కేట్ అంటే నాకెంతో ప్రేమ: డికాప్రియో | I love Kate Winslet, says Leonardo DiCaprio | Sakshi
Sakshi News home page

కేట్ అంటే నాకెంతో ప్రేమ: డికాప్రియో

Jan 1 2014 3:22 PM | Updated on Sep 2 2017 2:11 AM

కేట్ అంటే నాకెంతో ప్రేమ: డికాప్రియో

కేట్ అంటే నాకెంతో ప్రేమ: డికాప్రియో

తనకు బాగా నచ్చిన అమ్మాయి ఎవరంటే.. టైటానిక్ సినిమాలో తన సరసన నటించిన కేట్ విన్స్లెటే అంటున్నాడు ఆ సినిమా హీరో లియొనార్డో డికాప్రియో.

తనకు బాగా నచ్చిన అమ్మాయి ఎవరంటే.. టైటానిక్ సినిమాలో తన సరసన నటించిన కేట్ విన్స్లెటే అంటున్నాడు ఆ సినిమా హీరో లియొనార్డో డికాప్రియో. వీరిద్దరి జంట వెండితెరపై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. టైటానిక్ సినిమాలో వీళ్లిద్దరి రొమాంటిక్ డ్రామా బాగా పండటంతో.. ఆ చిత్రానికి కాసుల వర్షం కురిసింది.

విన్స్లెట్ చాలా అద్భుతమైన నటి కావడంతో పాటు చాలా గొప్ప వ్యక్తిత్వం గలదని, చాలా నిజాయితీపరురాలని, ఆమె అంటే తనకెంతో ఇష్టమని డికాప్రియో చెప్పాడు. ఆమెకు ఇటీవలే అమ్మాయి పుట్టిందని, ఆమెతో ప్రేమలో కేట్ తలమునకలుగా ఉందని తెలిపాడు.  2008లో వచ్చిన 'రెవల్యూషనరీ రోడ్' చిత్రంలో కూడా డికాప్రియో-విన్స్లెట్ జంట నటించింది. ఇక నెడ్ రాక్ఎన్రోల్ను పెళ్లి చేసుకున్న ఏడాదికే విన్స్లెట్కు మూడో సంతానం కలిగింది. ఇంతకు ముందే ఆమెకు రెండు పెళ్లిళ్లయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement