real estates
-
ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నేల చూపులు
-
హైడ్రా కూల్చివేతలతో రాష్ట్రంలో తగ్గిన భూములు, ఆస్తుల కొనుగోళ్లు
-
ఆకాశమే హద్దురా.. అక్కడి ప్లాటు ధరలకు రెక్కలు.. ఏకంగా 5 రెట్లు పెరగడంతో..
ముంబై: రియల్ ఎస్టేట్ రంగం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో ప్రాపర్టీ డిమాండ్ బట్టి కోట్లు సంపాదిస్తారు, ఒక్కో సారి కొనేవాళ్లు లేక అదే స్థాయిలో నష్టపోతూ ఉంటారు.అయితే ఇటీవల ప్రజలు సొంత ఇళ్లు లేదా ఫ్లాట్ కొనుగోలుపై ఆసక్తి చూపడంతో రియల్టర్ల పంట పండుతోంది. తాజాగా నేవీ ముంబైలోని ఫ్లాట్ల ధరలకు రెక్కలు రావడంతో అవి ఒక్క సారిగా ప్రారంభ ధర కంటే 5 రేటు పెరిగి అందరనీ ఆశ్చరపరిచింది. బాబోయ్.. ప్లాటు ధరలకు రెక్కలు సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) నవీ ముంబైలోని ఓ ప్రాంతానికి సంబంధించిన 28 ప్లాట్లను బ్లాక్‌లో ఉంచింది. అయితే ఊహించని విధంగా ఆ ప్లాటు ఒక చదరపు మీటరుకు రూ. 5.54 లక్షలు వసూలు చేసింది. ఇ-వేలం ఈ ఇరవై ఎనిమిది ప్లాట్లు గాను సిడ్కో దాదాపు రూ.1,365 కోట్లను ఆర్జించనుంది. గతంలో దీని ప్రారంభ ధర రూ.1.14 లక్షలుగా నిర్ణయించగా ప్రస్తుతం రయ్ అంటూ దూసుకుపోయి ఐదు రెట్లు ఎక్కువగా పలుకుతోంది. సెక్టార్ 20, పామ్ బీచ్ రోడ్, సన్పాద వద్ద ఉన్న సుమారు 1.3 ఎకరాల ప్లాట్ (5,526 చదరపు మీ) రూ. 306 కోట్లు బిడ్‌ను దక్కించుకుంది. ఈ బిడ్‌ను గెలుచుకున్న బిల్డర్ డీపీవీజి వెంచర్స్‌కి చెందిన యజమానులు మాట్లాడుతూ.. పామ్ బీచ్ రోడ్లో సముద్రానికి ఎదురుగా ఉన్న ప్రధాన ప్లాట్లలో ఇది చివరిది. అందుకే ఇది రికార్డు ధర పలికిందన్నారు. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. వాటికి చెక్, ఈ–కామర్స్ కంపెనీలు ఇలా చేయాల్సిందే! -
నమ్మి పార్టీకీ వెళ్లావా.. టోపీ ఖాయం!
సాక్షి, సిటీబ్యూరో: ప్రధానంగా మహిళల్ని టార్గెట్‌గా చేసుకుంటారు. పరిచయస్తుల ద్వారా ఎర వేస్తారు..ఖరీదైన హోటళ్లు, రిసార్ట్‌ల్లో పార్టీలు ఇస్తారు..ఇలా తమ డాబు ప్రదర్శించి, అధిక వడ్డీ ఆశ చూపి అందినకాడికి వసూలు చేస్తారు.. ఒకటి–రెండు నెలలు లాభమంటూ కొంత మొత్తం ఇచ్చి ఆపై చేతులెత్తేస్తారు..ఈ పంథాలో ఏడాదికి కాలంలో రూ.13 కోట్ల వసూలు చేసిన భార్యాభర్తల్ని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన భార్యాభర్తలు పీత పద్మజ అలియాస్ పద్మిని, వెంకట సుబ్రహ్మణ్య వరప్రసాద్ కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి స్థిరపడ్డారు. గతంలో సైబరాబాద్ పరిధిలోని కార్యకలాపాలు సాగించిన స్వధాత్రి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో పని చేశారు. ఈ సంస్థపై ఇటీవలే మాదాపూర్ పోలీసులు రూ.156 కోట్ల స్కామ్‌కు సంబంధించి కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడానికి ముందే ఆ సంస్థలో మానేసిన భార్యాభర్తలు శ్రీనగర్‌కాలనీలో రణధీర ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరుతో కార్యాలయం తెరిచారు. దీని ముసుగులో అనేక మందితో పరిచయాలు పెంచుకున్నారు. (చదవండి: కరోనాలోను రియల్ ఎస్టేట్ దూకుడు: సర్వే) తాము సినిమాలకు, ప్రాజెక్టులకు ఫైనాన్స్ ఇస్తూ ఉంటామని ఎర వేశారు. తమ వద్ద పెట్టుబడి పెడితే నెలకు 5 నుంచి 10 శాతం వడ్డీలు ఇస్తామంటూ నమ్మబలికారు. ఆసక్తి చూపిన వారికి ఖరీదైన పార్టీలు ఇచ్చి మరింత ఆకర్షించేవాళ్లు. ఇలా డిపాజిట్ చేసిన వారికి ఒకటి–రెండు నెలలు సక్రమంగానే వడ్డీ చెల్లించే వారు. ఆ తర్వాత చేతులు ఎత్తేసి మోసం చేసేవాళ్లు. ఒకరి ద్వారా మరొకరిని పరిచయం చేసుకుంటూ తమ దందా కొనసాగించారు. చివరకు లాక్డౌన్ టైమ్‌లోనూ వీరి ‘వ్యాపారం’ ఆగలేదు. ఇలా గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు రూ.13 కోట్లు డిపాజిట్లుగా వసూలు చేసి మోసం చేశారు. వీరి చేతిలో దాదాపు 20 మంది మోసపోయారు. బాధితుల్లో ఒకరైన సోమాజిగూడకు చెందిన బి.విజయలక్ష్మి ఫిర్యాదుతో సీసీఎస్‌లో కేసు నమోదైంది. దీన్ని ఇన్స్పెక్టర్ కేవీ సూర్యప్రకాష్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసింది. ఈ స్కామ్‌కు సంబంధించి ఆధారాలు సేకరించిన దర్యాప్తు అధికారులు శుక్రవారం భార్యభర్తల్ని అరెస్టు చేసింది. (చదవండి: రూ.156 కోట్ల ‘రియల్’ మోసం) -
ఆన్లైన్ జాబ్ అప్లికేషన్స్.. తప్పులను సరిదిద్దుకోండిలా!
టాప్ స్టోరీ: రోజూ వార్తాపత్రికల్లో, వెబ్సైట్లలో అనేక ఉద్యోగ ప్రకటనలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, మీడియా, మ్యానుఫ్యాక్చరింగ్, రియల్ ఎస్టేట్ కంపెనీలు కొలువుదీరిన హైదరాబాద్ వంటి సిటీలో.. ఉద్యోగాలకు కొదవలేదు. అయినా ఆన్లైన్లో ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినా.. కంపెనీల నుంచి స్పందన ఉండటం లేదని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. ఆన్లైన్ దరఖాస్తుకు రిప్లై రావాలంటే.. వెంటనే వ్యూహం మార్చాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఆన్లైన్ దరఖాస్తుల విషయంలో అభ్యర్థులు సాధారణంగా ఏడు పొరపాట్లు చేస్తుంటారని చెబుతున్నారు. వీటిని సరిదిద్దుకుంటే కోరుకున్న ఉద్యోగం సంపాదించడం కష్టమేమీ కాదని సూచిస్తున్నారు. దరఖాస్తు.. అసంపూర్ణం పూర్తి సమాచారం లేకుండా దరఖాస్తును పంపి, రిక్రూటర్స్‌కు శ్రమ కలిగిస్తే ఫలితం సున్నా. రోజూ వందలాది దరఖాస్తులను పరిశీలించేవారి సమయాన్ని హరించొద్దు. పూర్తి వివరాలు ఉన్న అప్లికేషన్లను చూసేందుకు వారు ఇష్టపడతారు. ముందు జాబ్ బోర్డులో మీ వివరాలు నమోదు చేయాలి. తర్వాత రెజ్యుమెను, కవర్ లెటర్‌ను అప్లోడ్ చేయాలి. విద్యార్హతలు, ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థ, గతంలో పనిచేసిన సంస్థ, పని అనుభవం, వ్యక్తిగత వివరాలను వరుస క్రమంలో ఇవ్వాలి. అన్నింటికంటే పెద్ద పొరపాటు ఏమిటంటే.. ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు తెలియజేయకపోవడం. సంస్థ కోరుకుంటున్న అన్ని అర్హతలు మీకుంటే.. మిమ్మల్ని సంప్రదిం చేందుకు వీలుండాలి కదా! కొందరు అభ్యర్థులు తాము కోరినంత జీతభత్యాలు ఇవ్వాలని, ఫలానా ప్రాంతంలోనే పని చేస్తామని షరతులు విధిస్తుంటారు. ఇవి దరఖాస్తులో తెలియజేయాల్సిన విషయాలు కావు. వేతనం అంకె దరఖాస్తులో కనిపిస్తే యాజమాన్యాలకు నచ్చకపోవచ్చు. తాము ఇవ్వాలనుకుంటున్న వేతనం కంటే ఎక్కువ మొత్తం దరఖాస్తులో కనిపిస్తే దాన్ని పక్కనపెట్టేస్తారు. సంస్థ మిమ్మల్ని సంప్రదించినప్పుడు మాత్రమే వీటిని ప్రస్తావించాలి. సూచనలు పాటించకపోవడం సంస్థలు ఉద్యోగ ప్రకటనలో కొన్ని సూచనలను ఇస్తుంటాయి. అభ్యర్థులు వాటిని తప్పనిసరిగా పాటించాలి. ఫోన్ ద్వారా తమను సంప్రదించాల్సిన అవసరం లేదు అని అంటే.. దానికి కట్టుబడి ఉండడమే ఉత్తమం. ఆన్లైన్లో మీ రెజ్యుమె సరైన సమాచారంతో, సరైన సమయానికి, సరైన వ్యక్తికి చేరగానే సరిపోదు.. మీరు సంస్థ సూచనలకు అనుగుణంగా నడుచుకున్నప్పుడే కోరుకున్న కొలువును దక్కించుకోగలుగుతారు. ఒకే రెజ్యుమె అన్నింటికీ సరిపోదు కొందరు అభ్యర్థులు ఒకే రెజ్యుమెను రూపొందించుకొని, అన్ని సంస్థలకు దాన్నే గ్రూప్ ఈ-మెయిల్స్ ద్వారా ఫార్వర్డ్ చేస్తుంటారు. ఇది ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. మొదట ఉద్యోగం గురించి అవగాహన పెంచుకోవాలి. వీటి ఆధారంగా రెజ్యుమెను తయారు చేసుకోవాలి. ఆ ఉద్యోగానికి మీరు సరిగ్గా సరిపోతారనే భావం రెజ్యుమే ద్వారా వెల్లడి కావాలి. తద్వారా మీకు ఉద్యోగంపై తగిన ఆసక్తి, ఇష్టం ఉన్నాయనే విషయం తెలుస్తుంది. అప్పుడే రిక్రూటర్స్‌కు మీపై సానుకూల అభిప్రాయం ఏర్పడుతుంది. దరఖాస్తు త్వరగా ముందుకు కదులుతుంది. కొన్నిసార్లు సంస్థల తరఫున ప్లేస్మెంట్ ఏజెన్సీలు ఉద్యోగ ప్రకటనలను విడుదల చేస్తుంటాయి. అవి సంస్థ పేరును, వివరాలను బయటపెట్టవు. అలాంటప్పుడు ఉద్యోగంపై సమాచారం కోసం సదరు ఏజెన్సీని సంప్రదిస్తూ ఉండాలి. తొందరపాటు వద్దు మిగిలినవారి కంటే ముందే దరఖాస్తు చేస్తే ఉద్యోగం తప్పకుండా వచ్చేస్తుందని అనుకోవద్దు. తొందరపాటు కారణంగా దరఖాస్తులో తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. రెజ్యుమే, కవర్ లెటర్‌ను జతచేయడం మర్చిపోవద్దు. సరైన ఫార్మాట్లో లేని రెజ్యుమెలను పంపకూడదు. దరఖాస్తు పంపేముందు అన్నీ ఒకటికి రెండుసార్లు క్షుణ్నంగా సరిచూసుకున్న తర్వాతే పంపించాలి. రిక్రూటర్స్ దరఖాస్తులోని అంశాలనే పరిశీలిస్తారు తప్ప దాన్ని ఎప్పుడు పంపారనే విషయానికి ప్రాధాన్యత ఇవ్వరు. అనవసర ఆర్భాటం రిక్రూటర్స్‌ను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో దరఖాస్తు విషయంలో ఆర్భాటం చేయొద్దు. దీనివల్ల ఎలాంటి ఫలితం ఉండకపోగా, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయని గ్రహించాలి. కొందరు దరఖాస్తులకు రంగులు, హంగులు జోడిస్తుంటారు. అక్షరాల ఆకృతి, పరిమాణం(ఫాంట్) గురించి పట్టించుకోరు. ఇలాంటి అప్లికేషన్లు చూడటానికి ఇంపుగా ఉండవు. కాబట్టి అతిశయం వదులుకోవడం మంచిది. సాధారణ ఫార్మాట్లోనే దరఖాస్తును పంపాలి. ఇంకొందరైతే వ్యక్తిగత అభ్యర్థనలు, విజ్ఞప్తులను జతచేస్తారు. వీటివల్ల అభ్యర్థిపై రిక్రూటర్స్‌కు చిన్నచూపు ఏర్పడుతుందని తెలుకోండి. ఒక్కో దరఖాస్తును పరిశీలించేందుకు రిక్రూటర్స్ వెచ్చించే సమయం కొన్ని సెకన్లు మాత్రమే. అంత తక్కువ సమయంలో మీ గురించి తెలిపేలా దరఖాస్తును రూపొందించుకోవాలి. ఫాలోఅప్ చేయకపోవడం ఆన్లైన్లో దరఖాస్తును పంపగానే సరిపోదు. అది ఏ దశలో ఉందో తెలుసుకుంటూ ఉండాలి. అప్లికేషన్‌ను పంపిన తర్వాత వారం నుంచి 10 రోజుల్లోగా రిక్రూటర్స్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోతే.. ఒకసారి ఫాలోఅప్ చేయాలి. సంస్థను నేరుగా సంప్రదించాలి. అంతేతప్ప రోజూ ఈ-మెయిళ్లు పంపడం, ఫోన్లు చేయడం లాంటివి చేయొద్దు. మీ దరఖాస్తు అందినట్లు వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోతే వేరే జాబ్ పోర్టల్/ప్లేస్మెంట్ కన్సల్టెన్సీ ద్వారా దరఖాస్తును మరోసారి పంపడానికి ప్రయత్నించండి. పాత కొలువును వదులుకోవడం మబ్బును చూసి కుండలో నీళ్లు ఒలకబోసుకోవడం తెలివైన లక్షణం కాదు. కొత్త ఉద్యోగం వస్తుందో రాదో తెలియకముందే పాత జాబ్‌కు రాజీనామా చేయొద్దు. కొత్త కొలువు వేట గురించి ప్రస్తుతం మీరు పనిచేస్తున్న సంస్థకు తెలియనివ్వకపోవడమే అన్నివిధాలా మంచిది. మరో విషయం.. పాత సంస్థ నుంచే కొత్త సంస్థను సంప్రదించడం, దరఖాస్తు పంపడం వంటి పొరపాట్లు అస్సలు చేయొద్దు. ఇలాంటివి చేస్తే యాజమాన్యానికి వెంటనే తెలిసిపోయేలా ఏర్పాట్లు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఉద్యోగ ప్రయత్నాలు ఆఫీసు బయటే చేసుకోవాలి. కొత్త కొలువు ఖాయమైన తర్వాతే రాజీనామా విషయాన్ని పాత సంస్థకు తెలియజేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ పంపేటప్పుడు పాటించాల్సినవి.. * ఉద్యోగ ప్రకటనలో ఇచ్చిన సూచనలను పాటించాలి * రిక్రూటర్స్ కోరిన సమాచారం తప్పనిసరిగా ఇవ్వాలి. * దరఖాస్తులో అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు లేకుండా జాగ్రత్తపడాలి. అప్లికేషన్‌ను పూర్తిగా సరిచూసుకున్న తర్వాతే పంపించాలి. * రిక్రూటర్స్ సంప్రదించేందుకు వీలుగా ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి కాంటాక్ట్ సమాచారాన్ని దరఖాస్తులో పొందుపరచాలి. * అప్లికేషన్‌తో కవర్ లెటర్‌ను జతచేయాలి. * రెజ్యుమేను కూడా తప్పనిసరిగా జోడించాలి. * ఇప్పటిదాకా పనిచేసిన పాత సంస్థల్లో మీరు నిర్వహించిన విధులు, నిర్వర్తించిన బాధ్యతలు కాదు.. సాధించిన విజయాలను రెజ్యుమేలో పొందుపర్చాలి. * ఎక్కువ పేజీలున్న రెజ్యుమేకు ఎక్కువ విలువ ఉంటుందనుకోవద్దు. అందులో పొందుపర్చిన అంశాలకే విలువ ఉంటుంది కానీ పేజీలకు కాదు. అడ్డంకులను అధిగమించండి! ‘‘ఉద్యోగార్థులు రెజ్యుమె పంపడం దగ్గర్నుంచి ఆఫర్ లెటర్ అందుకునే వరకు జాగ్రత్తగా వ్యవహరించాలి. కొందరు అభ్యర్థులు పేజీల కొద్దీ రెజ్యుమెను తయారు చేసి పంపుతుంటారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. ఫ్రెషర్స్ అయితే ఒక్క పేజీలోనే తమ పూర్తి వివరాలతో కూడిన రెజ్యుమెను రూపొందించడం ప్రధానం. తప్పనిసరి పరిస్థితుల్లో పేజీన్నరకు మించకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఫ్రెషర్స్ నుంచి కంపెనీలు అకడమిక్ అర్హతలు, ప్రాజెక్టులు, ఇతర ప్రత్యేక నైపుణ్యాలనే కోరుకుంటాయి. అందుకే సాధ్యమైనంత తక్కువ సైజులో ఉండడం మంచిది. ముందుగానే అన్ని వివరాలతో కూడిన మాస్టర్ రెజ్యుమెను రూపొందించుకుని.. దాని ఆధారంగా ఉద్యోగ సంబంధిత అంశాలకే ప్రాధాన్యమిస్తూ మరో రెజ్యుమె తయారు చేసుకోవాలి. రెజ్యుమెలో రాసిన పదాల అర్థాలు తెలియక ఇంటర్వ్యూల్లో ఇబ్బంది పడేవారూ ఉంటారు. అందుకే రెజ్యుమెలో రాసే ప్రతి అంశంపై శ్రద్ధ ఉంచాలి. చాలామంది అభ్యర్థులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను నిర్లక్ష్యం చేస్తారు. అభ్యర్థుల వ్యక్తిగత నైపుణ్యాలతో పాటు సోషల్ మీడియా అంశాలను కూడా కంపెనీలు పరిశీలిస్తాయి. కాబట్టి అభ్యర్థులు తమ ఫేస్బుక్, లింక్డ్ఇన్ తదితర సోషల్ ప్రొఫైల్, ప్రవర్తన, కామెంట్లు, చర్చలపైనా సమతుల్యాన్ని పాటించాలి’’ - జి.ఆర్. రెడ్డి, ఫౌండర్ అండ్ చీఫ్ ఫెసిలిటేటర్, హ్యుసిస్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ -
ఇబ్బందులకు లోన్ కావద్దు
కొన్నాళ్లుగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ధరలు పెద్దగా పెరిగింది లేదు. గతంతో పోలిస్తే ప్రాంతాలను బట్టి ధరలు కాస్తో కూస్తో తగ్గాయి కూడా. దీనికితోడు బ్యాంకులు కూడా బేస్ రేటుకే రుణాలందించడానికి ముందుకొస్తున్నాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి ఇవన్నీ శుభ సూచకాలే. మిగిలిన అంశాలను పరిశీలించకుండా ఈ రెండుకారణాలతోనే ఇంటి రుణం తీసుకుంటే ఇబ్బందులుతప్పవంటున్నారు నిపుణులు. మొదటిసారి ఇంటి రుణం తీసుకోవాలనుకునే వారు పాటించాల్సిన అంశాలపై ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనమిది... ఆర్థిక