టైటానిక్‌ను... తెలుగులో నిర్మించి ఉంటే!
హాస్యం
టైటిల్‌ను ‘టైటానిక్’ అని కాకుండా ‘టైటానికా మజాకా!’ అని పెట్టేవాళ్లు ‘టైటానికా మజాకా’ అనే పేరుతో రెండు సంవత్సరాల క్రితమే తాను ఫిలిం ఛాంబర్‌లో టైటిల్‌ను రిజిస్టర్ చేయించానని, తన టైటిల్‌ను తస్కరించడం అక్రమమని వర్ధమాన నిర్మాత సుబ్బారావు ప్రెస్ మీట్‌లో మండి పడేవాడు. దీంతో సినిమా టైటిల్‌ను ‘టిక్ టిక్ టిక్... టైటానిక్’(ట్యాగ్‌లైన్: ఎప్పుడు మునుగుతుందో ఎవడికీ తెలియదు) అని మార్చేవారు షూటింగ్ మొత్తం హుసేన్‌సాగర్ జలాల్లో జరుగుతుంది హీరోహీరోయిన్లతో సాగర్‌లోని ‘రాక్ ఆఫ్ జిబ్రాల్టర్’ దగ్గర డ్యూయెట్ చిత్రించేవారు హుసేన్‌సాగర్ జలాల్లో టైటానిక్ మునిగిపోగానే... హీరో ముందుగా హీరోయిన్‌ను రక్షించేవాడు.
ఆ తరువాత... బుద్ధ్ద విగ్రహం దగ్గర నిల్చొని తన చొక్కా మీద ఉన్న ‘టై’ని ప్యాంట్‌కు కట్టుకున్న ‘బెల్ట్’ను కలిపి కట్టి దాన్ని టైటానిక్‌షిప్‌కు కట్టి, జలాల్లో మునిగిపోతున్న షిప్‌ను పైకిలాగుతాడు. అందరినీ రక్షిస్తాడు. శుభం కార్డు పడుతుంది తమ అప్పు క్లియర్ చేసేవరకు సినిమాను విడుదల చేయవద్దని ఫైనాన్షియర్స్ కోర్టులో దావా వేస్తారు. దీంతో సినిమా విడుదల ఆగిపోతుంది సినిమా విడుదలయ్యే మార్గం లేక నిర్మాత హుసేన్‌సాగర్‌లోకి జంప్ చేస్తాడు.