ఆ నాలుగు రాష్ట్రాలూ కమలానికే!
ఆ నాలుగు రాష్ట్రాలూ కమలానికే!
Published Thu, Mar 9 2017 7:09 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
న్యూఢిల్లీ : గెలుపుపై ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతాయోనని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ బయటికి వచ్చేశాయి. గురువారం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ లో కమలదళ్ మరింత పరిమళించబోతుందని వెల్లడైంది. అత్యంత కీలక రాష్ట్రం, అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో కూడా బీజేపీ చరిత్రను సృష్టించబోతుందని తెలిసింది. యూపీలో అతిపెద్ద పార్టీగా తొలిసారి బీజేపీ తన జెండాను ఎగురవేయబోతుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఒక్క యూపీనే కాక, ఉత్తరాఖాండ్, గోవా, మణిపూర్ లో కూడా బీజేపీ లీడింగ్ లో ఉంటుందని వెల్లడించాయి. అంటే ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాలు ఈ సారి హంగ్ కే హస్తగతం కాబోతున్నాయని వెల్లడైంది.
అయితే పంజాబ్ లో మాత్రం బీజేపీ దారుణంగా దెబ్బతిన్నబోతుందట.. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ-కాంగ్రెస్ లు పొత్తులో బరిలోకి దిగగా.. సింగిల్ పార్టీగా బీజేపీ వాటితో హోరాహోరి పోటికి దిగింది. ఈ హోరాహోరి పోటీలో సింగిల్ లార్గెస్ట్ పార్టీ అదేనని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఇండియా టుడే జరిపిన సర్వేలో యూపీలో ఉన్న మొత్తం 403 సీట్లలో బీజేపీకి 185, ఎస్పీ- కాంగ్రెస్ లకు 120 సీట్లు, మాయావతి నడిపించే బీఎస్పీకి 90 సీట్టే వస్తాయట.
అటు ఉత్తరాఖాండ్ లో సైతం ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ను వెనక్కి నెట్టేసి, కమలం తన కిరీటాన్ని ఎగురవేయబోతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. 71 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసి, 50 స్థానాలను తన వశం చేసుకోతోందని తెలిసింది. అలాగే మణిపూర్, గోవాలు కూడా బీజేపీకేనని ఎగ్జిట్ పోల్స్ ప్రజానానుడి పట్టి చెప్పేశాయి. కానీ కొన్ని ఛానల్స్ మాత్రం గోవాలో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు పోటా-పోటీగా ఉంటుందని అంటున్నాయి. ఇక ఒక్క పంజాబ్ లో మాత్రమే బీజేపీకి కాకుండా పోతుందట. ఇక్కడ మాత్రం కాంగ్రెసే 62-71 సీట్లతో ఆధిక్యంలో ఉండబోతుందని తెలిసింది. రెండేళ్ల అధికారంలో ఉన్న బీజేపీ-అకాలీదళ్ కూటమిని వెనక్కి నెట్టేసి, కాంగ్రెస్ తన సత్తా చాటబోతున్నదని వెల్లడైంది.
Advertisement
Advertisement