President Election
-
హారిస్‌పై ట్రంప్ దూకుడు..
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతను చేసే రహస్యం ఏంటి?
-
అధ్యక్ష రేసు నుంచి బైడెన్ ఔట్?
-
కోరి తెచ్చుకున్న కొరివి?
ఎన్నికలు, ఫలితాలనేవి ఉద్వేగాలను రేపడం సహజం. అయితే, కొన్ని ఎన్నికలు, కొందరి ఎంపికలు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తాయి. అనుమానాలతో పాటు ఆందోళనలూ రేపుతాయి. అర్జెంటీనా కొత్త అధ్యక్షుడిగా ఛాందసవాద జేవియర్ మిలీ తాజా ఎన్నిక అలాంటిదే. ఓట్ల లెక్కింపులో మిలీ 56 శాతం ఓట్లు సాధిస్తే, అధికార పక్షమైన పెరోనిస్ట్ ప్రభుత్వ ఆర్థిక మంత్రి సెర్జియో మస్సాకు 44 శాతం ఓట్లే వచ్చాయి. వర్తమాన అర్జెంటీనా రాజకీయ వ్యవస్థపై నెలకొన్న ప్రజాగ్రహానికి, ‘సరికొత్త రాజకీయ శకం’ తీసుకువస్తానన్న వాగ్దానం తోడై సృష్టించిన ప్రభంజనంలో మిలీ విజయతీరాలకు చేరారు. అయితే, ఆయన విజయం అర్జెంటీనాలోని ప్రతిపక్షాల్లోనే కాదు... అంతర్జాతీయంగానూ ఆందోళన రేపుతోంది. కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని భావిస్తున్నారు. నలభై ఏళ్ళుగా ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్న దక్షిణ అమెరికా దేశాన్ని కొత్త అధ్య క్షుడు మళ్ళీ వెనక్కి నడిపిస్తారనే భయం నెలకొంది. అదెలా ఉన్నా... అర్జెంటీనా దౌత్య సంబంధాలు, ఆర్థిక భవితవ్యం, ఆ ప్రాంత రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. నాలుగున్నర కోట్ల జనాభా గల అర్జెంటీనాలో నవంబర్ 19న జరిగిన ఎన్నికలు, ఫలితాలు ఇంతగా చర్చనీయాంశమైంది అందుకే. ఎన్నికల్లో మిలీకి పట్టం కట్టినమాట నిజమే అయినా, అంత మాత్రాన అర్జెంటీనా ప్రజలందరూ ఆయన భావజాలంతో ఏకీభవిస్తున్నట్టు అనుకోలేం. దశాబ్దాల నిర్వహణ లోపాలు, అవినీతితో ఆ దేశం దీర్ఘకాలంగా ఆర్థిక కష్టాల ఊబిలో కూరుకుపోయింది. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. ప్రపంచస్థాయిలోనే ఎక్కువగా ద్రవ్యోల్బణం 150 శాతానికి దగ్గరలో ఉంది. దారిద్య్రం పెరుగుతోంది. దేశంలో నూటికి 40 మందికి పైగా దారిద్య్రంలో మగ్గు తున్నారు. అధికార కరెన్సీ పెసో విలువ ఎన్నడూ లేనంతగా పడిపోయింది. మూడేళ్ళ క్రితం కరోనా రావడానికి ముందు దాకా 80 పెసోలు ఒక డాలరైతే, ఇవాళ వెయ్యి పెసోలైతే కానీ ఒక డాలర్‌కు సమానం కాని దుఃస్థితి. ఈ ఆర్థిక కష్టాలకు రాజకీయ వ్యవస్థ, ముఖ్యంగా వామపక్షాలు కారణమని మిలీ ఆరోపణ. ఆ ఆరోపణల్ని అధికారపక్ష అభ్యర్థి సమర్థంగా తిప్పికొట్టలేకపోయారు. ఎలాగైనా సరే జీవన పరిస్థితుల్లో మార్పు రావాలని తహతహలాడుతున్న జనం మిలీతో ఏకీభావం లేకున్నా ఆయనకే ఓటేశారు. అందుకే, ఈ ఎన్నిక ‘‘నిరసన ఓటు’’ ఫలితమని నిపుణుల మాట. ఆర్థిక నిపుణుడు, మాజీ టీవీ ప్రముఖుడు, తాంత్రిక సెక్స్ కోచ్ 53 ఏళ్ళ జేవియర్ మిలీకి నిజా నికి రాజకీయ అనుభవం లేదు. కానీ, ప్రజలకు ఆయన బాసలు కోటలు దాటాయి. పన్నులు తగ్గిస్తా ననీ, అర్జెంటీనా కేంద్ర బ్యాంకును రద్దు చేస్తాననీ, దేశ కరెన్సీ పెసో స్థానంలో అమెరికా డాలర్‌ను తెస్తాననీ అన్నారు. గర్భస్రావంపై నిషేధం ఎత్తేస్తానన్నారు. కారుణ్య మరణాల్ని వ్యతిరేకించారు. తుపాకులపై నియంత్రణల్ని సడలిస్తానన్నారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ‘సామ్యవాదంపై పోరాటం’ చేయదలచిన దేశాలే అర్జెంటీనాకు మిత్రపక్షాలంటూ తన భావజాలాన్ని కుండబద్దలు కొట్టారు. అసలే కష్టాల్లో ఉన్న దేశాన్ని ఆయన అధ్యక్షత మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని వందమందికి పైగా ప్రముఖ ఆర్థికవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. పైగా, అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్యదేశాలైన బ్రెజిల్, చైనా, అమెరికా, చిలీ నేతల్ని మిలీ దుమ్మెత్తిపోశారు. ఇక, సర్కారు వద్దే డాలర్లు లేని వేళ దేశ కరెన్సీ స్థానంలో డాలర్లను ప్రవేశపెడతాననడం ఆచరణ సాధ్యం కాని పని. ఏ కొద్దిగా ప్రయత్నించినా అది మరో సంక్షోభానికి తెర తీస్తుంది. అర్జెంటీనా సంగతి అటుంచితే, మిలీ విజయవార్త మిగతా ప్రపంచానికీ శుభవార్తేమీ కాదు. అందుకు అనేక కారణాలు. టీవీ ప్రముఖుడిగా తెచ్చుకున్న పేరును ఆయన రాజకీయాల్లో మదుపు పెట్టారు. రెచ్చగొట్టే మాటలు, మితిమీరిన హావభావ విన్యాసాలతో ముందుకు సాగుతున్నారు. సుమారు అయిదేళ్ళ క్రితం రాజకీయాల్లోకి వచ్చిన ఈ స్వేచ్ఛావాది ప్రపంచ వాతావరణ మార్పు ఓ పెద్ద సామ్యవాద అబద్ధం అంటారు. ప్రపంచవ్యాప్తంగా అతివాదులకు నచ్చే ఆ మాటల్ని ఐరోపా లాంటివి స్వాగతిస్తున్నాయి. విజేత మిలీని తక్షణం అభినందించిన వారి జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో తదితరులు ఉండడం గమనార్హం. అమెరికాలో ట్రంప్ హయాంలో, బ్రెజిల్లో బొల్సొనారో ఏలుబడిలో జరిగిందేమిటో అందరికీ తెలిసిందే, చూసినదే. మరి, స్నేహితుల్ని బట్టి స్వభావం తెలుస్తుందన్న దాన్ని బట్టి రానున్న రోజుల్లో మిలీ ఎలాంటి పోకడలు పోగలరో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థలతో నిత్యం పోరాడే అధ్యక్షుడి వల్ల అర్జెంటీనా ప్రజాస్వామ్యం మరింత బలహీనపడే ముప్పుంది. ఎన్నికల ప్రచార సమయంలో రంపం చేతబట్టి, ఖర్చునూ, కష్టాల్నీ కోసేస్తానని మిలీ చెబుతూ వచ్చారు. విజయోత్సవ ప్రసంగంలోనూ దేశంలో ‘అంచెలంచెలుగా కాక సమూలంగా మార్పు తెస్తా’నని వాగ్దానం చేశారు. అనుభవమే కాదు... భావోద్వేగాలపై అదుపు కానీ, పార్లమెంట్లో మెజారిటీ కానీ లేని మిలీ ఏం చేయగలుగుతారు, ఎంతకాలం నిలబడగలుగుతారన్నది సందేహమే! కొద్దికాలమే పదవిలో ఉన్నా దేశానికి నష్టం భారీగా ఉండవచ్చని పలువురి భయం. అసలు అర్జెంటీనాలో ప్రజాస్వామ్యం బీటలు వారుతోందని ఇప్పటికి మూడేళ్ళుగా అమెరికా, బ్రెజిల్ హెచ్చరిస్తూనే ఉన్నాయి. మిలీ హయాంలో ఆ భయాలన్నీ నిజమైతే, ఆ దేశానికి అంతకన్నా విషాదం మరొ కటి ఉండదు. మాటల్లో, చేష్టల్లో ట్రంప్‌కు తీసిపోని మిలీని అంతా ‘ఎల్లోకో’ (పిచ్చివాడు) అంటుంటారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం పక్కకుపోయి, అధికారం పిచ్చోడి చేతిలో రాయిగా మారితే కష్టమే! కారణాలేమైనా ఇది మెజారిటీ అర్జెంటీనా పౌరులు కోరి తెచ్చుకున్న కొరివి!! -
ఎప్పుడూ ఏకగ్రీవమే, కానీ.. ఇప్పుడే ఇలా!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు కాసేపట్లో తేలిపోనున్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో దేశంలోని వివిధ పోలింగ్ బూత్‌ల నుంచి చేరిన పోస్టల్ బాలెట్ల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మల్లికార్జున ఖర్గే, శశిథరూర్‌లో ఎవరు గెలుస్తారన్నది కాసేపట్లో తేలనుంది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారాయి. గాంధీయేతర కుటుంబం నుంచి అభ్యర్థి ఎన్నిక కాబోతుండడం, కాంగ్ సీనియర్లపై అభ్యర్థి శశిథరూర్ అసహనం వ్యక్తం చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో ఓటింగ్‌పై శశిథరూర్ ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. ఓటింగ్ ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు జరిగాయంటూ కౌంటింగ్ వేళ ఆరోపణలకు దిగారాయన. ఉత్తర ప్రదేశ్ ఓట్లను రద్దు చేయాలని కోరారు ఆయన. ఇక ఓటింగ్ అవకతవకలతో పాటు కొన్ని అంశాలపై ఎన్నికల అధికారి మధుసుధన్ మిస్త్రీని కలిసినట్లు, తమ వర్గం తరపున లేఖ అందించినట్లు థరూర్ ఎలక్షన్ ఏజెంట్ సల్మాన్ సోజ్ వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్ ఓటింగ్‌లో అవకతవకలు జరిగాయని, మల్లికార్జున ఖర్గేకు తెలియకుండా అది జరిగి ఉంటుందని, ఒకవేళ తెలిస్తే ఆయన సైతం ఆ అక్రమాలను సహించబోరని థరూర్ టీం లేఖలో పేర్కొంది. పోలింగ్‌తో సంబంధం లేని వాళ్ల సమక్షంలో బాలెట్ బాక్సులు ఉండడంపై అనుమానాలు ఉన్నట్లు తెలిపింది థరూర్ బృందం. ► అయితే ఓటింగ్ ప్రశాంతంగానే జరిగిందని, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించామని మధుసుదన్ మిస్త్రీ చెప్తున్నారు. మరో సీనియర్ సభ్యుడు జైరామ్ రమేశ్ సైతం ఎన్నికలు పారదర్శకంగానే జరిగినట్లు చెప్తున్నారు. ► మొత్తం పోలైన 9,915 ఓట్లలో అధికంగా.. సగానికి(50 శాతం) పైగా ఓట్లు ఎవరికి పోలైతే ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తుంది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం. ఈ క్రమంలో మెజార్టీ తేలగానే కౌంటింగ్‌ను ఇక ఆపేస్తుంది కూడా. ► మునుపెన్నడూ లేని విధంగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ ‘అధ్యక్ష ఎన్నిక’.. పార్టీలో అంతర్గత పోరును బయటపెట్టింది. పంజాబ్, కేరళ, యూపీ, మహారాష్ట్ర.. ఇలా చాలా చోట్ల కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చును రాజేసింది. సీనియర్లు సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం గమనార్హం. ► అయితే ఎవరు గెలిచినా.. రిమోట్ కంట్రోల్ సోనియాగాంధీ కుటుంబం చేతుల్లోనే ఉంటుందన్న విమర్శలను పార్టీ ఖండిస్తోంది. సమర్థులైన ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారని కాంగ్రెస్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ► ఇక శశిథరూర్ అసహనం మొదటి నుంచి చర్చనీయాంశంగా మారింది. సీనియర్లు, పార్టీలో కీలక పదవులు అనుభవిస్తున్న వాళ్లతో సహా పీసీసీ చీఫ్‌లు సైతం మల్లికార్జున ఖర్గేకు బహిరంగ మద్దతు ప్రకటించడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు.. ► థరూర్ నామినేషన్‌ను ప్రతిపాదించిన కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సైతం థరూర్ నినాదం ‘గుణాత్మక మార్పు’ ప్రచారం గురించి తప్పుడు సమాచారం కార్యకర్తల్లోకి వెళ్లిందని, అయినా ఆశాజనక ఓట్లు దక్కవచ్చని పేర్కొన్నారు. ► 2014తో పాటు 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. 2019 ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. దీంతో తాత్కాలిక అధినేత్రిగా సోనియా గాంధీ కొనసాగుతూ వస్తున్నారు. ► పోటీలో శశిథరూర్ ప్రథమంగా బరిలో నిలవగా.. ఆయనకు ప్రత్యర్థిగా పలువురు అభ్యర్థులు పేర్లు తెరపైకి వచ్చాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బరిలో నిలవొచ్చని అంతా అనుకున్నారు. అయితే ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం ఆ రాష్ట్ర రాజకీయంలో చిచ్చు పెట్టగా.. అధిష్టాన జోక్యంతో చల్లారింది. చివరికి.. సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో నిలిచారు. ► స్వాతంత్రం అనంతరం నుంచి ఇప్పటిదాకా దాదాపుగా గాంధీ కుటుంబం నుంచే ఎవరో ఒకరు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికవుతూ వస్తున్నారు. ఆరుసార్లు మాత్రమే ఒకరి కంటే ఎక్కువ అభ్యర్థి నిలబడడంతో ఎన్నిక నిర్వహించారు. ఆ సమయాల్లోనూ అధిష్టాన మద్దతుతోనే అధ్యక్ష ఎన్నిక సజావుగా పూర్తైంది. ఇప్పుడు సుమారు 22 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక.. అందునా గాంధీయేతర కుటుంబం నుంచి ఎన్నిక కాబోతుండడం, తటస్థంగా ఉన్నట్లు అధిష్టానం ప్రకటించుకోవడం గమనార్హం. -
ఖర్గే వర్సెస్ థరూర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్‌ల మధ్య పోటీ నెలకొంది. సోమవారం జరిగే పోలింగ్‌లో కాంగ్రెస్ ఎలక్టోరల్ కాలేజీలోని 9 వేల మందికి పైగా పీసీసీ ప్రతినిధులు రహస్య ఓటింగ్ ద్వారా ఏఐసీసీ కొత్త చీఫ్‌ను ఎన్నుకోనున్నారు. 24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి పార్టీ పగ్గాలను చేపట్టనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో అ«ధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం ఇది ఆరోసారి మాత్రమే. ఖర్గే ఎన్నిక లాంఛనమే! కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ఎవరికీ మద్దతివ్వకున్నా గాంధీ కుటుంబం అండదండలతో ఖర్గే బరిలో దిగారు. జీ 23 అసమ్మతి నాయకులతో పాటు ఇతర సీనియర్లూ మద్దతు ప్రకటించడంతో ఆయన గెలుపు లాంఛనంగా కన్పిస్తోంది. అయితే పార్టీలో బ్లాక్ అధ్యక్షుడి నుంచి స్వయంకృషితో ఎదిగిన దళిత నాయకుడైన మల్లికార్జున ఖర్గే (80), అపారమైన మేధస్సుతో ఐక్యరాజ్య సమితిలో పని చేసిన అనుభవంతో కొత్త ఆలోచనలు చేసే నాయర్ కమ్యూనిటీకి చెందిన శశిథరూర్ ( 66) మధ్య రసవత్తర పోటీ సాగుతుందని కొందరు యువ నాయకుల అంచనా. కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో అనుభవానికి ప్రాధాన్యతనివ్వాలని సంస్థాగతంగా పార్టీ గురించి ప్రతీ అంశం తెలిసిన వారినే గెలిపించాలని ఖర్గే ప్రచారం చేశారు. పార్టీలో మార్పు కోరుకునే వారు, వికేంద్రీకరణకు మద్దతునిచ్చేవారు తనను బలపరచాలంటూ థరూర్ విజ్ఞప్తి చేశారు. పీసీసీ ప్రతినిధుల్ని కలుసుకున్న సమయంలో ఖర్గేకి అండగా సీనియర్ నాయకులు నిలబడితే, యువ నాయకులందరూ థరూర్‌కి స్వాగతం పలికిన దృశ్యాలు కనిపించాయి. ఇరువురు నేతలూ తాము గాంధీ కుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామనే స్పష్టం చేస్తూ వచ్చారు. గాం«ధీ కుటుంబానికి వీర విధేయుడైన ఖర్గే వారిచ్చే సూచనలు, సలహాలు తాను తప్పక పాటిస్తానని చెబితే గాంధీ కుటుంబ సభుల్ని దూరంగా ఉంచి పార్టీ అధ్యక్షులెవరూ పని చేయలేరని పార్టీ రక్తంలో వారి డీఎన్ఏ ఉందని థరూర్ వ్యాఖ్యానించడం విశేషం. అనారోగ్య కారణాలతో సోనియాగాంధీ, అధ్యక్ష పదవిపై ఆసక్తి లేక రాహుల్‌గాంధీ పోటీకి దిగడానికి నిరాకరించడంతో ఈ సారి ఎన్నికలు అనివార్యమయ్యాయి. సోనియా, ప్రియాంక గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో, భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ బళ్లారిలోని ఓటేయనున్నారు. -
కాంగ్రెస్ జీ-23 గ్రూప్‌పై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో జీ–23 అనే గ్రూప్ లేదని ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి, ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. పార్టీలో ఉన్నవారంతా ఒకే సిద్ధాంతంపై పనిచేస్తారని, గతంలో జరిగిన పరిణామాలను బట్టి పార్టీకి రాసిన లేఖపై కొందరు నేతలు సంతకాలు చేశారే తప్ప.. ప్రత్యేకమైన గ్రూప్ లేదని స్పష్టంచేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన శశిథరూర్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ‘మేమంతా ఒక్కటే. మాకు సిద్ధాంత వైరుధ్యాలు లేవు. మా చర్చంతా బీజేపీని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపైనే. అధ్యక్ష ఎన్నిక అనేది మా పార్టీ అంతర్గత విషయం’అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకే తాను ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని, పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎవరు శక్తిమంతులు అన్నదే ఇక్కడ చర్చ అని పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మల్లిఖార్జున ఖర్గే గొప్ప నాయకుడని, ఆయనతో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. ఇటీవల తాను ఖర్గేతో మాట్లాడానని, పార్టీ విషయంలో ఖర్గేది తనది ఒకటే స్టాండ్ అని చెప్పారు. అయితే, పార్టీని నడిపించే విషయంలో తన విజన్ తనకుంటే, ఖర్గే విజన్ ఖర్గేకు ఉంటుందని, తాను పార్టీ అధ్యక్షుడినయితే ఏం చేస్తాననే విషయంలో మేనిఫెస్టో కూడా తయారు చేశానని తెలిపారు. తెలంగాణ నేతలతో కూడా తనకు సన్నిహిత సంబంధాలున్నాయని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా కాఫీ తాగేందుకు తనను ఇంటికి పిలిచారని, అయితే తాను వెళ్లలేకపోయానని చెప్పారు. రేవంత్‌రెడ్డి పిలిస్తే గాంధీభవన్‌కు వచ్చి ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక ప్రచారం చేస్తానని శశిథరూర్ తెలిపారు. ఆసక్తి రేకెత్తించిన ట్వీట్.. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతానని చెప్పిన శశిథరూర్ సోమవారం చేసిన ట్వీట్ కాంగ్రెస్‌వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ‘రేవంత్ దగ్గరి బంధువు చనిపోయారని, ఆయనకు తన సంతాపాన్ని తెలియజేస్తున్నానని, రేవంత్ అండ్ టీం బెస్టాఫ్ లక్..’అని శశిథరూర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇదే విషయంపై గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రేవంత్‌ను ప్రశ్నించగా, శశిథరూర్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారని, తనకు ఫోన్ చేస్తే కాఫీకి ఇంటికి ఆహా్వనించానని, అయితే తన బంధువు చనిపోవడంతో పరామర్శకు వెళ్లాల్సి వచ్చిందని, అందుకే కలవడం కుదరలేదని తెలిపారు. అంతే తప్ప శశిథరూర్‌ను కలవకూడదన్న ఉద్దేశం తనకు లేదని చెప్పడం గమనార్హం. ‘రైడ్స్’ భయంతోనే ప్రశ్నించరు అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే ధైర్యం వ్యాపారవేత్తల్లో ఉండాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు శశిథరూర్ అన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోయినా, ప్రతిపక్షానికి మద్దతుగా ఉన్నా.. రైడ్స్ చేయించడం, ట్యాక్స్‌లు విధించడం లాంటి జరుగుతుంటాయని అందుకే పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలను ప్రశ్నించరని తెలిపారు. ఈ వైఖరి పాశ్చాత్య దేశాల్లోనూ ఉంటుందన్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని పార్క్ హోటల్లో శశిథరూర్‌తో సోమవారం ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. సీనియర్ పాత్రికేయులు కర్రి శ్రీరామ్ అనుసంధానకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో.. ఫిక్కీ ఎఫ్ఎల్ఓ చైర్పర్సన్ శుభ్రమహేశ్వరి అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానమిచ్చారు. పారిశ్రామికవేత్తలుగా మహిళలు ఎంతో రాణిస్తున్నారని, పురుషులకన్నా నిబద్ధతతో ఆలోచిస్తున్నారని ప్రశంసించారు. మహిళల్లో ఎంతో ప్రతిభ, నైపుణ్యం ఉన్నా, సమాజం, సంస్కృతి, సంప్రదాయాల వల్ల ఎక్కువగా రాలేకపోతున్నారన్నారు. ప్రతి ప్రభుత్వరంగ సంస్థలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఒక మహిళ ఉండాలని, కానీలేరని, ఇదే ప్రశ్న తాను పార్లమెంట్లో లేవనెత్తితే సరైన సమాధానం రాలేదని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన దేశంలో మహిళలకు గౌరవం ఉందని, మొట్టమొదటి ఎన్నికల్లోనే మహిళలకు ఓటు హక్కు మన దేశంలోనే కలి్పంచారని గుర్తు చేశారు. చదవండి: దుర్గా మండపంలో విగ్రహం వివాదం.. మహిశాసురుడిలా గాంధీ! -
పదాధికారులు ప్రచారంలో పాల్గొనొద్దు
న్యూఢిల్లీ: రెండు వారాల్లో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో పాటించాల్సిన నియమాలను కాంగ్రెస్ పార్టీ వెలువరించింది. ‘ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయాలనుకుంటే ముందుగా పదాధికారులు(ఆఫీస్ బేరర్లు) తమ పదవికి రాజీనామా చేయాలి. పార్టీ ప్రతినిధులు(డెలిగేట్స్) తమకు నచ్చిన అభ్యర్థికి బ్యాలెట్ పేపర్ విధానంలో ఓటు వేయవచ్చు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీలో పలు విభాగాల అధ్యక్షులు, పార్టీ సెల్స్‌లో ఉన్న వారు, అధికార ప్రతినిధులు... అభ్యర్థికి అనుకూలంగా/వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదు. ప్రచారం చేయాలనుకుంటే ముందుగా పార్టీలో మీ పదవికి రాజీనామా చేయండి’ అని పార్టీ కేంద్ర ఎన్నికల ప్రాధికార విభాగం మార్గదర్శకాల్లో పేర్కొంది. అభ్యర్థులు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నపుడు ఆయా రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు మర్యాదపూర్వకంగా కలవవచ్చని స్పష్టంచేసింది. ‘ప్రచారానికి సంబంధించిన సమావేశ మందిరాలు, చైర్లు, ప్రచార ఉపకరణాలు సమకూర్చవచ్చు. డెలిగేట్స్‌ను ఓటింగ్ స్థలానికి వాహనాల్లో తరలించకూడదు. మార్గదర్శకాలను మీరితే చర్యలు తప్పవు’ అని పార్టీ పేర్కొంది. -
అందుకే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచా
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గే ఆదివారం మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి కీలక విషయాలు వెల్లడించారు. తాను ఎవరి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడానికి పోటీ చేయట్లేదని, పార్టీ సీనియర్ నేతలు, యువనేతలు కోరడం వల్లే బరిలోకి దిగినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడే తన లక్ష్యమన్నారు. అలాగే తన వెనుక గాంధీ కుటుంబం ఉందని వస్తున్న వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు. గాంధీలు ఎవరికీ మద్దతు ప్రకటించలేదని చెప్పారు. ఎన్నికలు చాలా పారదర్శకంగా జరుగుతాయని పేర్కొన్నారు. జీ-23నేతలు మాత్రం తనకే మద్దతు తెలిపారని వివరించారు. ఒక్కరికి ఒకే పదవి ఉండాలనే పార్టీ నిబంధనను గౌరవిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ సమర్పించిన రోజే రాజ్యసభలో ప్రతిపక్షనేత పదవికి తాను రాజీనామా చేసినట్లు ఖర్గే వెల్లడించారు. ఒకేవేళ ఈయన అధ్యక్షుడిగా గెలిస్తే 136ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తొలి దళిత నేతగా అరుదైన ఘనత సాధిస్తారు. ఖర్గే గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పు రాదని, తాను గెలిస్తేనే సంస్కరణలు తీసుకొస్తానని శశిథరూర్ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ఖర్గే స్పందించారు. ఎవరు గెలిచినా పార్టీలో సంస్కరణల కోసం సమష్టి నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే బీజేపీపై విమర్శలు గుప్పించారు ఖర్గే. కమలం పార్టీ పాలనలో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆ పార్టీ నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు. మరోవైపు ఖర్గేకు మద్దతుగా ఆయన కోసం ప్రచారంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవులకు గౌరవ్ వల్లభ్, దీపిందర్ హుడా, నజీర్ హుస్సేన్ రాజీనామా చేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయని చెప్పేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఖర్గే విజయం కోసం తమవంతు కృషి చేస్తామన్నారు. చదవండి: శుక్రవారం నామినేషన్.. శనివారం రాజీనామా -
సచిన్ పైలటే సీఎం.. మంత్రి కీలక వ్యాఖ్యలు
జైపూర్: కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అతి త్వరలో ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు రాజస్థాన్ మంత్రి రాజేంద్ర గుఢా. ఎమ్మెల్యేలందరి మద్దతు ఆయనకు ఉందని స్పష్టం చేశారు. సీఎం అశోక్ గహ్లోత్‌కు మద్దతు తెలిపిన స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా సచిన్ పైలట్ వైపే ఉంటారని పేర్కొన్నారు. గహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే పైలట్ సీఎం అవుతారని, అధిష్ఠానం నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించరని చెప్పారు. 2018లో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల్లో రాజేంద్ర గుఢా ఒకరు. ఆ తర్వాత వీరంతా తమ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. రాజేంద్రకు మంత్రి పదవి దక్కింది. తమ ఆరుగురు ఎమ్మెల్యేలు సచిన్ పైలట్‌కు మద్దతుగానే ఉంటారని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. అక్టోబర్ 17న జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అశోక్ గహ్లోత్ పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే తాను అధ్యక్షుడినైనా సీఎంగా కొనసాగుతానని గహ్లోత్ అన్నారు. రెండు బాధ్యతలూ చేపట్టగలనని పేర్కొన్నారు. కానీ రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం ఒక్కరికి ఒకే పదవి అని ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను గుర్తు చేశారు. దీంతో గహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే, యువ నేత సచిన్ పైలట్ రాజస్థాన్ సీఎం కావడం ఖాయం. ఆయన రాహుల్‌కు సన్నిహితుడు కావడమే గాక, రాష్ట్రంలో ముఖ్యంగా యువతలో మంచి ఆదరణ ఉంది. చదవండి: బీజేపీకి వెన్నుపోటు పొడిచాడు: అమిత్‌షా -
అధ్యక్ష పదవికి సోనియా ఫ్యామిలీ దూరం!
ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో ఓ ఉత్కంఠకు తెర పడింది. ఎన్నికకు సోనియా గాంధీ కుటుంబం దూరంగా ఉండడం దాదాపు ఖాయమైంది. ఈ విషయాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అధ్యక్ష రేసులో గెహ్లాట్ అధికారికంగా నిలిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో భాగంగా కేరళలో ఉన్నారు. గురువారం సాయంత్రం అశోక్ గెహ్లాట్, రాహుల్‌ను కలిశారు. ఈ సందర్భంగా.. పార్టీ అధ్యక్ష పదవికి తమ కుటుంబం దూరంగా ఉంటుందని స్వయంగా రాహుల్ వెల్లడించినట్లు గెహ్లాట్ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తిరిగి చేపట్టాలని వస్తున్న విజ్ఞప్తులను అంగీకరించాలని అతన్ని(రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ..) కోరాం. కానీ, తాను కాదు కదా తన కుటుంబం నుంచి కూడా ఎవరూ అధ్యక్ష బరిలో ఉండబోరని ఆయన స్పష్టం చేశారు అని గెహ్లాట్ శుక్రవారం ఉదయం మీడియాకు వెల్లడించారు. వాళ్ల కోరికను గౌరవిస్తాను. కానీ, నేను ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నా. అంతేకాదు.. గాంధీయేతర వ్యక్తే కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపడతారు అంటూ రాహుల్ బదులిచ్చినట్లు గెహ్లాట్ తెలిపారు. ఇదిలా ఉంటే.. రేసులో ఇప్పటికే అశోక్ గెహ్లాట్‌తో పాటు దిగ్విజయ్ సింగ్, శశిథరూర్‌తో పాటు మరికొందరు నామినేషన్లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: అలా అంటే కుదరదు గెహ్లాట్జీ-రాహుల్ -
ఇద్దరు కాదు ముగ్గురు.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తెరపైకి కొత్త పేరు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తెరపైకి మరో కొత్త పేరు వచ్చింది. ఇప్పటివరకు కేరళ ఎంపీ శశిథరూర్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ మధ్యే పోటీ ఉంటుందనే ప్రచారం జరుగుతుండగా.. రేసులో నేనూ ఉన్నా అని కీలక వ్యాఖ్యలు చేశారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్. ఇద్దరే పోటీ చేయాలా? నేను చేయకూడదా? అని ఓ జాతీయ ఛానల్‌తో ఇంటర్వ్యూలో అన్నారు. నన్నెందుకు పోటీ నుంచి తీసేస్తున్నారని ప్రశ్నించారు. నామినేషన్లకు చివరి తేదీ ఆయిన సెప్టెంబర్ 30న పోటీలో ఎవరెవరు ఉండేది తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే అశోక్ గహ్లేత్ కచ్చితంగా సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందేనని దిగ్విజయ్ స్పష్టం చేశారు. ఒక్కరికి ఒకే పదవి అని ఉదయ్‌పూర్‌లో పార్టీ డిక్లరేషన్‌ను గుర్తు చేశారు. తాను ఒక్కటే కాదు.. మూడు పదవులనూ కూడా సమర్థంగా నిర్వహించగలనని అశోక్ గహ్లోత్ మీడియాతో మాట్లాడుతూ అన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనా రాజస్థాన్ సీఎంగా కొనసాగుతానని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. దిగ్విజయ్ దీనిపైనే స్పందిస్తూ ఒక్కరికి ఒకే పదవి అని తేల్చి చెప్పారు. అంతేకాదు అధ్యక్ష పదవికి గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకపోయినా ఎలాంటి ఆందోళన అవసరం లేదని దిగ్విజయ్ అన్నారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా బరిలో ఉండవచ్చన్నారు. పోటీ చేయొద్దనుకునే వారిని బలవంతం చేయవద్దని సూచించారు. అధ్యక్షుడు కాకపోతే పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా రాహుల్ నిర్వర్తిస్తారని దిగ్విజయ్ స్పష్టం చేశారు. గాంధీలు పదవుల్లో లేనప్పుడు ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీని నడిపించిన విషయాన్ని గుర్తు చేసారు. పీవీ నరసింహా రావు, సీతారం కేసరి పేర్లను ప్రస్తావించారు. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు -
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ పోటీ చేస్తారని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యేందుకు ఆయన బుధవారం ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 40-50 ఏళ్లుగా పార్టీలో తాను చాలా పదవులు చేపట్టానని, కాంగ్రెస్ అధిష్ఠానం తనకు అన్నీ ఇచ్చిందని గహ్లోత్ అన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని పార్టీ అప్పగించే బాధ్యతలను నిర్వర్తించడమే ముఖ్యమని గహ్లోత్ స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం, కార్యకర్తలు తనను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని కోరితే తప్పకుండా చేస్తానన్నారు. ఒకవేళ సీఎంగా కొనసాగమంటే కూడా అలాగే చేస్తానని పేర్కొన్నారు. అయితే చివరిప్రయత్నంగా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని రాహుల్ గాంధీని తాను మరోమారు కోరతానని గహ్లోత్ చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో ఆయన భారత్ జోడో యాత్రలో పాల్గొంటే.. పార్టీకి సరికొత్త అధ్యాయం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపసంహరణకు అక్టోబర్ 8వరకు గడువు. ఎన్నికల అనంతరం రెండు రోజుల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో గాంధీల విధేయుడిగా అశోక్ గహ్లోత్, పార్టీ సీనియర్ నేత శశిథరూర్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ పోటీ చేస్తే మాత్రం ఇద్దరూ తప్పుకునే అవకాశం ఉంది. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి రాహుల్ గాంధీ విముఖత! -
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి రాహుల్ గాంధీ విముఖత!
సాక్షి,న్యూఢిల్లీ: అక్టోబర్‌లో జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేయకపోవచ్చని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న ఆయన.. మధ్యలో విరామం తీసుకుని ఢిల్లీకి వచ్చే సూచనలు కన్పించడం లేదని పేర్కొన్నాయి. దీంతో గాంధీ కుటుంబేతరులే పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని స్పష్టం చేశాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్‌కు సెప్టెంబర్ 30 చివరి తేదీ. అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహిస్తారు. 19న ఫలితాలు ప్రకటిస్తారు. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం సోనియా గాంధీతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం మాట్లాడుతూ ఎన్నికల్లో రాహుల్ పోటీ చేసేది, లేనిది ఆయన మాత్రమే చెప్పగలరని పేర్కొన్నారు. దీనిపై ఆయనే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని, ఎవరైనా పోటీ చేయవచ్చని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ పోటీ చేయకపోతే అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతలు శశిథరూర్, రాజస్థాన్ సీఎం ఆశోక్ గహ్లోత్ మధ్యే పోటీ నెలకొనే అవకాశం ఉంది. శశిథరూర్ ఇప్పటికే సోనియాను కలిసి పోటీ చేస్తానని చెప్పారని, ఆమె కూడా అందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గాంధీల విధేయుడిగా ఉన్న గహ్లోత్‌కే సోనియా, రాహుల్‌ల మద్దతు ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్ర మొదలుపెట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజుల పాటు 3,700 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. ప్రస్తుతం కేరళలో రాహుల్ పాదయాత్ర చేస్తున్నారు. చదవండి: గుజరాత్లో కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చిన మోదీ అభిమానులు -
కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగేది ఆ ఇద్దరే!
న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నాన్-గాంధీ కుటుంబం వ్యక్తికి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించే సంకేతాలు అందుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగాలని పార్టీ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ నిర్ణయించుకున్నారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన నిర్ణయాన్ని ఆమె ముందుంచారు. ‘మీ ఇష్టం. అధ్యక్ష పదవి కోసం ఎవరైనా పోటీ పడవచ్చు’ అంటూ సోనియా కూడా పచ్చజెండా ఊపినట్టు సమాచారం. అధ్యక్ష బరిలో ఎవరు నిల్చున్నా సరే.. తాను వ్యక్తిగతంగా ఎవరికీ మద్దతు ప్రకటించకుండా తటస్థంగా ఉంటానని చెప్పారంటున్నారు. భేటీ వివరాలను మీడియాకు వెల్లడించేందుకు థరూర్ నిరాకరించారు. ‘‘పోటీ చేయాలనుకునే నేతలందరికీ స్వాగతం. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పూర్తి పారదర్శకంగా జరిగే ప్రజాస్వామిక ప్రక్రియ. అందులో పాల్గొనేందుకు ఎవరి అనుమతీ అవసరం లేదు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కూడా అన్నారు. పోటీకి తాను సన్నద్ధమవుతున్నట్టు కొద్ది రోజుల క్రితమే థరూర్ ప్రకటించడం తెలిసిందే. పార్టీలో అంతర్గత సంస్కరణల దిశగా ఆయన కొంతకాలంగా గట్టిగా గళం వినిపస్తున్నారు. వరుస పరాజయాలు, నేతల నిష్క్రమణతో కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ బాగా డీలా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీకి అత్యవసరమైన పలు విప్లవాత్మక మార్పులకు అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ శ్రీకారం చుడుతుందని మలయాళ దినపత్రిక మాతృభూమికి రాసిన వ్యాసంలో థరూర్ అభిప్రాయపడ్డారు. పార్టీలో నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడంతో పాటు ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అమలు చేస్తామని అధ్యక్ష అభ్యర్థులు ప్రమాణం చేయాలంటూ పలువురు యువ నేతలు, కార్యకర్తల చేసిన విజ్ఞాపనను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. ‘‘దీనిపై 650 మందికి పైగా సంతకం చేశారు. ఈ విజ్ఞాపనను స్వాగతిస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు. పార్టీని సమూలంగా ప్రక్షాళించాలంటూ లేఖ రాసి జీ–23గా పేరుపడ్డ కాంగ్రెస్ అసంతృప్త నేతల్లో థరూర్ కూడా ఉన్నారు. రాజస్తాన్ పగ్గాలు పైలట్‌కు? మరోవైపు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం ఇప్పటికే ఖాయమైంది. దేవీ నవరాత్రులు మొదలయ్యాక సెపె్టంబర్ 26న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. నామినేషన్ల దాఖలుకు 30వ తేదీ తుది గడువు. అక్టోబర్ 17న అధ్యక్ష ఎన్నిక జరగనుంది. 19న ఫలితాలు వెల్లడవుతాయి. గెహ్లాట్ నెగ్గి పార్టీ పగ్గాలు చేపడితే సచిన్ పైలట్‌ను రాజస్తాన్ సీఎంగా నియమిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాహుల్‌గాంధీయే మళ్లీ అధ్యక్షుడు కావాలంటూ ఆరు పీసీసీ కమిటీలు తీర్మానం చేశాయి. ఇదీ చదవండి: నగదు విరాళాలు రూ.2,000 మించొద్దు -
కాంగ్రెస్ అధ్యక్ష బరిలో శశి థరూర్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సోనియా గాంధీ!
సాక్షి,న్యూఢిల్లీ: అక్టోబర్‌లో జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని భావిస్తున్న ఆ పార్టీ ఎంపీ శశిథరూర్.. సోనియా గాంధీతో సోమవారం సమావేశమయ్యారు. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని కొందరు యువ కార్యకర్తలు రూపొందించిన ఆన్లైన్ పిటిషన్‌కు ఆయన అంగీకారం తెలిపిన అనంతరం ఈ భేటీ జరగడం గమనార్హం. అయితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని శశి థరూర్ సోనియా గాంధీకి ఈ భేటీలో చెప్పారని, అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. దీంతో ఆయన అక్టోబర్ 17న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. కొద్దినెలల క్రితం ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ చేసిన తీర్మానాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని పార్టీకి చెందిన కొందరు యువ నాయకులు ట్విట్టర్లో ఓ పిటిషన్‌ను రూపొందించారు. దీనికి మద్దతుగా 650మంది పార్టీ నాయకులు సంతకాలు చేశారు. దీన్నే ట్విట్టర్లో షేర్ చేసి తాను స్వాగతిస్తున్నట్లు శశిథరూర్ తెలిపారు. దీనిపై ప్రచారం చేస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. I welcome this petition that is being circulated by a group of young @INCIndia members, seeking constructive reforms in the Party. It has gathered over 650 signatures so far. I am happy to endorse it & to go beyond it. https://t.co/2yPViCDv0v pic.twitter.com/waGb2kdbTu — Shashi Tharoor (@ShashiTharoor) September 19, 2022 తీర్మానాలివే.. కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడమే గాక కుటుంబం నుంచి ఒక్కరికి ఒకే పదవి ఇవ్వాలనే తీర్మానాలను ఉదయ్‌పూర్ సమావేశాల్లో కాంగ్రెస్ ఆమోదించింది. అయితే ఐదేళ్లకుపైగా పార్టీలో పనిచేసే కుటుంబాలకు దీని నుంచి మినాహాయింపు ఇచ్చింది. ఇందులో భాగంగానే అక్టోబర్ 17న అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. వాస్తవానికి ఈ ఎన్నికలు సెప్టెంబర్‌లోనే జరగాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల అక్టోబర్‌కు వాయిదావేశారు. అయితే ఎన్నికలు జరుగుతాయని అందరూ భావిస్తుండగా.. కొన్ని రాష్ట్రాల అధ్యక్షులు రాహుల్ గాంధీకి అనుకూలంగా తీర్మానాలు చేస్తున్నారు. అధ్యక్షుడి ఎంపికను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకే వదిలేయాలని మూడు రాష్ట్రాల పీసీసీలు ఇప్పటికే తీర్మానాలకు ఆమోదం తెలిపాయి. దీంతో ఎన్నికలు లేకుండా మళ్లీ గాంధీ కుటుంబసభ్యులకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని చూస్తున్నారనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురావాలనే పిటిషన్‌కు శశిథరూర్ బహిరంగంగా మద్దతు తెలిపారు. పార్టీలో సంస్కరణల కోసం డిమాండ్ చేసిన జీ-23 నేతల్లో ఈయన కూడా ఒకరు. ఈ విషయంపై 2020లోనే సోనియా గాంధీకి లేఖ రాశారు. కచ్చితంగా పోటీ.. తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తానని థరూర్ కొద్దిరోజుల క్రితమే చెప్పారు. తాను పోటీ చేసేది లేనిది త్వరలో తెలుస్తుందన్నారు. గాంధీ కుటుంబం నుంచి కాకుండా మరో నాయకుడు కాంగ్రెస్ పగ్గాలు చేపడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ సుముఖంగా లేకపోతే రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌ను బరిలోకి దింపాలని సోనియా భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అదే జరిగితే శశిథరూర్ తప్పకుండా అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. చదవండి: వీడియో లీక్ ఘటన.. పంజాబ్ సీఎం కీలక నిర్ణయం -
AIFF: తొలిసారి అధ్యక్షుడిగా ఆటగాడు
న్యూఢిల్లీ: మైదానంలో ఆటగాళ్లు గోల్ కోసం శ్రమిస్తుంటే... కేంద్ర మంత్రి స్థాయి వారు ఫుట్‌బాల్ సంఘంలో ఏళ్ల తరబడి తిష్టవేసి రాజకీయాలు చేశారు. ఇలా ఆటకు సంబంధంలేని వారే 85 ఏళ్ల పాటు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)ను ఏలారు. ఏనాడూ మాజీ కెప్టెన్ కానీ, దిగ్గజ ప్లేయర్ కానీ సమాఖ్యలో అధ్యక్ష స్థానంలో లేనే లేరు. దీంతో రాజకీయాలతో మసక బారిన ఏఐఎఫ్ఎఫ్ చివరకు మన ఫుట్‌బాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ‘ఫిఫా’ నిషేధానికి గురైంది. చివరకు రోజుల వ్యవధిలోనే సడలింపుతో ఊపిరి పోసుకున్న ఏఐఎఫ్ఎఫ్కు ఇప్పుడు కొత్త జవసత్వాలు మాజీ ఆటగాడి రూపంలో వచ్చాయి. భారత మాజీ గోల్ కీపర్ కల్యాణ్ చౌబే 85 ఏళ్ల ఏఐఎఫ్ఎఫ్ చరిత్రలో అధ్యక్షుడైన ఆటగాడిగా నిలిచారు. మాజీ కెప్టెన్, దిగ్గజం బైచుంగ్ భూటియా ఈ ఎన్నికలో ఓడినప్పటికీ మైదానంలోలాగే ఓ ఆటగాడి చేతిలోనే ఓడాడు. రాజకీయ నాయకుడి చేతిలో కాకపోవడం గొప్ప ఊరట. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 46 ఏళ్ల కల్యాణ్ చౌబే అధ్యక్షుడిగా ఏకపక్ష విజయం సాధించారు. ఆయన 33–1 ఓట్ల తేడాతో భూటియాను ఓడించారు. ఆశ్చర్యకరంగా మాజీ కెప్టెన్‌కు ఒక్క ఓటే రావడం విచిత్రం! భూటియా, ఐఎం విజయన్, లారెన్స్, హైదరాబాద్‌కు చెందిన భారత మాజీ కెప్టెన్ షబ్బీర్ అలీ ఆటగాళ్ల ప్రతినిధులుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సభ్యులుగా వ్యవహరిస్తారు. మిగతా 14 మంది ఈసీ మెంబర్లంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం జనరల్ సెక్రటరీ జీపీ ఫల్గుణతో పాటు అవిజీత్ పాల్, పి.అనిల్ కుమార్, వాలంక నటాష, మాలోజి రాజే ఛత్రపతి, మేన్ల ఎతెన్పా, మోహన్ లాల్, ఆరిఫ్ అలీ, కె.నీబౌ సెఖోస్, లాల్గింగ్లోవా, దీపక్ శర్మ, విజయ్ బాలి, ఇంతియాజ్ హుస్సేన్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన గోపాలకృష్ణ కొసరాజు కోశాధికారి పదవి కోసం పోటీపడి 1–32తో కిపా అజయ్ (అరుణాచల్ ప్రదేశ్) చేతిలో ఓడారు. మంచి గోల్ కీపర్... కల్యాణ్ చౌబే మాజీ గోల్ కీపర్, మంచి గోల్‌కీపర్ కూడా. 1996లో మోహన్ బగాన్ సీనియర్ క్లబ్ తరఫున అరంగేట్రం చేశారు. తదనంతరం ఈస్ట్ బెంగాల్, జేసీటీ, సాల్గావ్కర్ తదితర క్లబ్‌లకు 2003 ఏడాది వరకు ప్రాతినిధ్యం వహించారు. అంతకంటే ముందు జూనియర్ స్థాయిలో భారత అండర్–17, అండర్–20 జట్ల తరఫున ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. 1999–2000లో ప్రి–ఒలింపిక్ క్వాలిఫికేషన్లో భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. దక్షిణాసి యా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత్ మూడుసార్లు విజేతగా నిలువడంలో గోల్‌కీపర్ గా చౌబే కీలకపాత్ర పోషించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో 2019లో బీజేపీ తరఫున బెంగాల్లో ఎంపీ పదవికి పోటీ చేసి ఓడిపోయారు. -
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక తేదీపై ఊహాగానాలకు తెరపడింది. అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ తర్వాత రెండు రోజుల్లో విజేత పేరును ప్రకటించనున్నట్లు తెలిపాయి. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా అధ్యక్షుడిని ఎన్నుకుంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని పేర్కొన్నాయి. పార్టీ నూతన సారథి ఎన్నిక కోసం సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ జారీ చేస్తారు. సెప్టెంబర్ 24 నుంచి 30 దాకా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ చెప్పారు. అక్టోబర్ 1న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8. ఒకరి కంటే ఎక్కువ మంది బరిలో నిలిస్తే అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహిస్తారు. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు విజేత పేరును ప్రకటిస్తారు. ఎన్నిక షెడ్యూల్‌కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేసింది. సోనియా గాంధీ నేతృత్వంలో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించారు. వైద్య పరీక్షల కోసం ప్రస్తుతం విదేశాల్లో ఉన్న సోనియా వెంట కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రా ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక కోసం చివరిసారిగా 2000 నవంబర్‌లో ఎన్నిక నిర్వహించారు. సోనియా గాంధీ మధ్యలో రెండేళ్లు(2017–2019) మినహా 1998 నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఈసారి పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని ఎన్నుకోవడంపై సీడబ్ల్యూసీ సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని తెలిసింది. చదవండి: (ఆ ప్రాంతాల్లో రక్తపాతం జరిగితే దానికి కారణం కేసీఆరే: ఎంపీ కోమటిరెడ్డి) -
కాంగ్రెస్ చీఫ్ ఎన్నికకు 3–4 రోజుల్లో షెడ్యూల్!
న్యూఢిల్లీ/జైపూర్: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధినేతను ఎన్నికొనేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ మరో 3–4 రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు సోమవారం తెలిపాయి. సెప్టెంబర్ 20లోగా నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ చెప్పారు. ఎన్నిక తేదీపై తుది నిర్ణయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీదేనని(సీడబ్ల్యూసీ) వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ చేపట్టాలని తాము కోరుకుంటున్నట్లు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు. రాహుల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొనేందుకు పార్టీ నేతలంతా సానుకూలంగా ఉన్నారని వివరించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని, పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించాలని రాహుల్ గాంధీకి అశోక్ గహ్లోత్ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఆయన నిరాకరిస్తే కార్యకర్తలు అసంతృప్తికి లోనవుతారని చెప్పారు. ఆనంద్ శర్మను బుజ్జగించే యత్నాల్లో కాంగ్రెస్ హిమాచల్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన ఆనంద్ శర్మను శాంతింపజేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఏఐసీసీ ఇన్చార్జి రాజీవ్ శుక్లా సోమవారం ఆయన్ను కలిసి, పార్టీ పదవిలో కొనసాగాలని కోరారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా శర్మతో ఫోన్లో మాట్లాడి, అనేక అంశాలపై చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీయే అంతిమ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాయి. -
12న హైదరాబాద్‌కు ద్రౌపది ముర్ము
సాక్షి, హైదరాబాద్: ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల ప్రచారం నిమిత్తం ఈ నెల 12న హైదరాబాద్‌కు రానున్నారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టడంలో భాగంగా ఆమె ఇక్కడ ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నగరానికి వస్తున్న ఆమె 3, 4 గంటలపాటు ఇక్కడ ఉండే అవకాశముంది. ఏదైనా హోటల్లో గిరిజన, ఆదివాసీ వర్గాల నాయకులు, ప్రజలు, వివిధ రంగాల ప్రముఖులు, మేధావులతో ద్రౌపది ముర్ము విడివిడిగా సమావేశమవుతారని సమాచారం. రాష్ట్ర బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదు గురు ఎంపీలు(రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్ సహా), ముగ్గురు ఎమ్మెల్యేలతోనూ భేటీ కానున్నారు. ఈ సమావేశాల ద్వారా తన అభ్యర్థిత్వానికి విశాల సమాజ మద్దతు కోరడం, దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో తాను ప్రజల కోసం చేయబోయే కృషి తదితరాలను వివరిస్తారని తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలను పురస్కరించుకుని ఆదివాసీ, గిరిజనులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తనకు తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతునివ్వకపోవడాన్ని ఎండగట్టే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో గిరిజన, ఆదివాసీ వర్గాల ప్రజలపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ఎస్టీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచ కుండా తాత్సారం చేయడం, గిరిజనులకు ఇచ్చి న హామీలు నెరవేర్చకపోవడం, పోడుభూములకు పట్టాలు ఇవ్వకపోవడం వంటి అంశాలను ప్రస్తావించవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా మోదీ ప్రభుత్వం ఆదివాసీ, గిరిజనుల సంక్షేమానికి, అభివృద్ధికి చేపడుతున్న చర్యల గురించి వివరించే అవకాశాలున్నాయి. -
రాష్ట్రపతి ఎన్నికలో ఏపీ వాటా ఇదీ.. ప్రత్యేకతలెన్నో.. ఎన్నిక ఇలా..
సాక్షి, అమరావతి: భారతదేశంలో అత్యున్నత పదవిగా భావించే రాష్ట్రపతి ఎన్నిక అంటే ఓటింగ్‌పైనే అందరి దృష్టి ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నిక సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉండడంతో పాటు పార్లమెంటు సభ్యులు, రాష్ట్రంలోని ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉండడం గమనార్హం. పైగా అన్ని రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా పాలుపంచుకునే రాష్ట్రపతి ఎన్నికలు త్వరలో జరగనున్నందున అందులో ఆంధ్రప్రదేశ్ పాత్ర ఏమిటనే దానిపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఓటు విలువకు ఎంతో ప్రాధాన్యం ఉంది. చదవండి: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఇందులో 151 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, 23 మంది టీడీపీకి చెందినవారు కాగా, ఒకరు జనసేనకు చెందిన వారు. ఇక ఎంపీల విషయానికొస్తే రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు 25 ఉండగా, ఇందులో 22 మంది వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీలు, ముగ్గురు టీడీపీకి చెందిన ఎంపీలున్నారు. రాజ్యసభ స్థానాలు 11 ఉండగా ఇందులో వైస్సార్సీపీకి చెందిన ఎంపీలు 9 మంది, టీడీపీ, బీజేపీలకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నిక ఇలా.. దేశాధ్యక్షుడి ఎన్నిక ఇతర సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటుంది. ఇందులో లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికైన ఎంపీలు, రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలకు కూడా ఓటు ఉంటుంది. ఒక ఎంపీ ఓటు విలువను మొత్తం ఎన్నికైన రాష్ట్ర ఎమ్మెల్యేలు/ఎన్నికైన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో లెక్కిస్తారు. ఆ లెక్కన ఒక్కో ఎంపీ ఓటు విలువ 708గా ఉంది. ఏపీలో 36 మంది ఎంపీలు (లోక్‌సభ+రాజ్యసభ) ఉండగా వారి మొత్తం ఓటు విలువ 25,488గా ఉంది. ఎమ్మెల్యే ఓటు విలువను రాష్ట్జ జనాభా/మొత్తం ఎమ్మెల్యేలు 1000గా (జనాభాను 1971 లెక్కల ప్రాతిపదికగా తీసుకున్నారు) లెక్కిస్తారు. ఆ లెక్కన ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 159గా ఉంది. రాష్ట్రంలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ 27,825గా ఉంది. అంటే రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ 53,313గా ఉంది. ఇక జమ్మూ అండ్ కశ్మీర్ అసెంబ్లీని రద్దుచేయడంతో ఆ మేరకు ఎంపీ ఓటు విలువ తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న 708 నుంచి 700కు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధాన పాత్ర వైఎస్సార్సీపీదే.. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధికంగా ఓటు వేసేది అధికార వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలే. ఈ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు 22 మంది, రాజ్యసభలో మరో 9 మంది ఎంపీలకు కలిపి మొత్తం ఓటు విలువ 21,948 కాగా, 151 మంది ఎమ్మెల్యేలకు 24,009 ఓటు విలువ ఉంది. అంటే రాష్ట్రం నుంచి ఉన్న మొత్తం 53,313 ఓటు విలువలో వైఎస్సార్సీపీ 45,957 ఓటు విలువ పంచుకోనుంది. -
రాష్ట్రపతి ఎన్నికల్లో తగ్గనున్న.. ఎంపీల ఓటు విలువ
న్యూఢిల్లీ: ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుల ఓటు విలువ 700కు పడిపోనుంది. గతంలో ఇది 708గా ఉండేది. 83 స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రద్దవడమే ఇందుకు కారణం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత లద్దాఖ్, జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్ విభజన జరగడం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో శాసనసభ ఉనికిలో లేకపోవడంతో దేశవ్యాప్తంగా ఎంపీల ఓటు విలువ తగ్గిపోతున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నిక జూలైలో జరగనుంది. ఎంపీల ఓటు విలువ రాష్ట్రాల్లో శాసనసభ సభ్యుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. చదవండి: తల్లిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రేమతో ముద్దాడిన సీఎం -
ఇరాన్లో ఎలక్షన్.. హైదరాబాద్‌లో ఓటింగ్
సాక్షి, బంజారాహిల్స్: ఎన్నికలు ఇరాన్లో జరగడమేమిటి? ఇక్కడ హైదరాబాద్‌లో ఓటు వేయడమేమిటి? అర్థం కాలేదు కదూ.. శుక్రవారం ఇరాన్లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. తమ దేశ పౌరులందరూ ఈ ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకునేందుకు వీలుగా.. ఆ దేశ కాన్సులేట్ భారత్‌లోని ఢిల్లీ, హైదరాబాద్, రాజమండ్రి, బెంగళూరు, పుణే, ముంబై తదితర ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే శుక్రవారమిక్కడ బంజారాహిల్స్‌లోని కాన్సులేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 220 మంది ఇరాన్ పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు రాజమండ్రిలో 28 మంది ఓటేశారు. చదవండి: ఐరాస సెక్రటరీ జనరల్‌గా మళ్లీ గుటెరస్ -
పశ్చిమాసియా: ట్రంప్ సుడిగుండంలో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి బైడెన్ గెలుపు చట్టబద్ధతను సవాలు చేయడం ద్వారా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించారు. ఓటర్ల తీర్పును తాను గౌరవించబోనని, మోసంతో బైడెన్ గెలిచారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దేశీయంగా చిక్కులను కల్పించడమే కాకుండా విదేశాల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రతిష్టను కూడా దెబ్బతీసింది. సునాయాసంగా అధికార మార్పిడీ, ప్రజాస్వామ్య ఆదర్శాల పట్ల నిబద్ధత గురించి విదేశీ నేతలకు ప్రబోధించే నైతిక అధికారాన్ని ఇప్పుడు అమెరికా కోల్పోయింది. నాలుగేళ్ల తర్వాత ట్రంప్ వదిలివెళుతున్న విధానాలు అధికార మార్పిడి విషయంలో బైడెన్‌కు దేశీయంగా చిక్కులు కొని తేవడమే కాకుండా పశ్చిమాసియాలో గమ్యం తెలీని ప్రయాణాన్ని కొత్త అధ్యక్షుడి యంత్రాంగానికి కలిగించనున్నాయి. గత కొన్ని వారాల్లో ట్రంప్ యంత్రాంగం మధ్యప్రాచ్యానికి అసాధారణ ప్రాధాన్యతనిచ్చింది. విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో సహా కనీసం నలుగురు సీనియర్ అధికారులు ఇజ్రాయెల్‌కి అమెరికా సన్నిహిత గల్ఫ్ మిత్రదేశాలను సందర్శించారు. ఈ క్రమంలోనే ట్రంప్ ఇరాన్‌పై ఆంక్షలను పెంచడమే కాకుండా ఇరాన్ అణు శాస్త్రజ్ఞుడు మొహసెన్ ఫఖీర్జాదె హత్యకు ఆమోద ముద్ర వేశారు. అణ్వాయుధ సహిత అమెరికా యుద్ధ వాహన నౌకను గల్ఫ్ ప్రాంతానికి తరలించారు. ఈ చర్యలన్నీ అమెరికా విదేశీ విధానాన్ని కాకుండా దాని దేశీయ రాజకీయాలకు దగ్గరగా ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. అధికారం నుంచి వైదొలుగుతున్న ట్రంప్ యంత్రాంగానికి సన్నిహితులుగా ఉంటూవచ్చిన పశ్చిమాసియాలోని మిత్రులు బైడెన్‌ను లాంఛనప్రాయంగా స్వాగతించి ఉండవచ్చు కానీ బైడెన్ యంత్రాం గానికి వ్యతిరేకంగా వీరు ట్రంప్‌తో చేతులు కలిపి డెమొక్రాటిక్ పార్టీకి రాజకీయ వ్యతిరేక శిబిరంలో చేరే అవకాశం కూడా కాదనలేం. ట్రంప్ విధానాలకు పూర్తి వ్యతిరేకంగా బైడెన్ అధ్యక్ష పాలన ఉండబోతోందని, బరాక్ ఒబామా పాలనను అది తలపించవచ్చని మధ్యప్రాచ్య నేతలు భావిస్తున్నారు. ఇటీవల జాతీయ భద్రతా అధికారులను బైడెన్ నియమించిన తీరు దీనికి కాస్త భిన్నంగా ఉండటం వాస్తవమే కానీ, అమెరికా విదేశాంగ విధానం బైడెన్ హయాంలో కొన్ని నిర్దిష్ట మార్పులను తీసుకురావడం తప్పదని వీరి అంచనా. అందుకే సౌదీ పాలకుడు, ఈజిప్ట్ అధ్యక్షుడు, టర్కీ పాలకుడు కొన్ని రాజీధోరణులను ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇక ఇరాన్ సైతం అమెరికా తనపై విధించిన ఆంక్షలను రద్దు చేయించుకుని అణు చర్చల పునరుద్ధరణ బైడెన్ హయాంలో సాధ్యమవుతుందని ఆశిస్తోంది. ట్రంప్ హయాంలో అమెరికా విదేశీ విధానం ప్రమాదకరస్థాయిలో వ్యక్తిగతీకరణ బారిన పడింది. ట్రంప్ విధానాలను వ్యతిరేకించిన అధికారులను నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపేవారు. విశ్వసనీయులు, అవకాశవాదులు మాత్రమే ట్రంప్ యంత్రాంగంలో ఉండేవారు. సాంప్రదాయికమైన విదేశీ విధాన నిర్ణయాలు పక్కకుపోయి, సంస్థల మధ్య అంతర్గత సహకారం కుప్పగూలింది. పెంటగాన్, విదేశాంగ శాఖ వంటి కీలకమైన సంస్థలను ట్రంప్ నమ్మేవారుకాదు. దీంతో ట్రంప్ అనుయాయులతో విదేశీ నేతలు సులువుగా సంప్రదింపులు జరుపుతూ శ్వేతసౌధంలో మరింత పట్టును సాధించేవారు. అయితే బైడెన్, డెమొక్రాట్లు అధికారం స్వీకరించాక, ట్రంప్ అల్లుడితో అర్ధరాత్రి వాట్సాప్ సందేశాలు వంటి అడ్డదారి విధానాలకు పశ్చిమాసియా నేతలకు అందుబాటులో ఉండవు. దీంతో పశ్చిమాసియాతోపాటు విదేశీ విధాన అంశాలపై అమెరికా సంస్థల మధ్య విభేదాలు తిరిగి పొడసూపి విధాన నిర్ణయ ప్రక్రియ మందగించే అవకాశమూ లేకపోలేదు. ట్రంప్ అధ్యక్ష పాలనా వారసత్వం నూతన అధ్యక్షుడిగా గెలుపొందిన బైడెన్ యంత్రాంగం పురోగమించేందుకు కొన్ని అవకాశాలను ప్రతిపాదించవచ్చు కానీ ట్రంప్ సృష్టించిన ప్రాంతీయ సవాళ్లు మాత్రం మిగిలే ఉంటాయి. పశ్చిమాసియాలో ట్రంప్ బృందం ఇప్పటికే విదేశీ విధాన డైనమైట్లను అమర్చివుంది. వచ్చే నాలుగేళ్లలో వీటిని తొలగించడానికి బైడెన్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. పశ్చిమాసియా నేతలు ప్రారంభంలోనే బైడెన్‌కు పరీక్ష పెడతారు. వచ్చే నాలుగేళ్ల పాలనను సీరియస్‌గా తీసుకోవాలంటే బైడెన్ ఇప్పుడే కాస్త వెన్నెముకను ప్రదర్శించాల్సి ఉంది. వ్యాసకర్త: జో మెకరాన్, అరబ్ సెంటర్ పరిశోధకుడు, వాషింగ్టన్ డీసీ -
పాపం ట్రంప్.. కోర్టులో కూడా ఓటమే
వాషింగ్టన్: ఇప్పటికే ఓటమి భయంతో అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కి కోర్టులో కూడా ప్రతికూల ఫలితాలే ఎదురయ్యాయి. గడువు ముగిసిన తర్వాత వచ్చిన మెయిల్ ఇన్ ఓట్లను లెక్కించవద్దని, కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ మద్దతుదారులు ఆరోపిస్తూ.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జార్జియా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగాన్ రాష్ట్రాల్లో ఓట్ల కౌంటింగ్‌ను సవాల్ చేశారు. ఈ క్రమంలో సరైన సాక్ష్యాధారాలు లేవంటూ జార్జియా, మిచిగాన్ కోర్టులు ఈ పిటిషన్లని పరిగణలోకి తీసుకోలేదు. ఇక నెవాడా మీదనే ట్రంప్ ఆశలు పెట్టుకున్నారు. జార్జియా కేసులో, ఆలస్యంగా వచ్చిన 53 బ్యాలెట్లను ఆన్-టైమ్ బ్యాలెట్లతో కలిపినట్లు ట్రంప్ మద్దతుదారులు ఆరోపించారు. మిషిగాన్‌లో కూడా ఇదే కారణంతో ఓట్లను లెక్కించకుండా ఆపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో జార్జియాలోని ఒక ఉన్నత న్యాయమూర్తి జేమ్స్ బాస్ మాట్లాడుతూ, బ్యాలెట్లు చెల్లవని చెప్పడానికి "ఎలాంటి ఆధారాలు లేవు".. ఈ పిటిషన్లని పరిగణలోకి తీసుకోలేం అని తెలిపారు. (చదవండి: ఎన్నికల ఫలితాలపై ట్రంప్ దావాలు భ్రమే..!) మిషిగాన్ కేసులో, న్యాయమూర్తి సింథియా కూడా స్టీఫెన్స్ ఇవే వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. "యోగ్యతపై విజయం సాధించే అవకాశం ఉందని తెలుసుకోవడానికి నాకు ఎటువంటి ఆధారం లేదు." లాస్ వెగాస్‌తో సహా నెవాడా జనాభా కలిగిన క్లార్క్ కౌంటీలో ఓటింగ్‌లో అవకతవకలు జరిగాయని ట్రంప్ మద్దతుదారులు ఆరోపించారు. ఇక మిచిగాన్, జార్జియా తీర్పులపై ట్రంప్ ప్రచార ప్రతినిధి స్పందించలేదు. అధ్యక్ష పదవిని నిర్ణయించగలిగే కొన్ని కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ నెవాడాలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. జార్జియాలో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక మిడిగాన్లో బిడెన్ విజయం సాధిస్తారని అంచనా వేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి బైడెన్ కేవలం ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు. (చదవండి: చరిత్ర సృష్టించిన జో బైడెన్) లాస్ వెగాస్‌లో గురువారం ఒక విలేకరుల సమావేశంలో మాజీ నెవాడా అటార్నీ జనరల్ ఆడమ్ లక్సాల్ట్, ఇతర ట్రంప్ మద్దతుదారులు ముఖ్యంగా మాజీ పరిపాలనా అధికారి రిచర్డ్ గ్రెనెల్ విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. అలానే ఎన్నికల్లో డెమొక్రాట్లు అవకతవకలకు పాల్పడినట్లు చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపించలేదు. ఇక లక్సాల్ట్ మాట్లాడుతూ.. ‘లెక్కించబడిన ఓట్లలో చనిపోయిన ఓటర్లు ఉన్నారని మేము నమ్ముతున్నాము. మహమ్మారి సమయంలో క్లార్క్ కౌంటీ నుంచి బయటికి వెళ్లిన వేలాది మంది ప్రజల ఓట్లు లెక్కించారని మాకు తెలిసింది” అని తెలిపారు. అంతేకాక "సరికాని ఓట్ల లెక్కింపును ఆపమని" ఆదేశించాల్సిందిగా న్యాయమూర్తిని కోరడానికి ఫెడరల్ కోర్టులో దావా వేస్తామని అన్నారు. క్లార్క్ కౌంటీలోని ఎన్నికల అధికారి జో గ్లోరియా విలేకరులతో మాట్లాడుతూ సరికాని బ్యాలెట్లను ప్రాసెస్ చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. కోర్టుకు వెళ్తానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపే అవకాశం లేదని ఎన్నికల న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. -
ఆ ఓట్లు లెక్కిస్తే విజయం నాదే: ట్రంప్
వాషింగ్టన్: అగ్రరాజ్యం ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. వైట్‌హౌస్‌కి చేరేది ఎవరో తేలడానికి కేవలం ఆరు ఓట్ల దూరం మాత్రమే ఉంది. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌లో జో బైడెన్ 264 ఓట్లు సాధించగా.. ట్రంప్ 214 దగ్గర ఆగిపోయారు. బైడెన్ గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. ఇక ట్రంప్ గెలవాలంటే నిజంగానే ఏదైనా అద్భుతం జరగాలి. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయపరంగా తాను గెలిచానని ప్రకటించారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో మీడియా, టెక్ సంస్థల జోక్యం భారీగా ఉందని ఆరోపించారు. నిర్ణయాత్మకంగా ఇప్పటికే తాను గెలిచాను అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఒకవేళ చట్టపరమైన ఓట్లను కౌంట్ చేస్తే నేను చాలా సులభంగా గెలుస్తాను. కానీ వారు మమ్మల్ని ఓడించడానికి అక్రమ ఓట్లను ఉపయోగించారు’ అని ఆరోపించారు. ఇక మీడియా కూడా తప్పుడు ప్రచారం చేస్తుందని మండి పడ్డారు. బ్లూ వేవ్ వచ్చింది అంటూ జనాలను గందరగోళంలో పడేసింది అన్నారు. కానీ డెమొక్రాట్లు మాత్రం మీడియా అంచానలను నిజం చేయలేకపోయారని.. తాను న్యాయంగా ఎన్నికల్లో విజయం సాధించానని అన్నారు ట్రంప్. (చదవండి: అడుగు దూరంలో బైడెన్) డెమొక్రాట్లు విజయం సాధించారు అనే భ్రమ కల్పించడానికి.. నిధుల సేకరణలో రిపబ్లికన్ల సామర్థ్యాన్ని దెబ్బ తీయడానికి వారు కుట్రలు చేస్తున్నారు అని ట్రంప్ మండి పడ్డారు. అనేక న్యూస్ నెట్‌వర్క్‌లు ప్రసారం చేసిన ఎగ్జిట్ పోల్స్‌ను ‘అణచివేత పోల్స్’ గా పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ అమెరికన్ ప్రజలను సూచిస్తుందని, అంతర్భాగానికి చిహ్నంగా నిలుస్తుందన్నారు. ఇక మొత్తం ఎన్నికల ప్రక్రియలో ‘డబ్బు, టెక్నాలజీ, మీడియా’ పెద్ద ఎత్తున డెమొక్రాట్లకు మద్దతు ఇచ్చాయని ఆరోపించారు. “అణచివేత.. అధ్యక్ష రేసులో కొన్ని రాష్ట్రాల్లో గెలుపు, ఓటమి ఇంకా నిర్ణయించబడలేదు. ఈ రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియని డెమొక్రాట్లు నిర్వహిస్తున్నారు. పలు కీలక రాష్ట్రాల్లో మేం చాలావరకు గెలిచాము. కానీ అనూహ్యంగా మా ఓట్లు దూరమవుతున్నాయి” అన్నారు. డెమొక్రాట్లు ఓటరు అణచివేతకు పాల్పడుతున్నారని ట్రంప్ ఆరోపించారు. (అమెరికా ఎన్నికలు: మేయర్‌గా ఎన్నికైన కుక్క..) రిపబ్లికన్ పోల్ పరిశీలకులను కౌంటింగ్ కేంద్రాలకు దూరంగా ఉంచారని ఆరోపిస్తూ తన ప్రచార బృందం ఎన్నికల ప్రక్రియపై పలు వ్యాజ్యాలని దాఖలు చేసిందని తెలిపారు ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో బ్యాలెట్-కౌంటింగ్ కేంద్రాల్లోని లెక్కింపు ప్రక్రియని ప్రత్యక్ష ప్రసారం చేశారని.. కానీ మెయిల్-ఇన్ ఓటింగ్ విధానం ‘అవినీతి’ అని, అది ‘ఓటింగ్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని’ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
అమెరికా ఎన్నికలు: మేయర్‌గా ఎన్నికైన కుక్క..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడలేదు. కానీ ఓ చిన్న పట్టణం మాత్రం విల్బర్ బీస్ట్ అనే కుక్కను తన మేయర్‌గా ఎన్నుకుంది. ఫాక్స్ న్యూస్ ప్రకారం, కెంటకీలోని రాబిట్ హాష్ అనే ఓ చిన్న పట్టణం ఫ్రెంచ్ బుల్‌డాగ్‌ను తమ కొత్త నాయకుడిగా ఎన్నుకుంది. ఇక మేయర్‌గా ఎన్నికైన విల్బర్ బీస్ట్ ఈ ఎన్నికల్లో 13,143 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు రాబిట్ హాష్ హిస్టారికల్ సొసైటీ తెలిపింది. "రాబిట్ హాష్‌లో మేయర్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. మొత్తం 22, 985 ఓట్లు పోలవ్వగా.. విల్బర్ 13,143 ఓట్లతో (అత్యధికంగా గెలిచిన మొత్తం)మేయర్‌గా గెలుపొందింది" అంటూ రాబిట్ హాష్ హిస్టారికల్ సొసైటీ బుధవారం ఫేస్బుక్లో ప్రకటించింది. జాక్ రాబిట్ బీగల్, గోల్డెన్ రిట్రీవర్ అనే రెండు కుక్కలు వరుసగా రెండవ, మూడవ స్థానంలో నిలిచాయి. లేడీ స్టోన్, 12 ఏళ్ల బార్డర్ కోలీ అనే కుక్క, పట్టణానికి రాయబారిగా తన స్థానాన్ని నిలుపుకుంది. కెంటకీ.కామ్ ప్రకారం, ఒహియో నది వెంబడి ఉన్న ఒక ఇన్కార్పొరేటెడ్ కమ్యూనిటీ అయిన రాబిట్ హాష్, 1990 ల నుంచి కుక్కను దాని మేయర్‌గా ఎన్నుకుంటుంది. కమ్యూనిటీ నివాసితులు హిస్టారికల్ సొసైటీకి $ 1 విరాళం ఇవ్వడం ద్వారా ఓటు వేస్తారు. ఇక మేయర్‌గా ఎన్నికైన విల్బర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, రాబిట్ హాష్ హిస్టారికల్ సొసైటీ, ఇతర స్వచ్ఛంద సంస్థల కోసం డబ్బును సేకరించడంలో సహాయపడుతుంది. విల్బర్ ప్రతినిధి అమీ నోలాండ్ అనే వ్యక్తి ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘స్థానికంగా, ప్రపంచవ్యాప్తంగా తనకు మద్దతు తెలుపుతూ.. నమ్మకంతో ఓటు వేసిన అందరికి పూచ్ కృతజ్ఞతలు తెలిపారు’ అన్నారు. (యూఎస్ ఎలక్షన్స్: చరిత్ర సృష్టించిన నల్లజాతి గే) "కెంటకీలోని నది కుగ్రామ పట్టణమైన రాబిట్ హాష్‌ను సంరక్షించడానికి ఇది చాలా అర్ధవంతమైన కారణం, ఉత్తేజకరమైన సాహసం" అని వ్రాతపూర్వక ప్రకటనలో తెలిపారు. అలానే ‘ఈ పట్టణం సందర్శకులకు స్వాగతం పలుకుతుంది. అన్ని వయసుల వారికి మేం సంతోషాన్ని కలిగించే కార్యక్రమాలను నిర్వహిస్తాం. ఈ పట్టణాన్ని సందర్శించి గొప్ప అనుభూతులను సొంతం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం’ అని అమీ నోలాండ్ తెలిపారు. -
అమెరికా ఎన్నికలు: ఆయన చెప్పినట్లే జరిగింది..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోరుకు తెరపడింది. విజయ బావుటా ఎగరవేయటానికి జో బైడెన్ అత్యంత సమీపంలో ఉన్నారు. ఆరు ఎలక్టోరల్ ఓట్లు సొంతమైతే మ్యాజిక్ ఫిగర్‌ను ఆయన చేరుకుంటారు. అయితే జార్జియాలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును అడ్డుకోవటానికి ట్రంప్ న్యాయపోరాటానికి దిగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. దీనిలో డెమొక్రాటిక్ సెనేటర్ బెర్నీ సాండర్స్ రెండు వారాల క్రితం అమెరికా ఎన్నికల గురించి.. కౌంటింగ్ సమయంలో చోటు చేసుకునే ట్విస్ట్‌లు.. ట్రంప్ స్పందన గురించి తన అంచనాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో నిన్న, ఈ రోజు జరగిన సంఘటనలను ఓ సారి చూస్తే.. ఆయన మాట అక్షరం పొల్లు పోలేదనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్టోబర్‌లో జిమ్మీ ఫాలన్ టునైట్ షోలో భాగంగా 79 ఏళ్ల బెర్నీని ఇంటర్వ్యూ చేశారు. ఇక ఎన్నికల ఫలితాల గురించి బెర్నీ తన అంచనాలను ఈ షోలో వెల్లడించారు. ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో మెయిల్ ఇన్ బ్యాలెట్లు ఎక్కువగా ఉంటాయని.. ఫలితంగా కౌంటింగ్ ప్రక్రియ ముగియడానికి ఆలస్యం అవుతుందని తెలిపారు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే బెర్నీ ఈ సంవత్సరం ప్రారంభంలో అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ఇక బెర్నీ మాట్లాడుతూ.. ‘నా అంచనా ఏంటంటే పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్ వంటి రాష్ట్రాల్లో మెయిల్-ఇన్ బ్యాలెట్లు భారీ మొత్తంలో నమోదవుతాయి. ఫ్లోరిడా లేదా వెర్మోంట్ వంటి రాష్ట్రాల మాదిరిగా కాకుండా, వేరే ఇతర కారణాల వల్ల, ఎన్నికల రోజు వెంటనే ఆ బ్యాలెట్లను ప్రాసెస్ చేయడం ప్రారంభించలేరు. అంటే ఈ ఏడాది ఎక్కువ రాష్ట్రాల్లో, మిలియన్ల కొద్దీ మెయిల్-ఇన్ బ్యాలెట్లు ఉండబోతున్నాయి. అయితే డెమొక్రాట్లు ఎక్కువగా మెయిల్ ఇన్ బ్యాలెట్స్‌ని వినియోగించుకుంటారు. రిపబ్లికన్లు మాత్రం పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేస్తారు. ఇక ఎన్నికలు జరిగే నాడు రాత్రి 10 గంటల ప్రాంతంలో ట్రంప్ పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో విజయం సాధిస్తాడు. దాంతో వెంటనే టీవీల్లో కనిపించి ‘నన్ను మరో సారి ఎన్నుకున్నందుకు అమెరికా ప్రజలకు ధన్యవాదాలు. ఇక అంతా ముగిసింది. ఇదొక మంచి రోజు’ అంటారు’ అని బెర్నీ తెలిపారు. (చదవండి: అక్కడ ట్రంప్‌కే అవకాశాలెక్కువ) బెర్నీ చెప్పినట్లే నిన్న జరిగింది. అలానే ‘మరుసటి రోజు మెయిల్ ఇన్ బ్యాలెట్స్ లెక్కింపు జరుగుతుంది. ఇక ఆయా రాష్టాల్లో బైడెన్ విజయం సాధిస్తారు. అప్పుడు ట్రంప్ చూశారా మోసం చేశారు. మెయిల్ ఇన్ బ్యాలెట్స్ అంతా మోసం. నేను పదవికి రాజీనామా చేయను’ అంటారు అని బెర్నీ అంచనా వేశారు. ఇక వాస్తవంలో కూడా అదే జరిగింది. బైడెన్ మిచిగాన్, విస్కాన్సిన్లో విజయం సాధించారు. అధిక్యం దిశలో ఉన్నారు. ఈ క్రమంలో ట్రంప్ తాను ఈ ఫలితాలను అంగీకరించనని.. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అతడి మద్దతుదారులు పెన్సిల్వేనియా, మిచిగాన్, జార్జీయా ఫలితాల విషయంలో కోర్టుకు వెళ్తామని చెప్పగా.. విస్కాన్సిన్లో రీ కౌంటింగ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: నమస్తే బైడెన్.. బై..బై ట్రంప్) హన్నాహ్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో దీన్ని 27 మిలియన్ల మంది చూశారు. ఇక ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. ట్రంప్ 214 ఓట్లు సాధించారు. మేజిక్ ఫిగర్ (270)ను అందుకునేందకు చేరువలో ఉన్నారు. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. -
బైడెన్ వైపే ముస్లింలు..
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో 69 శాతం ముస్లిం ఓటర్లు బైడెన్‌కి ఓటు వేయగా, కేవలం 17 శాతం మంది మాత్రమే డొనాల్డ్‌కు ఓటు వేసినట్లు అమెరికాలోని ముస్లిం సివిల్ లిబర్టీస్ సంస్థ ద కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ రిలేషన్స్(సీఏఐఆర్) బుధవారం విడుదల చేసిన ఎగ్జిట్ ఫలితాల్లో పేర్కొంది. నమోదు చేసుకున్న 844 ముస్లిం ఓటర్ల కుటుంబాల్లో 84 శాతం మంది అత్యధికంగా ఓట్లు వేసినట్లు సీఏఐఆర్ సంస్థ తెలిపింది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో 13 శాతం ముస్లిం ఓట్లను మాత్రమే దక్కించుకున్న ట్రంప్, ఈ ఎన్నికల్లో మరో నాలుగు శాతం ఓట్లను అదనంగా సాధించగలిగారు. ఊహలకు భిన్నంగా.. ట్రంప్, బైడెన్ మధ్య హోరాహోరీగా సాగిన ఎన్నికల ఫలితాలు మీడియా అంచనాలకు భిన్నంగా వస్తుండడంతో, మీడియా సహనం పాటించాలని భావిస్తున్నారు. ముందస్తు ఓటింగ్ వల్ల కౌంటింగ్ ప్రక్రియ అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉందని, అందువల్ల ఎటువంటి అభిప్రాయాలకూ రావద్దని మీడియా సంస్థలు తెలిపాయి. ఫలితాలన్నీ అసందిగ్ధంగా ఉన్నాయని, ఎవరు గెలుస్తారో ఇప్పటికిప్పుడే చెప్పలేమని సీబీఎస్ న్యూస్ ఎనలిస్ట్ జాన్డికర్సన్ అన్నారు. సంవత్సరానికి పైగా ప్రచారంలో తలమునకలైన జర్నలిస్టులు, వ్యాఖ్యాతలు కూడా ఫలితాలను ఊహించలేకపోవడం గమనార్హం. (చదవండి: బైడెన్‌కే ‘లిటిల్ ఇండియా’ ఓట్లు) జాత్యహంకారమున్నా అట్లాంటా: అగ్రరాజ్యం అమెరికాలో జాత్యహంకారాన్ని సమర్థిస్తూ నల్లజాతి ప్రజలను తరచూ తిట్టిపోసే మర్జోరీ టేలర్ గ్రీన్ ఈ ఎన్నికల్లో గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన ఆమె నార్త్‌వెస్ట్ జార్జియా స్థానం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. వ్యాపారవేత్త అయిన టేలర్ గ్రీన్ కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనతి కాలంలోనే ట్రంప్ దృష్టిలో పడ్డారు. ఆమెను ట్రంప్ ‘ఫ్యూచర్ రిపబ్లికన్ స్టార్’అని వర్ణించడం గమనార్హం. ఆమె జాత్యహంకారాన్ని సమర్థిస్తూ ఆన్లైన్లో వీడియోలు విడుదల చేస్తుంటారు. నల్లజాతి, హిస్పానిక్ ప్రజలను దూషిస్తుంటారు. వారు ముఠాలు కడుతుంటారని, మాదక ద్రవ్యాల బానిసలని విమర్శిస్తుంటారు. -
అమెరికా ఎన్నికలు: మళ్లీ గెలిచిన ‘స్క్వాడ్’..
వాషింగ్టన్: అమెరికాలో నల్ల జాతీయులు, మైనారిటీల హక్కుల కోసం గళమెత్తుతూ అందరి దృష్టిని ఆకర్షించిన నలుగురు మహిళా పార్లమెంట్ సభ్యులు తాజా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు. ‘ద స్క్వాడ్’పేరిట వీరు అమెరికాలో ప్రసిద్ధిపొందారు. మిన్నెసొటా నుంచి ఇల్హానా ఒమర్, న్యూయార్క్ నుంచి అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్, మిషిగాన్‌లో రషీదా తలెయిబ్, మసాచుసెట్స్‌లో అయన్నా ప్రిస్లీ మళ్లీ గెలిచారు. వీరంతా మైనారిటీ, నల్లజాతి మహిళలే కావడం గమనార్హం. స్క్వాడ్ పోరాటం పలుమార్లు వివాదాలకు దారితీసింది. అంతేకాకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహాన్ని కూడా వారు చవి చూడాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో స్క్వాడ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇదే వారి విజయానికి కారణమని భావిస్తున్నారు. (చదవండి: సరిగ్గా వందేళ్ల క్రితం నవంబర్ 2న రాత్రి..) Our sisterhood is resilient. pic.twitter.com/IfLtsvLEdx — Ilhan Omar (@IlhanMN) November 4, 2020 -
నీరజ్ అనంతాని అరుదైన రికార్డు
వాషింగ్టన్: సెనేట్‌లోనూ హోరాహోరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన నీరజ్ అనంతాని (29) అరుదైన రికార్డు సృష్టించారు. ఒహాయో రాష్ట్రం నుంచి సెనేట్‌కు ఎన్నికైన తొలి భారతీయ సంతతి అభ్యర్థిగా రికార్డుల్లోకి ఎక్కారు. స్టేట్ రిప్రజెంటేటివ్‌గా వ్యవహరిస్తున్న నీరజ్ రిపబ్లికన్ పార్టీ తరఫున సెనేట్‌కు పోటీ చేశారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి మార్క్ ఫోగెల్‌పై విజయం సాధించారు. విజేతగా నిలిచిన తరువాత నీరజ్ మాట్లాడుతూ కేవలం 70 ఏళ్ల క్రితం మాత్రమే స్వాతంత్య్రం సాధించిన భారత్‌లో తన పూర్వీకులు బ్రిటిష్ ఏలుబడిలో జీవించారని, అటువంటి కుటుంబానికి చెందిన తాను సెనేటర్‌గా ఎన్నిక కావడం అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనమని వ్యాఖ్యానించారు. భారతీయ సంతతి సమూహం తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ( సెనేట్‌లోనూ హోరాహోరీ ) సెనేటర్‌గా గెలిపించిన ఓటర్లందరికి ధన్యవాదాలు తెలిపిన నీరజ్ వారి తరఫున స్టేట్‌హౌస్‌లో గళం వినిపిస్తానని హామీ ఇచ్చారు. రాజకీయ శాస్త్రం పట్టభద్రుడైన నీరజ్ 2014లో 23 ఏళ్ల వయసులోనే ఓహాయో స్టేట్ హౌస్‌కు ఎన్నికైఆ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగానూ రికార్డు సృష్టించారు. ‘‘స్టేట్ సెనేటర్‌గా ఓహాయో వాసులందరూ తమ అమెరికన్ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు నిత్యం శ్రమిస్తా’’అని నీరజ్ హామీ ఇచ్చారు. నీరజ్ తల్లిదండ్రులు 1987లో వాషింగ్టన్కు వలస వచ్చారు. ఆ తరువాత మయామీకి తమ నివాసాన్ని మార్చారు. -
అధ్యక్ష ఎన్నిక : గెలుపుపై ధీమాతో అభ్యర్థులు
-
సరిగ్గా వందేళ్ల క్రితం నవంబర్ 2న రాత్రి..
‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థి వారెన్ హార్డింగ్, డెమోక్రాట్ల అభ్యర్థి జేమ్స్ కోక్స్పై అఖండ విజయం సాధించారు’ అనే వార్త అమెరికా రేడియోలో మారు మ్రోగిపోయింది. అధ్యక్ష అభ్యర్థుల పేర్లు మారిపోయాయంటూ ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. సరిగ్గా వందేళ్ల క్రితం 1920, నవంబర్ 2వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు అమెరికాలోని తొలి వాణిజ్య బ్రాడ్ క్యాస్టింగ్ రేడియో స్టేషన్ ‘పిట్స్బర్గ్స్ కేడీకేఏ’ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. ఆ ఫలితాలతోనే తొట్ట తొలి రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. (చదవండి : అమెరికా అధ్యక్ష ఫలితాలపై ఎందుకు ఆసక్తి?) హైస్కూల్ చదువు కూడా పూర్తి చేయని ‘ఫ్రాంక్ కొనార్డ్’ అనే వ్యక్తి రేడియో సాంకేతిక పరిజ్ఞానంలో అనేక పేటెంట్లు సాధించారు. ఆయనే ఆ రోజున తన గ్యారేజీలో ఏర్పాటు చేసిన రేడియో స్టేషన్ ప్రసారాలను బటన్ తిప్పడం ద్వారా ప్రారంభించారు. ‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒహాయో నుంచి వెలువడుతున్న మారియన్ స్టార్ ఎడిటర్, పబ్లిషర్ వారెన్ హార్డింగ్ అఖండ విజయం సాధించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అనుసరించిన విధానాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిపోయింది. ఆ పర్యవసానంగానే డెమోక్రాట్ల అభ్యర్థి ఓడిపోవాల్సి వచ్చింది’ అంటూ ఫ్రాంక్ కొనార్డే వార్తను విశ్లేషించారు. ఆయన టెలిఫోన్ అమెరికా ఎన్నికల ఫలితాలను ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు తెప్పించుకున్నారు. (చదవండి : ‘ముందస్తు ఓటింగ్’తో నష్టమా, లాభమా?!) నాటి ఫలితాలను నవంబర్ రెండో తేదీ రాత్రి కొంత మంది శ్రోతలే తెలుసుకోగలిగారు. మిగతా అమెరికన్లు మరుసటి రోజు ఉదయం పత్రికలు వచ్చే వరకు ఫలితాల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ప్రముఖ వ్యాపార వేత్త జార్జి వెస్టింగౌజ్ పెట్టుబడులతో ఫ్రాంక్ కొనార్డ్ సాంకేతిక పరిజ్ఞానంతో అమెరికా తొలి లైసెన్స్ వాణిజ్య రేడియో కల నెరవేరింది. వాస్తవానికి 1890 దశకం నుంచి రేడియో సిగ్నల్స్‌పై ప్రయోగాలు మొదలయ్యాయి. దూర ప్రాంతానికి రేడియో సిగ్నల్స్ ప్రసారం చేసిన ఇంజనీర్ జీ. మార్కోనికి నోబెల్ బహుమతి లభించింది. 1910 కొంత మంది ఔత్యాహిక రేడియో ఆపరేటర్లు పరిమిత దూరం వరకు తమ గొంతును, సంగీతాన్ని ప్రసారం చేయగలిగారు. తొలితరంలో రాజకీయ నాయకులు ఎంతో ఉపయోగపడిన రేడియో మాధ్యమం, టీవీల రూపంలో, సోషల్ మీడియా రూపంలో మరెంతగానో అభివృద్ధి చెందింది. -
బైడెన్‌కే ‘లిటిల్ ఇండియా’ ఓట్లు
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో అత్యధికంగా భారతీయులు ఉంటారన్న విషయం తెల్సిందే. అందుకే దాన్ని ‘లిటిల్ ఇండియా’ అని వ్యవహరిస్తారు. ఎడ్సన్‌లోని జీపీ స్టీఫెన్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉదయం పది గంటల నుంచి 12 గంటలలోపే 200 ఓట్లు పడ్డాయి. సాయంత్రానికల్లా బ్యాలెట్ పత్రాలు అయిపోయాయన్న వార్త తెల్సింది. మునుపెన్నడు లేనంతగా అక్కడ పోలింగ్ జరిగింది. అక్కడే కాకుండా న్యూజెర్సీ అంతటా ముమ్మరంగా పోలింగ్ జరిగింది. భారతీయ అమెరికన్ ఓటర్లంతా ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొన్నారు. (అమెరికా అధ్యక్ష ఫలితాలపై ఎందుకు ఆసక్తి?) ‘గత ఎన్నికల వరకే నాకు ఓటు హక్కు వచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో నేను ఓటు వేయలేదు. ఈసారి కృతనిశ్చయంతో ఓటింగ్‌కు వచ్చానని అక్కడికెళ్లిన భారతీయ మీడియాతో నరేంద్ర కాంచీ అనే ఓటరు తెలిపారు. జో బైడెన్, కమలా హారిస్‌కే తాను ఓటేసినట్లు ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను కూడా వారికే ఓటు వేసినట్లు ఎడ్సన్ పోలింగ్ కేంద్రంలో పోల్ వర్కర్‌గా స్వచ్ఛందంగా సేవలందిస్తున్న కొలంబియా యూనివర్శిటీ విద్యార్థిని మిల్లీ తెలిపారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతి విద్వేషాలను రెచ్చ గొడుతున్నందున ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సి వచ్చిందని చెప్పారు. భారతీయులు శాంతియుత పరిస్థితులు కోరుకుంటున్నారని, తుపాకీ సంస్కృతిని కాదని బైడెన్‌కు ఓటేసిన గుజరాత్‌కు చెందిన 84 ఏళ్ల శారదాబెన్ పటేల్, ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. (‘ముందస్తు ఓటింగ్’తో నష్టమా, లాభమా?!) మొదటి సారి ఓటు హక్కు వచ్చిన జేపీ స్టీవెన్స్ కాలేజీ గ్రాడ్యువేట్ అలేఖ్య బంట్ల, 19 ఏళ్ల శ్రీనివాసన్ రామకష్ణన్ ఎవరికి ఓటేశారో మీడియాకు చెప్పడానికి సిగ్గు పడ్డారు. ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తే పన్నులు తగ్గిస్తారని తమ తల్లిదండ్రులు చెప్పడం వల్ల తాము ట్రంప్‌కు ఓటు వేసినట్లు కొత్త ఓటర్లను పదే పదే ప్రశ్నించగా చెప్పారు. బైడెన్‌కు ఓటేసిన భారతీయ అమెరికన్లు ఆ విషయాన్ని బహిరంగంగా చెబుతుండగా, ట్రంప్‌కు ఓటేసిన వారు బయటకు చెప్పలేక పోతున్నారు. ట్రంప్‌కు ఓటేశానంటే ఎక్కడ తిడతారోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఏదేమైన అక్కడి భారతీయ–అమెరికన్లలో ఎక్కువ మంది బైడెన్‌కే ఓటు వేసినట్లు చెప్పారు. (కుట్ర జరుగుతోంది, సుప్రీం కోర్టుకు వెళతాం: ట్రంప్) -
అమెరికా అధ్యక్ష ఫలితాలపై ఎందుకు ఆసక్తి?
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ఫలితాల కోసం అమెరికన్–భారతీయులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ప్రపంచ దేశాలు సాధారణంగా చూపే ఆసక్తి కాకుండా భారతీయ–అమెరికన్లు ఏమైన ప్రత్యేక ఆసక్తి ఉందా? ఉంటే ఎందుకు? భారత్‌పై దుందుడుకుగా దురాక్రమణకు దిగుతున్న చైనా పట్ల అమెరికా కఠినంగా వ్యవహరించాలని వారు కోవడం, భారత సంతతికి చెందిన కమలా హారిస్ డెమోక్రట్ల తరఫున అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయడం మరో కారణం. కమలా హారిస్ తల్లి భారతీయులు. ఆమె 1950లోనే భారత్ నుంచి అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. (‘ముందస్తు ఓటింగ్’తో నష్టమా, లాభమా?!) మరో నాలుగేళ్ల తర్వాత అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రట్ల తరఫున పోటీచేసే అవకాశం ఉండడం వల్ల కూడా ఆమె ఈ ఉపాధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలని అమెరికన్–భారతీయులు కోరుకుంటున్నారు. గడిచిన దశాబ్దాల్లోలాగా కాకుండా రాజకీయంగా తమ ప్రాథమ్యాలివి అని చెప్పడానికి వారు ఈసారి ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి అమెరికా ఎన్నికల కోసం, ముఖ్యంగా కమలా హారిస్ కోసం వారు భారీ ఎత్తున విరాళాలు సేకరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమకు నిర్ణయాత్రక పాత్ర ఉండాలని, తద్వారా భారత్–అమెరికా మధ్యన వారు సత్సంబంధాలను ఆశిస్తున్నారు. (కమలా హారిస్ పట్ల వారికి ఎందుకు కోపం?) సాధారణంగా ఒక్క భారతీయులే కాకుండా ఆసియాకు చెందిన అమెరికన్లు సంప్రదాయబద్ధంగా రిపబ్లికన్లకే ఓటు వేస్తారు. అయితే వలసదారుల వీసాల పట్ల డొనాల్డ్ ట్రంప్ వైఖరి కఠినంగా ఉండడంతో వారంతా ఈసారి డెమోక్రట్ల అభ్యర్థిగా పోటీ చేసిన జో బైడెన్ విజయాన్నే కోరుకుంటున్నారు. ఎబీసీ న్యూస్, ఏబీసీ న్యూస్, పీబీఎస్ న్యూస్ అవర్, యూట్యూబ్ ద్వారా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రసారం చేస్తున్నాయి. అల్ జజీరా ఇంగ్లీష్ ఛానల్ కూడా ఫలితాలపై అంతర్జాతీయ విశ్లేషణలు ఇస్తోంది. (అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వివాదాలెన్నో!) -
‘ముందస్తు ఓటింగ్’తో నష్టమా, లాభమా?!
అమెరికా అధ్యక్ష పదవికి అధికారికంగా మంగళవారం జరిగిన ఎన్నికలకు ముందే దాదాపు పది కోట్ల మంది అమెరికా పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో మూడింట రెండొంతల మంది ఓటర్లు ఓటు వేయడానికి పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకోగా ఒక వంతు మంది ఓటర్లు భౌతికంగా ముందస్తు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటింగ్‌లో పాల్గొన్నారు. అమెరికా తరహాలో ముందస్తు పోలింగ్‌ను అమలు చేస్తున్న అన్ని దేశాల నుంచి సానుకూల వార్తలే వస్తున్నాయి. ఒక్క రోజే పోలింగ్‌ను నిర్వహించడం వల్ల పోలింగ్ కేంద్రాలు జనంతో కిక్కిరిసి పోతున్నాయి. ప్రాణాంతక కరోనా వైరస్ విజంభిస్తున్న నేటి పరిస్థితుల్లో ఇలా ముందస్తు పోలింగ్‌ను అనుమతించడం ఎంతైనా సమంజసమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. (ట్రంప్ సంచలన కామెంట్లు: ట్వీట్ తొలగింపు) న్యూజిలాండ్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో 56.7 శాతం ముందస్తు ఓటింగ్ జరిగింది. అదే 2017లో నిర్వహించిన ఎన్నికల్లో 48 శాతం ముందస్తు ఓటింగ్ జరగ్గా, ఈసారి మరింతగా పెరిగింది. కరోనా వైరస్ కారణంగా ఈ ఓటింగ్ పెరిగిందని భావించవచ్చుగానీ 2011 ఎన్నికల్లో అధికారిక పోలింగ్‌కు ముందు కేవలం 14.7 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. 2013లో ఆస్ట్రేలియాకు జరిగిన ఎన్నికల్లో 26.4 శాతం మంది ముందస్తు ఓటింగ్‌లో పాల్గొనగా, 2019లో జరిగిన ఎన్నికల్లో 40.1 శాతం మంది ముందస్తు ఓటింగ్‌లో పాల్గొన్నారు. (ఈ ఎన్నికల్లో మేం గెలుస్తాం : జో బైడెన్) అమెరికాకు 2000 సంవత్సరం నుంచి 2016 వరకు జరిగిన అయిదు ఎన్నికల్లో వరుసగా 16, 22, 30.6, 31.6, 33.6 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును ముందుగానే ఉపయోగించుకున్నారు. ముందస్తు ఓటింగ్ సదుపాయం వల్ల అత్యవసర పనులు కూడా మానుకొని ఓటింగ్‌లో పాల్గొనాల్సి రావడం, పోలింగ్ కేంద్రాల వద్ద గంటల కొద్ది బారులు తీరి క్యూల్లో నిలబడాల్సి రావడం లాంటి సమస్యలు తప్పిపోవచ్చుగానీ, ముందస్తు ఓటింగ్ వల్ల సమస్యలంటూ లేకపోలేదు. అభ్యర్థుల చర్చా గోష్ఠుల్లో వారి చెప్పే అంశాలను అర్థం చేసుకొని వారి పట్ల ఓ అభిప్రాయానికి రావడం కుదరదు. హోరా హోరీ ఎన్నికల పోరులో అభ్యర్థులకు సంబంధించి కొన్ని కీలక అంశాలు చివరి నిమిషంలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కొందరు అభ్యర్థులు చివరి నిమిషంలో ఎన్నికలకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలను చివరి నిమిషంలో కుమ్మరిస్తారు. ముందస్తు ఓటింగ్ వల్ల అలాంటి పరిణామాలు తెలుసుకొనే అవకాశం ఓటర్లు కోల్పోతారు. కొంత మంది ఓటర్లు చివరి నిమిషం వరకు తమ ఓటు విషయంలో ఓ నిర్ణయానికి రాలేరు. అలాంటి వారికి ఇది ఇబ్బంది. కొన్ని దేశాల్లో పార్లమెంట్ ఎన్నికల అనంతరం జాతీయ నిరుద్యోగం జాబితాలు వెలువడ్డాయి. అలాంటి సమయాల్లో వాటిని సమీక్షించి ఓటువేసే అవకాశాలను కొల్పోవాల్సి వస్తుంది. ముందస్తు ఓటింగ్‌ను అనుమతించడం వల్ల ఎన్నికల ఖర్చు పెరగుతుంది. (అమెరికా ఓటర్ ‘స్వింగ్’ ఎటు?) ముందస్తు ఓటింగ్ వల్ల పోలింగ్ శాతం పెరగుతుందని చాలా మంది భావిస్తారు. కానీ అది అబద్ధమని ‘విస్కాన్సిన్ యూనివర్శిటీ’ 2013లో నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ముందస్తు ఓటింగ్‌ను అనుమతించడం వల్ల ప్రస్తుతం ఏ దేశంలోనైనా 50 శాతం నుంచి 70 శాతం వరకు ఓటింగ్ అధికారిక పోలింగ్ తేదీకీ ముందే జరిగిపోతుంది. ఆ 30 శాతం పోలింగే సరిగ్గా జరగడం లేదని అధ్యయనంలో తేలింది. ఓటు చేయడానికి చాలా రోజులుందిలే అని భావించి ఓటు వినియోగాన్ని వాయిదా వేస్తూ వచ్చే వారు, చివరి నిమిషంలో ఏదో కారణంగా పోలింగ్‌లో పాల్గొనకపోవడం, అధికారిక పోలింగ్ రోజుకు తక్కువ మంది ఓటర్లు మిగిలిపోవడం వల్ల ఆ పోలింగ్ రోజు పట్ల అంతగా ఆసక్తి లేకపోవడం, ఓటు వేయడం వల్ల ఒరిగేదేముందిలే అనుకునే వారి వల్ల పోలింగ్ శాతం తగ్గుతోందట. (అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వివాదాలెన్నో!) రాజకీయ ప్రాతినిథ్యంలేని ప్రజా వర్గాలు కూడా ఓటింగ్ పట్ల ఆసక్తి చూపడం లేదని, వారిని నయానో, భయానో పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లాల్సి అవసరం లేక పోవడం వల్ల కూడా పోలింగ్ తగ్గుతోందట. ‘అప్లైడ్ ఎకనామిక్స్’ ప్రచురించిన పరిశోధనా పత్రం, యూనివర్శిటీ ఆఫ్ మేరీలాండ్, యూనివర్శిటీ ఆష్ క్వీన్స్లాండ్ ఈ ఏడాదిలో నిర్వహించిన సర్వే ప్రకారం ముందస్తు ఓటింగ్‌ను అనుమతించడం వల్ల 0.22 పాయింట్ల అదనపు ఓటింగ్ పెరిగింది. మహిళలు, వృద్ధులు, గర్బవతులు, కార్మికులకు ఈ ఓటింగ్ అనుకూలంగా ఉందట. ఈ సారి అమెరికా ముందస్తు ఓటింగ్‌లో పాల్గొన ప్రతి ఐదుగురిలో ఒకరు గత ఎన్నికల్లో పాల్గొనలేదని, దీన్నిబట్టి ఓటర్లలో భిన్నమైన గ్రూప్‌ను ఈ ముందస్తు ఎన్నికలు ఆకర్షిస్తున్నాయని ‘వాషింగ్టన్ పోస్ట్’ కాలమిస్ట్ గ్రెగ్ సార్జంట్ పేర్కొన్నారు. ముందస్తు ఓటింగ్ అమెరికాలో డెమోక్రట్లు కలసి వస్తుండగా, ఆస్ట్రేలియాలో ఉదారవాద జాతీయ కూటమికి అనుకూలిస్తోంది. ‘ఎలక్షన్ లా జనరల్ : రూల్స్, పాలిటిక్స్ అండ్ పాలసీ’లో ప్రచురించిన ఓ వ్యాసం ప్రకారం పలు దేశాల్లో నాలుగు రకాల ముందస్తు ఎన్నికలను అమలు చేస్తున్నారు. కెనడాలో కొన్ని రోజుల ముందు నుంచి, ఫిన్లాండ్ వారం రోజుల ముందు నుంచి, జర్మనీలో ఆన్‌డిమాండ్ పోస్టల్ ఓటింగ్, స్విడ్జర్లాండ్‌లో ఆటోమేటిక్ పోస్టల్ ఓటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దాదాపు వంద కోట్ల మంది ఓటర్లను కలిగిన భారత దేశంలో ముందస్తు ఓటింగ్‌ను అమలు చేయడం కష్టం. పోలింగ్ కేంద్రాల ఆక్రమణ, రిగ్గింగ్‌లు జరిగే భారత్‌లో ఓటర్లకు స్వేచ్ఛాయుత వాతావరణం లేదని చెప్పవచ్చు. -
అమెరికా ఎన్నికలు: మూడో సారి గెలిచిన రాజా కృష్ణమూర్తి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి వరుసగా మూడో సారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. వివరాలు.. డెమొక్రాటిక్ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి మూడో సారి విజయం సాధించారు. ఢిల్లీలో జన్మించిన కృష్ణమూర్తి ప్రత్యర్థిప్రెస్టన్ నెల్సన్‌పై విజయం సాధించారు. 71 శాతం ఓట్లతో గెలుపొందారు. కృష్ణమూర్తి 2016లో తొలిసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఈయన తల్లిదండ్రులు తమిళనాడుకు చెందినవారు. (ట్రంప్ సంచలన కామెంట్లు: ట్వీట్ తొలగింపు ) మరో భారత సంతతి వ్యక్తి అమి బెరా కాలిఫోర్నియా నుంచి వరుసగా ఐదో సారి విజయం సాధించాలని ఆశిస్తున్నారు. అలానే మరో ఇండియన్ అమెరికన్ ఆర్ఓ ఖన్నా కూడా కాలిఫోర్నియా నుంచి మూడో సారి ప్రతినిధుల సభకు ఎన్నికవ్వాలని కోరుకుంటున్నారు. వీరిద్దరితో పాటు మరో ఇండో అమెరికన్ ప్రమిలా జయపాల్ కూడా వాషింగ్టన్ నుంచి మూడోసారి గెలుపొందాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియా, వాషింగ్టన్ రాష్ట్రాల్లో ఓటింగ్ కొనసాగుతుంది. త్వరలోనే పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. -
కుట్ర జరుగుతోంది, సుప్రీం కోర్టుకు వెళతాం: ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కోట్లాది అమెరికన్లకు నా ధన్యవాదాలు. ఎన్నికల్లో గెలవబోతున్నాం, భారీగా సంబరాలు చేసుకుంటాం. ఫ్లోరిడాలో ఓడిపోతామనుకున్నాం, కానీ, భారీ విజయం దక్కింది. కోట్లాది మంది ఉన్న టెక్సాస్‌లో మనం గెలిచాం. పెన్సిల్వేనియాలో మనం ఘన విజయం సాధిస్తున్నాం. మిషిగాన్‌లోనూ ఆధిక్యంలో ఉన్నాం, గెలుస్తాం. జార్జియాలోనూ ఊహించని విజయం దక్కబోతోంది. ( ట్రంప్ సంచలన కామెంట్లు: ట్వీట్ తొలగింపు ) ఈ విజయం ఎవరూ ఊహించలేనిది. చివరి క్షణంలో ఓట్ల లెక్కింపులో మోసం చేయటానికి కుట్ర చేస్తున్నారు. ఉదయం నాలుగు గంటల తర్వాత ఓట్ల లెక్కింపును ఆపాలి. దీని కోసం మేము సుప్రీం కోర్టుకు వెళతాం’’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పటివరకు జో బైడెన్ 236, డొనాల్డ్ ట్రంప్ 213 ఎలక్టోరల్ ఓట్లు గెలుపొందారు. -
ట్రంప్ సంచలన కామెంట్లు: ట్వీట్ తొలగింపు
వాషింగ్టన్ : అమెరికా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అభ్యర్థులిద్దరి మధ్యా గట్టి పోటీ నడుస్తోంది. విజయంపై ఇరు పక్షాలు ధీమాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీడియా సమావేశాలు, ప్రకటనలు సైతం చేస్తున్నారు. డెమొక్రాటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ మీడియా ముందుకు రాకపోయినా ట్విటర్ వేదికగా కామెంట్లు చేస్తున్నారు. భారీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ( ఈ ఎన్నికల్లో మేం గెలుస్తాం : జో బైడెన్ ) అంతేకాకుండా ‘‘ భారీ విజయం దిశగా ఉన్నాం. వాళ్లు ఎన్నికల్లో మోసం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. అలా జరగనివ్వం. పోలింగ్ అయిపోయిన తర్వాత ఓట్లు వేయటానికి ఒప్పుకోం!’’ అంటూ సంచలన కామెంట్లు చేశారు. ఈ ట్వీట్లోని వ్యాఖ్యలు ఎన్నికల్ని తప్పుదోవపట్టించేవిగా ఉన్నాయంటూ ట్విటర్ దాన్ని తొలగించింది. కాగా, ఇప్పటివరకు జో బైడెన్ 224, డొనాల్డ్ ట్రంప్ 213 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. We are up BIG, but they are trying to STEAL the Election. We will never let them do it. Votes cannot be cast after the Polls are closed! — Donald J. Trump (@realDonaldTrump) November 4, 2020 -
ట్రంపే ఫెవరేట్ అంటున్న బెట్టింగ్ మార్కెట్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ల మధ్య హోరాహోరి పోరు నడుస్తుంది. గద్దెనెక్కెదేవరో.. ఇంటికి వెళ్లేది ఎవరో మరి కాసేపట్లో తేలనుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ట్రంప్‌కు అనుకూలంగా బెట్టింగ్ మార్కెట్లలో పందాలు కాస్తున్నారట. న్యూజిలాండ్‌కు చెందిన ప్రిడిక్షన్స్ మార్కెట్ డొనాల్డ్ ట్రంప్, బైడెన్ కంటే అధిక్యంలో ఉన్నారని తెలిపింది. కొద్ది సేపటికే న్యూజిలాండ్ ప్రిడిక్ట్ వెబ్‌సైట్‌కు అంతరాయం కలిగింది. దాంతో సదరు వెబ్సైట్ వీలైనంత త్వరగా సేవలను తిరిగి పప్రారంభించడానికి" కృషి చేస్తున్నట్లు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అయితే అంతరాయానికి గల కారణాలు మాత్రం తెలపలేదు. ఇదిలా ఉండగా బ్రిటిష్ బెట్టింగ్ ఎక్స్ఛేంజ్ బెట్‌ఫెయిర్ ట్రంప్ గెలిచే అవకాశం 75 శాతం ఉందని తెలిపింది. అయితే మంగళవారం ఉదయం ఎన్నికలు ప్రారంభమైనప్పుడు ట్రంప్ గెలిచే అవకాశం 39శాతంగా ఇచ్చింది. అది క్రమంగా పెరిగి ప్రస్తుతం 75శాతానికి చేరింది. ఇక బైడెన్ విషయానికి వస్తే తొలుత 61శాతం ఇవ్వగా ప్రస్తుతం అది 25 శాతానికి పడిపోయింది. ఉదయం 10.30 గంటల నాటికి, జో బైడెన్ వైట్ హౌస్ పోటీలో 200 కి పైగా ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ట్రంప్ 118 ఎన్నికల ఓట్లను సాధించారు. అమెరికా అధ్యక్ష పదవిని గెలుచుకోవడానికి ఒక అభ్యర్థికి 270 ఓట్లు అవసరం. "ట్రంప్, బిడెన్‌ను గణనీయంగా అధిగమించాడు. ఇప్పుడు మంచి పొజిషన్లోఉన్నాడు" అని బెట్‌ఫెయిర్ ప్రతినిధి సామ్ రోస్బోట్టమ్ అన్నారు. బ్రిటన్ ఆధారిత స్మార్కెట్స్ ఎక్స్ఛేంజ్ ట్రంప్ మరోసారి గెలవడానికి 55శాతం అవకాశం ఉందని తెలిపింది. కాగా పోల్స్ ప్రారంభమైనప్పుడు ఇది 39 శాతంగా ఉండటం గమనార్హం. స్మార్కెట్లలో బైడెన్ విజయావకాశాలు 61శాతం నుంచి 45 శాతానికి పడిపోయాయి. (చదవండి: ట్రంప్‌కి గట్టి పోటీ ఇస్తున్న కమల) "క్యూబా జనాభా అధికంగా ఉన్న మయామి-డేడ్ కౌంటీలో డొనాల్డ్ ట్రంప్ చాలా బలంగా ఉన్నారు. కీలకమైన స్వింగ్ స్టేట్ ఫ్లోరిడాలో ట్రంప్ విజయానికి ఇది ప్రధాన కారణం" అని స్మార్కెట్స్లోని రాజకీయ విశ్లేషకుడు పాట్రిక్ ఫ్లిన్ అన్నారు. అంతేకాక ఫ్లోరిడా మొదటి నుంచి ట్రంప్‌కే అనుకూలంగా ఉందని తెలిపారు. కీలకమైన పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాలలో బైడెన్ తన అధిక్యాన్ని ప్రదర్శించగలిగితే.. అతను ఎన్నికల్లో విజయం సాధిస్తాడు అని తెలిపారు. -
ఈ ఎన్నికల్లో మేం గెలుస్తాం : జో బైడెన్
న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అధ్యక్ష అభ్యర్థుల మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది. మరి కొన్ని గంటల్లో ఎన్నికల కౌంటింగ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో డెమొక్రాటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల్లో మేం గెలుస్తాం’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. కీలక రాష్ట్రాల్లో డెమొక్రాట్లు ఇప్పటికే గెలిచారని తెలిపారు. మిషిగాన్, విస్కాన్సిన్‌లోనూ తామే గెలుస్తామన్నారు. రిపబ్లిక్ పార్టీ ఆధిక్యతలు తగ్గిపోతాయన్నారు. మెట్రోలు, పట్టణాల్లో తమకు భారీగా ఓట్లున్నాయన్నారు. ప్రచారానికి సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. డెమొక్రాట్లు ఆశాభావంతో ఉండాలని, తామే గెలువబోతున్నామని పేర్కొన్నారు. ( అమెరికా ఎన్నికలు; జూనియర్ ట్రంప్ కలకలం ) కాగా, ఇప్పటివరకు బైడెన్ 237, ట్రంప్ 210 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. బైడెన్ ఆధిక్యంలో ఉన్నప్పటికి పెద్ద రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ కొనసాగితే ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువ. 288 ఎలక్టోరల్ ఓట్లు సాధించే దిశగా ట్రంప్ అడుగులు ముందుకు వేస్తున్నారు. ( అమెరికా ఎన్నికలు: మరోసారి అధ్యక్ష పీఠం దిశగా ట్రంప్ ) -
అమెరికా ఎన్నికలు; జూనియర్ ట్రంప్ కలకలం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఒట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో జో బైడెన్ ముందంజలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. దీనిపై మన దేశంలోని విపక్షాలు మండి పడుతున్నాయి. ట్రంప్ తన బుద్ది చూపించుకున్నారు. మనం స్నేహ హస్తం అందిస్తే.. వారు మనల్ని అవమానించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. మంగళవారం డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఓ వరల్డ్ మ్యాప్‌ని ట్వీట్ చేశారు. దీనిలో దాదాపు అన్ని దేశాలను రిపబ్లికన్ పార్టీ కలర్ అయిన ఎరుపు రంగులో చూపించారు. అంటే ఈ దేశాలన్ని తన తండ్రి విజయం సాధిస్తాడని నమమ్ముతున్నాయి.. ఆయనకే ఓటు వేస్తాయి అనే ఉద్దేశంతో ఇలా ఎరుపు రంగులో చూపించారు. ఇక ఇండియా, చైనా, లైబేరియా, మెక్సికో వంటి దేశాలను మాత్రం డెమొక్రాట్ పార్టీ రంగు బ్లూ కలర్లో చూపించారు. ఈ దేశాలన్ని జో బైడెన్‌కు మద్దతుదారులని.. ఆయనకే ఓటు వేస్తాయని తెలిపారు. అలానే అమెరికాలోని కాలిఫోర్నియా, మేరీల్యాండ్ వంటి రాష్ట్రాలను కూడా నీలం వర్ణంలోనే చూపించారు. ఒకే చివరకు నా ఎన్నికల మ్యాప్ అంచనా ఇలా ఉంది అంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఈ ట్వీట్లో అతడు జమ్ము కశ్మీర్, లద్దాఖ్, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలను ఎరుపు రంగులో చూపించాడు. అది కాస్తా వివాదాస్పదంగా మారింది. దీనిపై విపక్షాలు మండి పడితున్నాయి. (చదవండి: ట్రంప్ గెలిస్తే అతనికి 112 కోట్లు) Okay, finally got around to making my electoral map prediction. #2020Election #VOTE pic.twitter.com/STmDSuQTMb — Donald Trump Jr. (@DonaldJTrumpJr) November 3, 2020 మనం స్నేహితుడని భావిస్తే.. ట్రంప్ బుద్ధి చూపించాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ట్వీట్‌పై స్పందించారు. ‘సీనియర్ ట్రంప్‌తో మనకు ఎంతో స్నేహం. ఇక జూనియర్ ట్రంప్ ఇండియాని జో బైడెన్, కమలా హారిస్ మద్దుతుదారుగా చూపించారు. ఆశ్చర్యం ఏంటంటే.. జమ్ము కశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు మాత్రమే ట్రంప్‌కి ఓటు వేస్తాయని వెల్లడించారు. ఎవరైనా అతడి కలర్ పెన్సిల్ని లాక్కొండి’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. So much for the friendship with Trump Senior. Junior has placed India firmly with @JoeBiden & @KamalaHarris though interestingly Jr. believes J&K & the NorthEast go against the rest of India & will vote Trump. Someone needs to take his colouring pencils away. https://t.co/AqVyX4ixdl — Omar Abdullah (@OmarAbdullah) November 3, 2020 అలానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయుకుడు శశి థరూర్ కూడా జూనియర్ ట్వీట్‌పై స్పందించారు. ‘నమో బ్రొమాన్స్‌కు దక్కిన బహుమతి ఇది. డాన్ జూనియర్ భారత్‌లోని జమ్ము కశ్మీర్, ఈశాన్య ప్రాంతాలను చైనా, మెక్సికో వంటి శత్రువులు, మురికి ప్రదేశాలతో కలిపారు. సెరినేడింగ్ ఈవెంట్ల కోసం కోట్లు ఖర్చు చేసినందుకు దక్కిన ఫలితం ఇది’ అన్నారు. (చదవండి: అమెరికా అధ్యక్షులెవరో తేలకపోవచ్చు!) The price of Namo’s bromance: Kashmir & the NorthEast cut off from the rest of India, &the whole “filthy" place relegated by Don Jr to the realm of hostiles, along with China&Mexico. So much for the crores spent on obsequious serenading stadium events! https://t.co/fsI53aSkpv — Shashi Tharoor (@ShashiTharoor) November 3, 2020 మరోవైపు భారతదేశానికి మాజీ పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఈ మ్యాప్‌ని "ప్రోత్సాహకరంగా"ఉంది అంటూ ప్రశంసించారు. "మంచిది. జమ్మూ కాశ్మీర్‌ని పాకిస్తాన్లో భాగంగా చూపించారు. చాలా ప్రోత్సాహకరంగా ఉంది" అంటూ ట్వీట్ చేశారు. Good. Jammu and Kashmir is shown as part of Pakistan. Very encouraging. https://t.co/cAwqYniOct — Abdul Basit (@abasitpak1) November 3, 2020 -
అమెరికా ఎన్నికలు: వాషింగ్టన్ డీసీలో బైడెన్ క్లీన్‌స్వీప్
4:35 : వాషింగ్టన్ డీసీలో బైడెన్ క్లీన్‌స్వీప్ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో బైడెన్ క్లీన్‌స్వీప్ చేశాడు. అక్కడ బైడెన్‌కు 93 శాతం పాపులర్ ఓట్లు రాగా, ట్రంప్‌కు కేవలం 5.6 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 11 : 50 : భారీ విజయం సాధిస్తాం: ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము భారీ విజయాన్ని సాధిస్తామని అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రాత్రి మీడియా ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ట్విటర్ వేదికగా స్పందించారు. I will be making a statement tonight. A big WIN! — Donald J. Trump (@realDonaldTrump) November 4, 2020 10: 55 : మరోసారి అధ్యక్ష పీఠం దిశగా ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పీఠం దిశగా ట్రంప్ దూసుకుపోతున్నారు. పెద్ద రాష్ట్రాల్లో ఆయన ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ కొనసాగితే ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువ. 288 ఎలక్టోరల్ ఓట్లు సాధించే దిశగా ట్రంప్ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటి వరకు బైడెన్ 227.. ట్రంప్ 204 ఓట్లు సాధించారు. అయితే పెద్ద రాష్ట్రాల్లో ఆధిక్యం ట్రంప్‌నకు కొండంత బలంగా మారింది. 10 : 30 : బైడెన్ ఆధిక్యం.. ట్రంప్‌నకు అవకాశం! బైడెన్ విజయానికి మరింత చేరువయ్యారు. ఇప్పటివరకు 213 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్ ఆయన బాగా కలిసొచ్చాయి. ట్రంప్ సొంతం రాష్ట్రంలోనూ బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. అయితే ట్రంప్ 118 ఓట్లు సాధించినప్పటికి కాలిఫోర్నియా మినహా మిగిలిన పెద్ద రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. టెక్సాస్(38), ఫ్లోరిడా(29), పెన్సిల్వేనియా(20) ఒహియో(18), మిషిగాన్(16), జార్జియా(16)లలో ట్రంప్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. స్వింగ్ రాష్ట్రాల్లోనూ ట్రంప్ హవా కొనసాగుతోంది. ఫ్లోరిడా(29)లో 4%, జార్జియా (16)లో 8%, మిషిగాన్ (16)లో 9%, ఒహియో (18)లో 8%, పెన్సిల్వేనియా (20)లో 15% ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడున్న ట్రెండింగ్ కొనసాగితే ట్రంప్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. 9: 30 : విజయానికి చేరువలో బైడెన్ డెమొక్రాటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్.. ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు అందనంత దూరంలో.. విజయానికి చేరువలో ఉన్నారు. ఇప్పటి వరకు బైడెన్‌కు 209 ఎలక్టోరల్ ఓట్లు రాగా, ట్రంప్‌నకు 112 ఓట్లు మాత్రమే వచ్చాయి. బైడెన్ మ్యాజిక్ ఫిగర్ అందుకోవటానికి ఇంకా 61 ఓట్లు మాత్రమే కావాల్సి ఉంది. 9: 00 : ముందుకు దూసుకు వస్తున్న ట్రంప్ ట్రంప్ నెమ్మదిగా ముందుకు దూసుకు వస్తున్నారు. 9 గంటల సమయానికి 108 ఎలక్టోరల్ ఓట్లను ఆయన దక్కించుకున్నారు. బైడెన్ 131 వద్దే నిలబడిపోయారు. ఇప్పటి వరకు ట్రంప్ 16 రాష్ట్రాల్లో విజయం సాధించగా.. బైడెన్ 13 రాష్ట్రాల్లో విజయం సాధించారు. 8:00 : బైడెన్ ఖాతాలోకి కొలరాడో, ఇల్లినోయ్, న్యూమెక్సికో బైడెన్ మరింత దూకుడు మీదున్నారు. ఇప్పటివరకు 131 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు. ఇక ట్రంప్ 92 వద్దే నిలబడిపోయారు. బైడెన్ ఖాతాలోకి కొలరాడో, ఇల్లినోయ్, న్యూమెక్సికోలు వచ్చి చేరాయి. నెబ్రాస్కా, వయోమింగ్, ఆర్కాన్సా, కాన్సాస్, ఒహాయోలలో ట్రంప్ విజయం సాధించారు. 7: 30 : చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్ అమెరికన్ ముస్లిం ఎన్నికల్లో విజయం సాధించి, వర్జీనియా స్టేట్ సెనేట్‌కు ఎన్నికవనున్న మొదటి ఇండియన్ అమెరికన్ ముస్లింగా గజాలా హస్మి చరిత్ర సృష్టించారు. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హస్మి ప్రత్యర్థి గ్లెన్ స్టర్టెవెంట్పై వర్జీనియా, పదవ సెనేట్ డిస్ట్రిక్ట్ నుంచి ఆమె విజయం సాధించారు. హస్మితో పాటు మరికొంత మంది ఇండియన అమెరికన్లు సుహాస్ సుబ్రమణ్యం, రాజు, డింపుల్ అజ్మెరా ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. 7: 00 : అమెరికా ఎన్నికలు: ట్రంప్ ఆశలు గల్లంతు! అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఆశలు గల్లంతు చేస్తూ జో బైడెన్ దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు బైడెన్‌కు 119, ట్రంప్‌కు 92 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. పెద్ద రాష్ట్రాల్లో బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. పెన్సిల్వేనియా, వెర్మాంట్, న్యూజెర్సీ, మేరీల్యాండ్, డెలావేర్, రోడ్‌ఐలాండ్‌లో బైడెన్ విజయం సాధించటంతో పాటు టెక్సాస్, కాన్సాస్, మిస్సోరీలలో ముందంజలో ఉన్నారు. ఇక ఇండియానా, ఓక్లహోమా, కెంటకీ, వర్జీనియా, సౌత్ కరోలినాలో ట్రంప్ విజయం సాధించారు. ఫ్లోరిడా, జార్జియాలలో ముందంజలో ఉన్నారు. ( అమెరికా ఓటర్ ‘స్వింగ్’ ఎటు?) కాగా, అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాల్లో కలిపి 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. 270 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్న వారికి అధ్యక్ష పీఠం దక్కనుంది. ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రాలదే కీలక పాత్ర. ఎక్కువ ఓట్లు వచ్చినవారికే ఆ రాష్ట్రంలోని మొత్తం ఎలక్టోరల్ ఓట్లు వస్తాయి. కాలిఫోర్నియా-55, టెక్సాస్-38, న్యూయార్క్-29, ఫ్లోరిడా-29, పెన్సిల్వేనియా-20, ఇల్లినోయ్-20 ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రాలు. 10 కంటే తక్కువ ఎలక్టోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రాలు -30 ఉన్నాయి. -
ట్రంప్‌కి గట్టి పోటీ ఇస్తున్న కమల
ఆడవాళ్లతో మాటల్లో గానీ, పోటీల్లో గానీ గెలవలేక పోతున్న క్షీణదశలో మగాళ్ల దగ్గర ఉండే ఆఖరి అస్త్రాన్నే ట్రంప్ తన అమ్ముల పొది నుంచి తీశారు. కమలా హ్యారిస్ పై సంధించారు. ‘‘ఏమిటంత పగలబడి నవ్వుతుంది ఆమె! నిన్న టీవీలో చూశాను. మనిషిలో ఏదో తేడా ఉంది. ఇంటర్వూ్యలో సీరియస్ క్వశ్చన్స్ కి కూడా పెద్దగా నవ్వుతోంది!’’ అని పెన్సిల్వేనియా ర్యాలీలో కమలను విమర్శించారు ట్రంప్. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కమల అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా గెలిచే అవకాశాలు మెరుగవుతున్నాయి. అంటే.. ట్రంప్ విజయావకాశాలు సన్నగిల్లడం. అమెరికా అధ్యక్ష పదవి కోసం ట్రంప్‌పై పోటీ పడుతున్న జో బైడెన్ రన్నింగ్ మేట్ (ఉపాధ్యక్ష అభ్యర్థి) కమలా హ్యారిస్. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ట్రంప్‌కి గట్టి పోటీ ఇస్తున్నారు కమల. అక్కడ గెలిచి తీరితేనే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యే ఛాన్స్ ఉంటుంది. గత ఎన్నికల్లో (2016) కూడా పెన్సిల్వేనియాలో ట్రంప్ కనాకష్టంగా కన్ను లొట్టతో గట్టెక్కారు. ఇప్పుడు కమల అడ్డుపడుతున్నారు. ‘‘ఎవరైనా ఆ 60 నిముషాల షో చూశారా?! ఆమె నవ్వు చూశారా హా హా. దటీజ్ సో ఫన్నీ. హా హా హా. నవ్వుతూనే ఉంది. నవ్వుతూనే ఉంది. వెర్రి నవ్వు. సంథింగ్ రాంగ్ విత్ హర్‘ అని కమల నవ్వును ఎన్నికల ప్రచారంలో అనుకరించారు ట్రంప్. ఇంటర్వూ్యలో జర్నలిస్ట్ నోరా వొడానెల్ కమలా హ్యారిస్‌ను సీరియస్ ప్రశ్నలు అడిగిన మాట వాస్తవమే కానీ, సీరియస్‌గా ఏమీ అడగలేదు. పైగా ఆమె మహిళ. ఈమె మహిళ. ఆమె ప్రశ్నలకు కమల పెద్దగా నవ్వడం ఎందుకంటే.. ‘ఐ నో. బట్ యు టెల్ మీ’ అన్నట్లు అడిగిన విధానానికి. ట్రంప్‌కి అది అర్థం కాకుండా ఏమీ ఉండదు. పై చేయిగా ఉన్న మహిళను కించపరచడానికి ఆమె క్యారెక్టర్ మీద దెబ్బకొట్టడం, ఆమె మేనరిజమ్స్‌ని అనుకరించడం పురుషుడి స్వభావంలో ఉన్నదే. ట్రంప్ లో కాస్త ఎక్కువ మోతాదులో ఉన్నట్లుంది. -
97 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా..
మీరు కనుక అపూర్వమైన వాటిని సేకరించి దాచుకునే ఒక చక్కటి అభిరుచిని కలిగి ఉన్నవారైతే, ఇప్పటికే మార్కెట్లో ఉన్న నవంబర్ రెండు TIME వార పత్రికను 250 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయవచ్చు. టైమ్ 97 ఏళ్ల చరిత్రలోనే తొలిసారి TIME అనే పేరుతో రాని టైమ్ సంచిక అది! బహుశా ఇలాంటిది ప్రపంచ పత్రికా చరిత్రలోనే ఒక విశేషం. TIMEలోని IM అనే మధ్య లెటర్స్ ని తొలగించి, ఈ చివర్న ఉన్న Tని ఆ చివర్న ఉన్న E పక్కకు జరిపి, ఎడమవైపున ఖాళీ అయిన రెండు స్థానాలలో VO అనే లెటర్స్ పెట్టి VOTE అనే పేరుతో తాజా సంచికను మార్కెట్ లోకి విడుదల చేశారు! టైమ్ తన ఐడెంటిటీని కోల్పోవడమే ఇది. తను కోల్పోవడం ద్వారా యూఎస్‌కి ఈ అధ్యక్ష ఎన్నికలు ఎంత కీలకమైనవో చెప్పాలని టైమ్ భావించినట్లుంది. ముఖచిత్రంపై ఒక మహిళ.. కర్చీఫ్‌ను మాస్కులా ధరించి ఉంటుంది. కర్చీఫ్ మీది డిజైన్లుగా బ్యాలెట్ బాక్సు, బాక్సును కాపాడుతున్నట్లుగా రెండు అరిచేతులు, విడిగా ఇనుప సంకెళ్లు, ఇంకా ఏవో అంతరార్థ చిత్రాలు ఉంటాయి. ప్రముఖ వీధి చిత్రకారుడు ఫ్రాంక్ షెఫర్డ్ ‘టైమ్’ పూర్వపు సంచికల ముఖచిత్రాలు రెండింటిని మిక్స్ చేసి ఈ కవర్ పేజ్ని డిజైన్ చేశాడని టైమ్ ఎడిటర్–ఇన్–చీఫ్ ఎడ్వర్డ్ ఫెల్సెంతాల్ (54) లోపల రాసిన ముందుమాటను బట్టి తెలుస్తోంది. ఆయన ఇంకొక మాట కూడా రాశారు. ‘రానున్న రోజుల్లో కొన్ని ఘటనలు ప్రపంచాన్ని మలచబోతున్నాయి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కంటే కూడా..’ అని వ్యాఖ్యానించారు! ఓటు వేసి ఆ కొన్ని ఘటనల ప్రభావాన్ని అమెరికాలోని సకల పౌరుల సార్వభౌమాధికారతకు అనుకూలంగా మార్చుకోవాలని ఓటర్లకు చెప్పడం ఆయన ఉద్దేశంలా కనిపిస్తోంది. అర్థం కాలేదా? ట్రంప్ ఓడిపోతే ‘య్యస్’ అనే పెద్ద అరుపుతో బల్లను గుద్దిన చప్పుడు మొదట వినిపించేది న్యూయార్క్ లోని ‘టైమ్’ కార్యాలయ భవనం నుంచే! ఎడిటర్లు ప్రభుత్వాన్ని పడగొట్టగలరు. నిర్మించగలరు. ట్రంప్ ఓడినా, గెలిచినా టైమ్ పత్రిక తాజా సంచిక VOTE మాత్రం ఎప్పటికీ అపూర్వంగానే నిలిచిపోతుంది. -
తదుపరి అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ షురూ
న్యూఢిల్లీ: పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి(సీడబ్ల్యూసీ) అప్పగించిన అధికారం మేరకే అధినేత్రి సోనియాగాంధీ సంస్థాగత మార్పులను చేపట్టారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. పార్టీ తదుపరి అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించేందుకే ఆమె ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారని వివరించింది. తాజా మార్పులపై కొందరు నేతల ప్రకటనలపై కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలెవరూ ఎటువంటి ప్రకటనా చేయలేదని, వ్యాఖ్యానించలేదని అన్నారు. సోనియా చేపట్టిన సంస్థాగత మార్పులపై రాహుల్ గాంధీ ముద్ర ఉందా అని అడగ్గా..రాహుల్ గాంధీని ఏఐసీసీ ఏకగ్రీవంగా అధ్యక్ష పదవికి ఎన్నుకుందనీ, 2019 ఎన్నికల ఫలితాలకు బాధ్యతవహిస్తూ ఆయన వైదొలిగారని గుర్తు చేశారు. కోట్లాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు సీడబ్ల్యూసీ కూడా సోనియా, రాహుల్ నాయకత్వంపై విశ్వాసం ప్రకటించాయన్నారు. మరోవైపు, క్రమం తప్పకుండా జరిగే మెడికల్ చెకప్ కోసం శనివారం ఉదయం కొడుకు రాహుల్ గాంధీతో కలిసి సోనియాగాంధీ అమెరికా వెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. -
‘ఇండో-అమెరికన్ ఓట్లే కీలకం’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవడానికి భారతీయ అమెరికన్ల ఓటర్లు ఎంతో ముఖ్యమని డెమొక్రాట్లు నమ్ముతున్నారు. గతంలో అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు డెమొక్రాట్లకు ఎక్కువగా ఓట్లు వేశారు. అలాగే ఈ సారి నవంబర్ 3న, జరిగే ఎన్నికల్లో వారు కీలక పాత్ర పోషిస్తారని, మాజీ వైస్ ప్రెసిడెంట్ జో బిడెన్ వైట్‌హౌస్‌లోకి వెళ్లడానికి మార్గం సుగమం అవుతుందని ఆ పార్టీ భావిస్తోంది. డెమొక్రటిక్ నేషనల్ కమిటీ చైర్మన్ టామ్ పెరెజ్ ఇటీవల ఒక వర్చువల్ టన్-హాల్లో మాట్లాడుతూ, భారతీయ అమెరికన్ ఓట్లు కచ్ఛితంగా ఫలితాలలో వ్యత్యాసాన్ని తీసుకురాగలవని చెప్పారు. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లోనూ మిచిగాన్, విస్కాన్సిన్ , పెన్సిల్వేనియా రాష్ట్రంలో డొనాల్డ్ ట్రంప్‌కు తక్కువ మెజారిటీ లభించింది. ఆసియా అమెరికన్లు, పసిఫిక్ ద్వీపవాసులు, భారతీయ, చైనీస్, ఫిలిపినో, కొరియన్, జపనీస్ ఇండోనేషియా సంతతివారు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. చదవండి: నాడు సరితా కోమటిరెడ్డి.. నేడు విజయ్ శంకర్! అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మూడు రాష్ట్రాలను వరుసగా 0.2, 0.7, 0.8 శాతం పాయింట్లతో స్వల్ప మెజారిటీతో గెలుచుకున్నారు. జనభా పరంగా ఎక్కువ ఓట్లను హిల్లరీ క్లింటన్ సొంత చేసుకున్నప్పటికీ అమెరికాలో అధ్యక్షుడని నిర్ణయించేవి ఎలక్టోరల్ ఓట్లు. అమెరికాలో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా ట్రంప్‌కు 304 ఎలక్టోరల్ ఓట్లు రాగా, క్లింటన్‌కు 227 ఓట్లు వచ్చాయి. మిచిగాన్‌లో 125,000 మంది భారతీయ అమెరికన్ ఓటర్లు, పెన్సిల్వేనియాలో 156,000, విస్కాన్సిన్లో 37,000 మంది ఉన్నారు. యూనిటెడ్ స్టేట్స్లో 4 మిలియన్ల మంది భారతీయ అమెరికన్ ఓటర్లు ఉన్నారు. వీరిలో మూడో వంతు మంది ఓటు వేయడానికి అర్హులు. ట్రంప్‌ను నిలువరించి బిడెన్‌ను గెలిపించడంలో ఈ ఓటర్ల కీలక పాత్ర పోషిస్తారని డెమొక్రాటిక్ గ్రూప్ ఏఏపీఐ విక్టరీ ఫండ్ విశ్లేషించింది. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో గెలవడానికి అమెరికన్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: చాలా సార్లు విన్నా: మేరీ ట్రంప్ -
ట్రంప్‌పై విమర్శలు: ఒబామా ఆడియో లీక్
న్యూయార్క్ : మరికొన్ని నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శల దాడి మొదలుపెట్టారు. కరోనా వైరస్‌ను అరికట్టడంలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని ఒబామా ఆరోపించారు. గత శుక్రవారం తన ప్రభుత్వంలో పనిచేసిన అధికారులతో ఒబామా వెబ్ కాల్ ద్వారా మాట్లాడారు. ఈ వెబ్ కాల్ ఆడియో కాస్తా లీకైంది. ఈ లీకైన వెబ్ కాల్ ఆడియోలో.. మైకేల్ ఫ్లైన్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయవ్యవస్థను దిగజార్చిందని ఒబామా అన్నారు. ( ట్రంప్ ట్వీట్‌పై నెటిజన్ల మండిపాటు.. ) నవంబర్ ఎన్నికలలో ట్రంప్‌పై గెలిచేందుకు తనతో కలిసి, జోయ్ బైడెన్ తరపున జరిగే ర్యాలీలో పాల్గొనాలని తన మాజీ ఉద్యోగులను ఆయన కోరారు. స్వార్థం, అనాగరికం, విభజించి పాలించటం, ఇతరులను శత్రువులుగా చూసే పద్ధతులతో పోరాడుతున్నామని, ఇవన్నీ అమెరికా పౌరుల జీవితంపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. ఈ కారణంగానే అమెరికా కరోనాను అడ్డుకునే విషయంలో విఫలమైందని అన్నారు. -
రామ్‌నాథ్ మంచి మెజార్టీతో గెలుస్తారు
-
నేనూ.. ఓటు వేస్తా ప్లీజ్: ఎంపీ
భువనేశ్వర్: ప్రతిష్టాత్మక భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలంటూ మయూర్భంజ్ లోక్‌సభ సభ్యుడు, బిజూ జనతా దళ్ అభ్యర్థి రామచంద్ర హంసదా అభ్యర్థించారు. నవదిగంత్ చిట్‌ఫండ్ సంస్థ మోసాల్లో నిందితుడైన ఆయనకు సీబీఐ దర్యాప్తు బృందం 2014వ సంవత్సరంలో అరెస్టు చేసింది. బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానాలు నిరాకరించడంతో ఆయన స్థానిక ఝరపడా జైలులో ఖైదీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతించాలని అభ్యర్థన పత్రాన్ని జైలు అధికారులకు సమర్పించారు. రామచంద్ర హంసదా దాఖలు చేసిన అభ్యర్థన పత్రాన్ని జైలువిభాగం అదనపు డీజీకి సిఫారసు చేసినట్లు జైల్ సూపరింటెండెంట్ రవీంద్రనాథ్ స్వంయి తెలిపారు. లోక్‌సభ స్పీకర్, పార్లమెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు రామచంద్ర హంసదా అభ్యర్థన పట్ల తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉందని జైల్ సూపరింటెండెంట్ తెలిపారు. -
ఆ పదవులకు పోటీ వద్దు: వైఎస్ జగన్
పులివెందుల: రాజ్యాంగపరంగా అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, స్పీకర్ పదవులకు పోటీ ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. అత్యున్నత పదవులు ఏకగ్రీవమైతే వాటి హుందాతనం పెరుగుతుందన్నారు. తటస్థంగా ఉండే వారే ఆ పదవుల్లో ఉండాలని ఆశిస్తామని, అందుకే ఏకగ్రీవానికి మద్దతు పలుకుతామని చెప్పారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావుకు అందుకే మద్దతు ఇచ్చామని, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. అన్ని పార్టీలు మద్దతు ఇస్తే తటస్థంగా ఉంటారన్న ఆశ కలుగుతుందని చెప్పారు. గతంలో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చామని తెలిపారు. పదవుల్లో ఉన్న వారు ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలన్నారు. తమ పార్టీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసుపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... సీఎం పదవిలో ఇవాళ చంద్రబాబు ఉండొచ్చు రేపు మేం గెలవొచ్చు ఎవరు అధికారంలో ఉన్నా 5 కోట్ల మంది ప్రజల్లో ఒకరికే సీఎంగా ఉండే అవకాశం దేవుడు ఇస్తాడు అలాంటి పదవుల్లో ఉన్నవారు ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవాలి ఎవరైనా ప్రజలకు మంచి చేయాలి ప్రజల ఆశీస్సులతో, దేవుడి దీవెనలతో సీఎంగా ఎన్నిక కావాలి ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం, వారిపై అనర్హత వేటు పడకుండా చూడటం సరికాదు చంద్రబాబు పరోక్షంగా సహకరించబట్టే పత్తికొండలో హత్యలు జరిగాయి డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి నియోజకవర్గంలో హత్య జరిగింది నారాయణరెడ్డి లైసెన్స్ రెన్యువల్ కోసం వెపన్ తీసుకున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసినా వెపన్ తిరిగి ఇవ్వలేదు దీన్నిబట్టి చూస్తే పథకం ప్రకారం హత్య జరిగినట్టు తెలుస్తోంది ఇసుక మాఫియాపై నారాయణరెడ్డి యుద్ధం చేశారు కేఈ కుమారుడిపై విచారణకు హైకోర్టు ఆదేశించింది ఇలాంటి నేపథ్యంలో భద్రత కోసం నారాయణరెడ్డి పదేపదే వేడుకున్నారు కోర్టు ఆదేశాలతో సెక్యురిటీ ఇస్తే మూడు నెలల్లో తొలగించారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎదుటివారిని ప్రేమించడం కూడా చేయాలి వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజారిటీతో పత్తికొండలో గెలిచే పరిస్థితి వస్తుంది ఒకర్ని చంపితే అభ్యర్థి లేకుండా పోతారా? నాయకుడు లేకుండా పోతాడా? నారాయణరెడ్డి హత్యపై సీబీఐతో దర్యాప్తు జరపాలి నారాయణరెడ్డి హత్య కేసులో డిప్యూటీ సీఎం నిందితుడు కేఈకి చంద్రబాబు ఆశీస్సులు ఉన్నాయి సీబీఐతో విచారణ చేయిస్తేనే న్యాయం జరుగుతుంది పోలీసులు విచారణ వల్ల ఎవరికీ మేలు జరగదు -
ఆ పదవులకు పోటీ వద్దు: వైఎస్ జగన్
-
‘సోనియాతో కీలక విషయం చర్చించా’
న్యూఢిల్లీ: రాజకీయాల గురించి ముఖ్యమైన విషయం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో చర్చించినట్టు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. మంగళవారం సాయంత్రం సోనియాతో ఆమె భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో ముఖ్యమైన అంశం, రాష్ట్రపతి ఎన్నికలపై గురించి సోనియాతో చర్చించినట్టు చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థి పేరుపై చర్చ జరగలేదని వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాల తరపున సంయుక్త అభ్యర్థిని పోటీ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా ఇంతకుముందు సోనియా గాంధీతో చర్చలు జరిపారు. -
ఆస్పత్రి నుంచే సోనియా రాజకీయం
ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆస్పత్రి పాలైన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. అక్కడి నుంచే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫోన్ చేశారు. సోమవారం నాడు ఢిల్లీ వస్తే.. ఒక సమావేశం నిర్వహించుకుందామని చెప్పారు. రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని ఎలాగైనా నిలబెట్టాలన్నది ఆమె వ్యూహం. అధికారపక్షం ఈ ఎన్నికల్లో నెగ్గడానికి చాలావరకు అవకాశాలున్నాయి. ఈ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసు. అయితే, తాము పూర్తిగా వదిలేస్తే అధికారపక్షం సులభంగా తీసుకుంటుందని, అలా కాకుండా గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తున్నారు. అంతేకాక.. ఇప్పుడు ప్రతిపక్షాలన్నింటినీ ఈ పేరుతో ఒక్కతాటి మీదకు తెస్తే, రెండేళ్ల తర్వాత జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే ఐక్యతను కొనసాగించి బీజేపీని మట్టి కరిపించవచ్చన్నది సోనియా అసలైన వ్యూహంలా కనిపిస్తోంది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మరాఠా రాజకీయ భీష్ముడు శరద్ పవార్ తదితరులను సోనియా ఇప్పటికే కలిశారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌లను కలిశారు. సోమవారం నాటి సమావేశం తర్వాత మమతా బెనర్జీ కూడా వీళ్లకు మద్దతు ఇస్తారో లేదో తెలుస్తుంది. ఏప్రిల్ నెలలోనే అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకుని తిరిగొచ్చిన సోనియా మళ్లీ ఆస్పత్రి పాలు కావడంతో పలు రకాల అనుమానాలు తలెత్తాయి. యూపీ ఎన్నికల్లో కూడా ఆమె ప్రచారం చేయలేదు. దాంతో ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీలే ఎన్నికల వ్యూహాలు చూసుకున్నారు. 2012 సంవత్సరంలో నాటి బీజేపీ కూటమి మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి పీఏ సంగ్మాను ఓడించి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయ్యారు. ఆయన పదవీకాలం జూలై నెలలో ముగుస్తుంది. అధికార, ప్రతిపక్షాలు రెండూ సరేనంటే తాను మరో విడత కూడా రాష్ట్రపతి పదవి చేపట్టడానికి సిద్ధమేనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. యూపీతో పాటు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అనూహ్యంగా భారీ ఫలితాలు రావడంతో తమ సొంత అభ్యర్థిని నిలబెట్టాలనే ఎన్డీయే భావిస్తోంది. -
‘రష్యా ట్రంప్ సలహాదారులను వాడుకుంది’
వాషింగ్టన్: అమెరికా ఎన్నికలను రష్యా ప్రభావితం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లు సమచారం. రష్యాలోని కొంతమంది ప్రభుత్వ అధికారులు అమెరికాలోని ట్రంప్ సలహాదారులను, ట్రంప్‌కు విదేశాంగ వ్యవహారాలకు సహాయపడే కార్టర్ పేజ్‌తోపాటు పలువురి ద్వారా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారాన్ని ప్రభావితం చేసేందుకు గట్టిగానే ప్రయత్నించిందని స్పష్టమైనట్లు యూఎస్ అధికారులు చెప్పినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఎఫ్‌బీఐ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ విషయం తెలిసిందట. అయితే, పేజ్‌ను రష్యా పూర్తిస్థాయిలో వినియోగించుకుందా, పాక్షికంగానే అనే విషయం ఇంకా తెలియరాలేదని చెప్పారు. రష్యా విషయంలో అమెరికా విదేశాంగ విధానం చాలా కఠినంగా ఉంటుందని గత ఏడాది రష్యాలో ఓ యూనివర్సిటీలో పేజ్ ప్రసంగం చేసినప్పటి నుంచే ఎఫ్‌బీఐ అతడిపై ఓ కన్నేసి ఉంచిందట. అలా స్పీచ్ ఇచ్చిన ఆయన అమెరికా వచ్చినప్పటి నుంచి రష్యా ప్రభుత్వ అధికారులతో ప్రతిక్షణం టచ్‌లోనే ఉన్నట్లు కూడా సమాచారం. ట్రంప్ సలహాదారుల్లో పేజ్ కూడా కీలకమైన వ్యక్తి. -
బీజేపీకి ఊహించని మద్దతు!
-
బీజేపీకి ఊహించని మద్దతు!
న్యూఢిల్లీ: బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుడే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వరం మార్చారు. కమలం పార్టీకి స్నేహహస్తం అందించారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడితే మద్దతు ఇస్తామని సూచనప్రాయంగా వెల్లడించారు. అద్వానీని రాష్ట్రపతిగా చూడాలనుకుంటున్నట్టు బెంగాల్ టీవీ చానల్ కు వచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ లను రాష్ట్రపతి ఎన్నికల్లో నిలబెట్టినా మద్దతుయిస్తామని చెప్పారు. జూలై 24న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. బీజేపీ అభ్యర్థిగా అద్వానీని నిలబెడతారని ప్రచారం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రావడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై అఖిలేశ్ యాదవ్, రాహుల్ గాంధీ ఎందుకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా కోర్టుకు వెళ్లాలని సూచించారు. 2019 సాధారణ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ కలిసి పోటీ చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నారద స్టింగ్ ఆపరేషన్ బీజేపీ కుట్ర అని మమత ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకులను కుట్రపూరితంగా కేసుల్లో ఇరికిస్తున్నారని వాపోయారు. -
అమెరికా ఎన్నికల సందడి
బయటివారికి ఎప్పుడూ పెద్ద పజిల్లా, ఎంతో అనాసక్తిగా కనబడే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఈసారి చాలా ఆసక్తిగా...ఇంకా చెప్పాలంటే వినోద భరితంగా మారింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ, ఆ క్రమంలో దేన్నయినా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడిన డోనాల్డ్ ట్రంప్ ఇందుకు చాలా వరకూ కారకుడు. అటు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోరాడుతున్న బెర్నీ సాండర్స్ అసమానతలు, సంక్షేమం, కార్పొరేట్ అవినీతి లాంటి అంశాలను ప్రస్తావించడం అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ఈ ప్రక్రియలో కీలకమైన మలుపు అనదగ్గ ‘సూపర్ ట్యూస్డే’ ఓటింగ్‌లో బెర్నీ సాండర్స్‌కు అందనంత దూరంలో హిల్లరీ క్లింటన్ దూసుకెళ్లి డెమొక్రటిక్ పార్టీని ఇప్పటికైతే ‘ఇబ్బందుల’నుంచి బయటపడేశారు. కానీ రిపబ్లికన్ పార్టీకి అంత ‘అదృష్టం’ లేదు. డోనాల్డ్ ట్రంప్ తన విజయపరంపరను కొనసాగించి ఆ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. చివరాఖరికి తానే పార్టీ అభ్యర్థిని అవుతానని ఘంటాపథంగా ప్రకటించడంతో పాటు అమెరికాను ‘మళ్లీ గొప్ప దేశంగా చేస్తాన’ని ట్రంప్ హామీ ఇస్తున్నారు. 11 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే అటు హిల్లరీకి, ఇటు ట్రంప్‌కు కూడా ఏడేసిచోట్ల తిరుగులేని విజయాలు లభ్యమయ్యాయి. సౌత్ కరొలినాలో 90 శాతంమంది ఆఫ్రికన్ అమెరికన్ పౌరులు డెమొక్రటిక్ అభ్యర్థిత్వానికి సాండర్స్‌ను కాదని హిల్లరీని ఎన్నుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌కు గట్టి ప్రత్యర్థులనుకున్న మార్కో రుబియో, టెడ్ క్రజ్, జాన్ కేసక్లు ‘సూపర్ ట్యూస్డే’లో వెల్లడైన ఫలితాలతో దిగ్భ్రమచెందారు. రెండు పార్టీల్లోనూ ప్రత్యర్థులు రాగల కాలంలో భారీ స్థాయిలో నెగ్గగలిగితే తప్ప హిల్లరీ, ట్రంప్‌లే అధ్యక్ష ఎన్నికల బరిలో మిగిలే అవకాశం ఉంది. అమెరికా గడ్డపై ఊహించడం కూడా సాధ్యంకాని రెండు పరిణామాలు ఈ ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్నాయి. మెకార్తిజం రాజ్యమేలినచోట అధ్యక్ష ఎన్నికల్లో బెర్నీ సాండర్స్ సోషలిస్టు పరిభాష మాట్లాడటమే కాదు...హిల్లరీతో కూడా ఆ మాదిరి మాటలు మాట్లాడించగలిగారు. అటు డోనాల్డ్ ట్రంప్ అన్ని మర్యాదలనూ గాలికొదిలి ముస్లింలపైనా, వలసవచ్చినవారిపైనా విరుచుకు పడ్డారు. ఈ రెండు ధోరణులకూ ఇంతవరకూ అమెరికాలో చోటు లేదనడం అసత్య మవుతుంది. కానీ రెండు ప్రధాన పార్టీల్లో అధ్యక్ష పదవికి పోటీపడే అభ్యర్థులు అలాంటి ధోరణులను ప్రతిబింబించడమే వింతగా అనిపించే విషయం. ఈ రెండు ధోరణులూ పరస్పర విరుద్ధమైనవే అయినా వీటి మూలాలు ఒకటే. అవి- అమెరికన్ సమాజంలో నానాటికీ పెరుగుతున్న అసమానతలు, వాటి పర్యవ సానంగా పౌరుల్లో ఏర్పడుతున్న అసహనం. అవే ఇలాంటి ధోరణులకు జీవం పోస్తున్నాయి. అగ్రరాజ్యంగా, ప్రపంచంపై పెత్తనం చలాయించే దేశంగా ఉన్నా సాధారణ పౌరులు అక్కడ భరోసాగా జీవించే పరిస్థితులు లేవు. ఉగ్రవాద భయం, ఏదైనా ధూర్త దేశం ఏ అణు క్షిపణో ప్రయోగిస్తుందన్న సందేహం లాంటివి అలా ఉంచితే... అవకాశాలు తగ్గుముఖం పడుతూ, నానాటికీ పెరుగుతున్న ఆదాయ వ్యత్యాసాలు భవిష్యత్తుపై వారిలో గుబులు పుట్టిస్తున్నాయి. ఇందుకు కారణాలను డోనాల్డ్ ట్రంప్ ముస్లింలలో, వలసల వరదలో వెదుకుతున్నారు. ఇలాంటి వాటిని సరిచేస్తే మళ్లీ అమెరికా కంటినిండా నిద్ర పోవచ్చునని, పౌరులంతా ప్రశాంతంగా బతకవచ్చునని హామీ ఇస్తున్నారు. అందుకు అవసరమైన పనులు తాను చేస్తానం టున్నారు. విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ముస్లింలను దేశంనుంచి తరిమే స్తాననడం ఆయనకే చెల్లింది. అందువల్లే రిపబ్లికన్ ఓటర్లు ఆయనలో ‘సమర్థుడైన నేత’ను చూస్తున్నారు. తమ దేశం మధ్య అమెరికాలో సాగించిన విధ్వంసం, ఇప్పటికీ వేర్వేరు దేశాల్లో సృష్టిస్తున్న సంక్షోభాల పర్యవసానంగానే వలసల సమస్య పుట్టుకొచ్చిందన్న సంగతిని ట్రంప్ దాస్తున్నారు. పైగా అలాంటి సంక్షోభాలను మరిన్ని తెచ్చిపెట్టే విధానాలను ఏకరువు పెడుతున్నారు. సాధారణ మర్యాదల్ని పక్కనబెట్టి ఎంత తోస్తే అంతా మాట్లాడటం, ఎవరినైనా హేళన చేయడంవంటి లక్షణాలవల్ల ఆయన ప్రసంగాలు వింతగా అనిపిస్తుండవచ్చు. జనాన్ని ఆకట్టు కోవచ్చు. కానీ ఆయనలో విదూషకుడికంటే విధ్వంసకుడే దాగున్నాడన్నది విశ్లేషకుల అంచనా. బెర్నీ సాండర్స్ తీరు వేరు. దేశంలో సంపద కేంద్రీకరణను ప్రస్తావిస్తున్నారు. గుప్పెడుమంది వేల కోట్ల ఆస్తుల్ని చేజిక్కించుకుని దేశాన్ని శాసిస్తున్న తీరును ప్రశ్నిస్తున్నారు. దీన్నే కొనసాగిస్తే ఇప్పుడున్న పరిస్థితులు ఇంకెంత దుర్భరంగా మారుతాయో వివరిస్తున్నారు. అమెరికా సంపన్న దేశమే అయినా సాధారణ పౌరులకు అవకాశాలు క్రమేపీ కనుమరుగవుతుండటాన్నీ, మంచి వేతనాలు లేకపోవడాన్ని గుర్తుచేస్తున్నారు. సాండర్స్ చేసిన వాగ్దానాల్లో ఉచిత వైద్యం, ఉచిత ఉన్నత విద్య, బతకడానికి వీలైన కనీస వేతనం ముఖ్యమైనవి. బడా సంపన్నులపై అధిక పన్నుల్ని విధించడం ద్వారా వీటిని సాధించడం తేలికని లెక్కలు కట్టి చెబుతున్నారు. ఇవన్నీ సాధ్యంకావాలంటే రాజకీయాలపై కార్పొరేట్ ఆధిపత్యాన్ని తగ్గించాలని, వారిచ్చే రాజకీయ విరాళాలపై గట్టి నిఘా ఉండాలని అంటున్నారు. ఈ విషయంలో తన చిత్తశుద్ధిని చాటుకోవడం కోసం ఆయన కార్పొరేట్ సంస్థల విరాళాలను తిరస్కరించారు. సాధారణ పౌరులనుంచి ఆయనకు 3.30 కోట్ల డాలర్ల మేర విరాళాలు వచ్చాయంటే బెర్నీ సాండర్స్ ఏమేరకు ప్రభావం చూపగలిగారో అర్ధమవుతుంది. ‘సూపర్ ట్యూస్డే’లో హిల్లరీ ముందు ఆయన వెలవెలబోయినా సాండర్స్ లేవనెత్తిన అంశాల ప్రభావం ఆమెపై గట్టిగానే పడింది. ఉన్నత చదువు లకెళ్లే విద్యార్థులకు స్వల్ప వడ్డీ రుణాల గురించి, ఇతర సంక్షేమ పథకాల గురించి హిల్లరీ మాట్లాడక తప్పలేదు. ‘సూపర్ ట్యూస్డే’ ఫలితాలతో అంతా ముగిసిపోయినట్టు భావించడానికి లేదు. ఇందులో బాగా వెనకబడిన డెమొక్రటిక్ అభ్యర్థి బెర్నీ సాండర్స్ చేతిలో నాలుగు రాష్ట్రాల విజయాలున్నాయి. అవి హిల్లరీని కలవరపరిచేవే. అటు రిపబ్లికన్ పార్టీలో టెడ్ క్రజ్ టెక్సాస్‌లో సాధించిన భారీ గెలుపు... ఓక్లహామా, అలస్కాల్లో కైవసం చేసుకున్న విజయాలు ట్రంప్‌కు పూర్తి భరోసా కల్పించలేకపోతున్నాయి. ఇరు పక్షాల్లో చివరికి ఎవరు అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని చేజిక్కించుకున్నా ఈ ఎన్నికలు ఎజెండాలోకి తెచ్చిన అంశాలు రాగలకాలంలో సైతం సజీవంగా నిలుస్తాయి.