
‘అహంకారం, ద్వేషం, విభజన వాదం నరనరాన జీర్ణించుకుపోయిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. అలాంటి వారు మనకొద్దు’ అంటూ ట్రంప్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శలు గుప్పించారు.
త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ చేస్తుండగా..తాజాగా ఆమెకు మద్దతుగా బరాక్ ఒబామా పెన్సిల్వేనియాలలో ప్రచార సభ నిర్వహించారు. ఈ సభలో ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
‘గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా కోవిడ్-19 ప్రారంభం నుంచి అమెరికన్లు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. అధిక ధరలతో పాటు పలు ఇతర అంశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితుల నుంచి మనల్ని గట్టెక్కించే నాయకులు కావాలి. ట్రంప్ అందుకు అనర్హులు. ఆయనలో అహంకారం, ద్వేషం మెండుగా ఉన్నాయి. సమస్యలు పరిష్కరిస్తూ.. ప్రజల జీవితాలను మెరుగుపరిచే అధ్యక్షుడు మాత్రమే మనకు కావాలి. కమలాహారిస్ మాత్రమే అలా చేయగలరని నేను నమ్ముతున్నాను’ అని ఒబమా పేర్కొన్నారు.