4:35 : వాషింగ్టన్ డీసీలో బైడెన్ క్లీన్‌స్వీప్
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో బైడెన్ క్లీన్‌స్వీప్ చేశాడు. అక్కడ బైడెన్‌కు 93 శాతం పాపులర్ ఓట్లు రాగా, ట్రంప్‌కు కేవలం 5.6 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
11 : 50 : భారీ విజయం సాధిస్తాం: ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము భారీ విజయాన్ని సాధిస్తామని అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రాత్రి మీడియా ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ట్విటర్ వేదికగా స్పందించారు.
I will be making a statement tonight. A big WIN!
— Donald J. Trump (@realDonaldTrump) November 4, 2020
10: 55 : మరోసారి అధ్యక్ష పీఠం దిశగా ట్రంప్
మరోసారి అమెరికా అధ్యక్ష పీఠం దిశగా ట్రంప్ దూసుకుపోతున్నారు. పెద్ద రాష్ట్రాల్లో ఆయన ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ కొనసాగితే ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువ. 288 ఎలక్టోరల్ ఓట్లు సాధించే దిశగా ట్రంప్ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటి వరకు బైడెన్ 227.. ట్రంప్ 204 ఓట్లు సాధించారు. అయితే పెద్ద రాష్ట్రాల్లో ఆధిక్యం ట్రంప్‌నకు కొండంత బలంగా మారింది.
10 : 30 : బైడెన్ ఆధిక్యం.. ట్రంప్‌నకు అవకాశం!
బైడెన్ విజయానికి మరింత చేరువయ్యారు. ఇప్పటివరకు 213 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్ ఆయన బాగా కలిసొచ్చాయి. ట్రంప్ సొంతం రాష్ట్రంలోనూ బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. అయితే ట్రంప్ 118 ఓట్లు సాధించినప్పటికి కాలిఫోర్నియా మినహా మిగిలిన పెద్ద రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. టెక్సాస్(38), ఫ్లోరిడా(29), పెన్సిల్వేనియా(20) ఒహియో(18), మిషిగాన్(16), జార్జియా(16)లలో ట్రంప్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. స్వింగ్ రాష్ట్రాల్లోనూ ట్రంప్ హవా కొనసాగుతోంది. ఫ్లోరిడా(29)లో 4%, జార్జియా (16)లో 8%, మిషిగాన్ (16)లో 9%, ఒహియో (18)లో 8%, పెన్సిల్వేనియా (20)లో 15% ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడున్న ట్రెండింగ్ కొనసాగితే ట్రంప్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.
9: 30 : విజయానికి చేరువలో బైడెన్
డెమొక్రాటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్.. ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు అందనంత దూరంలో.. విజయానికి చేరువలో ఉన్నారు. ఇప్పటి వరకు బైడెన్‌కు 209 ఎలక్టోరల్ ఓట్లు రాగా, ట్రంప్‌నకు 112 ఓట్లు మాత్రమే వచ్చాయి. బైడెన్ మ్యాజిక్ ఫిగర్ అందుకోవటానికి ఇంకా 61 ఓట్లు మాత్రమే కావాల్సి ఉంది.
9: 00 : ముందుకు దూసుకు వస్తున్న ట్రంప్
ట్రంప్ నెమ్మదిగా ముందుకు దూసుకు వస్తున్నారు. 9 గంటల సమయానికి 108 ఎలక్టోరల్ ఓట్లను ఆయన దక్కించుకున్నారు. బైడెన్ 131 వద్దే నిలబడిపోయారు. ఇప్పటి వరకు ట్రంప్ 16 రాష్ట్రాల్లో విజయం సాధించగా.. బైడెన్ 13 రాష్ట్రాల్లో విజయం సాధించారు.
8:00 : బైడెన్ ఖాతాలోకి కొలరాడో, ఇల్లినోయ్, న్యూమెక్సికో
బైడెన్ మరింత దూకుడు మీదున్నారు. ఇప్పటివరకు 131 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు. ఇక ట్రంప్ 92 వద్దే నిలబడిపోయారు. బైడెన్ ఖాతాలోకి కొలరాడో, ఇల్లినోయ్, న్యూమెక్సికోలు వచ్చి చేరాయి. నెబ్రాస్కా, వయోమింగ్, ఆర్కాన్సా, కాన్సాస్, ఒహాయోలలో ట్రంప్ విజయం సాధించారు.
7: 30 : చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్ అమెరికన్ ముస్లిం
ఎన్నికల్లో విజయం సాధించి, వర్జీనియా స్టేట్ సెనేట్‌కు ఎన్నికవనున్న మొదటి ఇండియన్ అమెరికన్ ముస్లింగా గజాలా హస్మి చరిత్ర సృష్టించారు. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హస్మి ప్రత్యర్థి గ్లెన్ స్టర్‌టెవెంట్‌పై వర్జీనియా, పదవ సెనేట్ డిస్ట్రిక్ట్ నుంచి ఆమె విజయం సాధించారు. హస్మితో పాటు మరికొంత మంది ఇండియన అమెరికన్లు సుహాస్ సుబ్రమణ్యం, రాజు, డింపుల్ అజ్మెరా ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.
7: 00 : అమెరికా ఎన్నికలు: ట్రంప్ ఆశలు గల్లంతు!
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఆశలు గల్లంతు చేస్తూ జో బైడెన్ దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు బైడెన్‌కు 119, ట్రంప్‌కు 92 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. పెద్ద రాష్ట్రాల్లో బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. పెన్సిల్వేనియా, వెర్మాంట్, న్యూజెర్సీ, మేరీల్యాండ్, డెలావేర్, రోడ్‌ఐలాండ్‌లో బైడెన్ విజయం సాధించటంతో పాటు టెక్సాస్, కాన్సాస్, మిస్సోరీలలో ముందంజలో ఉన్నారు. ఇక ఇండియానా, ఓక్లహోమా, కెంటకీ, వర్జీనియా, సౌత్ కరోలినాలో ట్రంప్ విజయం సాధించారు. ఫ్లోరిడా, జార్జియాలలో ముందంజలో ఉన్నారు. ( అమెరికా ఓటర్ ‘స్వింగ్’ ఎటు?)
కాగా, అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాల్లో కలిపి 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. 270 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్న వారికి అధ్యక్ష పీఠం దక్కనుంది. ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రాలదే కీలక పాత్ర. ఎక్కువ ఓట్లు వచ్చినవారికే ఆ రాష్ట్రంలోని మొత్తం ఎలక్టోరల్ ఓట్లు వస్తాయి. కాలిఫోర్నియా-55, టెక్సాస్-38, న్యూయార్క్-29, ఫ్లోరిడా-29, పెన్సిల్వేనియా-20, ఇల్లినోయ్-20 ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రాలు. 10 కంటే తక్కువ ఎలక్టోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రాలు -30 ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment