
ముంబై: ఐపీఎల్ 2022లో రెండు కొత్త జట్లు రాబోతున్నాయనే విషయం తెలిసిందే. ఇప్పటికే లీగ్ పాలక మండలి రెండు కొత్త ఫ్రాంచైజీలుకు టెండర్లు జారీ చేసింది. అక్టోబర్ 5న ఆ గడువు ముగుస్తుంది. ఈ క్రమంలో అక్టోబర్ 17 న కొత్తగా వచ్చే రెండు ఫ్రాంచైజీల కోసం వేలం నిర్వహించడానికి బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ 17 ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ ప్రారంభమయ్యే రోజు కాబట్టి, మిడిల్ ఈస్ట్ నగరాల్లో ఒకటైన దుబాయ్ లేదా మస్కట్‌లో బిడ్డింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.
కాగా గువాహటి, రాంచీ, కటక్, అహ్మదాబాద్, లక్నో, ధర్మశాల నగరాలను షార్ట్ లిస్ట్ చేశారు. వీటిల్లో నుంచి టెండర్లు వచ్చే రెండు నగరాలను ఎంపిక చేస్తారు. అయితే రెండు ఫ్రాంచైజీలకు గాను ఒక్కో దానికి కనీసం రూ.2000 కోట్లను బేస్ ప్రైస్‌గా నిర్ణయించారు. దీంతో మొత్తం జట్ల సంఖ్య 10కి చేరుకోనుంది.
చదవండి: MS Dhoni: పాక్‌పై బౌల్ అవుట్ విజయానికి 14 ఏళ్లు.. ధోని వ్యూహాలు ఫలించడంతో..
Comments
Please login to add a commentAdd a comment