా సంబంధిత ఎమ్మెల్యేదే బాధ్యత అన్న యోగి హెచ్చరికలు కూడా ప్రజలకు నచ్చాయి’ అని సెంటర్ ఫర్ పొలిటికల్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు ప్రవీణ్ వర్మ అన్నారు. ‘కిందిస్థాయిలో అవినీతి ఉన్నా ప్రజలను ఇబ్బంది పెట్టేంతగా లేదని ప్రజలు విశ్వసించారు. మరోసారి యోగి గెలిస్తే అవినీతి మరింత తగ్గుతుందని కూడా నమ్మారు’ అని ప్రముఖ సెఫాలజిస్ట్ ప్రదీప్ గుప్తా విశ్లేషించారు. పన్నులు పెంచినా వృద్ధీ ఉంది యోగి హయాంలో పన్నులు బాగా పెంచారన్న అసంతృప్తి ప్రజల్లో లేకపోలేదు. కానీ అభివృద్ధి జరగాలంటే నిధులు కావాలి కదా అని సర్దుకుపోయే ధోరణిలో మాట్లాడుతున్న వాళ్లే ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల పనితీరు కూడా ఐదేళ్లలో బాగానే మెరుగుపడిందని ప్రజలు బహిరంగంగా చెపుతున్నారు. యోగికి మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వడానికి ఇవీ కారణాలేనన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. సమాజ్‌వాదీ ఓటమికి కారణాలెన్నో.. అఖిలేశ్‌ను ఎలాగైనా మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలంటూ ముస్లింలలో వచ్చిన పెద్ద మార్పు యూపీలో హిందువుల పోలరైజేషన్‌కు ఉపయోగపడింది. బహుశా ఇదే బీజేపీని గెలిపించినట్టు కన్పిస్తోందని ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యాదవులకు వ్యతిరేకంగా ఓబీసీలు బీజేపీ వైపు ర్యాలీ అయ్యారని ఆయన విశ్లేషించారు. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజకీయంగా దాదాపుగా కనుమరుగు కావడం కూడా అఖిలేశ్‌కు అతి పెద్ద మైనస్‌గా మారిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో ఆమె పెద్దగా ప్రచారం కూడా చేయలేదు. మాయావతి అనాసక్తిని కనిపెట్టిన కొందరు దళితులు బీజేపీ పంచన చేరారు. మరికొందరు ఎస్పీకి వ్యతిరేకంగా పని చేశారు. నిజానికి ఈసారి ముస్లింలు, యాదవులు అఖిలేశ్‌కు ఏకమొత్తంగా మద్దతు పలికారు. అలా చూస్తే ఆయన పోరాటం నేరుగా 24 శాతం ఓట్లతో మొదలైంది! 2013 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇది ఏకంగా 4 శాతం అధికం. మరో 16 శాతానికి అటూఇటుగా ఓట్లు తెచ్చుకోగలిగి ఉంటే అధికారం ఆయన సొంతమయ్యేదే. కానీ అది చెప్పినంత తేలిక కాదు. యూపీ రాజకీయాల్లో బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువే. వారు ఏ పార్టీకి మద్దతిస్తే వారి తరపున జోరుగా ప్రచారం చేస్తారు. పైగా మరో విశేషమేమంటే ఆ వర్గానికి చెందిన వారు కనీసం 90 శాతం దాకా కచ్చితంగా ఓటు వేస్తారు. ఇది ఈసారి అఖిలేశ్‌కు బాగా మైనస్‌గా మారింది. గత ఐదేళ్లలో అఖిలేశ్ పార్టీని పటిష్టపరచుకోగలిగారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పెద్దగా పోరాటాలు చేయలేదన్న అపవాదుంది. ప్రజలను చైతన్యవంతులను చేసే ప్రయత్నంలో కూడా విఫలమయ్యారన్న విమర్శలు ఎక్కువయ్యాయి. అలాగే యాదవులు, ముస్లింలు మినహా మిగతా వర్గాలను అఖిలేశ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఆయనకు ప్రజల్లో మంచి ఆదరణే ఉంది. కానీ, దాన్ని ఓట్లుగా మలుచుకోలేకపోయారు. అందుకు కావాల్సిన యంత్రాంగం, దాన్ని ముందుండి నడిపే వనరుల లేమి కూడా