మణిరత్నం డైరెక్షన్లో పొలిటికల్ థ్రిల్లర్ | Maniratnam Next To Be A Political Thriller | Sakshi
Sakshi News home page

మణిరత్నం డైరెక్షన్లో పొలిటికల్ థ్రిల్లర్

Nov 15 2016 2:51 PM | Updated on Sep 17 2018 5:12 PM

మణిరత్నం డైరెక్షన్లో పొలిటికల్ థ్రిల్లర్ - Sakshi

మణిరత్నం డైరెక్షన్లో పొలిటికల్ థ్రిల్లర్

పొలిటికల్ థ్రిల్లర్స్ తెరకెక్కించటంలో మణిరత్నంది డిఫరెంట్ స్టైల్. ఇద్దరు, యువ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న మణిరత్నం మరోసారి అదే జానర్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. కొంత కాలంగా...

పొలిటికల్ థ్రిల్లర్స్ తెరకెక్కించటంలో మణిరత్నంది డిఫరెంట్ స్టైల్. ఇద్దరు, యువ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న మణిరత్నం మరోసారి అదే జానర్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. కొంత కాలంగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న మణి, ఓకెబంగారం సక్సెస్తో తిరిగి ఫాంలోకి వచ్చాడు.

ప్రస్తుతం కార్తీ హీరోగా తెరకెక్కుతున్న కాట్రు వేలయిదే (తెలుగులో డ్యూయెట్) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న మణిరత్నం, ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేశాడట. తన సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్పై ఎదిర్ కట్చి( ప్రతిపక్ష పార్టీ) అనే టైటిల్ను రిజిస్టర్ చేయించాడు మణి, దీంతో ఇదే మణిరత్నం నెక్ట్స్ సినిమా అన్న ప్రచారం జరుగుతోంది.

తన సినిమాలకు తెలుగు, తమిళ భాషల్లో ఇమేజ్ ఉన్న హీరోలను ఎంచుకునే మణిరత్నం ఈ సినిమాకు తమిళ రంగం మీదే దృష్టి పెడుతున్నాడు. అందుకే తమిళనాట వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో అధర్వను హీరోగా తీసుకునే అవకావాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement