అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజల తీర్పును స్వీకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభ్యర్థుల విజయానికి కష్టపడి పనిచేసిన కాంగ్రెస్, కార్యకర్తలు, వాలంటీర్ల కృషికి కృతజ్ఞతలు తెలిపారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని.. దేశ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తామని తెలిపారు.
చదవండి: ఏంటీ పరిస్థితి..! ఆశలు సమాధి.. అక్కడా ‘చేయి’చ్చారు
కాగా అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని చవిచూసింది. ఉత్తరప్రదేశ్ నుంచి గోవా వరకు ఒక్క రాష్ట్రంలోనూ గెలుపుసు సొంతం చేసుకోలేదు. పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు యూపీలో కేవలం ఒక స్ధానంలోనే కాంగ్రెస్ ఆధిక్యతలో కొనసాగడం పార్టీ శ్రేణులను కలవరపరిచింది. అంతేగాక పంజాబ్‌లో సీఎం చన్నీ, పీసీసీ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఓటమిపాలయ్యారు.
చదవండి: సీఎంను ఓడించిన సామాన్యుడు.. ఎవరతను?
Comments
Please login to add a commentAdd a comment