ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పారదర్శకంగా సాగుతోందన్నారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర. గురువారం ఉదయం కౌంటింగ్ మొదలైన నేపథ్యంలో ఆయన పలు అంశాలపై స్పందించారు. ‘‘ఐదు రాష్ట్రాలఅసెంబ్లీ ఎన్నికల కోసం 31,000 కొత్త పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు ఆయన. మహిళలచే నిర్వహించబడే 1,900 పోలింగ్ బూత్‌లను సృష్టించాం. తద్వారా మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో మహిళలు ఓటింగ్‌లో పాల్గొనడం కనిపించింది. 5 రాష్ట్రాలలో 4 రాష్ట్రాల్లో పురుషుల ఓటర్ల కంటే మహిళా ఓటర్ల శాతం ఎక్కువగా నమోదు అయ్యిందని చెప్పారు సీఈసీ.
ఇక ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలపైనా సీఈసీ స్పందించారు. ఈవీఎం ట్యాంపరింగ్ అనే సమస్యే లేదు. 2004 నుండి EVMలు నిరంతరం ఉపయోగించబడుతున్నాయి. 2019 నుండి మేము ప్రతి పోలింగ్ బూత్‌లో VVPATని ఉపయోగించడం ప్రారంభించాము. రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్ వేశారు.
ఇక యూపీలో ఈవీ ట్యాంపరింగ్ ఆరోపణలపైనా సీఈసీ వివరణ ఇచ్చారు. స్ట్రాంగ్‌రూమ్ నుంచి ఓట్లు వేసిన ఏ ఈవీఎంను బయటకు తీయలేరు. కొన్ని పార్టీలు ప్రశ్నలు లేవనెత్తాయి. మేం ఇచ్చిన వివరణతో ఆ పార్టీల వాళ్లు సంతృప్తి చెందారు. వారణాసిలోని ఈవీఎంలపై లేవనెత్తిన ప్రశ్నలు శిక్షణ నిమిత్తం ఉద్దేశించబడ్డాయి. స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ప్రకారం శిక్షణ అవసరాల కోసం ఈవీఎంల తరలింపు గురించి రాజకీయ పార్టీలకు తెలియజేయకపోవడమే ADM చేసిన పొరపాటు.
ఎన్నికల సంఘం ఏ రాజకీయ పార్టీ తొత్తు కాదు. ప్రతి రాజకీయ పార్టీ సమానమే. ఒమిక్రాన్ వేవ్ కారణంగా ఎన్నికల ర్యాలీలపై నిషేధం విధించిన సమయంలో, EC MCC ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించింది. మొత్తం 5 రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అలాగే MCC ఉల్లంఘనలకు సంబంధించి దాదాపు 2,270 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి.
One Nation One Election is a good suggestion but this needs a change in the Constitution. The Election Commission is fully geared up and is capable of holding all the elections simultaneously. We are ready to hold elections only once in 5 years: CEC Sushil Chandra pic.twitter.com/reixPOoqIl
— ANI (@ANI) March 10, 2022
మీ అభ్యర్థిని తెలుసుకోండి(Know your candidate) యాప్ ఎన్నికల సంఘం చేపట్టిన విజయవంతమైన ప్రయత్నం. నేర నేపథ్యం ఉన్నవారు ఓటర్లకు తెలియాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి, మేము ఈ యాప్‌ని సృష్టించాము. ఈ ఎన్నికల్లో మొత్తం 6,900 మంది అభ్యర్థులలో 1,600 కంటే ఎక్కువ మంది నేర నేపథ్యం ఉన్నవాళ్లే! అని తెలిపారు సీఈసీ సుశీల్ చంద్ర.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి..
ఇది మంచి సూచన. అయితే దీనికి రాజ్యాంగంలో మార్పు అవసరం. అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం.
Comments
Please login to add a commentAdd a comment