టైటానిక్‌లో వినోదం! | Titanicmovie in Thirty Years' Prithvi! | Sakshi
Sakshi News home page

టైటానిక్‌లో వినోదం!

Published Thu, Jun 2 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 1:30 AM

టైటానిక్‌లో వినోదం!

టైటానిక్‌లో వినోదం!

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి, యామిని భాస్కర్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘టైటానిక్’. ‘అంతర్వేది టు అమలాపురం’ అన్నది ఉపశీర్షిక. చందర్ రావ్ సమర్పణలో జి. రాజవంశీ దర్శకత్వంలో కన్నా సినీ ప్రొడక్షన్స్ పతాకంపై కె. శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలుపుతూ- ‘‘అంతర్వేది నుంచి అమలాపురం వరకు గోదావరి నదిలో లాంచీలో జరిగే ప్రయాణమే ఈ చిత్రం.

రాజమండ్రిలో పేరుగాంచిన వశిష్ఠ అనే యాత్ర బోట్‌ను టైటానిక్‌గా రూపొందించి షూటింగ్ జరిపాం. పూర్తి వినోదాత ్మకంగా తెరకెక్కించాం. పెళ్లి బృందం వినోదంతో సినిమా సరదాగా సాగుతుంది. థర్టీ ఇయర్స్ పృథ్వీ ఇందులో పెళ్లి కొడుకుగా, రఘుబాబు విలన్‌గా నటించారు. వినోద్ యాజమాన్య స్వరపరచిన పాటలు, ట్రైలర్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తప్పకుండా ప్రేక్షకులను మా చిత్రం కడుపుబ్బా నవ్విస్తుందనడంలో సందేహం లేదు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: అమర్, సహ నిర్మాత: అట్లూరి సురేష్ బాబు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement