
మొక్కలు నాటుతున్న నాయకులు
జిన్నారం: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలో, దేశంలో అధికారంలోకి రావటం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం బొల్లారం గ్రామంలో ‘హమ్ మే హై రాజీవ్’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.
అనంతరం అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. దివంగత రాజీవ్‌గాంధీతోనే యువతకు పార్టీలో ప్రాతినిధ్యం లభించిందని గుర్తుచేశారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడుల్‌రెడ్డి, నాయకులు నరేశ్, లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, మహేశ్ యాదవ్ తదితరులున్నారు.