న్యూయార్క్: అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ పడవ సందర్శనం కోసం వెళ్లి.. ఐదుగురు దుర్మరణం పాలైన ఉదంతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ ఐదుగురిని నీటి అడుగునకు మోసుకెళ్లిన టైటాన్ సబ్ మెర్సిబుల్.. వాళ్ల పాలిట మృత్యు శకటంగా మారింది. అయితే ఎట్టకేలకు ఆ శకలాలను అధికారులు బయటకు తీసుకొచ్చారు!.
జూన్ 18వ తేదీ ప్రారంభమైన టైటాన్ ప్రయాణం.. కాసేపటికే విషాదంగా ముగిసింది. తీవ్ర ఒత్తిడితో ఈ మినీ జలంతర్గామి పేలిపోగా.. అందులోని ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. కానీ, నాలుగు రోజుల తర్వాత టైటాన్ ప్రమాదంపై యూఎస్ కోస్ట్‌గార్డ్ అధికారికంగా ప్రకటన చేసింది. ఇక అట్లాంటిక్‌లో నీటమునిగిన టైటానిక్ పడవ ముందుభాగంలో 1,600 అడుగుల వద్ద.. దాదాపు 6.5 మీటర్ల పొడవు, 10,431 కిలోల దాకా బరువున్న టైటాన్ కూరుకుపోయినట్లు గుర్తించినట్లు ఇంతకు ముందు అధికారులు ప్రకటించారు. అతికష్టం మీద ఆ శకలాలను బయటకు తెచ్చినట్లు అమెరికా తీర రక్షణ దళం అధికారికంగా బుధవారం ఉదయం ప్రకటించింది.
ఎస్‌యూవీ కారు సైజులో ఉండే టైటాన్ సబ్‌ను అతికష్టం మీద బయటకు తెచ్చారట. న్యూయార్క్‌కు చెందిన పెలాజిగ్ రీసెర్చ్ కంపెనీ తన ఒడీస్సెస్ రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్‌ను సబ్‌మెర్సిబుల్ వెతుకలాట కోసం ఉపయోగించింది. శకలాలను బయటకు తీయగానే.. అది తన ఆపరేషన్ ముగిసినట్లు ప్రకటించింది.
అతిజాగ్రత్తగా బయటకు తీసిన శకలాల నుంచి మానవ అవశేషాలను బయటకు తీస్తారని, వాటిని వైద్య పరిశోధకులు పరిశీలిస్తారని యూఎస్ కోస్ట్‌గార్డ్ ప్రకటించింది. తద్వారా ప్రమాదం జరిగిన తీరు.. వాళ్లెలా చనిపోయారనేదానిపై ఓ అంచనానికి రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే కెనడా అధికారులు మాత్రం శకలాల వెలికితీత అంశంపై స్పందిచకపోవడం గమనార్హం.
బ్రిటిష్ సాహసికుడు హమీష్ హర్దింగ్, ఫ్రెంచ్ సబ్‌మెరిన్ ఎక్స్‌పర్ట్ పాల్ హెన్రీ, పాక్-బ్రిటిష్ బిలియనీర్ షాహ్‌జాదా దావూద్.. అతని థనయుడు సులేమాన్, ఈ మొత్తం ప్రయాణానికి కారణమైన ఓషన్‌గేట్ సీఈవో స్టాక్‌టన్ రష్‌లు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై యూఎస్‌కోస్ట్ గార్డు హయ్యెస్ట్ లెవల్ దర్యాప్తు ‘‘ మెరైన్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’’కు ఆదేశించింది కూడా.
The US Coast Guard said on Wednesday that it has recovered "presumed human remains" from the wreckage of the #Titan submersible. https://t.co/I9Hh5U8iku pic.twitter.com/9eCWdaMOFj
— China Daily (@ChinaDaily) June 29, 2023
ఇదీ చదవండి: అట్లాంటిక్‌లో టైటాన్ ప్రమాదం.. అసలు జరిగింది ఇదే
Comments
Please login to add a commentAdd a comment