న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ ట్రంప్‌పై కాల్పులు జరపగా.. ఆయన చెవిని తాకుతూ బుట్లెట్ పక్కకు దూసుకువెళ్లింది. వెంటనే ఆప్రమత్తమైన సిక్రెట్ సర్వీస్ ఎజెంట్లు ఆయన ఆస్పత్రి తీసుకెళ్లారు. అనంతరం వారి జరిపిన కాల్పుల్లో నిందితుడు క్రూక్స్ మృతి చెందాడు. అయితే ఈ ఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది.
తాజాగా క్రూక్స్‌కు సంబంధించిన ఓ విషయాన్ని ఎఫ్‌బీఐ అధికారులు వెల్లడించారు. ట్రంప్‌పై హత్యాయత్నానికి ముందు సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్‌లో సందేశం ద్వారా కాల్పులు జరపనున్నట్లు సంకేతం ఇచ్చినట్లు తెలిపారు. ‘జూలై 13 నాకు చాలా ముఖ్యమైంది. ఆ రోజు ఏం జరుగుతుందో చూడండి’అని క్రూక్స్ సోషల్‌మీడియా పోస్ట్ చేశాడని తెలిపారు. అదేవిధంగా దర్యాప్తు అధికారులు అతడు షూట్ చేడానికి వాడిన గన్ టెక్నాలజీ, వాడిన మొబైల్, లాప్‌టాప్‌పై పరిశీలిస్తున్నారు.
క్రూక్స్ మొబైల్‌లో డొనాల్డ్ ట్రంప్, ప్రెజిడెంట్ బైడెన్ ఫోటోలు, డొమెక్రటిక్ నేషనల్ కన్వేషన్ షెడ్యూల్, ట్రంప్ పెన్సిల్వేనియా ప్రచార ర్యాలీకి సంబంధించి సమాచారం ఉన్నట్లు ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. క్రూక్స్ రెండు మొబైల్స్ కలిగి ఉన్నాడని ఒకటి కాల్పుల ఘటనాస్థలిలో స్వాధీనం చేసుకోగా.. మరోఫోన్ అతని ఇంట్లో స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు తెలిపారు. అందులో కేవలం 27 కాంటక్ట్ నెంబర్లు మాత్రమే ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎఫ్‌బీఐ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment