minarty commission
-
గంగులపై విమర్శలు చేస్తే ఊరుకోం
సాక్షి, కరీంనగర్ అర్బన్: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు స్థాయిని మించి మాట్లాడి విమర్శలు చేస్తే ఊరుకోమని టీఆర్ఎస్వీ కరీంనగర్ అధ్యక్షుడు ఫహాద్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఉనికి కోసం అధికార పార్టీ నాయకులపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కరీంనగర్ అభివృద్ధిలో గంగుల కమలాకర్ చేస్తున్న కృషి కొండంత అయితే మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ చేసింది గొరంత అని ఎద్దెవా చేశారు. గంగుల కమలాకర్పై ఆరోపణలు చేస్తే ప్రజలు బుద్ధిచెపుతారని అన్నారు. సమావేశంలో నాయకులు కోల చందన్ పటేల్, జేఎస్ రెడ్డి, తబ్రెస్, సందమల్ల రవితేజ, రాచర్ల శ్రీనివాస్, బిగ్లు సుదర్శన్, రాజశేఖర్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. -
‘కవ్వాల్’ అభివృద్ధికి కృషి
మైనారిటీ కమిషన్ చైర్మన్ రసూల్ జన్నారం : కవ్వాల్ అడవుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మైనారిటీ కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ఖాన్ తెలిపారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు సోమవారం హరిత రిసార్ట్లో మండల కేంద్రానికి చెందిన కోఆప్షన్ సభ్యుడు ఫసీఉల్లా, మజీద్ కమిటీ సభ్యులు మోహినొద్దీన్, రజాక్ కలిసి మండలంలో కమ్యూనిటీ హాల్, ఉర్దూ విద్యార్థుల కోసం మోడల్ స్కూల్ ఏర్పాటు కోసం వినతిపత్రం ఇచ్చారు. ఇచ్చోడలో ముల్తానీలు అడవుల్లో ఉంటూ అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తున్నారని, వారిని జనజీవనంలో కలిపి వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అడవుల, వన్యప్రాణుల అభివృద్ధి, గిరిజనులకు ఉపాధి, ఇక్కడ పులుల రక్షణ కోసం ఏమి చేయాలనే విషయంపై ముగ్గురుతో మూడు రోజులపాటు పర్యటనకు వచ్చినట్లు చైర్మన్ తెలిపారు. ఈ విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. సమావేశంలొ డీఎఫ్వో రవీందర్ ఉన్నారు.