uttar pradesh chief minister
-
వారణాసిలో జ్ఞానవాపీ విశ్వనాథ ఆలయం
గోరఖ్‌పూర్: వారణాసిలోని జ్ఞానవాపీని మసీదు అని పిలుస్తుండడం దురదృష్టకరమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అది మసీదు కాదని చెప్పారు. జ్ఞానవాపీ ప్రాంగణమంతా విశ్వనాథుడి ఆలయమని స్పష్టంచేశారు. ఆ విషయం విశ్వనాథుడే స్వయంగా చెప్పాడని తెలిపారు. శనివారం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ యూనివర్సిటీలో ‘సామరస్య సమాజ నిర్మాణంలో నాథ్‌పంత్ పాత్ర’ అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. జ్ఞానవాపీని మసీదుగా కొందరు పరిగణిస్తుండడం సరైంది కాదని పేర్కొన్నారు. పురాణాల ప్రకారం చూస్తే ఆది శంకరుడికి, కాశీ విశ్వనాథుడికి మధ్య సంవాదం జరిగిందని తెలిపారు. జ్ఞానవాపీ తన ప్రాంగణమేనని ఆది శంకరుడితో విశ్వనాథుడు చెప్పినట్లు వెల్లడించారు. జ్ఞానవాపీ వ్యవహారంపై హిందువులు, ముస్లింల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
Yogi Adityanath: విడిపోతే ఊచకోతే
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆగ్రాలో దుర్గాదాస్ రాథోడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ‘విడిపోతే ఊచకోత కోస్తారు’ అంటూ హిందువులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘బంగ్లాదేశ్‌లో ఏమవుతోందో చూస్తున్నారుగా! ఆ తప్పిదాలను భారత్‌లో పునరావృతం చేయొద్దు. విడిపోయామంటే ఇక అంతే సంగతులు. మనల్ని ఊచకోత కోస్తారు. కలిసుంటేనే సురక్షితంగా ఉండగలం. అభివృద్ధి చెందగలం’’ అన్నారు. అనంతరం ఈ వ్యాఖ్యలను ఎక్స్‌లో కూడా యోగి పోస్ట్ చేశారు. వీటిపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ముస్లిం విద్వేషంతో యూపీని విడదీస్తున్నదే యోగి అని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ‘‘మైనారిటీల ఇళ్లపైకి ఆయన ఇప్పటికే బుల్డోజర్లు నడుపుతున్నారు. ఇప్పుడిలా మరో అడుగు ముందుకేసి విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు. యూపీని మతపరంగా మరింతగా విడదీయజూస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. సీఎం పదవి చేజారేలా ఉండటంతో అభద్రతా భావంతోనే ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రధాని కావాలని యోగికి ఎంత కోరికగా ఉన్నా మరీ ఇప్పట్నుంచే ఇలా విదేశీ వ్యవహారాల్లో వేలు పెట్టొద్దంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. -
కాశీ, అయోధ్య.. ఇక మథుర: యోగి
లఖ్నో: మథురలో చాలాకాలంగా వివాదాల్లో నలుగుతున్న మందిర్–మసీద్ వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అక్కడ షాహీ ఈద్గా స్థానంలో కృష్ణునికి ఆలయం నిర్మించడంపై గట్టిగా దృష్టి సారిస్తామని సంకేతాలిచ్చారు. ‘‘కాశీ, అయోధ్య అనంతరం ఇప్పుడిక మథుర వంతు. అక్కడ మందిరం రూపుదిద్దుకోకుంటే కృష్ణుడు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ ఇందుకు వేదికైంది. ‘‘కాశీ, అయోధ్య, మథుర విషయంలో మొండితనం, రాజకీయాలు కలగలిసి ఓటు బ్యాంకు రాజకీయాలుగా మారి పరిస్థితిని సంక్లిష్టంగా మార్చేశాయి’’ అంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టలపై విమర్శలు గుప్పించారు. మథురలో కృష్ణుని పురాతన ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారన్న వివాదం ప్రస్తుతం కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. -
అయోధ్యలో ‘ఆదిత్య’ మంత్రివర్గ సమావేశం
అయోధ్య: రాష్ట్ర రాజధాని లక్నోలో కాకుండా అయోధ్యలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేశారు. అయోధ్యలో కేబినెట్ భేటీ జరగడం ఇదే తొలిసారి. అత్యంత అరుదైన సందర్భాల్లోనే ఇలా రాష్ట్ర రాజధానికి బదులు వేరే చోట కేబినెట్ సమావేశమవుతుంది. అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారం¿ోత్సవానికి అంగరంగ వైభవంగా సంసిద్ధమవుతున్న వేళ అదే పట్టణంలో సీఎం మంత్రివర్గాన్ని సమావేశపరచడం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
ఆధ్యాత్మిక క్షేత్రాలను మేల్కొల్పాలి: యోగి
లక్నో: అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం ప్రారంభమైన తర్వాత ఆలయ నగరం కాశీని మేల్కొల్పాల్సిన అవసరం మన ముందు ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. మథుర, బృందావన్, వింధ్యావాసిని ధామ్, నైమిష్ థామ్ వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను సైతం మరోసారి మేల్కొల్పాలని అన్నారు. అయోధ్య తర్వాత కాశీ వంతేనని పరోక్షంగా వెల్లడించారు. మథుర, కాశీలో మందిరం–మసీదుపై చట్టపరమైన వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మత కలహాలు లేవని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఆయన ఆదివారం లక్నోలో బీజేపీ కార్యనిర్వాహక సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఈసారి ఈద్ చివరి శుక్రవారం నమాజ్‌ను రోడ్లపై జరపలేదని గుర్తుచేశారు. ఇలా జరగడం ఉత్తరప్రదేశ్‌లో ఇదే తొలిసారి అన్నారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతిని ప్రజలు శాంతియుతంగా జరుపుకున్నారని వెల్లడించారు. ప్రార్థన స్థలాల్లో లౌడస్పీకర్ల వినియోగంపై స్పందిస్తూ.. అనవసరమైన శబ్దాలు లేని పరిస్థితి రావాలని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ శ్రేణులకు యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. -
ప్రధాని మోదీతో సీఎం యోగి భేటీ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సీఎం యోగి మొదటిసారిగా దేశ రాజధానికి చేరుకున్నారు. దాదాపు గంటన్నరపాటు వారి భేటీ కొనసాగింది. ముఖ్యంగా యూపీలో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. రానున్న సంవత్సరాల్లో యోగి హయాంలో యూపీలో అభివృద్ధి మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకుముందు సీఎం యోగి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్‌లతో భేటీ అయ్యారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌లతోనూ సమావేశమయ్యారు. -
అబ్ క్యా కరే!
