అమెరికా ఎన్నికలు: మేయర్‌గా ఎన్నికైన కుక్క.. | US Town Elects French Bulldog As Mayor | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 5 2020 12:44 PM | Last Updated on Thu, Nov 5 2020 1:20 PM

US Town Elects French Bulldog As Mayor - Sakshi

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడలేదు. కానీ ఓ చిన్న పట్టణం మాత్రం విల్బర్ బీస్ట్ అనే కుక్కను తన మేయర్‌గా ఎన్నుకుంది. ఫాక్స్ న్యూస్ ప్రకారం, కెంటకీలోని రాబిట్ హాష్ అనే ఓ చిన్న పట్టణం ఫ్రెంచ్ బుల్‌డాగ్‌ను తమ కొత్త నాయకుడిగా ఎన్నుకుంది. ఇక మేయర్‌గా ఎన్నికైన విల్బర్ బీస్ట్ ఈ ఎన్నికల్లో 13,143 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు రాబిట్ హాష్ హిస్టారికల్ సొసైటీ తెలిపింది. "రాబిట్ హాష్‌లో మేయర్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. మొత్తం 22, 985 ఓట్లు పోలవ్వగా.. విల్బర్ 13,143 ఓట్లతో (అత్యధికంగా గెలిచిన మొత్తం)మేయర్‌గా గెలుపొందింది" అంటూ రాబిట్ హాష్ హిస్టారికల్ సొసైటీ బుధవారం ఫేస్‌బుక్‌లో ప్రకటించింది. జాక్ రాబిట్ బీగల్, గోల్డెన్ రిట్రీవర్ అనే రెండు కుక్కలు వరుసగా రెండవ, మూడవ స్థానంలో నిలిచాయి. లేడీ స్టోన్, 12 ఏళ్ల బార్డర్‌ కోలీ అనే కుక్క, పట్టణానికి రాయబారిగా తన స్థానాన్ని నిలుపుకుంది.

కెంటకీ.కామ్ ప్రకారం, ఒహియో నది వెంబడి ఉన్న ఒక ఇన్‌కార్పొరేటెడ్ కమ్యూనిటీ అయిన రాబిట్ హాష్, 1990 ల నుంచి కుక్కను దాని మేయర్‌గా ఎన్నుకుంటుంది. కమ్యూనిటీ నివాసితులు హిస్టారికల్ సొసైటీకి $ 1 విరాళం ఇవ్వడం ద్వారా ఓటు వేస్తారు. ఇక మేయర్‌గా ఎన్నికైన విల్బర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, రాబిట్ హాష్ హిస్టారికల్ సొసైటీ, ఇతర స్వచ్ఛంద సంస్థల కోసం డబ్బును సేకరించడంలో సహాయపడుతుంది. విల్బర్ ప్రతినిధి అమీ నోలాండ్ అనే వ్యక్తి ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘స్థానికంగా, ప్రపంచవ్యాప్తంగా తనకు మద్దతు తెలుపుతూ.. నమ్మకంతో ఓటు వేసిన అందరికి పూచ్ కృతజ్ఞతలు తెలిపారు’ అన్నారు. (యూఎస్‌ ఎలక్షన్స్‌: చరిత్ర సృష్టించిన నల్లజాతి గే)

"కెంటకీలోని నది కుగ్రామ పట్టణమైన రాబిట్ హాష్‌ను సంరక్షించడానికి ఇది చాలా అర్ధవంతమైన కారణం, ఉత్తేజకరమైన సాహసం" అని వ్రాతపూర్వక ప్రకటనలో తెలిపారు. అలానే ‘ఈ పట్టణం సందర్శకులకు స్వాగతం పలుకుతుంది. అన్ని వయసుల వారికి మేం సంతోషాన్ని కలిగించే కార్యక్రమాలను నిర్వహిస్తాం. ఈ పట్టణాన్ని సందర్శించి గొప్ప అనుభూతులను సొంతం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం’ అని అమీ నోలాండ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement