
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ఛైర్మన్ సుశీల్ చంద్రను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. సుశీల్ చంద్ర నియామకాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎన్నికల కమిషనర్‌గా చెలామణిలోకి వస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఆయన 1980 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన అధికారి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ తయారీలో సుశీల్ చంద్ర కీలక పాత్ర పోషించారు. టీ ఎస్ క్రిష్ణ మూర్తి తర్వాత ఓ ఐఆర్‌ఎస్ అధికారి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడం ఇది రెండో సారి.
Comments
Please login to add a commentAdd a comment