అదే మ్యాజిక్‌లా పనిచేసింది | Kate Winslet, Eddie Redmayne and Sam Smith lead British Golden Globes | Sakshi
Sakshi News home page

అదే మ్యాజిక్‌లా పనిచేసింది

Published Fri, Dec 11 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM

అదే మ్యాజిక్‌లా పనిచేసింది

అదే మ్యాజిక్‌లా పనిచేసింది

 హాలీవుడ్‌లో స్టార్‌గా ఎదగాలనుకుంటే ఆంగ్లం ధారాళంగా వస్తే చాలు అని అంటున్నారు కేట్ విన్‌స్లెట్. బ్రిటన్ నుంచి వచ్చి, హాలీవుడ్‌లోకి ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన కేట్ ‘టైటానిక్’ అనే ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల హృదయాలను దోచేసుకున్నారు. ఏ భాషా నటులకూ లేని సౌకర్యం ఇంగ్లిషు యాక్టర్స్‌కు ఉందటున్నారామె. ఇప్పటికే హాలీవుడ్‌ను ఏలుతున్న ప్రముఖ నటుల్లో చాలా మంది బ్రిటన్ నుంచి వచ్చి స్థిరపడిన వాళ్లే. ‘‘మొదట్లో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు నా ఇంగ్లీషు ఉచ్చారణ విని నేను అమెరికాకు చెందిన అమ్మాయినేమో అనుకున్నారు. చాలా ట్రైనింగ్ తీసుకుని వచ్చిన అమ్మాయిలా వాళ్లకు కనిపించాను. అదే నా కెరీర్ మీద మ్యాజిక్‌లా పనిచేసింది’’ అని కేట్ చెప్పుకొచ్చారు.,
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement