సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ఫలితాల కోసం అమెరికన్–భారతీయులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ప్రపంచ దేశాలు సాధారణంగా చూపే ఆసక్తి కాకుండా భారతీయ–అమెరికన్లు ఏమైన ప్రత్యేక ఆసక్తి ఉందా? ఉంటే ఎందుకు? భారత్‌పై దుందుడుకుగా దురాక్రమణకు దిగుతున్న చైనా పట్ల అమెరికా కఠినంగా వ్యవహరించాలని వారు కోవడం, భారత సంతతికి చెందిన కమలా హారిస్ డెమోక్రట్ల తరఫున అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయడం మరో కారణం. కమలా హారిస్ తల్లి భారతీయులు. ఆమె 1950లోనే భారత్ నుంచి అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. (‘ముందస్తు ఓటింగ్’తో నష్టమా, లాభమా?!)
మరో నాలుగేళ్ల తర్వాత అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రట్ల తరఫున పోటీచేసే అవకాశం ఉండడం వల్ల కూడా ఆమె ఈ ఉపాధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలని అమెరికన్–భారతీయులు కోరుకుంటున్నారు. గడిచిన దశాబ్దాల్లోలాగా కాకుండా రాజకీయంగా తమ ప్రాథమ్యాలివి అని చెప్పడానికి వారు ఈసారి ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి అమెరికా ఎన్నికల కోసం, ముఖ్యంగా కమలా హారిస్ కోసం వారు భారీ ఎత్తున విరాళాలు సేకరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమకు నిర్ణయాత్రక పాత్ర ఉండాలని, తద్వారా భారత్–అమెరికా మధ్యన వారు సత్సంబంధాలను ఆశిస్తున్నారు. (కమలా హారిస్ పట్ల వారికి ఎందుకు కోపం?)
సాధారణంగా ఒక్క భారతీయులే కాకుండా ఆసియాకు చెందిన అమెరికన్లు సంప్రదాయబద్ధంగా రిపబ్లికన్లకే ఓటు వేస్తారు. అయితే వలసదారుల వీసాల పట్ల డొనాల్డ్ ట్రంప్ వైఖరి కఠినంగా ఉండడంతో వారంతా ఈసారి డెమోక్రట్ల అభ్యర్థిగా పోటీ చేసిన జో బైడెన్ విజయాన్నే కోరుకుంటున్నారు. ఎబీసీ న్యూస్, ఏబీసీ న్యూస్, పీబీఎస్ న్యూస్ అవర్, యూట్యూబ్ ద్వారా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రసారం చేస్తున్నాయి. అల్ జజీరా ఇంగ్లీష్ ఛానల్ కూడా ఫలితాలపై అంతర్జాతీయ విశ్లేషణలు ఇస్తోంది. (అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వివాదాలెన్నో!)
Comments
Please login to add a commentAdd a comment