
సాక్షి, కరీంనగర్ అర్బన్: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు స్థాయిని మించి మాట్లాడి విమర్శలు చేస్తే ఊరుకోమని టీఆర్‌ఎస్‌వీ కరీంనగర్ అధ్యక్షుడు ఫహాద్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఉనికి కోసం అధికార పార్టీ నాయకులపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కరీంనగర్ అభివృద్ధిలో గంగుల కమలాకర్ చేస్తున్న కృషి కొండంత అయితే మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ చేసింది గొరంత అని ఎద్దెవా చేశారు. గంగుల కమలాకర్‌పై ఆరోపణలు చేస్తే ప్రజలు బుద్ధిచెపుతారని అన్నారు. సమావేశంలో నాయకులు కోల చందన్ పటేల్, జేఎస్ రెడ్డి, తబ్రెస్, సందమల్ల రవితేజ, రాచర్ల శ్రీనివాస్, బిగ్లు సుదర్శన్, రాజశేఖర్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment