కేటీఆర్‌తో అస‌దుద్దీన్ భేటీ.. ఎందుకంటే? | Asaduddin owaisi Meets With KTR In Assembly | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌తో అస‌దుద్దీన్ భేటీ.. ఎందుకంటే?

Published Sat, Mar 12 2022 9:13 PM | Last Updated on Sat, Mar 12 2022 10:27 PM

Asaduddin owaisi Meets With KTR In Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌తో భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని ఎంఐఎం అధినేత,ఎంపీ అసదుద్దిన్‌ ఒవైసీ తెలిపారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. కాగా మంత్రి కేటీఆర్‌తో ఎంపీ అసదుద్దీన్‌ శనివారం అసెంబ్లీలో సమావేశమయ్యారు. అనంతరం అసదుద్దీన్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే కేటీఆర్​ను కలిశాన‌ని, ప‌ద‌వుల వంటి మ‌రే ఇత‌ర అంశాలు చ‌ర్చించ‌లేద‌న్నారు. ఉత్తర ప్రదేశ్‌ ఫలితాలపై తనకే నారాజ్‌ లేదని పేర్కొన్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పని తెలిపారు.

యూపీ ఫలితాలు ఆశ్చర్యపరచలేదని, యూపీ ఎన్నికలు.. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు వేర్వేరు అన్నారు. యూపీ సీఎం మంచి జోష్‌లో ఉన్నారని పేర్కొన్నారు. ఆయన మంచి మాటకారి అని ఆదిత్యనాథ్​ తీరుపై కితాబిచ్చారు. అయితే ఎన్నికల ఫార్ములా ఇక్కడ పనిచేయదన్నారు. యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తే హత్య యత్నం చేశారు. అఖిలేష్ యాదవ్ నెల ముందు నుంచి పరీక్షకు సిద్ధమవుతారని. డిస్టింక్షన్ కొట్టాలంటే ముందు నుంచే సిద్ధంగా ఉండాలని హితవు పలికారు.
చదవండి: రాజీనామా యోచనలో సోనియా, రాహుల్‌, ప్రియాంక‌?.. రేపే ప్రకటన!

‘బీజేపీ తెలంగాణపై దృష్టి సారించినా ఇక్కడ ముఖ్యమంత్రి బలంగా ఉన్నారు. తెలంగాణలో కారు స్పీడ్ మీద ఉంది. గుజరాత్, రాజస్థాన్ ఎన్నికల్లో మజ్లిస్ పోటీ చేస్తుంది. జమ్మూ కశ్మీర్‌లో మజ్లిస్ పోటీ చేయదు. కాంగ్రెస్ వైఫల్యం వల్లే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తోంది. దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలకం అవుతాయి. రాజకీయ శూన్యతను ఏదో పార్టీ నింపాల్సి ఉంటుంది. అందుకే ఆప్ ఎదుగుతోంది.  పంజాబ్‌లో ఆప్‌కు అధికారాన్ని కాంగ్రెస్ బహుమతిగా ఇచ్చింది. కాంగ్రెస్ లోని జీ23 గ్రూప్ ఏం చేస్తుందో చూద్దాం. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయో... లేదో తెలియదు.
చదవండి: పొంగులేటి వ్యాఖ్యలతో పెరిగిన రాజకీయ వేడి.. పోటీకి సై అంటున్న మాజీలు..

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మజ్లిస్ సిద్ధమే.కేసీఆర్ ఫ్రంట్ ఆలోచనల గురించి నాకు తెలియదు. ఒంటరిగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్‌ను తక్కువ అంచనా వేయలేం. కేసీఆర్ చాలా మొండి వ్యక్తి. . కేసీఆర్ ఇంత మందితో మాట్లాడుతున్నారంటే ఏదో ఒకటి ఉంటుంది. #పదవీకాలం ముగిసినా గులాం నబీ ఆజార్‌కు ఢిల్లీలో ఇచ్చిన అధికారిక నివాసాన్ని పీఎంఓ లేఖతో కొనసాగిస్తున్నారు. ఆజాద్‌కు క్వార్టర్ ను కొనసాగించడం వెనక ఉన్న మతలబు ఏమిటి?’ అని ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement