Hindus population
-
మైనార్టీలుగా హిందువుల పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో హిందువులను మైనార్టీలుగా గుర్తించాలని ఓ బీజేపీ నేత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. బీజేపీ నేత, న్యాయవాది అశ్వని కుమార్ ఉపాద్యాయ భారత్‌లోని 7 రాష్ట్రాలు, మిజోరం, నాగలాండ్, మేఘాలయ, జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, పంజాబ్, ఒక కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లలో 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, వీరిని మైనార్టీలుగా గుర్తించాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీం తిస్కరించింది. జాతీయ మైనారిటీ కమిషన్‌ను సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది. ఈ 7 రాష్ట్రల్లోని హిందువుల సంఖ్య కన్నా మిజోరం, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా,కేరళ, మణిపూర్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో క్రిస్టియన్ల సంఖ్య ఎక్కువగా ఉందని, సిక్కులు పంజాబ్, ఢిల్లీ, చంఢీఘర్, హరియాణలో ఎక్కువగా ఉన్నారని, వీరందరిని మైనార్టీలుగా పరిగణిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. -
మోహన్‌జీ! మీరే పదిమంది పిల్లల్ని కనండి!
న్యూఢిల్లీ: హిందూ జనాభా విషయంలో ఆందోళన పడుతున్నట్టు కనిపిస్తున్న ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ వింత సవాల్ విసిరారు. 'హిందువులను రెచ్చగొట్టే ముందు, మోహన్ భగవత్‌గారే స్వయంగా పదిమంది పిల్లల్ని కని, వారిని బాగా పెంచాలి' అని ఆయన సోమవారం ట్విట్టర్లో సూచించారు. మిగతా మతాలతో పోల్చుకుంటే హిందూ జనాభా తగ్గిపోతున్నదని, కాబట్టి హిందువులు ఎక్కువమంది పిల్లల్ని కనాలని ఆరెస్సెస్ ప్రోత్సహిస్తున్నది. గతవారం ఆగ్రాలో జరిగిన ఓ సమావేశంలో ఆహూతులు అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ 'హిందువులు తమ జనాభా పెంచుకోకూడదని ఏ చట్టం చెబుతున్నది? అలాంటి చట్టమేది లేదు. అలాంటప్పుడు జనాభా పెరుగుదలకు అడ్డేమున్నది? ఇది వ్యవస్థకు సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే సామాజిక వాతావరణమే ఇలా ఉంది' అంటూ భగవత్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 11 జిల్లాల ఉపాధ్యాయులతో ఆరెస్సెస్ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. హిందూ జనాభా తగ్గుదల అంశంపై మాట్లాడాల్సిందిగా ఆహూతులు కోరడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని తాజాగా కేజ్రీవాల్ తప్పుబట్టారు.