dialasis patient
-
రోగితో నర్సు చాటింగ్.. రూ. 20 లక్షలు ఇవ్వమంటూ బ్లాక్మెయిల్!
ఇంతవరకు మనం చాలారకాలు దోపిడీల గురించి విన్నాం. అంతేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు ఎలా రోగుల పై పెద్ద మొత్తంలో బిల్లు వేసి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారో కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడొక నర్సు మాత్రం సరికొత్త విధానంలో రోగిని దోచుకునేందుకు యత్నించి జైలుపాలైంది. (చదవండి: రావణుడి వేషధారణలో పాల ప్యాకెట్ పట్టుకొని..) అసలు విషయలోకెళ్లితే...పోలీసుల కథనం ప్రకారం...పుణేకి చెందిన ఒక డయాలసిస్ రోగి చికిత్స నిమిత్తం డయాలసిస్ సెంటర్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆ డయాలసిస్ సెంటర్లోని నర్సుతో పరిచయం ఏర్పడింది. అయితే ఆ తర్వాత వాళ్లిద్దరూ చాట్లు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ మేరకు ఓ రోజు ఆమె నువ్వు గనుక రూ. 20 లక్షలు ఇవ్వకపోతే మన చాటింగ్ మెసేజ్‌లను పబ్లిక్‌లో పెట్టడమే కాక ఒక మహిళను మోసం చేశావంటూ సోషల్ మీడియాలో పెట్టి నీ పరువు తీస్తాను అని బెదిరించడం మొదలు పెట్టింది. దీంతో సదరు వ్యక్తి తమకు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. పోలీసుల ముందస్తు పథకం ప్రకారం పోలీసులు డబ్బులిస్తానని నర్సుకి చెప్పమని ఫిర్యాదు దారుడికే చెప్పారు. అలా ఆ నర్సు డబ్బులు వసూలు చేసేందుకు పుణేలోని రహత్నీలోని శివర్ చౌక్ వద్దకు రాగా వకాడ్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. (చదవండి: ఆ సమయంలో కూడా సేవలందించిన సూపర్ ఉమెన్లు) -
డయాలసిస్‌కొచ్చిన రోగి మృతి
హిందూపురం అర్బన్ : డయాలసిస్ చేయించుకునేందుకు ఆస్పత్రికి వచ్చిన రోగి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని తల్లి ఆరోపిస్తోంది. వివరాలిలా ఉన్నాయి. మడకశిర మండలం రంగాపురానికి చెందిన ఇమాంసాబ్, షాకీరా దంపతుల తనయుడు మస్తాన్ (19) మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. శుక్రవారం సాయంత్రం డయాలసిస్ చేయించేందుకు కుమారుడిని తీసుకుని తల్లి హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చింది. అప్పటికే శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న మస్తాన్‌ను గమనించిన నర్సు ఆక్సిజన్ పెట్టింది. డాక్టర్ పరీక్షించి అనంతపురం తీసుకెళ్లాలని సూచించారు. కానీ అంతలోపే మస్తాన్ మరణించాడు. తల్లి కన్నీరుమున్నీరైంది. వైద్యులు సకాలంలో మెరుగైన చికిత్స చేసి ఉంటే తన కుమారుడు బతికేవాడని రోదించింది.