లక్నో: ఈ ఫోటో చూశారు కదా..! ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భుజం మీద చేతులు వేసి మరీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏదో అంశం మీద చాలా సీరియస్‌గా చర్చిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. దీనిని యోగి ఆదిత్యనాథ్ ఆదివారం తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేస్తూ హిందీలో చిన్న కవితనే రాసుకొచ్చారు. నవభారత నిర్మాణం కోసం తామిద్దరం మేధోమథనం చేస్తున్నామన్న అర్థంలో ఆ కవిత సాగుతుంది. ‘‘ఒక లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మమ్మల్ని మేము అంకితం చేసుకుంటూ ప్రయాణాన్ని ప్రారంభించాం. ఆకాశ హద్దుల్ని చెరిపేస్తూ సూర్యకాంతుల్ని విరజిమ్మే నవభారత్ నిర్మాణం సాగిస్తామని ప్రతిజ్ఞ చేశాం’’ అంటూ అని యోగి రాసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న నేపథ్యంలో మోదీ, యోగి మంతనాలు సాగిస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్నాళ్ల క్రితం యోగి పనితీరుపై ప్రధాని అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. యూపీ సీఎంను మారుస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు వీరిద్దరూ సన్నిహితంగా ఏదో చర్చించుకుంటున్న ఫోటోని చూసి బీజేపీ అభిమానులు పండగ చేసుకుంటూ ఉంటే, విపక్షాలు మాత్రం విరుచుకుపడుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఈ ఫోటోపై స్పందిస్తూ ‘‘రాజకీయాల్లో బయట ప్రపంచాన్ని మభ్యపెట్టడానికి ఒక్కోసారి ఏదో ఒకటి చేస్తుంటారు. అయిష్టంగానే భుజం మీద చేతులు వేసి, కలిసి ఓ నాలుగు అడుగులు వెయ్యడం వంటివి అందులో భాగమే’’ అని ట్వీట్ చేశారు -
హిందూ ముస్లింలపై సీఎం యోగి వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హిందూ ముస్లింలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. తనకు 'బొట్టు'కు, 'టోపీ'కి ఏమీ తేడా లేదని చెప్పారు. ఒక టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనిలా చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని, ఆ విషయంలో ఏ ఒక్కరికీ అధిక ప్రాధాన్యం లేద అప్రాధాన్యం ఇవ్వడం ఉండబోదని స్పష్టం చేశారు. యోగి స్థాపించిన హిందూ యువవాహిని సంస్థ అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకుంటోందన్న నివేదికలను ప్రస్తావించగా.. చాలా తీవ్ర స్వరంతో స్పందించారు. మెడలో కాషాయ కండువాలు వేసుకున్నవాళ్లు బాగుపడాలని, లేకపోతే మాత్రం వాళ్లను వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. బీజేపీని గానీ లేదా వేరే ఏదైనా సంబంధిత సంస్థను గానీ పేరు పాడుచేద్దామని ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్లందరినీ గుర్తించి మరీ కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్తరప్రదేశ్‌లో జంగల్‌రాజ్ అంతమైపోతుందని హామీ ఇచ్చారు. శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నా.. తన ప్రభుత్వ వందరోజుల పాలన పూర్తయ్యేసరికి అవన్నీ కచ్చితంగా ఆగిపోతాయని హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రతి చెల్లి, సోదరి సురక్షితంగా ఉంటారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతామని యోగి అన్నారు. తాజాగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తరప్రదేశ్ నగరాలు ఏవీ లేకపోవడాన్ని ప్రస్తావించగా, వచ్చే సంవత్సరం సర్వే చేసేసరికి మొత్తం 100 టాప్ నగరాల్లో 50 మనవే ఉంటాయని అన్నారు. కొత్త ముఖ్యమంత్రి రాగానే పాలనా యంత్రాంగాన్ని మార్చాలనుకుంటారని, కానీ తాము మాత్రం అదే అధికారులతో పరిపాలన తీరును మారుస్తున్నామని అన్నారు. గత 12-15 ఏళ్లుగా అధికారుల బదిలీలంటే ఒక పెద్ద పరిశ్రమగా మారిపోయిందని, దాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తామని తెలిపారు. -
యోగి కాలేజీకి ముస్లిం ప్రిన్సిపాల్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనగానే ఒక్కసారిగా హిందూ అతివాదిని ముఖ్యమంత్రి ఎలా చేస్తారంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. కానీ, ఆయన జీవనశైలి ఏంటి, ఆయన సిద్ధాంతాలు ఏంటన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. పొరుగునే ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆయన నెలకొల్పిన ఓ కాలేజీకి ముస్లిం ప్రిన్సిపాల్ ఉన్నారు. 1999 సంవత్సరంలో తన సొంత జిల్లా అయిన పౌరిలో యోగి ఈ కాలేజీని నెలకొల్పారు. దానిపేరు మహాయోగి గురుగోరఖ్‌నాథ్ డిగ్రీ కాలేజి. ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ కాలేజీని ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల జాబితాలో చేర్చారు. ఈ కాలేజీలో కుల మతాలు, రంగు వేటినీ పట్టించుకోరని.. వాటి ఆధారంగా వివక్ష ఉండబోదని కాలేజి ప్రిన్సిపాల్ అఫ్తాబ్ అహ్మద్ తెలిపారు. ఇది ఇక్కడి పర్యావరణం లాగే చాలా స్వచ్ఛమైనదని ఆయన అన్నారు. ఆయన గదిలో వివిధ స్వాతంత్ర్య సమరయోధుల ఫొటోలు, కొంతమంది హిందూ దేవతల ఫొటోలు కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తం 150 మంది విద్యార్థులున్నారని, వాళ్లలో ఎక్కువమంది అమ్మాయిలేనని అహ్మద్ చెప్పారు. ఇక్కడ దేశవ్యాప్తంగా నెట్ క్వాలిఫై అయిన అధ్యాపకులను మాత్రమే నియమిస్తామని, తమ కాలేజీకి హెచ్ఎన్బీ గర్వాల్ యూనివర్సిటీ గుర్తింపు ఉందని తెలిపారు. జిల్లా మొత్తమ్మీద ఇదొక్కటే డిగ్రీ కాలేజి. యోగి ఆదిత్యనాథ్ తమ్ముడైన మహేందర్ సింగ్ బిష్త్ ఈ కాలేజికి అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తున్నారు. వివక్ష అన్న పదం వినిపిస్తే సహించేది లేదని ఆయన అన్నారు. ఇక్కడ ఎలాంటి మత సిద్ధాంతాలను బోధించరని, ఇక్కడి ముస్లిం ప్రిన్సిపాల్ ప్రతిసారీ ముందుగా తనతోనే హోలీ ఆడతారని తెలిపారు. -
18 గంటలు పనిచేయండి.. లేదా ఇంటికే: యోగి
తాపీగా 10.30-11 గంటలకు ఆఫీసుకు రావడం, తర్వాత టీ తాగి కాసేపు కబుర్లు చెప్పుకొని తీరిగ్గా పని ఏమైనా చూడటం, మరీ విసుగ్గా ఉంటే అది కూడా మానేసి కాసేపు కునుకు తీయడం, సాయంత్రం 5 గంటలు కొట్టగానే తట్టా బుట్టా సర్దుకుని ఎంచక్కా ఇంటికి వెళ్లిపోవడం. ప్రభుత్వ ఉద్యోగం అంటే సర్వసాధారణంగా ప్రజలకు ఉన్న అభిప్రాయం ఇదే. కానీ, ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుణ్యమాని ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. రోజుకు కనీసం 18-20 గంటల పాటు పనిచేయడానికి సిద్ధపడాలని, లేదా ఉద్యోగాలు వదిలి ఇళ్లకు వెళ్లిపోడానికి సిద్ధం కావాలని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని గోరఖ్‌పూర్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. తాను పని రాక్షసుడినని, అధికారులు కూడా అలాగే పనిచేయాలని ఆశిస్తానని అన్నారు. కష్టపడి పనిచేయడం ఇష్టం లేనివాళ్లు మాత్రం ఎంచక్కా వెళ్లిపోవచ్చని తెలిపారు. మంత్రులు కూడా తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి వీల్లేదని, అణకువగా పనిచేయాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం తన తొలి ప్రాధాన్యమని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం చాలా ముఖ్యమని, ప్రభుత్వ పథకాల లబ్ధి నిరుపేదల్లో చిట్టచివరి వ్యక్తికి కూడా దక్కేలా చూడటం కార్యకర్తల విధి అని ఆయన చెప్పారు. అదే సమయంలో ప్రభుత్వ కార్యకలాపాలలో మాత్రం వేలు పెట్టొద్దని పార్టీకి స్పష్టం చేశారు. కాంట్రాక్టుల కోసం అధికారుల మీద ఒత్తిడి చేస్తే సహించేది లేదన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఇక రెండేళ్లు మాత్రమే ఉందని, అందువల్ల ఇప్పటినుంచే సిద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వ పనితీరులో ఏమైనా లోపం ఉంటే నేరుగా తన దృష్టికి తేవాలన్నారు. పేద కుటుంబాలలోని అమ్మాయిల పెళ్లిళ్లకు ప్రభుత్వం సాయం చేస్తుందని, రాష్ట్రం నుంచి యువత వలసలు వెళ్లకుండా చూసేందుకు తగిన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూడా యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఎన్నికల్లో పార్టీకి లభించిన భారీ ఆధిక్యం వల్ల పార్టీ నాయకులు, కార్యకర్తల బాధ్యత మరింత పెరిగిందని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని అన్నారు. యోగి ఆదిత్యనాథ్ గురించిన మరిన్ని కథనాలు.. రాష్ట్రాన్ని వదిలిపోతే మీకే మంచిది: సీఎం వార్నింగ్ సీఎం బంగ్లాలో ఆవుల మంద గూండాలు లేరు.. సంతోషం యోగి ఎఫెక్ట్: దుకాణాల్లో ఏమైందంటే.. కాబోయే ప్రధానమంత్రి యోగినే! యోగిపై పిచ్చిరాతలు.. మండిపడ్డ భారత్ అందరికీ అభివృద్ధే లక్ష్యం: యూపీ సీఎం -
యోగి ఎఫెక్ట్: దుకాణాల్లో ఏమైందంటే..
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడా పాన్ మసాలా, గుట్కా మరకలు కనిపించడానికి వీల్లేదు... సీఎం యోగి ఆర్డర్ అక్రమ కబేళాలను వెంటనే మూసేయాలి. అవి నడవడానికి వీల్లేదు.. ముఖ్యమంత్రి ఆదేశం గ్యాంగ్ రేప్ చేసి, యాసిడ్ తాగించిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి.. ఆస్పత్రిలో పోలీసులతో ఆదిత్యనాథ్ వరుసపెట్టి పలు అంశాల్లో తన మార్కు చూపిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎఫెక్ట్ రాష్ట్రం మీద బాగానే కనపడుతోంది. ముఖ్యమంత్రి స్వయంగా ఆస్పత్రికి వచ్చి గ్యాంగ్ రేప్ బాధితురాలిని పరామర్శించిన తర్వాత.. రెండు గంటల్లోనే ఆ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఒక్కటే కాదు.. ఇంకా చాలా విషయాల్లో యోగి మార్క్ కనిపిస్తోంది. ప్రధానంగా దుకాణదారులు తమ దుకాణాల వద్ద బోర్డులు పెట్టి మరీ.. కస్టమర్లను తప్పనిసరిగా డస్ట్బిన్లు ఉపయోగించమని కోరుతున్నారు. