హైదరాబాద్, సాక్షి: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు పార్టీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో ఆయన బీఆర్‌ఎస్ కరీంనగర్ సభకు దూరంగా ఉంటారని తెలిపింది.
ఇవాళ కరీంనగర్‌లో కదన భేరి పేరుతో బీఆర్‌ఎస్ సభ నిర్వహించనుంది. ఈ సభ నుంచి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పార్టీ అధినేత కేసీఆర్ పూరించనున్నారు. అదే సమయంలో బీఆర్‌ఎస్‌కు కరీంనగర్ సెంటిమెంట్ ఎక్కువ. దీంతో ఈ సభను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాంటి సభకు అనారోగ్యంతో కేటీఆర్ హాజరు కాలేకపోతుండడం విశేషం.
తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
— BRS Party (@BRSparty) March 12, 2024
ఈరోజు జరగనున్న కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపిన కేటీఆర్ గారు
గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు
ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని తెలిపిన…
మూడు రోజుల కింద కామారెడ్డిలో జరిగిన సమావేశం తర్వాత కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని.. తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని బీఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment