సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో హిందువులను మైనార్టీలుగా గుర్తించాలని ఓ బీజేపీ నేత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. బీజేపీ నేత, న్యాయవాది అశ్వని కుమార్ ఉపాద్యాయ భారత్‌లోని 7 రాష్ట్రాలు, మిజోరం, నాగలాండ్, మేఘాలయ, జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, పంజాబ్, ఒక కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లలో 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, వీరిని మైనార్టీలుగా గుర్తించాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీం తిస్కరించింది. జాతీయ మైనారిటీ కమిషన్‌ను సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది.
ఈ 7 రాష్ట్రల్లోని హిందువుల సంఖ్య కన్నా మిజోరం, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా,కేరళ, మణిపూర్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో క్రిస్టియన్‌ల సంఖ్య ఎక్కువగా ఉందని, సిక్కులు పంజాబ్, ఢిల్లీ, చంఢీఘర్, హరియాణలో ఎక్కువగా ఉన్నారని, వీరందరిని మైనార్టీలుగా పరిగణిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment