న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన రోజే ఒపీనియన్ పోల్స్ ఫలితాల సందడి ప్రారంభమైంది. ‘ఇండియా టీవీ’కోసం ‘సీ-ఓటర్’ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల లౌకిక కూటమి గెలుస్తుందని తేలింది. మొత్తం 243 సీట్లకు గాను ఆ కూటమికి 116 నుంచి 132 రావొచ్చని ఆ చానెల్ బుధవారం ప్రకటించింది. బీజేపీ, ఎల్జేపీ, ఆర్‌ఎల్‌ఎస్‌పీ, హెచ్‌ఏఎంల ఎన్డీయే కూటమికి 94 నుంచి 110 సీట్లు రావొచ్చని పేర్కొంది.
ఆగస్ట్ చివరి వారం, సెప్టెంబర్ తొలి వారంలో మొత్తం నియోజకవర్గాల్లోని 10,683 మంది నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఈ ఫలితాలను క్రోడీకరించామని తెలిపింది. అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరు కాగలరనే విషయంలో జేడీయూ నేత నితీశ్ కుమార్‌కు 53% మంది మద్దతు తెలపగా, సుశీల్ మోదీ(బీజేపీ)కి 18% మంది మొగ్గు చూపారు. కేవలం 5% మందే లాలూను సీఎంగా కోరుకున్నారు. 2010 ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ కూటమి 206 స్థానాల్లో గెలిచింది.
‘గెలుపు లౌకిక కూటమిదే!’
Published Thu, Sep 10 2015 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM
Advertisement
Advertisement