యూత్‌ఫుల్‌ డ్యూయెట్‌  | Makers of Anand Deverakonda drop new poster from Duet | Sakshi
Sakshi News home page

యూత్‌ఫుల్‌ డ్యూయెట్‌ 

Published Sat, Mar 16 2024 1:12 AM | Last Updated on Sat, Mar 16 2024 1:12 AM

Makers of Anand Deverakonda drop new poster from Duet - Sakshi

‘డ్యూయెట్‌’లో ఆనంద్‌ దేవరకొండ

‘డ్యూయెట్‌’ పాడుతున్నారు మదన్‌. ఆనంద్‌ దేవరకొండ, రితికా నాయక్‌ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘డ్యూయెట్‌’. మిథున్‌ వరదరాజ కృష్ణన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కేఈ జ్ఞానవేల్‌ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ డిఫరెంట్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ జరుపుకుంటోంది. శుక్రవారం ఆనంద్‌ దేవరకొండ బర్త్‌ డే.

ఈ సందర్భంగా ‘డ్యూయెట్‌లో మదన్‌ క్యారెక్టర్‌లో ఆనంద్‌ నటిస్తున్నట్లుగా వెల్లడించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌ కుమార్, సహనిర్మాత: మధుర శ్రీధర్‌ రెడ్డి. మరోవైపు ఆనంద్‌ దేవరకొండ నటిస్తున్న యాక్షన్‌ ఫిల్మ్‌ ‘గం..గం..గణేశా’. ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్‌ కూడా విడుదలైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement