డయాలసిస్‌కొచ్చిన రోగి మృతి | dialasis patient dies in hindupur hospital | Sakshi

డయాలసిస్‌కొచ్చిన రోగి మృతి

Dec 2 2016 11:51 PM | Updated on Sep 4 2017 9:44 PM

డయాలసిస్‌కొచ్చిన రోగి మృతి

డయాలసిస్‌కొచ్చిన రోగి మృతి

డయాలసిస్‌ చేయించుకునేందుకు ఆస్పత్రికి వచ్చిన రోగి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని తల్లి ఆరోపిస్తోంది.

హిందూపురం అర్బన్‌ : డయాలసిస్‌ చేయించుకునేందుకు ఆస్పత్రికి వచ్చిన రోగి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని తల్లి ఆరోపిస్తోంది. వివరాలిలా ఉన్నాయి. మడకశిర మండలం రంగాపురానికి చెందిన ఇమాంసాబ్‌, షాకీరా దంపతుల తనయుడు మస్తాన్‌ (19) మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. శుక్రవారం సాయంత్రం డయాలసిస్‌ చేయించేందుకు కుమారుడిని తీసుకుని తల్లి హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చింది.

అప్పటికే శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న మస్తాన్‌ను గమనించిన నర్సు ఆక్సిజన్‌ పెట్టింది. డాక్టర్‌ పరీక్షించి అనంతపురం తీసుకెళ్లాలని సూచించారు. కానీ అంతలోపే మస్తాన్‌ మరణించాడు. తల్లి కన్నీరుమున్నీరైంది. వైద్యులు సకాలంలో మెరుగైన చికిత్స చేసి ఉంటే తన కుమారుడు బతికేవాడని రోదించింది.

Advertisement

పోల్

Photos

View all
Advertisement