రోగితో నర్సు చాటింగ్‌.. రూ. 20 లక్షలు ఇవ్వమంటూ బ్లాక్‌మెయిల్‌! | Nurse Blackmails Dialysis Patient To Make Chat Public | Sakshi
Sakshi News home page

రోగితో నర్సు చాటింగ్‌.. రూ. 20 లక్షలు ఇవ్వమంటూ బ్లాక్‌మెయిల్‌!

Published Sat, Jan 1 2022 4:29 PM | Last Updated on Sat, Jan 1 2022 5:09 PM

Nurse Blackmails Dialysis Patient To Make Chat Public - Sakshi

ఇంతవరకు మనం చాలారకాలు దోపిడీల గురించి విన్నాం. అంతేందుకు కార్పొరేట్‌ ఆసుపత్రులు ఎలా రోగుల పై పెద్ద మొత్తంలో బిల్లు వేసి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారో కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడొక నర్సు మాత్రం సరికొత్త విధానంలో రోగిని దోచుకునేందుకు యత్నించి జైలుపాలైంది. 

(చదవండి: రావణుడి వేషధారణలో పాల ప్యాకెట్‌ పట్టుకొని..)

అసలు విషయలోకెళ్లితే...పోలీసుల కథనం ప్రకారం...పుణేకి చెందిన ఒక డయాలసిస్‌ రోగి చికిత్స నిమిత్తం డయాలసిస్‌ సెంటర్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆ డయాలసిస్‌ సెంటర్‌లోని నర్సుతో పరిచయం ఏర్పడింది. అయితే ఆ తర్వాత వాళ్లిద్దరూ చాట్‌లు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ మేరకు ఓ రోజు ఆమె నువ్వు గనుక రూ. 20 లక్షలు ఇవ్వకపోతే మన చాటింగ్‌ మెసేజ్‌లను పబ్లిక్‌లో పెట్టడమే కాక  ఒక మహిళను మోసం చేశావంటూ సోషల్‌ మీడియాలో పెట్టి నీ పరువు తీస్తాను అని బెదిరించడం మొదలు పెట్టింది. దీంతో సదరు వ్యక్తి తమకు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. పోలీసుల ముందస్తు పథకం ప్రకారం పోలీసులు డబ్బులిస్తానని నర్సుకి చెప్పమని ఫిర్యాదు దారుడికే చెప్పారు. అలా ఆ నర్సు డబ్బులు వసూలు చేసేందుకు పుణేలోని రహత్నీలోని శివర్ చౌక్ వద్దకు రాగా వకాడ్‌ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

(చదవండి: ఆ సమయంలో కూడా సేవలందించిన సూపర్‌ ఉమెన్‌లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement