Duet
-
యూత్‌ఫుల్ డ్యూయెట్
‘డ్యూయెట్’ పాడుతున్నారు మదన్. ఆనంద్ దేవరకొండ, రితికా నాయక్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ‘డ్యూయెట్’. మిథున్ వరదరాజ కృష్ణన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది. శుక్రవారం ఆనంద్ దేవరకొండ బర్త్ డే. ఈ సందర్భంగా ‘డ్యూయెట్లో మదన్ క్యారెక్టర్లో ఆనంద్ నటిస్తున్నట్లుగా వెల్లడించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్, సహనిర్మాత: మధుర శ్రీధర్ రెడ్డి. మరోవైపు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘గం..గం..గణేశా’. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్ కూడా విడుదలైంది. -
Duet Movie: ఆనంద్ దేవరకొండ ‘డ్యూయెట్’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
లవ్ డ్యూయెట్
ఆనంద్ దేవరకొండ, రితికా నాయక్ జంటగా నటించనున్న సినిమాకు ‘డ్యూయెట్’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఏఆర్ మురుగదాస్ దగ్గర అసిస్టెంట్‌గా చేసిన మిథున్ వరదరాజ కృష్ణన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్టూడియో గ్రీన్ పతాకంపై కేజీ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాప్రారంభోత్సవం గురువారం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ఆనంద్ తల్లిదండ్రులు గోవర్ధన్ దేవరకొండ, మాధవి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో హీరోయిన్లపై దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్ ఇచ్చారు. తొలి సీన్‌కి దర్శకుడు చందు మొండేటి గౌరవ దర్శకత్వం వహించగా, దర్శక–నిర్మాత సాయిరాజేష్, నిర్మాత జ్ఞానవేల్ రాజా, ఈ చిత్ర సహ–నిర్మాత ‘మధుర’ శ్రీధర్ స్క్రిప్ట్‌ను దర్శకుడు మిథున్‌కు అందజేశారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘డ్యూయెట్’ నాకు స్పెషల్ ఫిల్మ్. మిథున్ మంచి కథ రాశాడు’’ అన్నారు. ‘‘ఇదొక మంచి లవ్‌స్టోరీ’’ అన్నారు మిథున్. ‘‘ఈ కథ విన్నప్పుడు భావోద్వేగానికి లోనయ్యాను. జీవీ ప్రకాశ్‌కుమార్ ఆల్రెడీ రెండు పాటలు ఇచ్చేశారు. వారం రోజుల్లో తొలి షెడ్యూల్ ఆరంభిస్తాం’’ అన్నారు. ఈ వేడుకకు హీరోలు విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అతిథులుగా హాజరయ్యారు. -
మణిరత్నం సినిమాకు ముహూర్తం ఫిక్స్
కొంతకాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలు తీయటంలో ఫెయిల్ అవుతూ వస్తున్న లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఓకె బంగారం సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సంగతి తెలిసింది. ఓకె బంగారం సినిమా తరువాత కూడా మరోసారి తన మార్క్ రొమాంటిక్ టచ్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు మణిరత్నం. కార్తీ, అదితీరావ్ హైదరీలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మణిరత్నం తన సొంతం నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్లో స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మార్చి 24న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను తెలుగులో డ్యూయెట్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. -
మణిరత్నం డైరెక్షన్లో పొలిటికల్ థ్రిల్లర్
పొలిటికల్ థ్రిల్లర్స్ తెరకెక్కించటంలో మణిరత్నంది డిఫరెంట్ స్టైల్. ఇద్దరు, యువ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న మణిరత్నం మరోసారి అదే జానర్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. కొంత కాలంగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న మణి, ఓకెబంగారం సక్సెస్‌తో తిరిగి ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం కార్తీ హీరోగా తెరకెక్కుతున్న కాట్రు వేలయిదే (తెలుగులో డ్యూయెట్) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న మణిరత్నం, ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేశాడట. తన సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై ఎదిర్ కట్చి( ప్రతిపక్ష పార్టీ) అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడు మణి, దీంతో ఇదే మణిరత్నం నెక్ట్స్ సినిమా అన్న ప్రచారం జరుగుతోంది. తన సినిమాలకు తెలుగు, తమిళ భాషల్లో ఇమేజ్ ఉన్న హీరోలను ఎంచుకునే మణిరత్నం ఈ సినిమాకు తమిళ రంగం మీదే దృష్టి పెడుతున్నాడు. అందుకే తమిళనాట వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న యంగ్ హీరో అధర్వను హీరోగా తీసుకునే అవకావాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
అప్పుడు రోజా... ఇప్పుడు డ్యూయెట్!
హృదయానికి హత్తుకునే ప్రేమకథలు మాత్రమే కాదు, యాక్షన్ చిత్రాలు తీయడంలోనూ దర్శకుడు మణిరత్నంది ప్రత్యేక శైలి. లవ్ అండ్ యాక్షన్ మేళవించి ఆయన తీసిన ‘రోజా’ విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందు కుంది. అటువంటి చిత్రాన్ని మణిరత్నం మళ్లీ తెరకెక్కిస్తున్నారు. కార్తీ, అదితీరావ్ హైదరీ జంటగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ప్రేమకథ ‘డ్యూయెట్’. దీన్ని తెలుగులో ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు. మార్చిలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కెమేరా: రవి వర్మన్, సంగీతం: ఏఆర్ రెహమాన్, సమర్పణ: శిరీష్. -
టైటానిక్‌ను... తెలుగులో నిర్మించి ఉంటే!
హాస్యం టైటిల్‌ను ‘టైటానిక్’ అని కాకుండా ‘టైటానికా మజాకా!’ అని పెట్టేవాళ్లు ‘టైటానికా మజాకా’ అనే పేరుతో రెండు సంవత్సరాల క్రితమే తాను ఫిలిం ఛాంబర్లో టైటిల్‌ను రిజిస్టర్ చేయించానని, తన టైటిల్‌ను తస్కరించడం అక్రమమని వర్ధమాన నిర్మాత సుబ్బారావు ప్రెస్ మీట్లో మండి పడేవాడు. దీంతో సినిమా టైటిల్‌ను ‘టిక్ టిక్ టిక్... టైటానిక్’(ట్యాగ్‌లైన్: ఎప్పుడు మునుగుతుందో ఎవడికీ తెలియదు) అని మార్చేవారు షూటింగ్ మొత్తం హుసేన్సాగర్ జలాల్లో జరుగుతుంది హీరోహీరోయిన్లతో సాగర్‌లోని ‘రాక్ ఆఫ్ జిబ్రాల్టర్’ దగ్గర డ్యూయెట్ చిత్రించేవారు హుసేన్సాగర్ జలాల్లో టైటానిక్ మునిగిపోగానే... హీరో ముందుగా హీరోయిన్ను రక్షించేవాడు. ఆ తరువాత... బుద్ధ్ద విగ్రహం దగ్గర నిల్చొని తన చొక్కా మీద ఉన్న ‘టై’ని ప్యాంట్‌కు కట్టుకున్న ‘బెల్ట్’ను కలిపి కట్టి దాన్ని టైటానిక్షిప్కు కట్టి, జలాల్లో మునిగిపోతున్న షిప్‌ను పైకిలాగుతాడు. అందరినీ రక్షిస్తాడు. శుభం కార్డు పడుతుంది తమ అప్పు క్లియర్ చేసేవరకు సినిమాను విడుదల చేయవద్దని ఫైనాన్షియర్స్ కోర్టులో దావా వేస్తారు. దీంతో సినిమా విడుదల ఆగిపోతుంది సినిమా విడుదలయ్యే మార్గం లేక నిర్మాత హుసేన్‌సాగర్‌లోకి జంప్ చేస్తాడు.