Breadcrumb
Assembly Election Results 2022: పంజాబ్ మినహా అన్ని చోట్లా విరబూసిన కమలం
Published Thu, Mar 10 2022 7:43 AM | Last Updated on Thu, Mar 10 2022 10:33 PM
Live Updates
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
నాలుగింట బీజేపీ, ఒక చోట ఆప్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పంజాబ్ మినహా ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో కమలం పార్టీ సత్తా చాటింది. యూపీలో 273 సీట్లు, ఉత్తరాఖండ్‌లో 47, మణిపూర్‌లో 32, గోవాలో 20 సీట్లు సాధించింది. పంజాబ్‌లో 92 సీట్లతో ఆప్ తిరుగులేని శక్తిగా అవతరించింది. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలోనూ మెరుగైన ఫలితాలు సాధించలేదు. యూపీలో 2, పంజాబ్‌లో 18, ఉత్తరాఖండ్‌లో 19, మణిపూర్‌లో 5, గోవాలో 12 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. యూపీలో ఎస్పీ 125 సీట్లు సాధించి ప్రతిపక్షానికి పరిమితమైంది.
ఈ ఫలితాలు ప్రజాస్వామ్య విజయానికి ప్రతీక : మోదీ
అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్య విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. హోలీ పండుగ ముందుగానే వచ్చిందని అన్నారు. ప్రజల అఖండ మద్దతే ఈ విజయానికి కారణమన్నారు. బీజేపీ నిర్ణయాలు, విధానాలపై నమ్మకం పెరిగిందని, బీజేపీ స్థానాల సంఖ్య పెరింగిందని తెలిపారు.
మహిళలు, యువత బీజేపీకి అండగా నిలిచారని, తొలిసారి ఓటేసిన యువకులు బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. గోవాలో అందరి అంచనాలు తలకిందులు అయ్యాయన్న మోదీ.. గోవా ప్రజలు బీజేపీకి మూడోసారి అధికారాన్ని కట్టబెట్టారన్నారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు. యూపీలో ఐదేళ్లపాటు ప్రభుత్రాన్ని నడిపిన సీఎంను.. ప్రజలు మళ్లీ గెలిపించడం ఇదే తొలిసారన్నారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో అఖండ విజయాలు: జేపీ నడ్డా
అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయం అందించిన అందరికీ ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలది అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో అఖండ విజయాలు సాధిస్తున్నామన్నారు. గోవాలో హ్యాట్రిక్ విజయాలు సాధించామని, యూపీ, ఉత్తరాఖండ్‌లో వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చామని తెలిపారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు.
పంజాబ్ ఫలితాలు వెల్లడి.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..
పంజాబ్‌లో పూర్తి ఫలితాలు వెల్లడయ్యాయి. ఆమ్ ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాలు కైవసం చేసుకొని విజయ దుందుభి మోగించగా.. కాంగ్రెస్ 18 సీట్లు గెలుచుకుంది. ఎస్ఏడీ 4, బీజేపీ 2, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు.
యూపీలో బీజేపీ కొత్త చరిత్ర: యోగి ఆదిత్యానాథ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి భారీ విజయం నమోదు చేసుకుంది. ఈ సందర్బంగా సీఎం యోగి ఆదిత్యానాథ్ మాట్లాడుతూ.. బీజేపీకి విజయం అందించిన ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు. యూపీలో బీజేపీ కొత్త చరిత్ర సృష్టించిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ అద్భుత విజయం సాధించిందని కితాబిచ్చారు. తమ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసే ప్రజలు రెండోసారి తమకు అధికారం ఇచ్చారని పేర్కొన్నారు.
గోవాలో బీజేపీకి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు
ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ఇస్తున్నట్లు లేఖ ఇచ్చారని గోవా బీజేపీ అధ్యక్షుడు సదానంద్ షెట్ తనవాడే ప్రకటించారు. దీంతో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు
3 independent MLAs have given us their letter of support, so we will form the government with full majority: Goa BJP president Sadanand Shet Tanavade#GoaElections pic.twitter.com/kYTo6yfdf4
— ANI (@ANI) March 10, 2022
తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్
తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలో పంజాబ్ మినహా నాలురు రాష్ట్రాల్లో బీజేపీ విజయఢంకా మోగించడంతో కాషాయ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాసంక్షేమ పాలన రావాలని ఆకాంక్షించారు. కేంద్రానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించడం లేదని, కేంద్ర నిధులను వాడుకోవడం లేదని తప్పుబట్టారు.
యూపీలో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ
ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ చరిత్ర తిరగరాస్తూ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్(202)ను దాటేసింది. 403 స్థానాలులున్న యూపీలో కమలం పార్టీ ఇప్పటికే 260 స్థానాల్లో గెలుపొందింది. మరో ఆధిక్యంలో ఉంది. ఇక ఎస్పీ 100 సీట్లకు పైగా గెలుపొందింది. మరో 21 స్థానాల్లో ముందజలో ఉంది.
ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ గెలుపు..
ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గెలుపొందారు. కర్హల్ స్థానం నుంచి బరిలోకి దిగిన అఖిలేష్ యాదవ్ 61,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు
మణిపూర్ సీఎం విజయం
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ విజయం సాధించారు. హింగాంగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై 17 వేల ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు.
ఉత్తరాఖండ్‌లో బీజేపీ విజయకేతనం..
ఉత్తరాఖండ్‌లో బీజేపీ మరోసారి సత్తా చాటింది. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓటమిపాలైనా వరుసగా రెండోసారి అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజార్టీని సాధించింది. ఉత్తరాఖండ్ చరిత్రలో ఒకే పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
లక్షకు పైగా మెజార్టీతో యూపీ సీఎం గెలుపు
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అఖండ విజయం సాధించారు. లక్ష పైచిలుకు ఓట్ల తేడాతో గోరఖ్‌పూర్ అర్భన్ స్థానం నుంచి గెలుపొందారు.
గోవా ఫలితాలు వెల్లడి.. మ్యాజిక్ ఫిగర్‌కు ఒక్క అడుగు దూరంలో బీజేపీ
ఇక గోవాలో పూర్తి స్థాయి ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాలుండగా ప్రభుత్వం ఏర్పాటుకు 21 సీట్లు రావాల్సి ఉంది.. గోవాలో 20 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. కాంగ్రెస్ 12 స్థానాలు గెలుచుకుంది. టీఎంసీ రెండు స్థానాలు, ఆప్ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఇతరులు నాలుగు స్థానాలు గెలుచుకున్నారు. కాగా ఒక్క ఇండిపెండెంట్‌ను లాక్కోగలిగినా బీజేపీ సర్కార్ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో గోవాలో ప్రభుత్వ ఏర్పాటులో టీఎంసీ, ఇండిపెండెట్లే కీలకం కానున్నారు.
ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ
అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజల తీర్పును స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్, కార్యకర్తలు, వాలంటీర్ల కృషికి కృతజ్ఞతలు తెలిపారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని.. దేశ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తామని తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
రాజ్‌భవన్‌లో కాదు.. పూర్వీకుల గ్రామంలో ప్రమాణస్వీకారం చేస్తా: భగవంత్ మాన్
పంజాబ్‌లో ఆప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజాగా తన ప్రమాణస్వీకారంపై భగవంత్ మాన్ స్పందించారు. రాజ్‌భవన్‌లో కాకుండా తన పూర్వీకుల గ్రామంలో ప్రమాణస్వీకారం చేస్తానని ఆయన వెల్లడించారు.
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి ఓటమి
ఉత్తరాఖండ్‌లో మరోసారి ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ రెండో అవుతోంది. మొత్తం 70 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 36ను దాటి 48 సీట్లలో బీజేపీ విజయం సాధించింది. అయితే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి మాత్రం 6 వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు.
పంజాబ్: సోనూసూద్ సోదరి మాళవిక సూద్ ఓటమి
పంజాబ్‌లో సోనూసూద్ సోదరి మాళవిక సూద్ ఓటమి చెందారు.మోగా స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మాళవికసూద్ ఓటమి పాలయ్యారు. ఇక, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాళవిక కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
అమృత్సర్ ఈస్ట్‌లో సిద్ధూ ఓటమి
అమృత్సర్ ఈస్ట్‌లో కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ ఓటమిపాలయ్యారు. ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్ చేతిలో పరాజం పొందారు.
భగవంత్ మాన్ గ్రాండ్ విక్టరీ
పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్.. ధూరి నియోజకవర్గం నుంచి 45వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీ మీద ఘన విజయం సాధించారు.
రెండు చోట్లా ఓడిన చన్నీ!
పంజాబ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. పోటీ చేసిన రెండు చోట్లా కాంగ్రెస్ సీఎం అభ్యర్థి, ప్రస్తుత సీఎం చన్నీ సింగ్ ఓడినట్లు తెలుస్తోంది.
పారికర్ కొడుకు పరాజయం
పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావించిన పనాజీ నియోజకవర్గంలో.. బీజేపీ గెలుపు సాధించింది. అటానాసియో మోన్సెరెట్టే బాబుష్ 700 ఓట్ల మెజార్టీతో మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్‌పై విక్టరీ సాధించాడు. ఉత్పల్ ఇక్కడి నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.
గోవాలో హంగ్! ప్రభుత్వ ఏర్పాటు బీజేపీ ప్రయత్నాలు
గోవాలో హంగ్ దిశగా ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతుందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అంటున్నారు. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ సహా స్వతంత్రుల మద్ధతు తమకే ఉందని గోవా ప్రమోద్ సావంత్ ధీమాగా చెప్తున్నారు. మరోవైపు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ వాళ్లందరినీ రిసార్ట్‌కు తరలించింది. ఈ సాయంత్రం గోవా గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదన సమర్పించాలని బీజేపీ భావిస్తోంది.
ఉత్తరాఖండ్ బీజేపీదే!
ఉత్తరాఖండ్‌లోనూ కాంగ్రెస్ ప్రభావం కనిపించలేదు. ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను(36) దాటేసి.. ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే కిందటి ఎన్నికల్లో 57 స్థానాలు గెల్చుకున్న బీజేపీకి ఈ దఫా సీట్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయంపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి.. సీట్ల తగ్గుదలపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆప్‌కు శుభాకాంక్షలు: సిద్ధూ
పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకెళ్తున్న ఆప్‌కు కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రజా గొంతుకే.. దేవుడి గొంతుక, పంజాబ్ ప్రజల అవసరాలను నిజాయితీగా అంగీకరిస్తున్నా అంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు.
ఈసీ కీలక ప్రకటన
ఎన్నికల ఫలితాలు.. విజయోత్సవాలపై నిషేధం ఎత్తేసిన ఈసీ
మణిపూర్‌లో బీజేపీ ముందంజ
మణిపూర్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. హెయిన్‌గాంగ్ నుంచి పోటీ చేసిన మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
అమరీందర్ సింగ్ ఓటమి!
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటమి పాలయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ను వీడాక పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ పెట్టి.. పాటియాలా నుంచి ఆయన పోటీ చేశారు.
రాజీనామా యోచనలో సిద్ధూ!
పంజాబ్‌లో కాంగ్రెస్ ఘోర పరాభవం కారణంగా పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అయ్యింది. ముఖ్యంగా పంజాబ్ నుంచి అవమానకర రీతిలో ఓటమి పాలైంది. సిద్ధూ నాయకత్వంపై పెట్టుకున్న నమ్మకం, చన్నీ సామాజిక వర్గ ఆదరణ.. రెండూ అంచనాలు ఘోరంగా విఫలం అయ్యాయి. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలోనూ ఓటమి తప్పడం లేదు. గోవాలో అయినా పరువు కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. ఒంటిగంటకు గోవా కాంగ్రెస్ అత్యవసర సమావేశం నిర్వహించనుంది.
ఈసీ అఫీషియల్ ట్రెండ్స్.. గోవా
గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. ఈసీ అధికారిక ట్రెండ్స్ వెలువడింది. మొత్తం 40 సీట్లలో.. బీజేపీ 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 12 స్థానంలో లీడ్‌లో ఉంది. సాన్వెలియమ్ స్థానం నుంచి సీఎం అభ్యర్థి ప్రమోద్ సావంత్ స్వల్ఫ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు 21 మ్యాజిక్ ఫిగర్‌గా ఉంది.
గోవాలో క్యాంప్ రాజకీయాలు మొదలు..
గోవాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నడుస్తోంది. సీఎం అభ్యర్థి ప్రమోద్ అనూహ్యంగా వెనకంజలో కొనసాగుతున్నారు. పార్టీ ఏర్పాటునకు ఇండిపెండెంట్లు కీలకంగా మారే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలను ముందస్తుగా రిసార్టులకు తరలించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ శివకుమార్ పర్యవేక్షణలో వాళ్లంతా ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెస్‌కు భంగపాటు!
ఎన్నికల ఫలితాల్లో.. జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు భంగపాటు ఎదురయ్యేలా ఉంది. ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన ఆధిక్యం కనబరుస్తోంది బీజేపీ. గోవా, మణిపూర్‌లో మాత్రం బీజేపీ కాంగ్రెస్ మధ్య ఆధిక్య ఫలితాలు పోటాపోటీగా ఉన్నాయి. అయితే పొత్తుల స్ట్రాటజీతో గోవా, మణిపూర్‌లో బీజేపీనే ప్రభుత్వం చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
పంజాబ్‌లో ఆప్ ఆధిక్యం
పంజాబ్ ఎన్నికల కౌంటింగ్‌లో ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. పంజాబ్ సీఎం, కాంగ్రెస్ నేత చన్నీ సింగ్ రెండు చోట్ల వెనుకబడి పోయారు. ఆప్ మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం 64 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ట్రెండ్ ఇలాగే నడిస్తే.. ప్రభుత్వ ఏర్పాటునకు ఆప్‌కు అవకాశాలున్నాయి. మరోవైపు పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్‌మన్ గెలుపు దిశగా పరిగెడుతున్నరు. కాంగ్రెస్ 20, శిరోమణి అకాళీదళ్ 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. బీజేపీ కేవలం 2 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ సిద్ధూపై ఆప్ అభ్యర్థి ముందంజలో ఉండడం విశేషం.
యూపీలో బీజేపీ హవా
ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావొచ్చన్న ఎగ్జిట్‌పోల్ అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ బీజేపీ దాటేయగా.. కాంగ్రెస్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ప్రియాంక, రాహుల్‌లు ప్రచారం చేసిన ఫలితం కనిపించడం లేదు. ప్రస్తుతం నాలుగు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది కాంగ్. ఎస్పీ 99, బీఎస్పీ 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నయి.
ఈసీ ఎర్లీ ట్రెండ్స్‌లో.. అకాళీదళ్ అభ్యర్థి
ఈసీ ఎర్లీ ట్రెండ్స్‌లో.. పంజాబ్ ముకేరియన్ అసెంబ్లీ స్థానం నుంచి శిరోమణి అకాళీ దళ్ అభ్యర్థి లీడ్‌లో ఉన్నారు.
In early trends, Shiromani Akali Dal leads in Mukerian Assembly constituency in Punjab, as per the Election Commission pic.twitter.com/bICjOn7IRU
— ANI (@ANI) March 10, 2022
సీఎం అభ్యర్థుల ముందంజ
ఉత్తరాఖండ్ మినహా(పుష్కర్ధామీ వెనకంజ).. దాదాపు అన్నిచోట్ల సీఎం అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. గోరఖ్‌పూర్ అర్భన్‌లో యూపీ సీఎం యోగి ముందంజలో ఉండగా.. కర్హల్‌లో అఖిలేష్ ముందంజలో కొనసాగుతున్నాడు. పంజాబ్ సీఎం చన్నీ రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాడు. గోవాలోనూ సీఎం అభ్యర్థి ప్రమోద్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇక అమేథీలో బీజేపీ అభ్యర్థి సంజయ్ సింగ్ ముందంజలో ఉండగా, హత్రాస్‌లో బీజేపీ అభ్యర్థి ముందంజ
యూపీ డిప్యూటీ సీఎం మౌర్య, పాటియాలలో అమరీందర్ సింగ్ ముందంజలో కొనసాగుతున్నారు.
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వేగంగా నడుస్తోంది.
ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభం
సిద్ధూ వెనుకంజ
అమృత్సర్ ఈస్ట్‌లో సిద్ధూ వెనుకంజ
ఓట్ల లెక్కింపు ఈసీ ప్రకటన
ఓట్ల లెక్కింపు పారదర్శకంగా సాగుతుంది. రాజకీయ పార్టీల అధీకృత పోలింగ్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రంలోకి రావడానికి అనుమతి ఇస్తున్నాం: సుశీల్ చంద్ర, ప్రధాన ఎన్నికల కమిషనర్
The counting of votes is a transparent process. There is a standard operating procedure under which we conduct the counting. Authorised polling agents of the political parties are allowed to come inside the counting centre: Sushil Chandra, Chief Election Commissioner pic.twitter.com/Uwkh4Mbnko
— ANI (@ANI) March 10, 2022
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు
ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.
పంజాబ్‌లో గెలుపు సంబురాలపై నిషేధం
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సుమారు యాభై వేలమంది అధికారులు భద్రత కోసం మోహరించారు. పంజాబ్‌లో గెలుపు సంబురాలపై నిషేధం విధించారు.
కొవిడ్ నిబంధనలు కఠినంగా..
సుమారు 1,200 కౌంటింగ్ హాల్స్ సిద్ధంగా ఉన్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే.. కౌంటింగ్ చేపట్టనున్నారు.
సిబ్బందికి మాస్క్, కేంద్రాల శానిటైజేషన్, ఫేస్ షీల్డ్ తప్పనిసరి చేశారు. లక్షణాలను ఉన్నవాళ్లను కౌంటింగ్ హాల్లోకి అనుమతించరు.
Imphal | Counting of votes to begin at 8am for #ManipurElection2022, at Thoubal District Commissioner Office Complex pic.twitter.com/jEZybrYYdu
— ANI (@ANI) March 10, 2022
ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన సీట్లు
యూపీ
యూపీలో 403 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు
యూపీలో ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మెజార్టీ 202
పంజాబ్
పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు
పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ 59
ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్‌లో 70 స్థానాల్లో ఓట్ల లెక్కింపు
ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ 36
మణిపూర్
మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు
మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ 31
గోవా
గోవాలో 40 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు
గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ 21
తొలుత బ్యాలెట్ ఓట్లు లెక్కింపు
► తొలుత బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలను లెక్కిస్తారు. ఆపై కొన్ని గంటల్లోనే ఓటింగ్ సరళి తెలిసిపోనుంది. మధ్యాహ్నం నాటికి ఫలితాలపై స్పష్టత వచ్చేస్తుంది. రాత్రికల్లా పూర్తి ఫలితాలు వస్తాయి.
► గరిష్టంగా యూపీలో 750 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. పంజాబ్‌లో 200 హాల్స్ సెటప్ చేశారు. ప్రతీ హాల్ దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
Related News By Category
Related News By Tags
-
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు.. గెలుపెవరిదో?
న్యూఢిల్లీ: నరాలు తెగే ఉత్కంఠతో కొనసాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పర్వం నేడు తుదిదశకు చేరుకోనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలకానున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీస్‌గా భావి...
-
ఐదు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా..
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగబోయే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కమలదళం సన్నద్ధమవుతోంది. అధికారం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, ప...
-
ఆ నాలుగు రాష్ట్రాలూ కమలానికే!
న్యూఢిల్లీ : గెలుపుపై ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతాయోనని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ బయటికి వచ్చేశాయి. గురువారం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ లో కమలదళ్ మరిం...
-
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఎగ్జిట్‌పోల్స్ ఏం చెబుతున్నాయంటే?
న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది దేశమం...
-
యూపీ పీఠం మళ్లీ బీజేపీదే
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయే మళ్లీ గెలుస్తుందని ఏబీపీ–సీ ఓటర్ తాజా సర్వేలో వెల్లడైంది. అయితే సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ బలపడడం వల్ల గత ఎన్నికల్లో గెలుచుకున...
Comments
Please login to add a commentAdd a comment