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. లక్నో మహాత్మాగాంధీ మార్గ్ ప్రాంతంలోని కొంతమంది దుకాణదారులు పరిశుభ్రత కోసం స్వయంగా కృషి చేయడమే కాక.. కస్టమర్లకు కూడా చేతులు జోడించి మరీ చెబుతున్నారు. జితేందర్ కుమార్ యాదవ్ అనే వర్తకుడు లక్నోలో ఓ ధాబా నిర్వహిస్తారు. ఇటీవలి కాలంలో తన వ్యాపారం ఒక్కసారిగా బాగా పుంజుకుందని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలవడానికి వచ్చిన జనాలు తమ ధాబాకు వచ్చి తింటున్నారని చెప్పారు. ఆయన తన ధాబా వద్ద డస్ట్బిన్లు పెట్టడమే కాక, నోటీసులు కూడా అతికించారు. అంతకుముందు వరకు కస్టమర్లు వదిలేసిన ఆహార పదార్థాల చుట్టూ ఈగలు ముసిరేవని, కానీ ఇప్పుడు డస్ట్బిన్లు పెట్టిన తర్వాత అవి లేవని అన్నారు. అంతేకాదు, తన ధాబా పక్కనున్న ఫుట్‌పాత్ మొత్తాన్ని తన వర్కర్లతో శుభ్రం చేయిస్తున్నారు. సామాన్యులు కూడా తలుచుకుంటేనే స్వచ్ఛభారతం సాధ్యం అవుతుందని జితేందర్ అన్నారు. తనతో పాటు చాలామంది వర్తకులు ఇప్పుడు డస్ట్బిన్లు పెట్టారని, తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారని చెప్పారు. జితేందర్ దుకాణం పక్కనే ఉమాశంకర్ యాదవ్‌కు చెందిన టీకొట్టు ఉంది. అక్కడ మట్టి పాత్రలో ఇచ్చే టీ తాగడం జనానికి ఇష్టం. తాగిన తర్వాత ఇంతకుముందు ఆ పాత్రలను రోడ్డుమీదే పారేసేవారు. కానీ ఇప్పుడు డస్ట్బిన్లు పెట్టడంతో వాటిలో వేస్తున్నారు. పలు ప్రభుత్వ శాఖలు పరిశుభ్రత కార్యక్రమానికి పెద్దపీట వేస్తూ, సీఎం యోగి చేపట్టిన మిషన్‌ను విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. లక్నో సీనియర్ ఎస్పీ స్వయంగా పోలీసు స్టేషన్‌ను శుభ్రం చేసి ఉదాహరణగా నిలిచారు. విద్యుత్ శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మ కూడా తన కార్యాలయాన్ని తానే శుభ్రం చేసుకున్నారు. ఇలా క్రమంగా ఈ కార్యక్రమానికి మంచి ఊతం లభిస్తోంది. -
యోగిపై పిచ్చిరాతలు.. మండిపడ్డ భారత్
యోగి ఆదిత్యనాథ్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడాన్ని విమర్శిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక రాసిన సంపాదకీయంపై భారత సర్కారు తీవ్రంగా మండిపడింది. ఇలాంటి పిచ్చి రాతలు రాయడంలో పత్రిక తెలివితేటలను ఎవరైనా ప్రశ్నించవచ్చని చెప్పింది. 'హిందూ తీవ్రవాదులతో అంటకాగుతున్న మోదీ' అనే అర్థం వచ్చేలా న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఘాటుగా సంపాదకీయం రాసింది. 2014లో ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి నరేంద్రమోదీ తన పార్టీ యొక్క హిందూ పునాదులను మరింత బలోపేతం చేస్తున్నారని, అదే సమయంలో అభివృద్ధి, ఆర్థికవృద్ధి అనే లౌకికవాద లక్ష్యాలను ప్రమోట్ చేస్తున్నారని అందులో చెప్పింది. 'ఫైర్ బ్రాండ్ హిందూ పూజారి' అయిన యోగి ఆదిత్యనాథ్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం అనేది మతపరమైన మైనారిటీలకు పెద్ద షాక్ అని ఆ సంపాదకీయంలో పేర్కొన్నారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇలా రాయడాన్ని కేంద్రం తీవ్రంగా నిరసించింది. ''సంపాదకీయాలు లేదా అభిప్రాయాలు విషయాన్ని బట్టి ఉంటాయి. ఈ సందర్భం కూడా అంతే. అయితే.. స్వదేశంలోనైనా పరాయి దేశంలోనైనా ప్రజాస్వామ్యంలో తీసుకునే నిర్ణయాలను, ప్రజల తీర్పును అనుమానిస్తే.. దాన్ని తప్పనిసరిగా ప్రశ్నించాల్సిందే''నని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి గోపాల్ బగ్లే వ్యాఖ్యానించారు.