మందగమనం స్థిరాస్తి రంగంపై బాగానే ప్రభావం చూపుతోంది. రెండేళ్ళుగా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ధరలు తగ్గుతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. మన రాష్ట్ర విషయానికి వస్తే ఇక్కడ నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఈ క్షీణతను మరింత పెంచాయి. గతేడాదితో పోలిస్తే హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ ధరలు 10% పైగా తగ్గినట్లు ఆర్థిక సంస్థల అంచనా. అలాగే డిమాండ్ కంటే సప్లయ్ కూడా 15% అధికంగా ఉన్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజంగా తగ్గాయా?.. రియల్ ఎస్టేట్ ధరలు తగ్గినా సంస్థలు ఆ విషయాన్ని ఎక్కడా నేరుగా చెప్పడానికి ఇష్టపడటం లేదు. ధరలు తగ్గాయి అన్న వార్తలు వెలువడితే అవి మరింత క్షీణిస్తాయన్న భయమే దీనికి కారణం. దీనికి బదులు రియల్ ఎస్టేట్ సంస్థలు ఆఫర్ల పేరుతో ఖాతాదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. స్టాంపు డ్యూటీ తగ్గిస్తామని, లేదా ఫ్లాట్స్ లో అదనపు సౌకర్యాలు కల్పిస్తామని, కార్లు, విదేశీ ప్రయాణం పేరుతో అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కాబట్టి ఏదైనా ఇంటిని కొనుగోలు చేసే ముందు ఆ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి? తగ్గాయా? ఆ సంస్థ ప్రకటించిన ఆఫర్లతో ఏమైనా ప్రయోజనం ఉందా అన్న విషయాలను తప్పకుండా పరిశీలించాలి. ఈ వివరాలన్నీ సేకరించి రియల్ ఎస్టేట్ సంస్థలతో గట్టిగా డిమాండ్ చేసి బేరమాడితే మరింత డిస్కౌంట్‌ను పొందే అవకాశముంటుంది కూడా. జేబులో ఎంతుండాలి? మన రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో ఇప్పుడు మంచి డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ధరలు శివారు ప్రాంతాల్లో అయితే రూ.30 లక్షల వరకు ఉంటే కొద్దిగా సిటీకి దగ్గరైతే రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటున్నాయి. ఇప్పుడు బ్యాంకులు ఇంటి విలువలో గరిష్టంగా 80 శాతానికి మించి రుణం ఇవ్వడం లేదు. అంటే రూ.30 లక్షలకు రుణం తీసుకుంటున్నారంటే చేతిలో కనీసం ఆరు లక్షలుండాలి. ఇది కాకుండా ప్రోసెసింగ్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ తదితర ఖర్చులకు మరో రెండు లక్షలు అవసరమవుతాయి. అంటే కనీసం రూ.8 నుంచి రూ.10 లక్షలు జేబులో ఉంటేనే సొంతింటికి రంగంలో దిగాలన్నమాట. రుణం ఎంతొస్తుంది? సాధారణంగా బ్యాంకులు నెల జీతానికి 50 నుంచి 60 రెట్ల వరకు రుణం ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. అదే వ్యాపారస్తులు అయితే సగటు నెల ఆదాయంపై 40 రెట్ల వరకు ఇస్తున్నాయి. ఉదాహరణకు మీ నెల జీతం రూ.50,000 అనుకుంటే మీకు గరిష్టంగా రూ.25-30 లక్షల రుణం లభిస్తుంది. ఈ నిబంధన తర్వాత బ్యాంకులు మరో అంశాన్ని కూడా పరిశీలిస్తాయి. మీరు చెల్లించే ఈఎంఐలు జీతంలో గరిష్టంగా 60 శాతం దాటకూడదు. దీన్ని పరిశీలించేటప్పుడు మీకు ఏమైనా రుణాలు ఉంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు రూ.30 లక్షలకు గృహరుణం తీసుకుంటే ప్రస్తుత వడ్డీరేట్ల ప్రకారం ప్రతీ నెలా దాదాపు రూ.30,000 వరకు చెల్లించాల్సి వస్తుంది. అంటే రూ.50,000 జీతం ఉన్న వ్యక్తి ఈ మొత్తానికి రుణం తీసుకోవాలంటే అతనికి ఇక ఎటువంటి రుణాలు ఉండకూడదు. ఉంటే ఆ మేరకు మంజూరయ్యే రుణం తగ్గుతుంది. వడ్డీరేట్ల పరిస్థితేంటి? వడ్డీరేట్లు ఇంకా తగ్గుతాయా లేక పెరిగే అవకాశం ఉందా...? అనే అంశంపై ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. ప్రస్తుతం ఈ పండుగలను దృష్టిలో పెట్టుకొని రెండు మూడు నెలల కాలానికి మాత్రమే బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారితే... వడ్డీరేట్లు పెరిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇప్పుడు తక్కువ రేటులో రుణం తీసుకునే వారు భవిష్యత్తులో పెరిగే రిస్క్ ఉందన్న అంశాన్ని మర్చిపోవద్దు. రుణం తీసుకునేటప్పుడు ఈఎంఐకి పోగా మిలిగిన మొత్తంతో కుటుంబ అవసరాలు, మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి తగినంత మొత్తం కేటాయించగలుగుతున్నారా లేదా అన్న అంశాన్ని కూడా పరిశీలించాలి. ఈఎంఐ భారం తగ్గించుకోవడానికి చాలామంది రుణ కాలపరిమితిని పెంచుకుంటారు. దీని వలన చెల్లించే వడ్డీ భారం బాగా పెరిగిపోతుంది. సాధ్యమైనంత వరకు గృహరుణాన్ని 15 ఏళ్ళు తప్పదంటే 20 ఏళ్ళలోపు పూర్తి చేసే విధంగా ఎంపిక చేసుకోవాలన్నది నిపుణుల సూచన. పన్ను ప్రయోజనాలు: ఇంటి ధరలు బాగా పెరిగిపోవడంతో కేవలం ఒక వ్యక్తి మాత్రమే రుణం తీసుకుంటే దానిపై లభించే పన్ను ప్రయోజనాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. ఈఎంఐలో వడ్డీ కింద చెల్లించే దాంట్లో సంవత్సరానికి గరిష్టంగా రూ.1.50 లక్షల మించి పన్ను ప్రయోజనాన్ని పొందలేము. రూ.30 లక్షలకి గృహరుణం తీసుకుంటే మొదటి ఐదేళ్ళ వరకు దాదాపుగా సంవత్సరానికి రూ.3 లక్షలు చొప్పున వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కాని దీనిపైన పన్ను ప్రయోజనం గరిష్టంగా రూ.1.5 లక్షలు మాత్రమే పొందగలం. కాబట్టి పన్ను ప్రయోజనాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలంటే గృహరుణాన్ని ఉమ్మడిగా తీసుకోవడం మంచిదన్నది నిపుణుల సూచన. దీని వలన ఈఎంఐ భారం తగ్గడంతో పాటు, పన్ను ప్రయోజనాలను పూర్తిగా పొందచ్చు. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం చూడాల్సినవి? తీసుకునే ఇంటి విలువ మీ బడ్జెట్ స్థాయిలో ఉందా? ఆదాయానికి రుణం ఎంత లభిస్తుంది? డౌన్ పేమెంట్‌కు కావల్సిన మొత్తం చేతుల్లో ఉన్నాయా? ఈఎంఐ చెల్లించడానికి కావల్సిన స్థిరమైన ఆదాయం ఉందా? ఇతర అప్పులను నియంత్రించే స్థాయి ఉందా? రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు ఇన్వెస్ట్మెంట్ కేటాయించగలరా? హోమ్ లోన్స్ బ్యాంకు పేరు వడ్డీరేటు% ప్రోసెసింగ్ ఫీజు ఎస్బీహెచ్ 10.2 50% తగ్గింపు ఆంధ్రా బ్యాంకు 10.25 లేదు ఎస్బీఐ బ్యాంకు 10.10 కనిష్టంగా రూ.500 ఐడీబీఐ బ్యాంకు 10.25 లేదు పీఎన్బీ బ్యాంకు 10.25 లేదు