‘కవ్వాల్‌’ అభివృద్ధికి కృషి | effort for Kavval development | Sakshi
Sakshi News home page

‘కవ్వాల్‌’ అభివృద్ధికి కృషి

Published Tue, Sep 6 2016 10:58 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

వినతిపత్రం ఇస్తున్న స్థానిక ముస్లింలు

వినతిపత్రం ఇస్తున్న స్థానిక ముస్లింలు

  • మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ రసూల్‌
  • జన్నారం : కవ్వాల్‌ అడవుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ అబీద్‌ రసూల్‌ఖాన్‌ తెలిపారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు సోమవారం హరిత రిసార్ట్‌లో మండల కేంద్రానికి చెందిన కోఆప్షన్‌ సభ్యుడు ఫసీఉల్లా, మజీద్‌ కమిటీ సభ్యులు మోహినొద్దీన్, రజాక్‌ కలిసి మండలంలో కమ్యూనిటీ హాల్, ఉర్దూ విద్యార్థుల కోసం మోడల్‌ స్కూల్‌ ఏర్పాటు కోసం వినతిపత్రం ఇచ్చారు. ఇచ్చోడలో ముల్తానీలు అడవుల్లో ఉంటూ అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తున్నారని,  వారిని జనజీవనంలో కలిపి వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అడవుల, వన్యప్రాణుల అభివృద్ధి, గిరిజనులకు ఉపాధి, ఇక్కడ పులుల రక్షణ కోసం ఏమి చేయాలనే విషయంపై ముగ్గురుతో మూడు రోజులపాటు పర్యటనకు వచ్చినట్లు చైర్మన్‌ తెలిపారు. ఈ విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. సమావేశంలొ డీఎఫ్‌వో రవీందర్‌ ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement