minarties
-
అమెరికా ఎన్నికలు: మళ్లీ గెలిచిన ‘స్క్వాడ్’..
వాషింగ్టన్: అమెరికాలో నల్ల జాతీయులు, మైనారిటీల హక్కుల కోసం గళమెత్తుతూ అందరి దృష్టిని ఆకర్షించిన నలుగురు మహిళా పార్లమెంట్ సభ్యులు తాజా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు. ‘ద స్క్వాడ్’పేరిట వీరు అమెరికాలో ప్రసిద్ధిపొందారు. మిన్నెసొటా నుంచి ఇల్హానా ఒమర్, న్యూయార్క్ నుంచి అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్, మిషిగాన్‌లో రషీదా తలెయిబ్, మసాచుసెట్స్‌లో అయన్నా ప్రిస్లీ మళ్లీ గెలిచారు. వీరంతా మైనారిటీ, నల్లజాతి మహిళలే కావడం గమనార్హం. స్క్వాడ్ పోరాటం పలుమార్లు వివాదాలకు దారితీసింది. అంతేకాకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహాన్ని కూడా వారు చవి చూడాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో స్క్వాడ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇదే వారి విజయానికి కారణమని భావిస్తున్నారు. (చదవండి: సరిగ్గా వందేళ్ల క్రితం నవంబర్ 2న రాత్రి..) Our sisterhood is resilient. pic.twitter.com/IfLtsvLEdx — Ilhan Omar (@IlhanMN) November 4, 2020 -
పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డ భారత్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి(యూఎన్హెచ్ఆర్సీ)లో దాయాది దేశం పాకిస్తాన్‌పై భారత్ విరుచుకుపడింది. ఓ వైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సాహిస్తూనే.. మరోవైపు బాధితురాలిగా బిల్డప్ ఇస్తూ అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చే ప్రయత్నం చేయవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. జెనీవాలో ఐక్యరాజ్య సమితికి భారత మొదటి కార్యదర్శి విమర్ష్ ఆర్యన్ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదంపై చర్చ జరిగినప్పుడల్లా పాకిస్తాన్ తాను బాధితురాలిని అంటూ మొసలి కన్నీరు కారుస్తుంది. కానీ మరోవైపు ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోంది. అయితే ఈ వాస్తవం నుంచి అంతర్జాతీయ సమాజ దృష్టిని మరల్చడానికి ఇలా నాటకాలు ఆడుతుంది’ అంటూ విమర్శించారు. అంతేకాక భారతదేశంలో మైనారిటీలకు రక్షణ కరువు అవుతుంది అంటూ పాక్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆర్యన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాయాది దేశం మహిళలు, పిల్లలు, హిందువులు, జర్నలిస్ట్‌ల విషయంలో ఎంత క్రూరంగా వ్యవహరిస్తుందో ఉదాహరణలతో సహా వెల్లడించారు. (చదవండి: బాబ్రీ విధ్వంసం వెనక పాక్ హస్తం!) ఆసిఫ్ పెర్వైజ్ అనే క్రైస్తవ వ్యక్తికి మరణ శిక్ష విధించడం.. దక్షిణ ప్రావిన్స్ సింధ్‌లో హిందూ మహిణ పార్యా కుమారిని అపహరించి మతం మార్చడం.. బిలాల్ ఫారూకి వంటి నిజాయతీ కలిగిన జర్నలిస్ట్‌ని పాక్ సైన్యం తీవ్రంగా హింసించడం వంటి ఉదాహరణలను వెల్లడించారు ఆర్యన్. ఇంత క్రూరంగా ప్రవర్తించే పాకిస్తాన్, భారత్ వంటి ప్రజాస్వామ్య దేశానికి హితబోధ చేయడం.. ఇండియాలో మైనారిటీల గురించి ఆందోళన వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భారత దేశాన్ని అప్రదిష్ట పాలు చేయడం కోసం ఎన్ని కల్పిత కథలు చెప్పినా.. పాక్ నుంచి ప్రాణ భయంతో పారిపోతున్న మైనారిటీలు వాస్తవాన్ని కళ్లకు కడుతున్నారని.. దీన్ని అంతర్జాతీయ వేదికలు మార్చబోవని ఆర్యన్ స్పష్టం చేశారు. -
మోదీ ‘సబ్ కా విశ్వాస్’ మాటకు అర్థం ఏమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన నినాదం. ‘సబ్ కా విశ్వాస్’ ఆయన తాజాగా ఇచ్చిన నినాదం. భారతీయ మైనారిటీ వర్గాలను దష్టిలో ఉంచుకొని ఆయన ఈ నినాదం ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. ఆయన మే 25వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కొత్తగా ఎన్నికైన ఎన్డీయే పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఓటు వేసిన వారంతా మనవారే, ఓటు వేయని వారు కూడా మనవారే. వారి విశ్వాసాన్ని కూడా మనం చూరగొనాల్సిన అవసరం ఉంది’ అంటూ దేశంలోని మైనారిటీలనుద్దేశించి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మైనారిటీలకు తాము వ్యతిరేకమని, వారిలో భయాందోళనలను సష్టించామని ప్రతిపక్షాలు చేస్తోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదంటూ నరేంద్ర మోదీ మొదటి సారి దేశంలో మైనారిటీల దుస్థితి గురించి మాట్లాడారు. గత బీజేపీ ఐదేళ్ల పాలనలో మైనారిటీలు భయం, భయంగానే బతికారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకు గోరక్షకుల పేరిట జరిగిన దాడులను గుర్తు చేస్తున్నాయి. ఆ దాడుల్లో ఇంతవరకు ఏ ఒక్కరికైనా శిక్ష పడిందా? అని ప్రశ్నిస్తున్నాయి. మైనారిటీలైన ముస్లింలను మినహాయిస్తూ మిగతా హిందూ శరణార్థులందరికి భారతీయ పౌరసత్వం ఇస్తామంటూ 2016లో ముసాయిదా బిల్లు తీసుకరావడం నిజం కాదా? అంటూ నిలదీస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతలు చేసిన ప్రచారం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. మెజారిటీలు, మైనారిటీలు అంటూ మాట్లాడిందీ బీజేపీ నేతలు కాదా? అని అడుగుతున్నాయి. ఏదిఏమైనా ఎన్నికలు ముగిశాయి. 303 సీట్లతో బీజేపీ అఖండ విజయం సాధించింది. మొదటి సారి మైనారిటీల బాగోగుల గురించి మాట్లాడిన నరేంద్ర మోదీ తన మాట నిలబెట్టుకోవాలి. గతంలో మైనారిటీలపై జరిగిన దాడులకు సంబంధించిన కేసుల్లో దోషులకు శిక్ష పడేలా చేయాలి. మైనారిటీల సంక్షేమం కోసం పలు అభివద్ధి కార్యక్రమాలు చేపట్టి ‘సబ్ కా విశ్వాస్’ చూరగొనాలి! -
‘ముందు మీ ఇంటిని చూసుకోండి’
న్యూఢిల్లీ : భారతదేశంలోని మైనారిటీలను ఉద్దేశిస్తూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఇప్పటికే ఇమ్రాన్ వ్యాఖ్యాల పట్ల క్రికెటర్ మహ్మద్ కైఫ్, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ వంటి వారు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా మాత్రం ఇమ్రాన్ వ్యాఖ్యల పట్ల కాస్త భిన్నంగా స్పందించారు. తన ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం ఇమ్రాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని పేర్కొన్నారు. నసీరుద్దీన్ మాట్లాడుతూ.. ‘ఇమ్రాన్ వ్యాఖ్యల గురించి ఇప్పుడు నేను ఏం మాట్లాడిన నన్నో పాకిస్తాన్ ఏజెంట్లా చూస్తారు. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తే.. అప్పుడు నేను మాట మార్చానంటారు’ అని తెలిపారు. తన దేశ ప్రజల మెప్పు పొందడం కోసం ఆయన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు ఇవి అన్నారు. ఒక వేళ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలని చెప్పాల్సి వస్తే ఏం చెబుతారు అని అడగ్గా.. ‘అవును అలాంటి అవకాశం వస్తే తప్పకుండా చెప్తాను. మా దేశంలో జరిగే విషయాల గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందు మీ ఇంటి గురించి పట్టించుకోండి అని చెప్తాన’న్నారు. కొన్ని రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్ భారత్‌లో మైనారిటీలను ఇతర పౌరులతో సమానంగా చూడంలేదని అందరూ అంటున్నారు. బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే, అది తిరుగుబాటుకు దారితీస్తుందన్నారు. అంతటితో ఊరుకోక మైనారిటీలతో ఎలా మెలగాలో మోదీ ప్రభుత్వానికి చూపెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. -
మైనారిటీల సంక్షేమానికి అనేక పథకాలు
బాలానగర్ (జడ్చర్ల) : రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఇందులో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ అన్నారు. బాలానగర్‌లోని జాతీయ రహదారి పక్కన మహ్మద్ నజీరొద్దీన్ అండ్ సన్స్ ఆధ్వర్యంలో అదునాతన సదుపాయలతో నూతనంగా నిర్మించిన మసీద్‌ను సోమవారం ఆయన మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లింలను గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే చూశాయని, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముస్లింల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. రాబోయే కాలంలో ముస్లింల అభివృద్ధికి మరింత కృషిచేస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా మసీదుల అభివృద్ధితోపాటు, అందులో పనిచేసే గురువులకు జీతం ఇచ్చే ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. దేశంలోనే ఆదర్శ రాష్ట్రం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందన్నారు. రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు చేపట్టి అమలుచేస్తూ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. తన నియోజకవర్గంలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన మసీద్ సదుపాయాలపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంతియాజ్, జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు వాల్యానాయక్, ఇబ్రహిం, దాస్‌రాంనాయక్, గోపాల్‌రెడ్డి, గిరిజన జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, మాజీ ఎంపీపీ నర్సింహులు, చెన్నారెడ్డి, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు. -
మైనార్టీలుగా హిందువుల పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో హిందువులను మైనార్టీలుగా గుర్తించాలని ఓ బీజేపీ నేత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. బీజేపీ నేత, న్యాయవాది అశ్వని కుమార్ ఉపాద్యాయ భారత్‌లోని 7 రాష్ట్రాలు, మిజోరం, నాగలాండ్, మేఘాలయ, జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, పంజాబ్, ఒక కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లలో 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, వీరిని మైనార్టీలుగా గుర్తించాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీం తిస్కరించింది. జాతీయ మైనారిటీ కమిషన్‌ను సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది. ఈ 7 రాష్ట్రల్లోని హిందువుల సంఖ్య కన్నా మిజోరం, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా,కేరళ, మణిపూర్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో క్రిస్టియన్ల సంఖ్య ఎక్కువగా ఉందని, సిక్కులు పంజాబ్, ఢిల్లీ, చంఢీఘర్, హరియాణలో ఎక్కువగా ఉన్నారని, వీరందరిని మైనార్టీలుగా పరిగణిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. -
‘కవ్వాల్’ అభివృద్ధికి కృషి
మైనారిటీ కమిషన్ చైర్మన్ రసూల్ జన్నారం : కవ్వాల్ అడవుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మైనారిటీ కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్‌ఖాన్ తెలిపారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు సోమవారం హరిత రిసార్ట్‌లో మండల కేంద్రానికి చెందిన కోఆప్షన్ సభ్యుడు ఫసీఉల్లా, మజీద్ కమిటీ సభ్యులు మోహినొద్దీన్, రజాక్ కలిసి మండలంలో కమ్యూనిటీ హాల్, ఉర్దూ విద్యార్థుల కోసం మోడల్ స్కూల్ ఏర్పాటు కోసం వినతిపత్రం ఇచ్చారు. ఇచ్చోడలో ముల్తానీలు అడవుల్లో ఉంటూ అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తున్నారని, వారిని జనజీవనంలో కలిపి వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అడవుల, వన్యప్రాణుల అభివృద్ధి, గిరిజనులకు ఉపాధి, ఇక్కడ పులుల రక్షణ కోసం ఏమి చేయాలనే విషయంపై ముగ్గురుతో మూడు రోజులపాటు పర్యటనకు వచ్చినట్లు చైర్మన్ తెలిపారు. ఈ విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. సమావేశంలొ డీఎఫ్‌వో రవీందర్ ఉన్నారు.