మైనస్ అయింది. బీజేపీ ఈ ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. మోదీ మంత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల యూపీ ప్రజలకున్న విశ్వాసం ఏమాత్రం సడలకపోవడం కూడా యోగికి ఈసారి పెద్ద వరమైంది. ‘యోగి కంటే మోదీకే యూపీలో ఎక్కువ పాపులారిటీ ఉంది. ఆయనపై ప్రజలకున్న తిరుగులేని విశ్వాసం కూడా అఖిలేశ్‌కు బాగా మైనస్ అయింది’ అని సెఫాలజిస్ట్ యశ్వంత్ దేశ్‌ముఖ్ అన్నారు. వీటికి తోడు రాష్ట్రంలో కాంగ్రెస్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోవడం కూడా అఖిలేశ్‌కు మరో పెద్ద మైనస్‌గా మారింది. ఎక్కడా కాంగ్రెస్ కనీసం ఐదు శాతం ఓట్లు కూడా చీల్చే పరిస్థితి కన్పించలేదు. దాంతో అధికార బీజేపీ ఓట్లు చీలలేదు. – (సాక్షి ప్రత్యేక ప్రతినిధి కంచర్ల యాదగిరిరెడ్డి) -
భగత్ సింగ్ సొంతూళ్లో ప్రమాణం
చండీగఢ్: ‘పంజాబ్ కొత్త కేబినెట్ ప్రమాణస్వీకార కార్యక్రమం రాజ్‌భవన్‌లో జరగదు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలన్‌లో నిర్వహిస్తాం’ అని ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ వెల్లడించారు. కార్యక్రమం తేదీలను తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. ఏ సర్కారు ఆఫీసులో కూడా ముఖ్యమంత్రి చిత్రపటాలు ఉండవని స్పష్టం చేశారు. బదులుగా భగత్‌సింగ్, అంబేద్కర్ ఫొటోలు ఉంటాయన్నారు. ఇప్పుడిక పంజాబ్‌ను మళ్లీ పంజాబ్‌గా మారుస్తామని చెప్పారు. పంజాబ్ ప్రజలు ఆప్‌కు పట్టం కట్టారని ట్రెండ్‌ను బట్టి తెలియడంతో ధురిలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో మాన్ మాట్లాడారు. పాఠశాలల స్థితిగతులను మెరుగుపరచడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెంచడం, పరిశ్రమలను తీసుకురావడం, సాగును లాభసాటిగా మార్చడం, మహిళలకు భద్రత కల్పించడం, క్రీడా మౌలిక సదుపాయాలను పెంచడం ప్రాధాన్యాంశాలని ఆయన వివరించారు. క్రీడలను ప్రోత్సహించడానికి గ్రామాల్లో ట్రాక్స్, స్టేడియంలు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని ప్రాంతాల్లో మంత్రులు ఎప్పటికప్పుడు పర్యటిస్తుంటారని.. ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటారని చెప్పారు. ‘ఆప్‌కు ఓటేయని వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని వర్గాల ప్రజల కోసం పార్టీ పని చేస్తుంది’ అని చెప్పారు. ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను తిరిగి తీసుకురావడంపై స్పందిస్తూ.. ‘మన పిల్లలు చదువుకోవడానికి బయటకు ఎందుకు వెళ్లాలి. మనమే తక్కువకు సదుపాయాలు ఎందుకు కల్పించకూడదు’ అన్నారు. -
హోలీ ముందుగానే వచ్చింది, 2024లోనూ ఇదే రిపీట్ అవుద్ది: మోదీ
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్య విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు హోలీ పండుగ ముందుగానే వచ్చిందని అన్నారు. ప్రజల అఖండ మద్దతే ఈ విజయానికి కారణమన్నారు. బీజేపీ నిర్ణయాలు, విధానాలపై నమ్మకం పెరిగిందని, బీజేపీ స్థానాల సంఖ్య పెరిగిందని తెలిపారు. మహిళలు, యువత బీజేపీకి అండగా నిలిచారని, తొలిసారి ఓటేసిన యువకులు బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. గోవాలో అందరి అంచనాలు తలకిందులు అయ్యాయన్న మోదీ.. గోవా ప్రజలు బీజేపీకి మూడోసారి అధికారాన్ని కట్టబెట్టారన్నారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు. యూపీలో ఐదేళ్లపాటు ప్రభుత్రాన్ని నడిపిన సీఎంను.. ప్రజలు మళ్లీ గెలిపించడం ఇదే తొలిసారన్నారు. ‘ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీ పాలనతీరును మెచ్చి ప్రజలిచ్చిన తీర్పు. పేదరికం నిర్మూలన అంటూ చాలా నినాదాలు, స్కీమ్‌లు వచ్చాయి. కానీ పేదరికం తొలగిపోలేదు. మేం ఆ దిశగా ప్రణాళికతో పనిచేశాం. పేదలకు ప్రభుత్వ పథకాలు అందే వరకు నేను వదిలిపెట్టను. చివరి పేదవాడి వరకు ప్రభుత్వ పథకాలు అందాలి. నిజాయితీతో పనిచేస్తే ఎంత కష్టమైన పనైనా సాధ్యమవుతుంది. చదవండి: ‘హస్త’వ్యస్తం.. చివరికి మిగిలింది ఆ ‘రెండే’.. మహిళలు అధికంగా ఓట్లేసిన చోట బీజేపీ బంపర్ విక్టరీ కొట్టింది. నాకు స్త్రీశక్తి అనే కవచం లభించింది. కులాల పేరుతో ఓట్లు అడిగి కొన్ని పార్టీలు యూపీ ప్రజల్ని అవమానించారు. యూపీ ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. కులం, జాతి అనేది దేశ ప్రగతికి ఉపయోగపడాలి కానీ, విచ్ఛిన్నానికి కాదు. యూపీ ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్‌ను ఫిక్స్ చేశాయి. ఇవే ఫలితాలు 2024లోనూ రిపీట్ అవుతాయి.’ అని మోదీ వ్యాఖ్యానించారు. #WATCH | Prime Minister Narendra Modi addresses party workers at BJP HQ in Delhi#AssemblyElections2022 https://t.co/OtqqxIUldv — ANI (@ANI) March 10, 2022 -
Sakshi Cartoon: ఈసారయినా డిపాజిట్ దక్కుతుందా సార్.. గెలుస్తామా?
ఈసారయినా డిపాజిట్ దక్కుతుందా సార్.. గెలుస్తామా? -
ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే..
అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజల తీర్పును స్వీకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభ్యర్థుల విజయానికి కష్టపడి పనిచేసిన కాంగ్రెస్, కార్యకర్తలు, వాలంటీర్ల కృషికి కృతజ్ఞతలు తెలిపారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని.. దేశ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తామని తెలిపారు. చదవండి: ఏంటీ పరిస్థితి..! ఆశలు సమాధి.. అక్కడా ‘చేయి’చ్చారు కాగా అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని చవిచూసింది. ఉత్తరప్రదేశ్ నుంచి గోవా వరకు ఒక్క రాష్ట్రంలోనూ గెలుపుసు సొంతం చేసుకోలేదు. పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు యూపీలో కేవలం ఒక స్ధానంలోనే కాంగ్రెస్ ఆధిక్యతలో కొనసాగడం పార్టీ శ్రేణులను కలవరపరిచింది. అంతేగాక పంజాబ్‌లో సీఎం చన్నీ, పీసీసీ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఓటమిపాలయ్యారు. చదవండి: సీఎంను ఓడించిన సామాన్యుడు.. ఎవరతను? -
బిజేపీ నేతల వింత సంబరాలు
-
గుడిలో అరవింద్ కేజ్రీవాల్ సంబరం
-
కేజ్రీవాల్ మ్యాజిక్: పంజాబ్‌లో పంజా
-
ఆ డిమాండ్ తీర్చండి సీఎం పీఠం ఎక్కండి
-
ఎన్నికల్లో భారీ విజయం..! పంజాబ్ సీఎం అభ్యర్థి ఫస్ట్ రియాక్షన్
-
Bhagwant Mann: కమెడియన్ నుంచి సీఎం స్థాయికి..
హాస్యం.. మనిషిని కవ్వించేది. అలాంటప్పుడు విరుద్ధమైన రాజకీయం ఆయన ఎందుకు ఎంచుకున్నాడనే అనుమానాలు రావొచ్చు. జనాల్ని నవ్వించడమే కాదు.. అవసరమైతే ప్రజల కన్నీళ్లూ తుడవాలని తండ్రి చెప్పిన మాటకు కట్టుబడే రాజకీయాల్లో అడుగుపెట్టాడు భగవంత్ మాన్. ప్రజాభిప్రాయంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా నిలిచాడు. పంజాబ్ కోటలో పాగా వెయ్యాలని వ్యూహాలు పన్నిన ఆప్‌కు.. ఒక బూస్టర్ షాట్లా పనికొచ్చాడు. ఆప్ ఘన విజయంలో ముఖ్యభూమిక పోషించి.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నాడు 48 ఏళ్ల భగవంత్ మాన్. ‘ఒకప్పుడు జనం నన్ను చూసి తెగ నవ్వేవారు. కానీ ఇప్పుడు అందరూ రోదిస్తున్నారు. తమను కాపాడమని కోరుతున్నారు’ సీఎం అభ్యర్థిగా ఎంపికైన రోజు మాన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అదే రోజు నుంచి ఆయనలో నవ్వు మాయమై.. రాజకీయాలపై సీరియనెస్ మొదలైంది. భగవంత్ సింగ్ మాన్.. 1973, అక్టోబర్ 17న పంజాబ్‌లోని సంగ్రూర్‌లో ఓ జాట్ సిక్కు కుటుంబంలో జన్మించారు. సాధారణ రైతు కుటుంబం ఆయనది. కాలేజీ రోజుల్లోనే ఉండగానే కామెడీ షోలతో గుర్తింపు దక్కించుకున్నాడాయన. సునామ్‌లో ఎస్‌యూఎస్ ప్రభుత్వ∙కాలేజీ తరఫున రెండు గోల్డ్ మెడల్స్ గెలిచారు. కానీ యాక్టింగ్ వల్ల కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయనివ్వలేదు. ఆపై ఇందర్‌ప్రీత్ కౌర్‌ని పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. 2015లో తన భార్యతో విడాకులు తీసుకున్నారు. పిల్లలిద్దరూ ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు. ►మొదట్లో.. నటుడు జగ్తర్ జగ్గీతో కలిసి కామెడీ ఆల్బమ్ చేశారు. జుగ్ను ఖెండా హై అనే టీవీ సీరియల్‌తో తన పాపులారిటీ పెంచుకున్నారు. రాజకీయ నాయకులపై సెటైర్లు వేస్తూ కార్యక్రమాన్ని రక్తికట్టించారు. 2008లో గ్రేట్ ఇండియా లాఫ్టర్ చాలెంజ్ అనే రియాల్టీ షోలో పాల్గొన్న తర్వాత దేశవ్యాప్తంగా భగవంత్ మాన్ పేరు మారు మోగిపోయింది. జాతీయ అవార్డు లభించిన ‘‘మైనే మా పంజాబ్ దీ’’ సినిమాలో అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ► 2011లో మన్‌ప్రీత్ బాదల్‌కు చెందిన పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ తీర్థం పుచ్చుకొని రాజకీయ అరంగేట్రం చేశారు. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లెహ్రా నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరి సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2 లక్షల పై చిలుకు మెజార్టీతో విజయం సాధించారు. 2014, 2019లలో సంగ్రూర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి ఆప్ ఎంపీగా వరుస విజయాలు సాధించారు. ప్రస్తుతం పంజాబ్ ఆప్ శాఖకు కూడా మాన్ చీఫ్ గా ఉన్నారు. ► 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ బాదల్‌పై ఆప్ భగవంత్ మాన్‌ను నిలబెట్టింది. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. మళ్లీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో సంగ్రూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2019 జనవరిలో ఆప్ పార్టీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రచారంలో దిట్ట.. లోక్ లెహర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను విజయవంతంగా నడుపుతూ ప్రజల్లో వారికున్న హక్కులపై అవగాహన పెంచుతున్నారు. కలుషిత నీరు తాగి రోగాలపాలవుతున్న ప్రజలకి సాయపడుతున్నారు. టీవీ సెలబ్రిటీగా దక్కిన పేరుతో.. పంజాబ్‌లో ఆప్ పార్టీలో క్రౌడ్ పుల్లర్‌గా పేరు తెచ్చుకున్నారు భగవంత్ మాన్. ఆప్ సీఎం అభ్యర్థి ఎంపిక కోసం దేశంలో మరే పార్టీ చేయని విధంగా టెలి ఓటింగ్ పెడితే, అందులో ఏకంగా 93శాతం ఓట్లను కొల్లగొట్టారు. స్టాండప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న భగవంత్ మాన్.. పంజాబ్ బహుముఖ పోటీలో ఆప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ► నయా పంజాబ్ పిలుపు.. నిరుద్యోగం పంజాబ్‌ను వేధిస్తున్న ప్రధాన సమస్య. అందుకే అధికారంలోకి వస్తే ఆ సమస్యపైనే మొదటి ఫోకస్ ఉంటుందని చెప్పాడు భగవంత్. ‘అతనో పచ్చి తాగుబోతు.. డ్రగ్స్ కూడా వాడతాడు.. నిత్యం నిషాలో జోగుతుండే మాన్. బఫూన్ వేశాలేసుకునేటోడు. అతన్నే గనుక గెలిపిస్తే పంజాబ్ మొత్తాన్నీ మత్తులో ముంచేస్తాడు.. ’ ఇదీ.. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు భగవంత్ మాన్‌పై చేసిన ఆరోపణ. భగవంత్ మాన్ మద్యం సేవించి పార్లమెంటుకు వస్తారని ఆరోపణలున్నాయి. సహచర ఎంపీలు ఆయన నుంచి వచ్చే మద్యం వాసన భరించలేక ఫిర్యాదులు కూడా చేశారు. అయితే.. రెండేళ్ల క్రితం బర్నాలాలో జరిగిన ఒక ర్యాలీలో తాను ఇంక మద్యం జోలికి వెళ్లనంటూ ప్రజలందరి మధ్య ప్రతిజ్ఞ చేశారు. మద్యం మానేశానని, ప్రజాప్రతినిధిగా, పంజాబ్ సీఎంగా కళ్లు నెత్తికెక్కించుకోకుండా.. బాధ్యతగా మసలుకుంటానని ఎన్నికల ప్రచారంలో మాన్ ప్రజలకు చెప్పారు. ఆ మాటలను నమ్మే భారీ మెజార్టీతో ఆయనకు, ఆప్‌కు పంజాబ్ ప్రజలు పట్టం కట్టారు. ::సాక్షి, వెబ్‌స్పెషల్ -
కెప్టెన్‌కి ఘోర పరాభవం
ఛండీగఢ్: ఆప్ దెబ్బకు పంజాబ్ రాజకీయమే మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని ఘన విజయం దిశగా దూసుకుపోతోంది Aam Aadmi Party. ఈ తరుణంలో పంజాబ్ రాజకీయ బాహుబలి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు ఘోర పరాభవం ఎదురైంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటమి పాలయ్యారు. పాటియాలా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. ఆప్ అభ్యర్థి అజిత్ పాల్‌సింగ్ కోహ్లీ చేతిలో 19, 797 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. సిద్ధూతో గొడవ, కాంగ్రెస్ లుకలుకల కారణంగా ఆయన పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఇక పాటియాలా అమరీందర్ సింగ్‌కు 12 ఏళ్లపాటు కంచుకోటగా ఉండింది. ఈ తరుణంలో ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారంతా. కానీ, ఫలితం ఊహించని రీతిలో రావడం.. కెప్టెన్‌తో పాటు ఆయన సన్నిహితులకు పెద్ద షాకే ఇచ్చింది. -
యూపీలో బీజేపీ జైత్రయాత్రకు ఈ రెండు అంశాలు కీలకం
-
యోగి రికార్డు! యూపీలో 70 ఏళ్ల తర్వాత..
ఎగ్జిట్ పోల్ అంచనాలే దాదాపుగా నిజం అవుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ మరోసారి ప్రభుత్వ దిశగా దూసుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో తొలి రౌండ్లోనే మ్యాజిక్ ఫిగర్ 202ను దాటేసి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ప్రాంతీయ పార్టీలతో జత కలిసి కూటమిగా వెళ్లినా.. అఖిలేష్ యాదవ్‌కు నిరాశే ఎదురైంది. కాంగ్రెస్, బీఎస్పీ, ఎంఐఎంలకు భంగపాటు తప్పలేదు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కంటిన్యూ అవుతోంది. మోదీ-షా ప్రచార మాయజాలంతో యోగి సర్కార్కే రెండోసారి పట్టం కట్టేందుకు జనాలు మొగ్గు చూపించారు. ఫలితాల సరళిని గమనిస్తే.. మెజారిటీ స్థానాలు బీజేపీ సునాయాసంగా గెలుచుకోనుంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్థానాలు కొద్దిగా తగ్గినప్పటికీ.. యోగి నేతృత్వంలో సుస్థిర బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం అయ్యింది. ముఖ్యంగా యూపీలో బీజేపీకి సోషల్ ఇంజినీరింగ్ బాగా కలిసొచ్చింది. ముజఫర్‌నగర్ పంచాయితీ ఎన్నికల్లో ఫలితం చూపించడంతో.. అసెంబ్లీ ఎన్నికలకు ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యింది బీజేపీ. Social Engineering కాస్త సూపర్‌సక్సెస్ అయ్యింది. ఓబీసీలు యోగి సర్కార్ వెంటే నడిచారు. అఖిలేష్ నేతృత్వంలోని ఎస్పీ కూటమి.. రెండో ప్లేస్‌లో నిలిచింది. అయితే చాలాగ్యాప్ తర్వాత ఎస్పీ వంద సీట్లు దాటడం కాస్త ఊరట ఇచ్చే విషయం. ఎంఐఎం ఓటింగ్ శాతం.. ఎస్పీపై ప్రభావం చూపిందని విశ్లేషకుల అంచనా. గతంలో ప్రతిపక్షం ఎప్పుడూ 50 సీట్ల కంటే ఎక్కువ గెలిచిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఇక నాలుగుసార్లు యూపీని పాలించిన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ.. కనీస ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ కీలక నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినప్పటికీ.. ఫలితాల్లో మాత్రం పరిస్థితి ఘోరంగా కనిపిస్తోంది. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ స్థానంలో గెలుపుదిశగా పయనిస్తున్నారు. యూపీలో 70 ఏళ్ల తర్వాత రికార్డు బద్ధలు అయ్యేలా కనిపిస్తోంది. స్వాతంత్రం వచ్చాక యూపీకి ఒక సీఎం పూర్తిస్థాయి పదవి కాలం పూర్తి చేసుకున్నాక.. రెండోసారి ఎన్నిక కావడం ఇదే తొలిసారి కానుంది. అంతేకాదు దాదాపు 37 ఏళ్ల తర్వాత ఒక పెద్ద రాష్ట్రంలో.. బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడం కూడా జరగనుంది.