
వాషింగ్టన్: అమెరికాలో నల్ల జాతీయులు, మైనారిటీల హక్కుల కోసం గళమెత్తుతూ అందరి దృష్టిని ఆకర్షించిన నలుగురు మహిళా పార్లమెంట్ సభ్యులు తాజా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు. ‘ద స్క్వాడ్’పేరిట వీరు అమెరికాలో ప్రసిద్ధిపొందారు. మిన్నెసొటా నుంచి ఇల్హానా ఒమర్, న్యూయార్క్ నుంచి అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్, మిషిగాన్‌లో రషీదా తలెయిబ్, మసాచుసెట్స్‌లో అయన్నా ప్రిస్లీ మళ్లీ గెలిచారు. వీరంతా మైనారిటీ, నల్లజాతి మహిళలే కావడం గమనార్హం. స్క్వాడ్ పోరాటం పలుమార్లు వివాదాలకు దారితీసింది. అంతేకాకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహాన్ని కూడా వారు చవి చూడాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో స్క్వాడ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇదే వారి విజయానికి కారణమని భావిస్తున్నారు. (చదవండి: సరిగ్గా వందేళ్ల క్రితం నవంబర్ 2న రాత్రి..)
Our sisterhood is resilient. pic.twitter.com/IfLtsvLEdx
— Ilhan Omar (@IlhanMN) November 4, 2020