న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సీఎం యోగి మొదటిసారిగా దేశ రాజధానికి చేరుకున్నారు. దాదాపు గంటన్నరపాటు వారి భేటీ కొనసాగింది. ముఖ్యంగా యూపీలో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. రానున్న సంవత్సరాల్లో యోగి హయాంలో యూపీలో అభివృద్ధి మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకుముందు సీఎం యోగి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్‌లతో భేటీ అయ్యారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌లతోనూ సమావేశమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment