gangula karunakar
-
కరీంనగర్‌ను టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దుతాం : గంగుల
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పట్టణాన్ని టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధిలో భాగంగా బుధవారం తెలంగాణచౌక్, ఐబీచౌరస్తా, నాఖా చౌరస్తాల జంక్షన్ సుందరీకరణ పనులకు గీతాభవన్ చౌరస్తా వద్ద మేయర్ సునీల్ రావు, కమిషనర్ క్రాంతితో కలిసి భూమిపూజ చేశారు. కమలాకర్ మాట్లాడుతూ.. మూడు జంక్షన్ల అభివృద్ధికి రూ.50లక్షలు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లను కూడ అభివృద్ధి చేస్తున్నామని, ప్రధాన రహదారుల్లో డివైడర్లు నిర్మించి లైటింగ్ సిస్టమ్ అమర్చి, మధ్యలో మొక్కలు పెంచి అందంగా తయారు చేశామని తెలిపారు. ఇప్పటికే కమాన్, కోర్టు, మంచిర్యాలచౌరస్తా జంక్షన్లను సుందరీకరణ చేశామని తెలిపారు. మిగిలిన తెలంగాణ తల్లి జంక్షన్‌ను త్వరలో సుందరీకరిస్తామని చేస్తామని పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి, కార్పొరేటర్ వాల రమణరావు, తదితరులు ఉన్నారు. పనులు వేగంగా పూర్తిచేయాలి కరీంనగర్ స్మార్ట్‌సిటీ పనులు వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర బీసీసంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో స్మార్ట్‌సిటీ పనులు, పట్టణ ప్రగతి, హరితహారంపై కలెక్టర్ శశాంక, నగరపాలక సంస్థ మేయర్ సునీల్‌రావు, కమిషనర్ క్రాంతి, సంబంధిత అధికారులతో సమావేశం అయ్యారు. స్మార్ట్‌సిటీ 1,2,3 ప్యాకేజీల్లో రూ.290 కోట్లతో చేపట్టిన పనులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. రాజా టాకీస్ నుంచి బొమ్మ వెంకన్న ఇంటి వరకు చేపట్టిన రోడ్డును త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రాజీవ్ చౌక్ నుంచి గాంధీ రోడ్డు వరకు రోడ్డు పనులు అసంపూర్తిగా ఉన్నాయని, వెంటనే పూర్తి చేయాలని అన్నారు. స్లాటర్ హౌస్ వేరే చోటికి మార్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డంపింగ్ యార్డ్ నిర్మాణానికి టెండర్లు పిలవాలని తెలిపారు. పార్కుల నిర్మాణాలు నెమ్మదిగా సాగుతున్నాయని, వేగం చేయాలని కోరారు. హరితహారంలో భాగంగా నగరంలో గుర్తించిన ప్రాంతాల్లో మొక్కలు నాటాలని అన్నారు. నగరంలోని 14.5 కిలోమీటర్ల రోడ్ల మధ్య డివైడర్లలో కోనకార్పస్ మొక్కలు నాటాలని సూచించారు. పుట్‌పాత్ ఆక్రమణపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. డిప్యూటీమేయర్ స్వరూపారాణి, ఎస్ఈ కృష్ణరావు, ఈఈ రామన్, డీసీపీ సుభాశ్, ఏసీపీ శ్రీనివాస్, స్మార్ట్‌సిటీ టీం లీడర్ జగదీశ్, తదితరులు ఉన్నారు. చదవండి: నేటి నుంచి పర్యాటక ప్రాంతాల్లోకి అనుమతి -
వర్షసూచన..ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, కరీంనగర్ : మరో రెండు రోజులపాటు భారీ వర్ష సూచన ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర బిసి సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. వర్షం, వరదలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. కరీంనగర్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. రేకుర్తిలో పలు ఇళ్లలోకి నీళ్లు రావడాన్ని మంత్రి పరిశీలించారు. నగర శివారులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ఓపెన్ ప్లాట్లలో నీళ్లు నిలిచి పలు ఇళ్లలోకి నీళ్లు చేరాయన్నారు. నిలిచి ఉన్న నీళ్లను వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు జిల్లా కేంద్రంలో ఉండి వర్షం, వరదల పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఎక్కడ ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి విపత్కర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగంతో పాటు టిఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని గంగుల పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వర్షాకాలం ఆరంభంతోనే జిల్లాలోని జలాశయాలన్ని జలకళను సంతరించుకున్నాయని, ఏ చిన్న వర్షం పడ్డా జలాశయాలు ఓవర్ ప్లో అయ్యే పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి ఉండటంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండి, మంచి నీటిని కాచి చల్లార్చి తాగాలని మంత్రి సూచించారు. (ఫ్లై ఓవర్‌పై ఘోరం: సీసీ కెమెరాల్లో దృశ్యాలు) -
గంగులపై విమర్శలు చేస్తే ఊరుకోం
సాక్షి, కరీంనగర్ అర్బన్: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు స్థాయిని మించి మాట్లాడి విమర్శలు చేస్తే ఊరుకోమని టీఆర్ఎస్వీ కరీంనగర్ అధ్యక్షుడు ఫహాద్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఉనికి కోసం అధికార పార్టీ నాయకులపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కరీంనగర్ అభివృద్ధిలో గంగుల కమలాకర్ చేస్తున్న కృషి కొండంత అయితే మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ చేసింది గొరంత అని ఎద్దెవా చేశారు. గంగుల కమలాకర్‌పై ఆరోపణలు చేస్తే ప్రజలు బుద్ధిచెపుతారని అన్నారు. సమావేశంలో నాయకులు కోల చందన్ పటేల్, జేఎస్ రెడ్డి, తబ్రెస్, సందమల్ల రవితేజ, రాచర్ల శ్రీనివాస్, బిగ్లు సుదర్శన్, రాజశేఖర్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు తప్పిన ముప్పు
-
ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు తప్పిన ముప్పు
గజ్వేల్ : కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన వాహనాన్ని....ఎదురుగా వస్తున్న ఓ కారు ఢీకొంది. శుక్రవారం ఉదయం గంగుల కమలాకర్ హైదరాబాద్ వస్తుండగా మెదక్ జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద రాజీవ్ రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే అక్కడ నుంచి వేరే వాహనంలో హైదరాబాద్ బయల్దేరారు.